రెండు పుష్కరాల క్రితం తానా సభల్లో విద్యార్ధి గారిని కలిశాము, వారెంతో స్నేహశీలి. ఎనిమిది పదులు పూర్తయిన సందర్భంగా వారికి హార్దిక అభినందనలు. విన్నకోట రవిశంకర్ చక్కని వ్యాసంతో పాత విషయాలను గుర్తు చేయడం సంతోషాన్ని కలిగించింది.
ఈ వ్యాసంలో బ్యాటరీ గురించి చదివినప్పుడు నేను యాభై ఏళ్లు వెనక్కి వెళ్ళాను. అది 1970 కి ముందు కాలం. అప్పటికి మన గ్రామాలకు విద్యుత్ రాలేదు. అయినా విద్యుత్ తో నడిచే పరికరాలు గ్రామాలకు వచ్చేవి. ఉదాహరణకు రేడియో. అప్పట్లో డబ్బా టీవీ అంత సైజు వుండేది రేడియో. టీవీలాగే అటు ఇటు కదిలించటానికి వీలులేకుండా ఒకేచోట స్థిరంగా వుండేది రేడియో. అది బ్యాటరీ మీద నడిచేది. దాని బ్యాటరీ సైజు కూడా వేరుగా వుండేది. పెళ్లిళ్లప్పుడు మైకు పెట్టేవారు. గ్రామఫోన్ రికార్డు ద్వారా ఆనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని హిట్ పాటలు వేసేవారు. అది కూడా బ్యాటరీ మీదే నడిచేది. కొందరి ఇళ్లలో బ్యాటరీ లైట్ వుండేది. టార్చ్ లైట్ కి అది మరో పేరు. డి సైజ్ బ్యాటరీలు నాలుగు లేక ఆరుటితో వెలిగేటంతటి పెద్దపెద్ద టార్చ్ లేట్లు వుండేవి. రేడియో స్థానంలో ట్రాన్సిస్టర్ వచ్చాక డి సైజు బ్యాటరీలు రెండిటితో నడిచేవి బుష్, మర్ఫి, ఫిలిప్స్ కంపెనీల ట్రాన్స్సిస్టర్లు. వాటిని కూడా సామాన్య జనం రేడియో అనే పిలిచేవారు. ట్రాన్స్సిస్టర్ అనటం చాలా మందికి కష్టం కదా. ఆ రోజుల్లో బ్యాటరీ మరియు కిరోసిన్ అనేవి జీవితంలో విడదీయరాని వస్తువులుగా వుండేవి. బ్యాటరీ పని అయిపోతే టార్చ్ లైట్ లైట్ గా వెలిగేది. రేడియోలో మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. పని అయిపోయిన బ్యాటరీని తీసివెయ్యకపోతే వస్తువులు పాడయ్యేవి. అవి ప్రమాదకరమైనవని నయ్యిదిబ్బలో పారేసేవాళ్లు. ఆరోజుల్లో ఏ2, ఏ3,ఏ4 బ్యాటరీలు లేవు. అంతటా డి సైజే!
విద్యుత్తు గ్రామాల్లోకి వచ్చాక బ్యాటరీ ప్రమేయం బాగా తగ్గిపోయింది చాలా కాలం. ఆ తర్వాత క్వాడ్జ్ గోడగడియారాలు బ్యాటరీతో నడిచేవి వచ్చాక మళ్లీ బ్యాటరీ తెరమీదకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏఏ, ఏఏఏ బ్యాటరీలు లేనిదే రోజులు ముందుకు సాగవు. గోడగడియారంలో ఏఏ, టీవీ ఏసీ రిమోట్ లో ఏఏఏ సైజు బ్యాటరీలు తప్పనిసరి. సెల్ ఫోన్ వచ్చాక లో బ్యాటరీ అనేది ఊతపదం అయ్యింది. 2000 సంవత్సరం ప్రాంతంలో విద్యుత్ కోత అధికంగా వుండటం వలన ఇన్వర్టర్ అనే పరికరం మార్కెట్లోకి వచ్చింది. పెద్ద బ్యాటరీలో విద్యుత్ ని స్టోర్ చేసి పవర్ కట్ అయినప్పుడు ఇన్వర్టర్ ద్వారా పరిమితంగా లైట్లు, పంఖాలు పనిచేసేవి. ఆ బ్యాటరీలోకి డిస్టిల్డ్ నీరు పోస్తూవుండాలి నెలకో రెండు నెలలకో.
