లక్ష్మన్న గారు,
రాగాల విషయాలు, మనలో దాగుండే ఆ సంగీత స్వభావాన్ని చక్కగా చెప్పారు.
It is educational to me because I do not normally get to see raagam related details for songs.
Thank you.
పాట వింటుంటే మీకు “నవమినాటి వెన్నెల నేను (శివరంజని సినిమా), నీలిమేఘాలలో (బావామరదళ్ళు సినిమా)” పాటలు గుర్తుకి రావటానికి కారణం ఇదే!
ఈ మూడు పాటలు, కొంచెం తేడాలతో, కర్నాటక సంగీతంలో ప్రసిద్ధ రాగమైన “ఆభేరి” రాగంలో బాణీ కట్టబడటమే అందుకు కారణం. మనందరిలో మనకి తెలియకుండా సంగీతం ఉందనటానికి మీరు వెలిబుచ్చిన అభిప్రాయమే ఒక మంచి ఉదాహరణ.
తెలుగు లలిత గీతాల్లో, సినిమా పాటలతో కలిపి, “ఆభేరి” రాగంలో చాలా పాటలే స్వరపరచబడ్డాయి! ఈమాట పాతసంచికల్లో ఈ రాగం పై వివరణ విస్తృతంగానే ఉంది.
హిందూస్థానీ సంగీతంలో ఈ రాగాన్నే “భీంపలాస్” అంటారు.
కొంటెకుర్రకారు వెనక జంటనడక నడిచి
విరహంతో వేదనతో వారి మనసు కలచీ || కొంటెకుర్రకారు ||
అంతలోన మంచి కలలు కనుల చిలకరించీ (2)
జరిగి జరిగి జౌతవుల పిలిచి పిలిచి చిలికీ || తిరునాళ్ళకు ||
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/14/2019 11:22 am
సాహితి గారు:
ఈ క్రింది మాటలు మీతో పంచుకోవాలని ముందే అనుకున్నా కాని మర్చిపోయా!
“స్వరాలైన జ్ఞాపకాలు”:
పాట సాహిత్యంలో ఉన్న పై పదాలు, మీకు అన్వయిస్తాయి! మీకు తెలియకుండానే మీ జ్ఞాపకాలు స్వరాలైనాయి! మీరు ఆ విషయాన్ని సంగీతపరంగా వ్యక్త పరచలేకపోయారు అంతే.
అభినందనలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి సాహితి అభిప్రాయం:
09/14/2019 10:46 am
లక్ష్మన్న గారు,
రాగాల విషయాలు, మనలో దాగుండే ఆ సంగీత స్వభావాన్ని చక్కగా చెప్పారు.
It is educational to me because I do not normally get to see raagam related details for songs.
Thank you.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/14/2019 1:58 am
సాహితి గారు:
“వియోగాల వానకారు
మనోవీణపైన జారు”
పాట వింటుంటే మీకు “నవమినాటి వెన్నెల నేను (శివరంజని సినిమా), నీలిమేఘాలలో (బావామరదళ్ళు సినిమా)” పాటలు గుర్తుకి రావటానికి కారణం ఇదే!
ఈ మూడు పాటలు, కొంచెం తేడాలతో, కర్నాటక సంగీతంలో ప్రసిద్ధ రాగమైన “ఆభేరి” రాగంలో బాణీ కట్టబడటమే అందుకు కారణం. మనందరిలో మనకి తెలియకుండా సంగీతం ఉందనటానికి మీరు వెలిబుచ్చిన అభిప్రాయమే ఒక మంచి ఉదాహరణ.
తెలుగు లలిత గీతాల్లో, సినిమా పాటలతో కలిపి, “ఆభేరి” రాగంలో చాలా పాటలే స్వరపరచబడ్డాయి! ఈమాట పాతసంచికల్లో ఈ రాగం పై వివరణ విస్తృతంగానే ఉంది.
హిందూస్థానీ సంగీతంలో ఈ రాగాన్నే “భీంపలాస్” అంటారు.
విష్ణుభొట్ల లక్ష్మన్న
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి సాహితి అభిప్రాయం:
09/13/2019 3:26 pm
10)
వియోగాల వానకారు
మనోవీణపైన జారు
స్వరాలైన జ్ఞాపకాలు
చాలవా బేలవా మనసా || వియోగాల ||
కనులలోన తారాడిన
కానరాక దూరమైన || కనులలోన ||
మౌనమే పాళించే గళం మేళవించెనే || వియోగాల ||
కలలులేని ఏ జీవితం
కంటిచేటు ఈ జగాన || కలలులేని ||
ఆశతో బంధించేనే వసంతాలు పంచునే || వియోగాల ||
అలపులేని ఈ ఊహలు
అందరాని అంబరాల
అలపులేని ఊహలు
అందరాని అంబరాల
వెండినే పండించేనే
విలాపాలు తుంచెనే || వియోగాల (2) ||
ps: నవమినాటి వెన్నెలనేను (శివరంజని సినిమా),
నీలిమేఘాలలో (బావామరదళ్ళు సినిమా)
గుర్తుకొచ్చాయి !
