పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఛాయారూపం గురించి Indra prasad అభిప్రాయం:

    11/01/2020 9:48 am

    మోహన్ బాబూ, నీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  2. స్థితం గురించి సత్యవతి అభిప్రాయం:

    11/01/2020 9:48 am

    కథనం బాగుంది.కథ ముగింపు చక్కగా వుంది.

  3. గల్ఫ్ గీతం: 5. నగర సంచారి గురించి ఆకెళ్ళ రవి ప్రకాష్ అభిప్రాయం:

    11/01/2020 9:29 am

    అమరేంద్ర గారూ
    మీ ట్రావెల్ సోలోలోగ్ సోల్ stirring
    Always
    ఒక spontaneity
    మళ్ళీ అందులో అపుడపుడు
    ఆత్మలోకి మునిగి తేలుతూ
    నోస్టాల్జియా ఒక పక్క
    ఈ క్షణం లోకి పరిగెడుతూ ఇంకోపక్క

    ఫోటోలు పేజీ మేకప్ వారికీ అభినందనలుకంగ్రాట్స్
    It has come out too well

  4. గల్ఫ్ గీతం: 5. నగర సంచారి గురించి Sudha అభిప్రాయం:

    11/01/2020 7:27 am

    అమరేంద్రగారు, చాలా బావుంది. ఒక ట్రావెలర్ జర్నీ ఎలా ఊంటుందో అందంగా, మనుషులమద్య ఆత్మీయత, పరిసరాల పట్ల మీదైన ప్రత్యేక పరిశీలన చాలా బావుంది ట్రావెలోగ్ … ఇది వరకు ప్రయాణాలని చదువుతాను… ధన్యవాదాలు

  5. బహుజన సాహిత్యానికి దృష్టాంతం: వలస గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2020 4:12 am

    చక్కని వ్యాసం

  6. బహుజన సాహిత్యానికి దృష్టాంతం: వలస గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2020 4:02 am

    చక్కని పరిచయం

  7. గల్ఫ్ గీతం: 5. నగర సంచారి గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2020 3:56 am

    చాలా సంతోషం శ్రీనివాస్ గారూ..thankyou

  8. ఛాయారూపం గురించి Mohan babu అభిప్రాయం:

    11/01/2020 3:20 am

    నువ్వు ఎప్పుడూ రాసే స్టైల్ నుంచి భిన్నంగా ఉంది, బావుంది.

  9. గల్ఫ్ గీతం: 5. నగర సంచారి గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    11/01/2020 3:15 am

    చూడటం ఒకటి. చూసిన దాన్ని చెప్పటం మరొకటి. చూసిన దాన్ని చెప్పటంలో రమణీయతను చొప్పించడం మరింకొకటి. ఈ మూడూ మీ ఈ పర్వంలో సమపాళ్లలో చేర్చారు. మనుషులనికానీ, ప్రాంతాలనికానీ పరిచయం చేస్తున్నప్పుడు ఒకే విధమైన ఆత్మీయత కనబరుస్తున్నారూ అంటే, అది మీలో పూర్తిగా నిండిపోయి, మీకు సెకండ్ స్కిన్‌గా మారిన ఆప్యాయత అనిపిస్తుంది. May your wings be always spread!

  10. దేవగిరి గురించి NS Murty అభిప్రాయం:

    11/01/2020 1:57 am

    భాస్కర్గారూ,

    చారిత్రక కథనాల్లో కొంత ఊహ కల్పన ఉండక తప్పదు. ముఖ్యంగా ఆధారాలు అంతరించుకుపోతున్నప్పుడు. కథనం కంటే కథనం వెనుక ఉన్న ఆంతర్యం ముఖ్యం. మీ కథనాలు చాలా బిగువుగా కుతూహలం రేకెత్తిస్తూ చివరిదాకా చదివిస్తాయి.

    “ఓ యాభై తరాలు వెనక్కిపోతే ఈ రోజు నువ్వు పూజించే దేవుడ్ని అప్పటి నీ వాళ్లు పూజించి ఉండకపోవచ్చు. అంత చారిత్రకదృష్టి ఉంటే మతాల మధ్య ఇంత ఘర్షణే ఉండేది కాదు.” ఇది అక్షర సత్యం.

    అభివాదములతో
    ఎన్ ఎస్ మూర్తి