నేడు కరెంటు కోత అంతగా లేకపోయినా, కరెంటు ఎప్పుడు పోతుందో చెప్పలేం. అందువలన చాలామంది ఇళ్లలో ఇన్వర్టర్ లు ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి వారు ఇన్వర్టర్ బ్యాటరీ ఆరోగ్యాన్ని గమనించటం అలవాటు అయింది. బ్యాటరీ మీద వుండే పుల్లలో ఎరుపు రంగు కిందకు దిగింది అంటే బ్యాటరీ కి దాహం అయ్యిందని అర్ధం. డిస్టిల్డ్ వాటరు నాలుగైదు సీసాలు ప్రతి ఇంట్లో వుంటున్నాయి ఇటీవలి కాలంలో. హనుమంతరావు గారి వ్యాసంలో బ్యాటరీ గురించి చదువుతుంటే యాభై సంవత్సరాల క్రితం రోజులు మదిలో మెదిలినవి. స్విచ్ స్టేజ్ లో మరికొన్ని మరిచిపోయిన, మరికొన్ని మరిచిపోలేని స్మృతులు మదిలో మెదలటానికి వెంపర్లాడుతున్నవి. అవి ఒక ట్రిగ్గర్ కోసం వేచిచూస్తున్నవి. అదే తీగద్వారా ఇంటికి సరఫరా అయ్యే కరెంటు!
జ్ఞాపకాలను యాభై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లినందుకు హనుమంతరావు గారికి ధన్యవాదములు.
Excellent narration with a gripping story line. Yadayya’s character made me to experience all kinds of emotions.
Narrator has kept the reader hooked on to the story till the end.
విద్యార్ధి గారి వ్యక్తిత్వాన్ని,ఆయన కవితలని రవిశంకర్ గారు చాలా చక్కగా పరిచయం చేసేరు. విద్యార్ధి గారి జీవన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది. రవిశంకర్ గారికి, ఈమాట సంపాదకులకు ధన్యవాదాలు.
గెలుపు
గురించి Rama mohana rao, sista Dilsukhnagar. అభిప్రాయం:
08/05/2025
10:05 am
తెలంగాణ యాసలో దినసరి కూలీ బ్రతుకుల జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంది మీరు రాసిన చిన్న కథ. అభినందనలు దేవ్. మీ ప్రతిభను ఇలాగే కొనసాగించండి. అద్భుతం.
M. కల్బుర్గిగారు మత విషయాలలో- హిందూ మతం పట్ల – కొంత విశృంఖలంగా, దారుణమైన వ్యాఖ్యలు- ఉదా: శివలింగపైన మూత్ర విసర్జన చేసినా తప్పులేదు (అది కూడా అభిషేకం లాంటిదే అన్నట్లుగా) చేసేవారు
రమేష్ కుమార్ గారు,
కల్బుర్గి చేసిన వ్యాఖ్యల గురించి మీరు పూర్తిగా అపోహ పడ్డట్టు కనిపిస్తుంది. శివలింగంపై మూత్రవిసర్జన గురించి రాసింది ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, రచయిత అయిన యు.ఆర్. అనంతమూర్తి. కల్బుర్గి ఈ అనంతమూర్తి కథను ఆయన పేరు స్పష్టంగా ప్రస్తావిస్తూ ఒక సెమినార్‌లో చెప్పాడు, అంతే. అయితే, కల్బుర్గి గురించి ఈ రకంగా వక్రీకరింపబడిన అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి, అసలు వాస్తవాలు వివరించడం ప్రధానం:
1. “శివలింగంపై మూత్ర విసర్జన” వ్యాఖ్య — అసలు నిజం ఏమిటి?
