పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఊహల ఊట 18 గురించి చెళ్లపిళ్ల శ్యామల అభిప్రాయం:

    11/08/2022 6:12 am

    కథను చదువుతున్నంత సేపూ మనసు కాగితం పడవై బాల్యం సెలయేటిలో విహరించింది. ఓ చిన్నపిల్ల తన భావాలు చెబుతున్నట్టు రాసిన ఈ కథలో రచయిత్రి తన చిన్నతనంలోకి పరకాయ ప్రవేశం చేసినట్టే. కథ చదివాక తప్పకుండా ఎవరి బాల్యపు ముచ్చట్లు వారు నెమరేసుకుంటారు. పొగాకు నీరు ఇలా వాడతారన్న కొత్త విషయం తెలిసింది. బుర్రకు పురుగు పడితే నా దగ్గరో సొల్యూషన్ ఉంది. ఇలాంటి ఓ మంచి కథ చదివేస్తే సరి.

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Santhisree అభిప్రాయం:

    11/08/2022 5:45 am

    పెద్దలకు నమస్సులు. ఎన్నో కొత్త విషయాలు త్యాగబ్రహ్మం గారి గురించి తెలుసుకున్నాం. సశాస్త్రీయంగా మీరు వెలిబుచ్చిన అంశాలు చదువుతుంటే మనసు ఆనందభరితమైంది. చాలా సంతోషం.

    ఇక ఆనందభైరవి రాగాన్ని త్యాగం చేసే సందర్భానికి కారణమైన మధురానగరిలో రచయిత ఎవరు? చాలామంది శ్రీ ఉత్తుకాడ్ వెంకట సుబ్బయ్యగారని అంటున్నారు. నిజమేనా? అది నిజమే ఐతే, నా సందేహమేమంటే వెంకట సుబ్బయ్యగారి కాలం ఇప్పటికి సుమారు వంద ఏళ్ళు అయి ఉండవచ్చు. కానీ అప్పటికే ఆ రచన యక్షగానంలో పాడినట్లయితే ఆ రచన ఇంకా ముందే రచింపబడి ఉండాలి గదాని. లేకపోతే ఇది కట్టుకథా? తెలియజేయగలరు.

  3. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Santhisree అభిప్రాయం:

    11/08/2022 4:10 am

    అత్యంత ఆసక్తికరంగా ఇన్నాళ్లూ గురువులచేత తెలుసుకున్న విషయాలు కొంతవరకే నిజమైనవనీ పరమ రామభక్తుడు, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, శ్రీ త్యాగబ్రహ్మం గారి జీవిత విశేషాలు ఇంకా చాలానే ఉన్నాయని, మీ ఈ వ్యాసం ద్వారా తెలుసుకున్నాను. మిగిలిన భాగాలు కూడా చదువుతాను. సంగీత ఉపాధ్యాయినిగా త్యాగయ్య గారిని స్మరిస్తూ, వారి కృతులను గానం చేస్తూ, అప్పుడప్పుడు ఆ కృతులకి వ్యాఖ్యానం చెప్పుకుంటూ వున్నాను ఇప్పటిదాకా. చాలా ధన్యవాదాలు మీకు.

  4. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    11/08/2022 1:17 am

    Venkygaru, Thank you!

  5. ఊహల ఊట 18 గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:

    11/07/2022 11:53 am

    ఓయి దేముడూ ఈ ఆస్తులూ అంతస్తులు వైభవాలు మెరమెచ్చు మాటలు ఏమీ వద్దంటే వద్దు. ఏడిస్తే లాలిపాడే అమ్మ ముద్దుచేసే నాన్న ఎటో వెళ్లిపోయిన నా బాల్యాన్ని తిరిగి ఇవ్వు. అవి చాలు చాలు.

  6. మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    11/07/2022 8:20 am

    పుస్తకం పేరు: సూరీడు. నవరత్న బుక్ సెంటర్. రచయిత: చిట్టిబాబు. 1986.

  7. వంద కుర్చీలు గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    11/07/2022 7:14 am

    నాగరికత ఉజ్వలంగా ఉండటానికి వీలుగా మేధావులు ఆలోచించి పెట్టిన కులం (నిజానికి వర్ణం అనాలి)దొంతర కాలక్రమేణా వెర్రితలలు వేసింది. నిజానికి డక్కిలి కులం వాళ్ళని మాదిగవారు చాలా తక్కువగా చూస్తారు. విప్రులలోనే శాఖాభేదం తీవ్రంగా ఉండేది. పురాణాల్ని వేదాలని సరిగా అర్ధం చేసుకోకుండా ఊరికే వల్లెవేస్తే వచ్చే ప్రమాదాలకి భాస్కరుగారు వ్రాసిన సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. పరిపాలకులు నడుం కట్టకపోతే ఈ జాడ్యానికి మందు కనిపెట్టడం కష్టమే మరి.

  8. మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి శాంతిశ్రీ బెనర్జీ అభిప్రాయం:

    11/07/2022 12:34 am

    తెలియజేసినందుకు ధన్యవాదాలు సుబ్రహ్మణ్యంగారు.

  9. మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి శాంతిశ్రీ బెనర్జీ అభిప్రాయం:

    11/07/2022 12:32 am

    చిట్టిబాబు గారి నవల పేరు, మిగతా వివరాలు దయచేసి తెలుపగలరు.

  10. మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి వంశీక్రిష్ణ అభిప్రాయం:

    11/07/2022 12:26 am

    చాలా బాగుందండి సమీక్ష.