నాకు నచ్చిన పద్యములలోని ఒకటైన ఈ పద్యముపై చాల చక్కని వ్యాసము. రచయితకు నమస్సుమాంజలులు. ఒకప్పుడు నేను ఈ పద్యమును గుఱించి వ్రాసినది –
నన్నయ భారతములో చివరి పద్యము శరత్కాలపు రాత్రుల సౌందర్యపు వర్ణన అయితే, ఎఱ్ఱన శరత్కాలములో ప్రాతఃకాలము ఏ విధముగా ఉంటుందని వర్ణిస్తాడు. నన్నయ భారతము ఉత్పలమాలతో అంతమయితే, ఎఱ్ఱన భారతము చంపకమాలతో ఆరంభమవుతుంది.
రాత్రి అంత్యాని సూచిస్తే ఉదయము వెలుగును, భవిష్యత్తును సూచిస్తుంది. ఎఱ్ఱన తన కావ్యాన్ని ఆశాజనకముగా ప్రారంభిస్తాడు. తిక్కన అరణ్యపర్వ శేషమును ముగించలేదు, విరాట పర్వముతో ఆరంభించాడు. కొందఱంటారు అరణ్య పర్వము కొనసాగిస్తే కీడు మూడుతుందేమో అని. అలా కాదని ఒక సంతోషముతో, ఆశతో ఎఱ్ఱన ప్రారంభిస్తాడు తన రచనను. అంతే కాదు అరుణాంశ అని ఎఱుపు రంగును తెలిపినపుడు తన పేరును కూడ తెలిపినాడని నా భావన. మిగిలిన కవులు పీఠికలో తమ పేరిని తెలుపుకొన్నారు. కాని మధ్యలో ఆరంభించిన ఎఱ్ఱనకు ఆ అవకాశము లేదు కదా? అందువలన పద్యములో స్ఫురదరుణాంశు అంటాడు, ప్రకాశించే ఎఱ్ఱన అని చెప్పుకొనక చెప్పుకొన్నాడు కవి. నన్నయ శైలిని కూడ అనుకరించడానికి ప్రయత్నిస్తాడు ఎఱ్ఱన ఈ పద్యములో. అందువలన చదువరులకు అది ఒక చక్కని కొనసాగింపు అవుతుంది.
నన్నయ చివరి పద్యాలను ఈ పత్రికలోని “నన్నయ హంసగీతికలు” అనే వ్యాసములో చర్చించి యున్నాను.
నాకు నచ్చిన పద్యం: ఒక మహారాజులోని పసి మనసు గురించి శ్రీనివాసరావు అభిప్రాయం:
12/21/2018 5:58 am
చాలా చాలా బాగుంది సార్..ధన్యవాదాలు.
ప్రాచీన తెలుగు కొలమానం గురించి అనూరాధా సాయి జొన్నలగడ్డ అభిప్రాయం:
12/21/2018 5:57 am
పడి కి ఎనిమిది __________ అని అడిగారు ఒకరు. తెలియలేదు. చెప్పగలరా
కొన్ని దూరాలంతే! గురించి Vijay Koganti అభిప్రాయం:
12/20/2018 5:07 pm
Thank you Prasuna garu 🙂
మంటో కథలు: కాలీ సల్వార్ గురించి ns murty అభిప్రాయం:
12/20/2018 9:34 am
పూర్ణిమ గారూ,
మీ అనువాదం ఎంతో సాఫీగా సాగింది.
హృదయపూర్వక అభినందనలు.
పెరటి తలుపు గురించి Chandra Sekhar అభిప్రాయం:
12/19/2018 12:06 pm
Meher’s translation: తెరిచున్న గుమ్మం
[ఈమాటలోనే వచ్చిన శారదగారి అనువాదం కూడా చదవండి. – సం]
పెరటి తలుపు గురించి సుజాత అభిప్రాయం:
12/15/2018 8:24 am
ఎన్నో సంవత్సరాల క్రితం ఈ కథ చదివాను. భలే తెలుగీకరించారు.
మా అమ్మంటే నాకిష్టం! గురించి జయంతి ప్రకాశ శర్మ అభిప్రాయం:
12/15/2018 2:36 am
సున్నితమైన వాస్తవ కథాంశం ని తీసుకుని, గుండెల్ని పిండిచేసే కథ రాసారు. చాలా బాగుంది.
మంటో కథలు: కాలీ సల్వార్ గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:
12/14/2018 9:58 pm
కథ చాలా బాగుంది. అలాగే అనువాదమూ. అభినందనలు
నాకు నచ్చిన పద్యం: ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం గురించి మోహన అభిప్రాయం:
12/14/2018 9:38 am
నాకు నచ్చిన పద్యములలోని ఒకటైన ఈ పద్యముపై చాల చక్కని వ్యాసము. రచయితకు నమస్సుమాంజలులు. ఒకప్పుడు నేను ఈ పద్యమును గుఱించి వ్రాసినది –
నన్నయ భారతములో చివరి పద్యము శరత్కాలపు రాత్రుల సౌందర్యపు వర్ణన అయితే, ఎఱ్ఱన శరత్కాలములో ప్రాతఃకాలము ఏ విధముగా ఉంటుందని వర్ణిస్తాడు. నన్నయ భారతము ఉత్పలమాలతో అంతమయితే, ఎఱ్ఱన భారతము చంపకమాలతో ఆరంభమవుతుంది.
రాత్రి అంత్యాని సూచిస్తే ఉదయము వెలుగును, భవిష్యత్తును సూచిస్తుంది. ఎఱ్ఱన తన కావ్యాన్ని ఆశాజనకముగా ప్రారంభిస్తాడు. తిక్కన అరణ్యపర్వ శేషమును ముగించలేదు, విరాట పర్వముతో ఆరంభించాడు. కొందఱంటారు అరణ్య పర్వము కొనసాగిస్తే కీడు మూడుతుందేమో అని. అలా కాదని ఒక సంతోషముతో, ఆశతో ఎఱ్ఱన ప్రారంభిస్తాడు తన రచనను. అంతే కాదు అరుణాంశ అని ఎఱుపు రంగును తెలిపినపుడు తన పేరును కూడ తెలిపినాడని నా భావన. మిగిలిన కవులు పీఠికలో తమ పేరిని తెలుపుకొన్నారు. కాని మధ్యలో ఆరంభించిన ఎఱ్ఱనకు ఆ అవకాశము లేదు కదా? అందువలన పద్యములో స్ఫురదరుణాంశు అంటాడు, ప్రకాశించే ఎఱ్ఱన అని చెప్పుకొనక చెప్పుకొన్నాడు కవి. నన్నయ శైలిని కూడ అనుకరించడానికి ప్రయత్నిస్తాడు ఎఱ్ఱన ఈ పద్యములో. అందువలన చదువరులకు అది ఒక చక్కని కొనసాగింపు అవుతుంది.
నన్నయ చివరి పద్యాలను ఈ పత్రికలోని “నన్నయ హంసగీతికలు” అనే వ్యాసములో చర్చించి యున్నాను.
విధేయుడు – మోహన
పెరటి తలుపు గురించి Chanti అభిప్రాయం:
12/14/2018 8:28 am
సూపర్ గా ఉంది…