అది కల్బుర్గి సొంత మాట కాదు: ఆ వ్యాఖ్య ఆయన సొంత అనుభవమూ, అభిప్రాయమూ కూడా కాదు. ఆయన ఒక అకడమిక్ సెమినార్‌లో ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత యు.ఆర్. అనంతమూర్తి తన పుస్తకం “బెట్టలే పూజె యాకె మాడబారదు” (నగ్న పూజ ఎందుకు చేయకూడదు?) అన్న పుస్తకంలో రాసుకున్న ఒక చిన్ననాటి అనుభవాన్ని ఉటంకించారు.
2. అనంతమూర్తి చెప్పిన అసలు కథ: చిన్నప్పుడు, విగ్రహాలకు దైవశక్తి ఉంటుందని, వాటిని అపవిత్రం చేస్తే కళ్లుపోతాయని లేదా దేవుడు శిక్షిస్తాడని పెద్దలు చెప్పిన మాటలను పరీక్షించడానికి, అనంతమూర్తి ఒక పొలంలోని విగ్రహంపై మూత్ర విసర్జన చేశాడు. ఆ రాత్రి ఆయనకు కలిగిన భయం ఇప్పటికీ గుర్తుందని రాస్తూ, చిన్నప్పుడు పెద్దలు చెప్పే మూఢనమ్మకాలను ఎదిరించడంలో చేసిన పిచ్చిపనులు, ఆ తరువాత ఎదురయ్యే సంఘర్షణల గురించి వివరిస్తూ రాసిన ఉదంతం అది.
కర్ణాటకలో ‘బెట్టలెసేవ’ అంటూ నిమ్నకులాల స్త్రీలు నగ్నంగా రేణుకమ్మ జాతరలో తిరిగే(తిప్పే) ఆచారం ఉండేది. ఈ ఆచారాన్ని నిషేధించాలని కోరుతూ అనంతమూర్తి రాసిన పుస్తకమే “బెట్టలే పూజె యాకె మాడబారదు” (నగ్న పూజలు ఎందుకు చేయకూడదు?). ఇటువంటి సంస్కర్తల ఉద్యమాల వల్లనే కర్ణాటక ప్రభుత్వం 1980-90లలో దళితస్త్రీలతో చేయించే నగ్నపూజలను నిషేధించే చట్టాన్ని తీసుకువచ్చింది. https://www.epw.in/journal/2012/44/insight/nude-worship-karnataka.html
3. కల్బుర్గి ఈ వ్యాఖ్య చేసిన నేపథ్యం: కల్బుర్గి ఈ కథను ప్రస్తావిస్తూ చెప్పిన సందర్భం ఒక అకడమిక్ సెమినార్. మూఢనమ్మకాల నిషేధచట్టం తీసుకురావాలని జరుపుతున్న ఈ సెమినార్‌లో కల్బుర్గి హిందువుల ఆచారాలను అపహాస్యం చేయాలనో, వ్యంగ్యంగానో చేసిన వ్యాఖ్య కాదు. ఆయన ఉద్దేశం హిందువులను కించపరచడం కాదు. ఆయన వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రెచ్చగొట్టడానికి చేసినవి కావు. అవి ఒక చట్టంపై జరుగుతున్న అకడమిక్ చర్చలో, హేతువాద దృక్పథాన్ని వివరించడానికి చేసినవి. వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడం వేరు, ఒక శాస్త్రీయ చర్చలో గట్టిగా వాదనలు వినిపించడం వేరు.
3. “మూత్ర విసర్జన కూడా అభిషేకం లాంటిదే” అని ఆయన ఎక్కడా, ఎప్పుడూ అనలేదు. ఇది పూర్తిగా కల్పిత ఆరోపణ.
M. కల్బుర్గి లాంటి వారు తమకు వాక్ స్వాతంత్రం వుంది అనుకుని పరిమితులని దాటి అతి తీవ్రమైన, హేయమైన విమర్శలు చేసి సమాజంలో తీవ్ర అశాంతిని కలగచేసారు.
4. అశాంతికి అసలు కారణం ఎవరు?
కల్బుర్గి వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి రాలేదు. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి, సందర్భం నుండి వేరుచేసి, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం వల్ల అశాంతి సృష్టించబడింది. ఒక పండితుడి మేధోపరమైన విశ్లేషణను, దైవదూషణగా చిత్రీకరించి, ఆయనను శత్రువుగా నిలబెట్టారు. ఈ దుష్ప్రచారమే చివరికి ఆయన హత్యకు దారితీసింది.
