పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. అస్తిత్వన్యాయం గురించి P Sunitha అభిప్రాయం:

    05/05/2021 7:34 am

    “నిన్ను తట్టి నువ్వు ఇది అని చెప్పేవాళ్ళంటే ఎందుకో కోపం వస్తుంది. ఎవరైనా నీలోపల కోరిక ఇది అని చెప్పాల్సిన అవసరం ఏంటి? అది బయటకులాగి నువ్వు ఇది అని చూపించేదాన్ని ఏమంటారు? ఎంత అవసరమో అంతవరకే మాట్లాడొచ్చుకదా! మనుషులు అనవసరంగా పరిధిదాటి వస్తారెందుకు?”

    మీ కథలు అన్నీ బాగుంటాయి. గుప్పిట విప్పే క్రమం లోనే ఉంది చాతుర్యం.

  2. అస్తిత్వన్యాయం గురించి Vupparapaati venkatesulu అభిప్రాయం:

    05/05/2021 12:46 am

    కథ నడిపిన స్టైల్ చాలా బాగుంది. అంతర్లీనంగ మీరు చెప్పాల్సిన కథా నేపథ్యము ప్రతి వాక్యంలో కనబడుతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోకుండా, ఏ ఆదర్శాన్ని అంగీకరించరని అనిపిస్తుంది. యిష్టం లేకపోయినా ఆదర్శం కోసం యితరుల పొగడ్తలకు తలూపడం నచ్చని విషయం బాగుంది. అభినందనలు.

  3. నిష్క్రమణ గురించి Madhu Babu Gogada అభిప్రాయం:

    05/04/2021 9:26 pm

    Very nice Padma garu.

  4. అడవి పుస్తకం గురించి sudha అభిప్రాయం:

    05/04/2021 8:34 pm

    చాలా బావుంది విశ్లేషణ. పుస్తకం హృదయంలో ఇంకినప్పుడు ఇలా రాయగలరు. తప్పకుండ చదువుతాను ఈ పుస్తకాన్ని…

  5. అడవి పుస్తకం గురించి Amarendra అభిప్రాయం:

    05/04/2021 11:47 am

    కామెంటు 7 లోని భావాలు అభిప్రాయాల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. కానీ అందులోని భాష అనుచితంగా అమర్యాదకరంగా ఉంది. ఇదే వ్యాఖ్యాత ఇలానే ఇంతకుముందు దాడి చెయ్యడం జరిగింది. ఇలాంటి దాడులనుంచి రచయితలను కాపాడటం సంపాదకుల బాధ్యత అనుకొంటున్నాను

  6. అస్తిత్వన్యాయం గురించి Lyla yerneni అభిప్రాయం:

    05/04/2021 11:24 am

    Writer! You are much too much. I am totally enjoying your intelligence.

    ప్రపంచం అంతా ఈ సరికే అర్థం ఐపోయింది. ఎవరేమిటికి ఎందుకు చేస్తున్నారో అంతా తెలుసు. ఐనా కథా రచన లో మాత్రమే భయభ్రాంతి చేసే విశ్వరూపం చూపించి, ఆ తర్వాత యశోదను మళ్లీ మాయలో పడేసి కృష్ణుడు చిన్న పిల్లడైపోయినట్టు, పాఠక లోకానికి, థాంక్యూ, థాంక్యూ అని చెప్పివెడుతూ మురిపిస్తున్నారు. మళ్లీ మేమంతా మా బొందన పడాలిగా! Is that the way you bring us out of your hypnosis?

    Also I saw your photograph elsewhere. You are a pretty woman. Like intelligence, beauty is also one of your attributes. (The minuscule photo in eemaata is not good. A photo is an art form, unless shown and seen in proper size does not do much for the subject. I wish eemaata magazine, provides a bigger and better photograph.) Please do not hesitate, to attach a different photograph, with each of your writings, published here or elsewhere. It helps you grow, glow, and enjoy yourself. The publishers should eagerly show them. The viewers will be delighted.

    Kudos on excellent writing! Have a charmed life!
    -Lyla

  7. అడవి పుస్తకం గురించి Lyla yerneni అభిప్రాయం:

    05/04/2021 10:26 am

    Hope the editors clarify.

    ‘అడవి లోంచి అడవికి’, ‘అడవి పుస్తకం’ అనేవి రెండు పుస్తకాలా? రెండు అడవుల గురించి రచయిత రెండు పుస్తకాలు రాసారా? లేక అట్టలు, పుస్తకం పేరు, మార్పులతో రెండు ముద్రణలా? ఒకటి 2018, రెండోది 2021 లోనా? అసలింతకీ రాసింది జయతి లోహితాక్షన్? మరి ఆ పేరు ఎత్తేసి, దాసరి అమరేంద్ర రచనల జాబితాలో ఈ మేగజీన్లో ఎందుకు ప్రచురిస్తారు? అసలు ‘స్టార్’ బదులు, స్టేజ్ మీదకు ‘Stand in’ వచ్చి, కర్టిసీలు చేస్తున్నట్టు, ‘రివ్యూయర్’ తేపతేపకూ పాఠకులకు కృతజ్ఞతలు తెలపటం ఎందుకు? అసలు రచయిత అడివిలో ఉన్నందునా? అంతా గందరగోళం తప్పించి, సాహిత్య ప్రయోజనం ఏమిటి?

