పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చిరంజీవి శర్మ గురించి వంశీ క్రిష్ణ అభిప్రాయం:

    04/01/2019 5:51 am

    శర్మగారి వ్యక్తిత్వం, మీ ఇద్దరి మధ్యనున్న స్నేహం, వారి రచనా శైలి, వైవిధ్యం, సాహిత్య సేవ చక్కగా వివరించారు. శర్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మీకు ధన్యవాదాలు.

  2. మా అమ్మంటే నాకిష్టం! గురించి Dileep Charasala అభిప్రాయం:

    03/31/2019 8:57 pm

    చదివిన 30 నిమిషాల్లో నవ్వుతో వచ్చిన కన్నీళ్లు, ఎమోషన్ తో వచ్చిన కన్నీళ్లు, రెంటినీ ఒకేసారి 30 నిమిషాలు పారించావు గురు, గొప్పగా వ్రాసావు.

  3. మా అమ్మంటే నాకిష్టం! గురించి Naresh Nunna అభిప్రాయం:

    03/31/2019 3:52 pm

    I, being the Editor of Andhra Pradesh Magazine, had the privilege of publishing this wonderful story (translation) in our magazine.

  4. మా అమ్మంటే నాకిష్టం! గురించి ప్రసాద్ అభిప్రాయం:

    03/31/2019 11:12 am

    మావాడికప్పుడు ఆరేళ్ళనుకుంటా. ఏదంటే అది కాదు కదా, తినమని పెట్టింది కూడా తినే రకం కాదు మా పిల్లలు ఇద్దరూ. ఒకరోజు ఎలా జరిగిందో ఏమో గానీ, నోట్లో పెన్నీ పెట్టుకొని ఆడుతున్నాడట. మింగేశాడు. వెంటనే కంగారుపడుతూ వచ్చి మాకు చెప్పాడు. మేను వెంటనే డాక్టరుకు పోన్ చేశాము. డాక్టర్ చాలా తేలిగ్గా తీసుకొని నవ్వేసింది. ఏం కాదు, వాడు టాయిలెట్‌కు వెళ్ళినపుడు వచ్చేస్తుంది. రాకపోతే అప్పుడు తీసుకురండి అంది.
    అప్పట్నుండి వాడు ఎప్పుడు వెళ్ళినా మాకు చెప్పాల్సిందే అని వాడికి ఓ హెచ్చరిక లాంటిది జారీ చేశాం. వాడేమో రెగ్యులర్‌గా ఒక టైంలో వెళ్ళే రకం కాదు. ఆ రోజంతా వెళ్ళలేదు. మరుసటి రోజు కుమాన్ (kumon అనేది ట్యూషన్ ప్రోగ్రాం) క్లాసుకు తీసుకువెళ్ళాను. అది ఆ భవనంలో మూడో అంతస్తులో వుంటుంది. తీరా అక్కడికి వెళ్ళాక “నాకు వచ్చేస్తుంది” అన్నాడు. అప్పట్లో వాడు ఒకసారి డిక్లేర్ చేశాడంటే వెంటనే పరుగెత్తాల్సిందే. ఇక తప్పలేదు. అక్కడి టాయిలెట్‌కు తీసుకెళ్ళి నేను బయట నిలబడ్డా. ఫ్లష్ చేయొద్దు అని చెప్పే వున్నా. తీరా వాడు పని ముగించుకొని బయటకు వచ్చాక, నేను లోపలికి వెళ్ళి చూస్తే, బాగా గట్టిగా కూర్చున్నాడు. అందులో వాడు మింగిన పెన్నీ వుందో లేదో ఎలా తెలుసుకోవడం! ఏదైనా కట్టెపుల్లో, మరేదో దొరుకుతుందనుకుంటే.. వుహూ.. నీళ్ళలో పడగానే కరిగిపోయే టాయిలెట్ పేపర్ తప్ప మరొకటి కనిపించలేదు. బయటకు వెళ్ళి ఏదైనా వెతుకుదామంటే, నేనటువెళ్ళగానే ఎవడో టాయిలెట్టులోకి దూరి ఫ్లష్ చేసేస్తే…
    ఇక వేరే దారి కనిపించలేదు.. ఆ టాయిలెట్ టిస్స్యూనే చేతితో పట్టుకొని దాన్నంతా పిసికి పిసికి పెన్నీ కోసం వెతికా.. దొరికింది.
    దొరికిన ఆనందం ముందు, కంపు కనిపించనేలేదు.