దురదృష్టం ఏంటంటే చాలామంది ఉదారవాదులు హిందూమతం పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తప్పులేదు అనుకుంటారు కాని ఇతర మతాలలో వున్న తప్పులను ఎత్తిచూపే ధైర్యం చూపరు.
4. దురదృష్టం ఏంటంటే చాలామంది హేతువాదులు శాస్త్రీయదృక్పథంతో అన్ని మతాలలోని మూఢాచారాలను విమర్శిస్తారని సాంప్రదాయవాదులు గుర్తెరుగరు. ఎవరైనా వారు పెరిగిన సమాజంలో, వారు క్షుణ్ణంగా అర్థం చేసుకొన్న సమాజాన్ని, ఆచారాలను, మతాన్ని మాత్రమే విమర్శ చేయడం సహజం. క్రిస్టియానిటీలో పుట్టి పెరిగిన బర్‌ట్రండ్ రసల్ “Why I am not a Christian” అన్న పేరుమీద పుస్తకం రాయడం సబబు. సల్‌మాన్ రుష్దీ, తస్లీమా నస్రీన్‌లు వంటివారు వారు పుట్టిపెరిగిన ఇస్లాం మతం గురించి విమర్శలు చేయడం సబబు.
ప్రొఫెసర్ కల్బుర్గిపై ఉన్న ఆరోపణలు, ముఖ్యంగా శివలింగంపై చేసిన వ్యాఖ్య గురించి కథనాలు పూర్తిగా దురుద్దేశపూర్వకమైన వక్రీకరణలు. ఆయన ఒక పండితునిగా, పరిశోధకునిగా లింగాయత్ మతంలోని వచనాలను సేకరించి, వాటిని విశ్లేషించి, ప్రచురించి, అవి పలుభాషల్లోకి అనువదించే ప్రాజెక్టులను చేపట్టి లింగాయత్ సమాజానికి ఎనలేని సేవచేశాడు. తాను దేవుణ్ణి విశ్వసిస్తాననే చెప్పుకొన్న ఆయన సమాజంలోని కొన్ని దారుణమైన ఆచారాలను సంస్కరించడానికి మూఢనమ్మకాలను ప్రశ్నించారు. ఆయన మాటలను వక్రీకరించి, ఆయనపై ద్వేషాన్ని పెంచి, జరిగిన హింసకు బాధ్యత వహించాల్సింది ఆయన కాదు, ఆయన మాటలను ఆయుధంగా వాడుకున్న శక్తులే. ఏ విషయాన్నైనా నిర్ధారించుకునే ముందు, దాని వెనుక ఉన్న వాస్తవాలను, సందర్భాన్ని పూర్తిగా తెలుసుకోవడం మనందరి బాధ్యత.
ఈ రచన (నిజానికి ఈ సిరీస్) చదువుతున్నప్పుడు, నేను టైమ్ మెషీన్‌లో ప్రయాణిస్తున్నట్లు నాకు అనిపించింది. గత సంవత్సరాల్లో నేర్చుకున్న/అధ్యయనం చేసిన వివిధ విభిన్న సంఘటనలు/ఆలొచనలను, ఒక కథకుడు ఒక దండగా తయారు చేసినప్పుడు అద్భుతమైన కథగా మారాయి. ఉత్పత్తులు మరియు ఆలోచనల మధ్య సాంకేతిక యుద్ధాల గురించి చదవాను (బ్లూ రే vs HD DVD, స్మార్ట్ ఫోన్ vs ఐఫోన్ మొదలైనవి). ఉత్తమమైన, ప్రజాదరణ పొందిన వస్తువులు గెలిచినప్పటికీ, పోటీదారుని ఉత్పత్తి, సమానంగా వినూత్నంగా ఉన్నప్పటికీ, ఓడిపోవడాన్ని చూడటం విచారకరం.
గెలుపు గురించి Rama Sarma అభిప్రాయం:
08/08/2025 12:56 am
Good story — well written.
