పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. దిల్ ధడక్‌నే దో! గురించి మల్లీశ్వరి అభిప్రాయం:

    07/01/2020 11:55 pm

    ప్రేమ ఉండబట్టే కదా, అతను అంత గిజాటుగా ఉన్నాడు. కథ చదువుతున్నంత సేపూ, ఆ పిల్లకాయలు, అతగాడు నాలుగు పనులు నైపుణ్యంగా నేర్చేసుకుంటే బావుండు అనిపించింది. బైటకు వెళ్లినప్పటి అతని ఫీలింగ్స్ మనందరివీ. కథనం జలపాతంలా దూకింది. చివరి పేరా వదిలేయాల్సిందేమో!

  2. సత్యప్రమాణం గురించి Raghunathpulukuri అభిప్రాయం:

    07/01/2020 8:04 pm

    Very nice sir. I Fell in love with Buddhism with your writings.

  3. విజయం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    07/01/2020 6:34 pm

    కొత్తగా కథను చెప్పడంలో రచయిత విజయం సాధించారు. పదాలను ఆచితూచి వాడటం బావుంది.

  4. విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి గురించి Amarendra Dasari అభిప్రాయం:

    07/01/2020 6:32 pm

    చాలా మంచి ప్రయత్నం ఇది. ఉదయించే సూర్యుని దేశమైన జపాను మూరాసాకితో మొదలుపెట్టడం బావుంది. గెంజి గాథ తెలుగు అనువాదం చాలా కాలం క్రితం చదివాను. సాహిత్య అకాడమీ ప్రచురణ.

  5. గడినుడి – 44 గురించి subhadra అభిప్రాయం:

    07/01/2020 11:36 am

    సహస్ర గారికి, నమస్తే. అన్నీ చూసి ఇచ్చిన ఆధారాలేనండి. వివరణతో మీకుమరింత బాగా తెలుస్తాయనుకుంటాను.

    గడి నుడి-44 సమాధానాలు, వివరణలు మీరు ఇక్కడ చూడవచ్చు.

  6. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Rajendra Kumar devarapalli అభిప్రాయం:

    07/01/2020 10:25 am

    Thoroughly enjoyed waiting for the next part.

  7. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    07/01/2020 8:24 am

    నలుగురికీ ధన్యవాదాలు. మీ స్పందన నాకు ఎంతో విలువైన బహుమతి.

  8. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Vamsi Krishna అభిప్రాయం:

    07/01/2020 7:27 am

    మీ యాత్రాకథనాలన్నీ ప్రయాణం, ప్రదేశాలు, పరిచయాలు అనే మూడు బిందువులను కలుపుతూ గీసే చిత్రాలు, అందుకే అందంగా ఉంటాయి.

  9. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి పొత్తూరి సునీత అభిప్రాయం:

    07/01/2020 7:10 am

    మీ వ్యాసం సాయంతో దుబాయ్ ట్రిప్ వేయవచ్చు. అంతా వివరంగా రాసారు. కాని వెళ్లేది ఎప్పుడనేదే ప్రశ్న. సశేషం అన్నారు… మిగతా బాగాల కోసం ఎదురు చూస్తాను.

  10. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి NEMANI SUBRAMANYAM అభిప్రాయం:

    07/01/2020 5:57 am

    అక్షరాల వెంట కళ్ళు అవి ఏదో లింక్‌లో చదువుతున్నాం అన్నట్లు కాక, సాదృశ్యంగా కంటికి చూపించారు.
    నిజానికి చూపించారు అనటం కన్నా, దుబాయ్ నగరాన చేయి పట్టుకొని మీతో పాటే తిప్పినట్లుంది.