  5. రజని పాటలు మరికొన్ని గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    03/28/2019 4:30 am

    సూర్య వెంకట సుబ్రహ్మణ్యంగారు,
    “తందనాన భళా తందనాన” అన్న సంగీత రూపకం గురించి నాకు తెలియదు. అన్నమయ్య అన్న రేడియో సంగీత రూపకమైతే నా దగ్గర (కూడా) ఉంది కానీ మాగంటి వంశీ గారు తమ వెబ్సైటుపైన ఇప్పటికే అందరికీ అందుబాటులోకి తెచ్చారు. మీరు 3 భాగాలలో అక్కడ వినవచ్చు. ఈ క్రింది లింకులు చూడండి. http://maganti.org/audiofiles/air/annamayya1.html
    http://maganti.org/audiofiles/air/annamayya2.html
    http://maganti.org/audiofiles/air/annamayya3.html

  6. రజని పాటలు మరికొన్ని గురించి సూర్య వెంకట సుబ్రహ్మణ్యం నూకిరెడ్డి అభిప్రాయం:

    03/25/2019 8:58 pm

    అన్నమాచార్య సంగీతరూపకము పోస్ట్ చేయగలరని ఆశిస్తున్నాను ఈమాట పత్రిక మనసుకు ఆహ్లాదంగా వుంటున్నది

  7. వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    03/25/2019 4:44 pm

    నారాయణరావు గారి రచనల్ని లోతుగా చదివి అర్థం చేసుకోవాలని అభిలషిస్తున్న వారి కోసం నా దగ్గర ఉన్న కొన్ని electronic books ని offer చేస్తున్నా. చాటు ప్రపంచాన్ని గురించిన మౌలికపరిశోధనల A poem at the right moment, పింగళి సూరన అద్భుత కావ్యం ప్రభావతీప్రద్యుమ్నానికి అనువాదం, దాని గురించిన లోతైన ఆలోచనలు వివరించే The demon’s daughter: A love story from South India ఇప్పుడు ఈ-మెయిల్ లో పంపగలుగుతాను. కావలిసిన వారు నాకు ఈ_మెయిల్ పంపండి – kvsramarao@yahoo.com . చదవాలని నిజంగా ఉత్సాహం వున్నవారే అడిగితే బాగుంటుంది. ముందుముందు వీలైనన్నిటిని అందుబాటులోకి తేవాలని ప్రయత్నం.

  8. తడిబల్ల – పొడిబల్ల గురించి పూడూరి రాజిరెడ్డి అభిప్రాయం:

    03/25/2019 8:52 am

    శిరీష్,
    వీటిని కలిపే సూత్రం ఏదీ లేదు. అన్నీ విడిగా చదువుకోవాల్సినవే.
    రాజిరెడ్డిత్వం:-) థాంక్యూ.

  9. వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    03/24/2019 10:59 am

    శర్మ గారు మంచి ప్రశ్నే అడిగారు. నేనన్న పదివేల సంఖ్యకి ఆధారం వారిచ్చిన తొలి వచనానికి ముందున్న పద్యం –

    “మీటు గల రాజరథికుల
    నాటికి వేవుర వధింతు నరుశరములు నో
    నాటి పడవైచునంతకు
    వేటాడెద ప్రతిబలంబు వీరుల నెల్లన్ ”

    రోజుకి వెయ్యిమందిని చంపుతానని స్పష్టంగానే చెప్పాడు భీష్ముడు. తను మొత్తం పదిరోజులు యుద్ధం చేశాడు. అలా పదివేల లెక్కయింది. తను పదిరోజులే యుద్ధం చేస్తానని భీష్ముడికి ముందే తెలుసా అనొచ్చు కాని అలా అంటే నరుడి శరాలే తనని పడవేస్తాయని మాత్రం ఎలా తెలిసిందన్న ప్రశ్న వస్తుంది. అలాగే మీటుగల రాజరథికులు వెయ్యిమంది, మీటులేని మిగతా వాళ్లు మరో తొమ్మిదివేలమందీ కలిపి రోజుకి పదివేలు అనొచ్చు కాని “అట్లుగా నాకయ్యంబు సేయుదివసంబులలోన” అన్న దానికి అన్ని రోజుల మీదా కలిపి పదివేలని నా అభిప్రాయం.

    ఇంతటితో ఈ పిడకల వేటని చాలిస్తాను. అసలు విషయం మరుగున పడటం మంచిది కాదు.

    త్వరలో మహా భారత నాగరికత పశ్వాధారితమని ఎందుకనుకోవచ్చునో నా ఆలోచనలు తెలుపుతాను. అలాటి విషయాల మీద చర్చ ఆహ్వానించదగింది.

  10. చిరంజీవి శర్మ గురించి రమాదేవి అభిప్రాయం:

    03/24/2019 8:45 am

    Sir ఎక్కడ తెలపాలో తెలియట్లేదు, కవనశర్మగారి విడాకులు కథ ప్రచురించమని మనవి.