సరిహద్దులు కలవరపరచని కవి గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
08/07/2025 6:42 pm
రెండు పుష్కరాల క్రితం తానా సభల్లో విద్యార్ధి గారిని కలిశాము, వారెంతో స్నేహశీలి. ఎనిమిది పదులు పూర్తయిన సందర్భంగా వారికి హార్దిక అభినందనలు. విన్నకోట రవిశంకర్ చక్కని వ్యాసంతో పాత విషయాలను గుర్తు చేయడం సంతోషాన్ని కలిగించింది.
కంప్యూటర్ చిప్ కథ – 5: గల్వాని – వోల్టా పోట్లాటలో పుట్టిన బ్యాటరీ గురించి Gummadidala Ranga Rao అభిప్రాయం:
08/06/2025 12:15 pm
ఈ వ్యాసంలో బ్యాటరీ గురించి చదివినప్పుడు నేను యాభై ఏళ్లు వెనక్కి వెళ్ళాను. అది 1970 కి ముందు కాలం. అప్పటికి మన గ్రామాలకు విద్యుత్ రాలేదు. అయినా విద్యుత్ తో నడిచే పరికరాలు గ్రామాలకు వచ్చేవి. ఉదాహరణకు రేడియో. అప్పట్లో డబ్బా టీవీ అంత సైజు వుండేది రేడియో. టీవీలాగే అటు ఇటు కదిలించటానికి వీలులేకుండా ఒకేచోట స్థిరంగా వుండేది రేడియో. అది బ్యాటరీ మీద నడిచేది. దాని బ్యాటరీ సైజు కూడా వేరుగా వుండేది. పెళ్లిళ్లప్పుడు మైకు పెట్టేవారు. గ్రామఫోన్ రికార్డు ద్వారా ఆనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని హిట్ పాటలు వేసేవారు. అది కూడా బ్యాటరీ మీదే నడిచేది. కొందరి ఇళ్లలో బ్యాటరీ లైట్ వుండేది. టార్చ్ లైట్ కి అది మరో పేరు. డి సైజ్ బ్యాటరీలు నాలుగు లేక ఆరుటితో వెలిగేటంతటి పెద్దపెద్ద టార్చ్ లేట్లు వుండేవి. రేడియో స్థానంలో ట్రాన్సిస్టర్ వచ్చాక డి సైజు బ్యాటరీలు రెండిటితో నడిచేవి బుష్, మర్ఫి, ఫిలిప్స్ కంపెనీల ట్రాన్స్సిస్టర్లు. వాటిని కూడా సామాన్య జనం రేడియో అనే పిలిచేవారు. ట్రాన్స్సిస్టర్ అనటం చాలా మందికి కష్టం కదా. ఆ రోజుల్లో బ్యాటరీ మరియు కిరోసిన్ అనేవి జీవితంలో విడదీయరాని వస్తువులుగా వుండేవి. బ్యాటరీ పని అయిపోతే టార్చ్ లైట్ లైట్ గా వెలిగేది. రేడియోలో మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. పని అయిపోయిన బ్యాటరీని తీసివెయ్యకపోతే వస్తువులు పాడయ్యేవి. అవి ప్రమాదకరమైనవని నయ్యిదిబ్బలో పారేసేవాళ్లు. ఆరోజుల్లో ఏ2, ఏ3,ఏ4 బ్యాటరీలు లేవు. అంతటా డి సైజే!
విద్యుత్తు గ్రామాల్లోకి వచ్చాక బ్యాటరీ ప్రమేయం బాగా తగ్గిపోయింది చాలా కాలం. ఆ తర్వాత క్వాడ్జ్ గోడగడియారాలు బ్యాటరీతో నడిచేవి వచ్చాక మళ్లీ బ్యాటరీ తెరమీదకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏఏ, ఏఏఏ బ్యాటరీలు లేనిదే రోజులు ముందుకు సాగవు. గోడగడియారంలో ఏఏ, టీవీ ఏసీ రిమోట్ లో ఏఏఏ సైజు బ్యాటరీలు తప్పనిసరి. సెల్ ఫోన్ వచ్చాక లో బ్యాటరీ అనేది ఊతపదం అయ్యింది. 2000 సంవత్సరం ప్రాంతంలో విద్యుత్ కోత అధికంగా వుండటం వలన ఇన్వర్టర్ అనే పరికరం మార్కెట్లోకి వచ్చింది. పెద్ద బ్యాటరీలో విద్యుత్ ని స్టోర్ చేసి పవర్ కట్ అయినప్పుడు ఇన్వర్టర్ ద్వారా పరిమితంగా లైట్లు, పంఖాలు పనిచేసేవి. ఆ బ్యాటరీలోకి డిస్టిల్డ్ నీరు పోస్తూవుండాలి నెలకో రెండు నెలలకో.