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి సాహితి అభిప్రాయం:
09/13/2019 2:48 pm
తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా (2)
మెరుపులతో మెరిసింది వానకారు || తిరునాళ్ళకు ||
నీ మొయిలు వాలుజడకు చినుకే చేమంతీ (2)
కట్టుకున్న పచ్చదనం పట్టుపరికిణీ || తిరునాళ్ళకు ||
చెలివెన్నెల వేకువలో తానమాడీ
అడవిదారి మలుపుల్లో అదరిచూచీ || చెలివెన్నెల ||
కొండ తిరిగి కోన తిరిగి గుసగుసలాడీ (2)
పరగల మువ్వుల గలగల నాట్యమాడీ || తిరునాళ్ళకు ||
చిగురేసిన చిరుకొమ్మలు ఊగిఊగిపోతే
చిలిపిగ జడివానవేళ చక్కిలిగిలి పెట్టీ
పకపక పువ్వుల నవ్వుల నవ్విస్తూ వస్తూ (2)
బాటవెంట సంబరాలు పంచిపంచి పెడుతూ || తిరునాళ్ళకు ||
కొంటెకుర్రకారు వెనక జంటనడక నడిచి
విరహంతో వేదనతో వారి మనసు కలచీ || కొంటెకుర్రకారు ||
అంతలోన మంచి కలలు కనుల చిలకరించీ (2)
జరిగి జరిగి జౌతవుల పిలిచి పిలిచి చిలికీ || తిరునాళ్ళకు ||
తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా… కన్నెపిల్లలా… కన్నెపిల్లలా…
👏👏👏
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి సాహితి అభిప్రాయం:
09/13/2019 10:30 am
7) రచన: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
గాయని: B. వరహాలు
సంగీతం: N.C.V. జగన్నాథాచార్యులు
పూవులపై గాలులతో తేలె నిదురరాదా (2)
నీటిపైని అలలవలే కలలు సోలిరాగా
మైమరచే తీరాలను మనసుకోరుకోగా || నీటిపైని || || పూవులపై ||
కలతలతో సుడులువడే కనులు తూలిపోగా
తెలిమబ్బుల పానుపుపై తనువు వాలిపోగా || కలతలతో|| || పూవులపై ||
ఏకాంతపు మందిరమై మనికి వేరుకాదా
మెలకువతో మలినమైన మనసు తేరుకోగా || ఏకాంతపు|| || పూవులపై ||
నిదుర రాదా…నిదుర రాదా…
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి సాహితి అభిప్రాయం:
09/13/2019 8:05 am
రచన: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
పూలపల్లకి దిగివచ్చేరెవ్వారే (2)
ఆ పాలనవ్వు దాసాని పువ్వు చూశారే || పూలపల్లకి (2) ||
చెఱకువిల్లు సారించి, తన విరిశరములు సాధించి (2)
మథనుడు కథనడిపింప, అదనెరిగి శరములందింప (2) || పూలపల్లకి ||
బేలగుండెలను పట్టి, ఆ కనులభాష కనిపెట్టి (2)
తలపుతలుపులని తట్టి, సరిజంటలెన్నిటినొకట్టి (2). || పూలపల్లకి ||
కన్నెచేతి గోరింట, తెలిమొగిలిరేకు జడగంట (2)
ప్రేమపేరి జేగంట, ఆ చిలుకతేజి జోడంట (2) || పూలపల్లకి ||
పూలపల్లకి దిగివచ్చినదొకతావి
ఆ తావిపేరు రతిదేవి || పూలపల్లకి (3) ||
గడినుడి – 35 గురించి వికారి అభిప్రాయం:
09/11/2019 12:22 am
“It is a riddle, wrapped in a mystery, inside an enigma; but perhaps there is a key”
గడినుడి – 35 గురించి G.S.BADRINATH అభిప్రాయం:
09/10/2019 10:22 am
కొంచెం సులభతరంగ ఇవ్వగలరు
సీతారాముడి “శివదర్పణం” గురించి చేజాల పెద్దన్న అభిప్రాయం:
09/09/2019 8:19 pm
పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?