పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. సూడోసైన్స్‌పై వైదిక సనాతనుల ధిక్కారం గురించి మథు చిత్తర్వు అభిప్రాయం:

    10/01/2025 9:59 pm

    చాలా మంచి వ్యాసం.సైంటిఫిక్ మెథడ్‌కి , సైన్స్‌కి సూడో సైన్స్‌కీ ఆథ్యాత్మికతకీ మానవ హక్కులకీ మానవ జీవితాన్ని సుఖమయం చేయడానికి చాలా మందికి తేడా తెలియదు.సైన్స్ రినైజాన్స్ కాలం నుంచి మానవ జీవితాన్ని మార్చేసింది.అయితే అన్ని రంగాల్లో సైన్స్ అభివృద్ధి చెందక ముందు మతం, సంప్రదాయాలు, హింసించే రాజరికం, ప్రపంచాన్ని శాసించాయి. కానీ సైన్స్ రుజువులతో సహా అత్యంత ప్రగతి సాధించిన ఈ 21వ శతాబ్దంలో కూడా సూడో సైన్స్ లాంటి జ్యోతిషాలు మతం విశ్వాసాలు, మనిషి దేవుళ్ళు, మతంతో రాజ్యాధికారం, పెట్టుబడి లాభం కోసమే పెట్టి కేవలం ధనార్జన కోసం ఇంటర్నెట్, యూట్యూబ్ ఎక్స్ వాట్స్ అప్, అంతరిక్ష ప్రయాణాలు, యుద్దాలు రాజకీయాలు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ వ్యాసం యొక్క ప్రాసంగికత అర్థం అవుతుంది. ప్రజాస్వామ్యం వెనుకబడి ప్రజాభిప్రాయం తెలియజేసే మార్గాలు పెరిగినా, ఫాసిజం, నియంతృత్వం నియంత్రణ అవే సాధనాలు వాడి అణచివేత చర్యలకు సిథ్థపడుతున్నాయి. అంతర్జాల కంప్యూటర్ ప్రగతిని తిరోగమన వాదానికి మిస్ ఇన్ఫర్మేషన్‌కీ అంతులేని ధనసంపాదన అనైతికంగా చేసి అధికారం నిలబెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు.బహుశా ఇది మానవ సహజమైన ప్రకృతి స్వార్థం ఏమో.ఆథ్యాత్మికవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు,మతబోథకులు కళాకారులు… ఎవరూ థనస్వామ్యం,థనార్జన, రాజకీయ అధికారం తప్ప ఏమీ ఆశించడం లేదు. పరపీడన తప్ప చేయడం లేదు.కొంత జీవన శైలిలో సౌఖ్యం పెరిగినా, దోపిడీ కొనసాగుతునే వుంది.

    The more things change they are the same.Inspite of improvement in quality of human life.

  2. బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి అల్లాడి మోహన్ అభిప్రాయం:

    10/01/2025 8:48 pm

    సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా … సుందరే కిం న సుందరం?
    అద్భుతమైన విశ్లేషణ! నమస్సులు

  3. బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి దర్భముళ్ళ చంద్రశేఖర్ అభిప్రాయం:

    10/01/2025 8:12 pm

    మాన్యులు శ్రీ విజయ సారథి గారు ఒక చక్కటి తులనాత్మక వ్యాసాన్ని అందించారు. వారికీ, ఈ మాట సంపాదక వర్గానికి అభినందనలు.

  4. సూడోసైన్స్‌పై వైదిక సనాతనుల ధిక్కారం గురించి సంచారి అభిప్రాయం:

    10/01/2025 4:06 pm

    ఎడారిలో మంచినీటి చుక్కలా ఉంది మీ ఈ వ్యాసం. భారతావనిలొ మళ్ళీ నిజమైన చర్చ, భిన్నత్వానికి ఆదరణ లభిస్తాయి అన్న ఆశ తళుక్కుమంది. మన పిల్లలకి హేతుబద్ధంగా అలోచించదం నేర్పించడం మన భాద్యత. ముందు మనం నేర్చుకుందాం.

