పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. ఏనుగు, మర్రిచెట్టూ… చలం! గురించి రావెళ్ల సురేష్ బాబు అభిప్రాయం:

    10/06/2025 11:25 pm

    చాలా మంచి వ్యాసం. చలం అనగానే బిర్ర బిగుసుకుపోయే సనాతనవాదులకు సత్యం తెలుసుకోవాలి అన్న ఆసక్తి, గ్రహించాలి అన్న వివేకం ఉండటం లేదు.

    ప్రకృతికి, సహజత్వానికి మనిషిని దూరం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవాలు, పరిశీలనలతో కలిగిన చాలా విలువైన చలం భావనల ప్రచారం అవసరం ఉన్నది.

    డా,, ప్రతాపరెడ్డిగారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పరాయీకరణ చెందుతున్న మానవుడిలో తిరిగి ప్రాకృతిక మానవత్వాన్ని పాదు కొలిపే రచనలకు ప్రాచుర్యం కల్పించటం ప్రగతిశీలుర కర్తవ్యం.

    చంద్రలత గారికి అభినందనలు, ధన్యవాదాలు.

  2. బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి మైథిలి అబ్బరాజు అభిప్రాయం:

    10/06/2025 8:42 am

    వెన్నెల మెట్ల మీద — వరసగా ఆహ్లాదం, ప్రమోదం, ఆనందం. ఇప్పుడు ఈ వెలుతురంతా పట్టుకొచ్చి పంచిపెట్టిన మీకెన్నో కృతఙ్ఞతలు.

  3. బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి విజయసారథి జీడిగుంట అభిప్రాయం:

    10/06/2025 8:29 am

    మీ సహృదయ స్పందనలకు, ఆత్మీయ ప్రశంసలకు ధన్యవాదాలు దర్భముళ్ళ చంద్రశేఖర్ గారు, అల్లాడి మోహన్ గారు, తాడేపల్లి పతంజలి గారు, చిట్టెన్ రాజు గారు.

  4. బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:

    10/06/2025 1:39 am

    విజయసారథిగారూ,

    మీ స్థాయి ఉన్నతమైనది. మీ యీ వ్యాసం ఎంతో బాగుంది. దీనిలో మీ గ్రంథపఠనవైదుష్యమూ కవిత్వవిమర్శనపద్ధతీ చక్కగా కనిపిస్తూ అందర్నీ అలరిస్తున్నాయి. విశ్వనాథ వరకూ వస్తే నేను కొంచెం వెనకబడి ఉన్నాను. మీ బోంట్ల వ్యాసాలు చదివయినా నేను కల్పవృక్షం త్వరలో చదువుతాను. అభినందనలు.

    -వాసు-

  5. ఏనుగు, మర్రిచెట్టూ… చలం! గురించి Dr.Pratapreddy అభిప్రాయం:

    10/05/2025 10:59 pm

    This article is needed for the present society. Writers like Chandra Latha garu rare personalities and belong to extinction species need of the hour is to support and encourage this writers I wholeheartedly love this beautiful article.

  6. ఏమో గురించి venkata krishna Rao Ponnaganti అభిప్రాయం:

    10/05/2025 5:23 pm

    నాకు బాగా నచ్చింది

  7. ఏనుగు, మర్రిచెట్టూ… చలం! గురించి V. Krishna Rao అభిప్రాయం:

    10/05/2025 12:09 am

    నిజమే నూరేళ్ళ స్త్రీ గ్రంధం ఎప్పటికీ గొప్పదే! ఆరోజున అంత ఆలోచన సాగించిన చలం ఒక చెలమే!

  8. ఏనుగు, మర్రిచెట్టూ… చలం! గురించి ప్రభు అభిప్రాయం:

    10/05/2025 12:04 am

    చలం లోని ఈ కోణాన్ని నేనైతే ఇదే మొదటి సారి చదవడం వెనక్కి పోతున్న ఈ కాలంలో చలం మనకి ఆసరా ఇస్తాడు

  9. కవిత్వంలో నిశ్శబ్దం గురించి అవధానం రఘు కుమార్ అభిప్రాయం:

    10/04/2025 3:32 am

    చాలా సంక్షిప్తంగా, నిశ్శబ్దంగా అద్భుతమైన విశాల విశ్వంలోకి తీసుకెళ్ళింది.

  10. అచ్చం నూలు చీర గురించి పద్మావతి రాంభక్త అభిప్రాయం:

    10/04/2025 3:04 am

    ఎంత బాగుందో కథ. తల్లి ప్రేమ, పిల్లలకు అన్నం పెట్టలేని అమ్మ బాధ ఎంత సున్నితంగా చెప్పారో. అనువాద కథలా లేదు. కథకులకు, అనువాదకులకు ధన్యవాదాలు.