పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి ఉణుదుర్తి సుధాకర్ అభిప్రాయం:

    09/09/2021 6:59 am

    అంతరిక్షానికెగసి, అక్కడనుండి భూగోళాన్ని పరికించగల రోజులు మనవి. శాటిలైట్ నేవిగేషన్, జీపీఎస్ నిత్యసాధనాలైన మొభైల్ ఫోన్లలో అందరి చేతుల్లోనూ అమరిపోయాయి. అయినప్పటికీ అత్యంత ప్రమాదకరమూ, దక్షిణ భారతదేశమంత వైశాల్యమూ కలిగినటువంటి ‘ఎంప్టీ క్వార్టర్’ వంటి మానవ సంచారంలేని ఎడారి ప్రాంతాలున్నాయంటే ఆశ్చర్యం కలిగింది.

    సమాజపు కపటత నుండి, దుర్మార్గం నుండి కెరీర్ అనబడే ‘ఇరవయ్యవ శతాబ్దం సృష్టించిన అందమైన వల’ నుండి దూరంగా జరిగి, చివరికి ప్రకృతి ఒదిలోనే ప్రాణాలు వదిలిన క్రిస్ కథను సినీమాగా చూశాను. ఇప్పుడు మళ్లీ గుర్తుచేశారు.

    అనికేత్ కి అతని యాత్రలలో ‘మారుమూల’ ప్రాంతాలలో సాధారణ జీవనం గడుపుతూన్న అసాధారణ వ్యక్తుల పరిచయాలు ఉత్తేజం కలిగించాయి.

    ఆడపిల్ల కావడం ఒక పరిమితిగా భావించని శివ్య కథ తెలుసుకున్నప్పుడు – అందరూ నడిచే తోవని తృణీకరించడం, ఇష్టపడ్డ తీరున జీవించగలగడం – వీటిల్లో అత్యంత ప్రాచీనమైన మానవ కాంక్ష దాగి ఉన్నదనిపించింది.

    ఈ పుస్తకాలు చదవాలనే బలమైన కోరికను, అంతకన్నా ముఖ్యంగా – జీవితం అంటేనే నిత్య సాహసయాత్ర అనే భావనను మరోసారి బలంగా కలిగించారు, ధన్యవాదాలు!

  2. నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి Sinu అభిప్రాయం:

    09/09/2021 2:34 am

    ఈ ఒక్హ సమీక్ష పది వేదాంత పుస్తకాల పెట్టు.
    ఈ వైరాగ్యం , స్మశాన వైరాగ్యం కాకుండా ఇలానే నిలవాలని , మిగిలిన జీవితమైనా పండించు కోవాలనే కోరిక

  3. నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి Amarendra అభిప్రాయం:

    09/09/2021 2:14 am

    స్పందించిన అందరికీ ధన్యవాదాలు

  4. నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి mani vadlamni అభిప్రాయం:

    09/08/2021 11:52 pm

    సత్యాన్వేషణ చేయాలన్నా,ఉత్తేజం పొందాలన్నా సంచారం చేయాలి… (ప్రయాణం)లో నేను వ్రాసుకున్న వాక్యం.

    ఈ నాలుగు పుస్తకాల గురించి అమరేంద్రగారు వ్రాసిన విశ్లేషణ లేదా పరిచయం చదువుతున్నప్పుడు ఆయా వ్యక్తులు కళ్ళముందు నిలిచారు.

    మీరు వ్రాసిన అక్షరాలతో నేను మానసికంగా సంచారం చేసినంత అనుభూతి కలిగింది. ఈ నాలుగు పుస్తకాలలోని ప్రయాణపు పిపాస అబ్బురపరిచింది.

    వాళ్ళలాగా ప్రయాణం చేయాలనే తపన మాత్రం బాగా పెరిగింది.

  5. విషాద నగరం గురించి మాధవ్ యినుగంటి అభిప్రాయం:

    09/08/2021 12:09 am

    శ్రీధర్ గారి మినీ కథ చాలబాగుంది

  6. విషాద నగరం గురించి Nageswara Rao అభిప్రాయం:

    09/07/2021 2:32 am

    చాలా బాగున్నది మినీ కథ. అనిశెట్టి శ్రీధర్ గారు ఈ ప్రక్రియలోనూ కచ్చితంగా రాణిస్తారు. చివరివాక్యం మలుపు ఊహించనిది..

  7. నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి Amarendra అభిప్రాయం:

    09/06/2021 10:32 pm

    శ్రీధర్ రాజు
    రవికృష్ణ మూర్తి
    ఛాయామోహన్
    రఘువర్మ సునీత

    మీ అందరి చక్కని స్పందనకు ధన్యవాదాలు

    యాత్రలు గురించి సీరియస్ గా ఆలోచించడం మొదలెట్టి 20-25 ఏళ్లు..ఎన్నో కోణాల్లో యాత్రను పదేపదే చూశాను. ఈ నాలుగు పుస్తకాలూ ఆ విభిన్న కోణాలను సమన్వయం చేసే మూల సూత్రాన్ని అందించాయి అనిపించింది. దాన్ని పదిమందికి అందించే ప్రయత్నం ఈ వ్యాసం.

    మీ స్పందనలు నా ప్రయత్నం సఫలం అయిందన్న ఆశ కలిగిస్తున్నాయి

    కృతజ్ఞతలు

  8. నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి Amarendra అభిప్రాయం:

    09/06/2021 9:12 pm

    రాజాగారూ… మీ స్పందన ఎంతో
    హృద్యంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    బ్యాక్ ప్యాక్ వేసుకోడానికి వయసంటూ లేదు. చూసారుగదా, క్రిస్ ఎనభై ఏళ్ల స్నేహితుడు ఏం చేశాడో!

  9. వినాయక చవితి కథ గురించి Srinivas Chilakamari అభిప్రాయం:

    09/06/2021 8:52 am

    కథ చాలా బాగుంది, బాల్యంలోని సంఘటనలు మళ్లీ గుర్తొచ్చాయి. అంటే మర్చిపోయామని కాదు, కానీ జీవనగమనంలో అడుగున పడిపోయినవాటిని మళ్లీ ఓసారి స్ఫురణకు తెచ్చారు ధన్యవాదాలు.

  10. విషాద నగరం గురించి Chandra Rao, Eluru అభిప్రాయం:

    09/05/2021 8:15 am

    మినీ కథ బాగుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్రాశారు.