    ఇతర పుస్తక రచయితలు కొన్నిసార్లు వారే, తమ పుస్తకం లోంచి excerpts ఈ పత్రికలో ప్రచురణకు ఇస్తున్నట్టున్నారు. సంతోషం. (అప్పుడు రచయితతో, గ్రంథం గురించిన సంభాషణకు అవకాశం ఉంది.) కాని వీటిని రచయితల రచనల పేజీలో- ఆసరికే ప్రచురించబడిన పుస్తకం పేరు చెప్పకుండా ‘వ్యాసాలుగా’ లిస్ట్ చెయ్యటం సరియేనా? ఈ ఫలానా పుస్తకంలో ఈ పేజీ నుండి, ఈ పేజీ వరకు అని ఇవ్వాలేమో.

    There is a variety of material to read in the magazine. To read it in the right context, please facilitate by accurate identification of literary works, right at the outset. Every time.

    Thanks.
    -Lyla

    [లైలాగారు: 1. అవి రెండు వేరే వేరే పుస్తకాలు. 2. ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తూనో, సమీక్షిస్తూనో రాసిన రచనలను ఆ పరిచయకర్త, లేదా సమీక్షకుల పేరుతోనే ప్రచురించుతారు కదా. అమరేంద్ర రాసిన పరిచయం కాబట్టి ఆయన పేరు మీదే ప్రచురించాము. 3. ఒక పుస్తకం అచ్చవుతున్న సందర్భంలో కాని, లేదూ మంచి పుస్తకం అని మేము భావించినదానిని కాని, మేమే పరిచయం చేయదలచుకున్నప్పుడు, ఆ పుస్తకపు ముందుమాట కాని, ఆ పుస్తకంలోనుంచి ఒక వ్యాసం కాని –ఆ పుస్తకం పట్ల పాఠకులకు ఆసక్తి కలిగించడం కోసం– రచయిత అనుమతితో, మేము అప్పుడప్పుడూ ప్రచురిస్తుంటాం. అలా ప్రచురించినప్పుడు, ఆవ్యాసంలో పుస్తకం వివరాలు పూర్తిగా ఇవ్వబడుతున్నాయి. 4. ఇక, రచయితలు పాఠకులకు కృతజ్ఞతలు తెలపడం వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడివుంది. రచయితలు ఇలా ‘తేపతేపకూ పాఠకులకు కృతజ్ఞతలు తెలపటం’లో మీవంటివారికున్న ఇబ్బందిని గమనిస్తూనే, వారిని అలా చేయద్దనే హక్కు కూడా మాకు లేదని తెలుపుకుంటున్నాం. – సం.]

  8. అదృశ్య దుఃఖాన్నై… గురించి సాంబమూర్తి లండ అభిప్రాయం:

    05/04/2021 10:11 am

    మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.

  9. అస్తిత్వన్యాయం గురించి Siddhiq అభిప్రాయం:

    05/04/2021 5:51 am

    మానవ సంబంధాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో, ఎప్పడు ఎవరు కలుస్తారో, ఎప్పుడు ఎవరు దూరం అవుతారో అన్ని కాలానికే తెలుసు. చాలా మంది కాలానుగుణంగా, నీరు పల్లం ఎరిగినట్లు, పరిస్థితులనుగుణంగా తమను తాము మలుచుకుంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం అనే చట్రానికి వెలుపల ఉంటారు, ఇలాంటి వారికి బాధలు తక్కువ. కానీ మరికొంత మంది కొన్ని విలువలకు కట్టుబడి, కింద నుండి శిఖరాన్ని అధిరోహించినట్లు ఎటువంటి పరిస్థిల్లో నైనా వ్యక్తిత్వాన్నీ నిలబెట్టుకుంటారు. వీళ్లకు బాధలు ఎక్కువ. ఒక వేళ పై చెప్పిన వ్యక్తులులాంటి వారితో వీళ్ళ సంబంధాలు చాలా నష్టాలకు, కష్టాలకు దారి తీస్తుంది. అటువంటి కథే కథకురాలిది.

    రచయిత్రి శైలి చాలా బావుంది. అభినందనలు

  10. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి G.balakrishna అభిప్రాయం:

    05/03/2021 9:53 pm

    ఈ పద్యం 10వ తరగతిలో నన్ను హీరోని చేసింది… 😊😊😊😊😊😊😊… గుర్తుకొస్తున్నాయి…