పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. కిక్ గురించి సతీష్ బాబు చిగురుపాటి అభిప్రాయం:

    12/02/2020 12:13 pm

    కథ ఆరంభమే ఆ అమ్మాయి ఏమిటో చెప్పింది. తక్షణ న్యాయం ఇచ్చే సత్వర మానసిక ఆనందం ఎట్లాంటిదో చెప్పడం వరకూ సరే. ఆ తరువాత తండ్రికి, అమ్మాయికి మధ్య జరిగిన చర్చ సాగదీతలా అనిపించింది. కాఫీ, కాఫీ లాంటి కథలు చిక్కగా ఉంటేనే బాగుంటాయి.

  2. స్వేచ్ఛ గురించి seshu అభిప్రాయం:

    12/02/2020 10:56 am

    ఈ తరం కధ ఇది. చక్కగ రాసేరు!! How nice to have such understanding parents!!

  3. ఆమె నవ్వు గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    12/02/2020 9:35 am

    “ఆధారపడంతోటే అన్నీ మొదలవుతాయి.” చాలా పెద్ద వేదాంతభావాన్ని మూడు పదాల్లో చెప్పేరు. అద్భుతం. పిల్లి ద్వారా మగవాడి అసలు రూపాన్ని చూపించడం – గింజుకుంటూనైనా నచ్చినట్లు ఒప్పుకోక తప్పదు. ప్రస్తుతం ఇంతే అర్థమైంది. మరో రెందు మూడుసార్లు చదివితే బహుశా మరికొంత అర్థం చేసుకోగలను.

  4. అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ గురించి nagamurali అభిప్రాయం:

    12/02/2020 9:22 am

    వ్యాసం బాగున్నది. వ్రాసినది పండితులైన పెద్దలని తెలుస్తున్నది.

    మీరన్న ఈ క్రింది మాటలు నాకు అర్థం కాలేదు. వీలైతే పురుషార్థసాధన గురించి నాలాంటి జిజ్ఞాసువులకి ఉపయోగించేలా మరొక సవివరమైన వ్యాసం వ్రాయమని సవినయంగా కోరుతున్నాను.

    ధర్మం ప్రత్యేక పురుషార్థం కాదు. కామార్థాల ప్రకటనే ధర్మస్వరూపం.

    (కామాన్ని) అదుపులో ఉంచుకోవడమే పురుషార్థసాధన.

    పురుషార్థసాధన అంటే ఇంతమాత్రమేనా, లేక ఇది దానికి అవసరమైన సాధనమా?

  5. స్వేచ్ఛ గురించి mlsb అభిప్రాయం:

    12/02/2020 8:17 am

    Happy for varun and proud of varuns mother for understanding the problem and coming with a solution. Hats off to the writer.

  6. గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్ గురించి కొత్తపల్లి రవిబాబు అభిప్రాయం:

    12/02/2020 6:30 am

    మీతో పాటు మమ్ములను కూడా కాళ్ళు, కళ్ళు నొప్పి పుట్టినా తిప్పుతున్నారు కదా. ధన్యవాదాలు. రేపటి పోస్ట్ కోసం…

  7. గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్ గురించి sudha అభిప్రాయం:

    12/01/2020 6:18 pm

    కళ్ళకు కట్టి నట్లుగా రాసారు చాల బావుంది

  8. ఆమె నవ్వు గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    12/01/2020 12:51 pm

    చాలా లోతైన కథ. ఎందుకో మేల్ మిజరబులిటి అనే పేరైతే బాగుండు అనిపించింది. బహుశా దాన్ని చూసే ఆమె నవ్విందేమో. పురుషుడ్ని స్త్రీ ఎంత బలంగా ప్రభావితం చేస్తుందో, ఎంత నిస్సహాయంగా మారుస్తుందో కూడా మీదైన శైలిలో చెప్పినట్లున్నారు. స్త్రీ అర్ధమయ్యే పురుషుడికి, తనని తాను అర్థమయ్యే స్త్రీకి ఈ కథ మరంత గాఢతతో కనిపిస్తుందేమో.

  9. కాపరుల జీవిత దర్పణం: కొండపొలం గురించి Amarendra Dasariy అభిప్రాయం:

    12/01/2020 9:15 am

    A good essay. Touching upon the seema literary back ground and discussion on the critical essays that emerged on kondapolam – added value to this essay.

  10. గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్ గురించి Amarendra అభిప్రాయం:

    12/01/2020 6:23 am

    సంతోషం శ్రీనివాస్ గారూ..రచనకు సహృదయ పాఠకులు దొరకడం యెంత అవసరమో మీ వ్యాఖ్య చెపుతోంది.