పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. వి. ఎ. కె. అంటే? గురించి రామాచారి బంగారు అభిప్రాయం:

    09/02/2022 12:47 am

    నమస్కారము. వెలకట్టలేని సమాచారం పంచారు. మీకు వేనవేల వందనాలు.

  2. ష్‌! ఆమె పని చేసుకుంటోంది గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/02/2022 12:40 am

    అలవోకగా ఒక జీవితాన్నీ జీవనవిధానాన్నీ నాలుగు మాటల్లో చెప్పేసారు. ధన్యవాదాలు.

  3. జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి Nagalakshmi Varanasi అభిప్రాయం:

    09/01/2022 10:27 am

    కళాకారులుగా పుట్టి అదే తమ అస్తిత్వమని నమ్మేవారు కులమత ప్రాంతీయభేదాలకి అతీతులై జీవించగలరని ఇలాంటి రచనలు చదివితే అనిపిస్తుంది. వారి జీవితాలు ఎందరికో స్ఫూర్తిదాయకమౌతాయి! అన్వర్, కళాకారులుగా మీరు బిస్మిల్లాఖాన్, జేసుదాస్ వంటి వారి వారసులు. వారి మనసుకి వారు ఆరాధించిన కళ ఒక్కటే విశ్వవ్యాప్తి అయి కనబడింది. ఇతరమైన ఏ హద్దులూ వారి దృష్టికి ఆనలేదు కదా.

  4. జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి తః తః అభిప్రాయం:

    09/01/2022 10:10 am

    అన్వర్:

    మా అబ్బాయితో ఒకమారు అన్నాను, “Science loved and got married to Technology and Technology eloped with Commerce” అని. అమ్మాయిలను చూడటం నేర్పిన రఫీ పాట, ఎక్కడున్నానో తెలీకుండా చేసిన సజ్జద్ హుసేన్ సంగీతమూ, ఎప్పుడు ఎక్కడ వినపడ్డా గిలగిలా కొట్టుకునేటట్టు చేసిన సాహిర్ మాటల రోజుల్లో కుర్రాణ్ణయినందుకు ఈ రోజుకు గూడా ఒక హాయి!

    నమస్కారాలతో -తః తః

  5. జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి Hema అభిప్రాయం:

    09/01/2022 9:13 am

    అన్వర్ గారు,

    మీరు అందంగా బొమ్మలు గీయడమే కాదు అందంగా రాస్తారు కూడా. మీలో చాలా సున్నిత, సునిశిత భావపరంపర. మీరు గీసే బొమ్మల్లో, మీరు రాసే భావ రచనల్లో సర్వమత సమానత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది. ఇలా అందరూ ఆలోచిస్తే, మరో మతంలోని మంచి, అందం చూడగలిగితే ప్రపంచం ఎంత శాంతియుతంగా ఉంటుందో కదా!

    మీకు అభివాదాలు మరియు అభినందనలు. నమస్కారములు.

  6. జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి ఓలేటి శ్రీనివాసభాను అభిప్రాయం:

    09/01/2022 7:22 am

    ఎంత బాగా రాశారో!

  7. శ్రీకాంత శర్మ సాహితీప్రస్థానం గురించి Sony అభిప్రాయం:

    08/29/2022 9:52 am

    చిగురుల వూయలలో lyrics and భావం please.

  8. Trash గురించి రాజ్ రెడ్డి అభిప్రాయం:

    08/28/2022 1:09 am

    రాత్రింబవళ్లు కాలాకాలాలకు పుట్టిన కవల పిల్లలలేమోనన్న స్పృహ మసక మసకగా ఎరుకలోకి వచ్చే క్రమంలో ప్రాపంచికం అలౌకికాన్ని మెలి పెడుతున్నట్టు ఏదో మెత్తటి నొప్పి గట్టిగా తెలుస్తోంది, చదువుతుంటే. మళ్లీ చదువుతుంటే మరింత ఎక్కువవుతోంది. గొప్పగా రాశారు, అనురాధగారు. అభినందనలు!

  9. గుర్రాల మావయ్య గురించి డా.అరిపిరాల అభిప్రాయం:

    08/27/2022 11:11 pm

    కొప్పున్న ఆడది తల్లో ఏం పెట్టిన అందమే అన్నట్టు చేయి తిరిగిన రచయిత ఏం రాసినా అందమే అన్నట్టుంది మీ గుర్రాల మామయ్య ఉదంతం.
    అభినందనలు శ్రీరమణ గారూ!

  10. ఋతుపర్ణము గురించి గంటి లక్ష్మీ నారాయణ మూర్తి అభిప్రాయం:

    08/26/2022 3:49 am

    మాన్య మిత్రులు శ్రీ బెజ్జాల మోహనరావుగారి చేతిలో ఏచందస్సైనా పురివిప్పి ఆడుతుంది. అది అందరికీ సాధ్యం కాదు. జన్మతః వస్తుంది. అది వారి పుణ్యఫలం.