నేడు కరెంటు కోత అంతగా లేకపోయినా, కరెంటు ఎప్పుడు పోతుందో చెప్పలేం. అందువలన చాలామంది ఇళ్లలో ఇన్వర్టర్ లు ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి వారు ఇన్వర్టర్ బ్యాటరీ ఆరోగ్యాన్ని గమనించటం అలవాటు అయింది. బ్యాటరీ మీద వుండే పుల్లలో ఎరుపు రంగు కిందకు దిగింది అంటే బ్యాటరీ కి దాహం అయ్యిందని అర్ధం. డిస్టిల్డ్ వాటరు నాలుగైదు సీసాలు ప్రతి ఇంట్లో వుంటున్నాయి ఇటీవలి కాలంలో. హనుమంతరావు గారి వ్యాసంలో బ్యాటరీ గురించి చదువుతుంటే యాభై సంవత్సరాల క్రితం రోజులు మదిలో మెదిలినవి. స్విచ్ స్టేజ్ లో మరికొన్ని మరిచిపోయిన, మరికొన్ని మరిచిపోలేని స్మృతులు మదిలో మెదలటానికి వెంపర్లాడుతున్నవి. అవి ఒక ట్రిగ్గర్ కోసం వేచిచూస్తున్నవి. అదే తీగద్వారా ఇంటికి సరఫరా అయ్యే కరెంటు!
జ్ఞాపకాలను యాభై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లినందుకు హనుమంతరావు గారికి ధన్యవాదములు.
గెలుపు గురించి Victoria Nallamothu అభిప్రాయం:
08/06/2025 3:43 am
Excellent narration with a gripping story line. Yadayya’s character made me to experience all kinds of emotions.
Narrator has kept the reader hooked on to the story till the end.
సరిహద్దులు కలవరపరచని కవి గురించి C.V.Syamala అభిప్రాయం:
08/05/2025 11:46 am
విద్యార్ధి గారి వ్యక్తిత్వాన్ని,ఆయన కవితలని రవిశంకర్ గారు చాలా చక్కగా పరిచయం చేసేరు. విద్యార్ధి గారి జీవన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది. రవిశంకర్ గారికి, ఈమాట సంపాదకులకు ధన్యవాదాలు.
గెలుపు గురించి Rama mohana rao, sista Dilsukhnagar. అభిప్రాయం:
08/05/2025 10:05 am
తెలంగాణ యాసలో దినసరి కూలీ బ్రతుకుల జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంది మీరు రాసిన చిన్న కథ. అభినందనలు దేవ్. మీ ప్రతిభను ఇలాగే కొనసాగించండి. అద్భుతం.
గెలుపు గురించి Grandhi Venkata Swamy అభిప్రాయం:
08/05/2025 9:47 am
చాలా బాగా వ్రాశారు. కష్టజీవికి భగవంతుడు తన వంతు సహాయం చేశాడని నాకు అనిపించింది.
నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి గురించి Girish Karnala అభిప్రాయం:
08/05/2025 8:40 am
Ramesh Kumar ఇలా అన్నారు:
రమేష్ కుమార్ గారు,
కల్బుర్గి చేసిన వ్యాఖ్యల గురించి మీరు పూర్తిగా అపోహ పడ్డట్టు కనిపిస్తుంది. శివలింగంపై మూత్రవిసర్జన గురించి రాసింది ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, రచయిత అయిన యు.ఆర్. అనంతమూర్తి. కల్బుర్గి ఈ అనంతమూర్తి కథను ఆయన పేరు స్పష్టంగా ప్రస్తావిస్తూ ఒక సెమినార్‌లో చెప్పాడు, అంతే. అయితే, కల్బుర్గి గురించి ఈ రకంగా వక్రీకరింపబడిన అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి, అసలు వాస్తవాలు వివరించడం ప్రధానం:
1. “శివలింగంపై మూత్ర విసర్జన” వ్యాఖ్య — అసలు నిజం ఏమిటి?