  5. సూడోసైన్స్‌పై వైదిక సనాతనుల ధిక్కారం గురించి తిరుపాలు అభిప్రాయం:

    10/01/2025 2:09 pm

    శీర్షిక చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే, “సూడో సైన్స్ పై వైదిక సనాతనుల ధిక్కారం” వైదిక సనాతనులకు తాము గొప్ప సైంటిఫిక్‌ టెంపర్ కలవారమని ధిక్కారమా? వారికి సూడో సైన్స్ అంటే వారికి తెలుసా? వారు సైంటిఫిక్‌ టెంపర్ కలవారైతే కదా సూడో సైన్స్ అనేది ఏమిటని గ్రహించకలిగేది! వారే సైన్స్ అంటే ఏమిటో తెలియని సనాతనులు, ఇక వారికి సూడో సైన్స్ గురించి ఏమి తెలుస్తుంది?

  6. సూడోసైన్స్‌పై వైదిక సనాతనుల ధిక్కారం గురించి డా అవధానం రఘు కుమార్ అభిప్రాయం:

    10/01/2025 1:32 pm

    ఈ మధ్య కాలంలో మీరు రాసిన అనేక వ్యాసాలు, విశ్లేషణల కంటే ఇది నన్ను ఎక్కువగా కట్టిపడేసింది. చాలా అద్భుతంగా, ఆలోచింప చేసేదిలా ఉంది. 17 వ శతాబ్దపు కాలానికే ఆ నీలకంఠ దీక్షితులు అంత తీవ్రమైన, అత్యంత ఆధునికమైన విమర్శ చేయడం తెలుసుకోవడానికే చాలా గర్వంగా ఉంది.

  7. సూడోసైన్స్‌పై వైదిక సనాతనుల ధిక్కారం గురించి T. Narendranath roy అభిప్రాయం:

    10/01/2025 10:24 am

    ఎంత అద్భుతంగా రాశారండీ. హాట్స్ ఆఫ్ సూపర్ ఎంతో relevence వున్న ఆర్టికల్. చాలా మందికి షేర్ చేసాను. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దురు భేద్యమైన అజ్ఞానం మూసి వరదలాగా ప్రవహిస్తుంది. ఒకడు వచ్చి రాజా రామ్మోహన్ రాయ్ దేశాన్ని నాశనం చేసాడు అంటాడు. మరొక ఆవిడ మాక్స్ ముల్లర్, మెకాలే మన సంస్కృతీని మంట కలిపారట. చివరకు బాపు కార్టూన్ ను కూడా ట్రోల్ చేసే స్థితి కి దిగజారి పోయారు. This article is eye-opener. రాసే విధానం, ఫ్లో, readability అదుర్స్…. It is flagship article of october issue. 🙏

  8. కళ్యాణ తిలకం గురించి పాలగిరి విశ్వప్రసాద్ అభిప్రాయం:

    10/01/2025 10:23 am

    కథ బాగుంది. ఒకప్పుడు అనైతికం అనుకున్న అనేక విషయాలు, కాలచక్రమంలో నైతికం అయిపోయాయి. నైతికం, అనైతికంల నడుమ వున్న గీతలు చెరిగిపోతున్నాయి. ఇది చరిత్రలో ఆనాడే ప్రారంభమయిందని చెప్పిన కథ. బాగుంది. రచయితకు అభినందనలు.

  9. ఒకరికి నచ్చిన పద్యం గురించి శివశంకర్ పాపినేని అభిప్రాయం:

    09/27/2025 10:25 pm

    ఆ మెయిల్ ఏదో నేనే పెట్టి ఉంటానేమో. 😊

    చిన్నప్పుడు పాఠశాలలో ‘తల్లీ నిన్ను దలంచి’, ‘ఎవ్వనిచే జనించు’ మా తొలి ప్రార్థనలు. తర్వాతే పాఠాలు. అప్పటినుంచీ ఆ పద్యం చాలా ఇష్టం. సంస్కృత సహజమైన యత్తదర్థక వాక్య పద్ధతిని ఎంతో సహజంగా తెలుగు చేశాడు మహాకవి. అంతకన్నా గొప్ప భగవత్ ప్రార్థన తెలుగు సాహిత్యంలో నాకు కనపడలేదు. ఆ గజేంద్రుడిలో పోతనే ఉన్నాడు.

  10. ఒకరికి నచ్చిన పద్యం గురించి Chandra M అభిప్రాయం:

    09/26/2025 11:55 am

    Very nice.

    Surrender to the source (avyakta chetana and its self-contained manifestation) to experience blissful calm and contentment – the way it is meant to be.