అది కల్బుర్గి సొంత మాట కాదు: ఆ వ్యాఖ్య ఆయన సొంత అనుభవమూ, అభిప్రాయమూ కూడా కాదు. ఆయన ఒక అకడమిక్ సెమినార్‌లో ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత యు.ఆర్. అనంతమూర్తి తన పుస్తకం “బెట్టలే పూజె యాకె మాడబారదు” (నగ్న పూజ ఎందుకు చేయకూడదు?) అన్న పుస్తకంలో రాసుకున్న ఒక చిన్ననాటి అనుభవాన్ని ఉటంకించారు.
2. అనంతమూర్తి చెప్పిన అసలు కథ: చిన్నప్పుడు, విగ్రహాలకు దైవశక్తి ఉంటుందని, వాటిని అపవిత్రం చేస్తే కళ్లుపోతాయని లేదా దేవుడు శిక్షిస్తాడని పెద్దలు చెప్పిన మాటలను పరీక్షించడానికి, అనంతమూర్తి ఒక పొలంలోని విగ్రహంపై మూత్ర విసర్జన చేశాడు. ఆ రాత్రి ఆయనకు కలిగిన భయం ఇప్పటికీ గుర్తుందని రాస్తూ, చిన్నప్పుడు పెద్దలు చెప్పే మూఢనమ్మకాలను ఎదిరించడంలో చేసిన పిచ్చిపనులు, ఆ తరువాత ఎదురయ్యే సంఘర్షణల గురించి వివరిస్తూ రాసిన ఉదంతం అది.
కర్ణాటకలో ‘బెట్టలెసేవ’ అంటూ నిమ్నకులాల స్త్రీలు నగ్నంగా రేణుకమ్మ జాతరలో తిరిగే(తిప్పే) ఆచారం ఉండేది. ఈ ఆచారాన్ని నిషేధించాలని కోరుతూ అనంతమూర్తి రాసిన పుస్తకమే “బెట్టలే పూజె యాకె మాడబారదు” (నగ్న పూజలు ఎందుకు చేయకూడదు?). ఇటువంటి సంస్కర్తల ఉద్యమాల వల్లనే కర్ణాటక ప్రభుత్వం 1980-90లలో దళితస్త్రీలతో చేయించే నగ్నపూజలను నిషేధించే చట్టాన్ని తీసుకువచ్చింది.
https://www.epw.in/journal/2012/44/insight/nude-worship-karnataka.html
3. కల్బుర్గి ఈ వ్యాఖ్య చేసిన నేపథ్యం: కల్బుర్గి ఈ కథను ప్రస్తావిస్తూ చెప్పిన సందర్భం ఒక అకడమిక్ సెమినార్. మూఢనమ్మకాల నిషేధచట్టం తీసుకురావాలని జరుపుతున్న ఈ సెమినార్‌లో కల్బుర్గి హిందువుల ఆచారాలను అపహాస్యం చేయాలనో, వ్యంగ్యంగానో చేసిన వ్యాఖ్య కాదు. ఆయన ఉద్దేశం హిందువులను కించపరచడం కాదు. ఆయన వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రెచ్చగొట్టడానికి చేసినవి కావు. అవి ఒక చట్టంపై జరుగుతున్న అకడమిక్ చర్చలో, హేతువాద దృక్పథాన్ని వివరించడానికి చేసినవి. వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడం వేరు, ఒక శాస్త్రీయ చర్చలో గట్టిగా వాదనలు వినిపించడం వేరు.
ఆ రోజుల్లో అనంతమూర్తి, కల్బుర్గిలపై కోర్టులో జరిగిన కేసు విచారణ వివరాలు ఇక్కడ చూడవచ్చు:
https://www.thenewsminute.com/karnataka/case-against-ananthamurthy-kalburgi-allegedly-offending-religious-sentiments-23003
3. “మూత్ర విసర్జన కూడా అభిషేకం లాంటిదే” అని ఆయన ఎక్కడా, ఎప్పుడూ అనలేదు. ఇది పూర్తిగా కల్పిత ఆరోపణ.
4. అశాంతికి అసలు కారణం ఎవరు?
కల్బుర్గి వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి రాలేదు. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి, సందర్భం నుండి వేరుచేసి, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం వల్ల అశాంతి సృష్టించబడింది. ఒక పండితుడి మేధోపరమైన విశ్లేషణను, దైవదూషణగా చిత్రీకరించి, ఆయనను శత్రువుగా నిలబెట్టారు. ఈ దుష్ప్రచారమే చివరికి ఆయన హత్యకు దారితీసింది.
4. దురదృష్టం ఏంటంటే చాలామంది హేతువాదులు శాస్త్రీయదృక్పథంతో అన్ని మతాలలోని మూఢాచారాలను విమర్శిస్తారని సాంప్రదాయవాదులు గుర్తెరుగరు. ఎవరైనా వారు పెరిగిన సమాజంలో, వారు క్షుణ్ణంగా అర్థం చేసుకొన్న సమాజాన్ని, ఆచారాలను, మతాన్ని మాత్రమే విమర్శ చేయడం సహజం. క్రిస్టియానిటీలో పుట్టి పెరిగిన బర్‌ట్రండ్ రసల్ “Why I am not a Christian” అన్న పేరుమీద పుస్తకం రాయడం సబబు. సల్‌మాన్ రుష్దీ, తస్లీమా నస్రీన్‌లు వంటివారు వారు పుట్టిపెరిగిన ఇస్లాం మతం గురించి విమర్శలు చేయడం సబబు.
ఇదే అంశం మీద టివి మనోజ్, మీరా నందాలు రాసిన ఈ పాతవ్యాసం చూడండి:
Why Should an Indian Rationalist Criticize Hinduism The Most
ఇతర దేశాల్లో కూడా ఇదే రకమైన విమర్శ వినిపిస్తుంది. ఉదాహరణకు అమెరికాలో పదేపదే వినిపించే వాదన: హేతువాదులు క్రిస్టియానిటీ మాత్రమే ఎందుకు విమర్శిస్తారు? ఇతర మతాలను ఎందుకు విమర్శించరు? ఈ కింది చర్చలు చూడండి:
Why do many atheists criticize Christianity but not other religions?
I don’t get why people are ok with criticizing Christianity and Christians but defend other religions
Why do people criticize Christianity so often but hardly ever Judaism and Islam?
ప్రొఫెసర్ కల్బుర్గిపై ఉన్న ఆరోపణలు, ముఖ్యంగా శివలింగంపై చేసిన వ్యాఖ్య గురించి కథనాలు పూర్తిగా దురుద్దేశపూర్వకమైన వక్రీకరణలు. ఆయన ఒక పండితునిగా, పరిశోధకునిగా లింగాయత్ మతంలోని వచనాలను సేకరించి, వాటిని విశ్లేషించి, ప్రచురించి, అవి పలుభాషల్లోకి అనువదించే ప్రాజెక్టులను చేపట్టి లింగాయత్ సమాజానికి ఎనలేని సేవచేశాడు. తాను దేవుణ్ణి విశ్వసిస్తాననే చెప్పుకొన్న ఆయన సమాజంలోని కొన్ని దారుణమైన ఆచారాలను సంస్కరించడానికి మూఢనమ్మకాలను ప్రశ్నించారు. ఆయన మాటలను వక్రీకరించి, ఆయనపై ద్వేషాన్ని పెంచి, జరిగిన హింసకు బాధ్యత వహించాల్సింది ఆయన కాదు, ఆయన మాటలను ఆయుధంగా వాడుకున్న శక్తులే. ఏ విషయాన్నైనా నిర్ధారించుకునే ముందు, దాని వెనుక ఉన్న వాస్తవాలను, సందర్భాన్ని పూర్తిగా తెలుసుకోవడం మనందరి బాధ్యత.
గెలుపు గురించి Govinda D అభిప్రాయం:
08/05/2025 7:02 am
Dev
It is simply super 👌
Unearthing old talent
Great 👍
కంప్యూటర్ చిప్ కథ – 5: గల్వాని – వోల్టా పోట్లాటలో పుట్టిన బ్యాటరీ గురించి Srinivas అభిప్రాయం:
08/05/2025 4:02 am