ఎట్రాసిటీ మీద, కులాల వెనుకబాటు మీద కథ అంటే ఇంత చిక్కగా రాయాలి. అణగారిన కులంలో పుట్టని వారు కూడా ఈ కథ చదివితే , ఆ మనుషుల జీవితం ఒక జిస్ట్ లా అవగతమవుతుంది. మాటలు రాక, ఏ పనీ చెయ్యలేక అలా కాసేపు అచలంగా ఉండిపోయాను. వంద కుర్చీలు కథ తో సాహిత్యంలో వంద సింహాసనాలు అధిరోహించిన మీకూ, జయమోహన్ కీ వెయ్యి నమస్కారాలు.
వ్యాసం బాగుంది. త్యాగయ్య కీర్తనల్లొ వాడిన తెలుగు పదాలు కొన్ని నేడు అస్సలు ప్రాచుర్యంలొ లేవు. వాటిని గురించి ప్రస్తావించితే మనకి తెలియని త్యాగరాజు కాస్తైనా తెలిసె అవకాశం వుండేది. ఆయన రచనల్లొ తామసము అనే పదప్రయోగం తరచుగా కనిపిస్తుంది. ఆయన వాడిన తెలుగు పదాలు మరికొన్ని మనకు తెలియనివి వున్నాయి. మచ్చుకు కొన్నిటిని వివరిస్తే బాగుండేది. ఆయన కాలంలో సామాజిక పరిస్థితులమీద కీర్తనలు లేకపొవటం ఎప్పటికీ అర్ధంకాని విషయం. కృతులన్నీ భక్తిమీదనె కేంద్రీకృతమై వున్నాయి. అందుకేనేమో నేడు శాస్త్రీయ సంగీతం ప్రజల ఆదరణకు నోచుకోవటం లేదు. పాశ్చాత్య సంగీతంగూడా చర్చి లోనే పుట్టినప్పటికీ కాలక్రమంలో దానికి ఒక సొంత దారి ఎంచుకున్నది. అందుకే నేటికీ సామాన్య ప్రజల ఆదరణకు నోచుకున్నది. మనిషికి కలిగే అనుభూతికి అనుగుణంగా వుంది ఆ బాణీ. మన సంగీతం అలా కాదు. మన సంగీతం భక్తి నుంచి బయటపడలేకపోయింది. నేటి జీవిత సమస్యలకు భక్తి సమాధానం చెప్పలేక పోతుంది. సినిమా పాటలకున్న ఆదరణ శాస్త్రీయ సంగీతానికి లేకపోవటానికి కారణం మన శాస్త్రీయ సంగీతం సగటు మనిషి భావోద్వేగాలను అర్ధం చేసుకోలేక పోవటమే. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జీవనం. కానీ వ్యవసాయం మీద ఒక్కటంటే ఒక్క పాట కూడా రాయలేదు త్యాగయ్య. నేటి సమస్యలకు రాముడు ఏవిధంగానూ సమాధానం చెప్పలేడు. మన సంగీతంలో వున్న లోపాన్ని గూడా చూపితే బాగుండేది. చదువరులకు ఒక సమగ్ర అవగాహన కలిగే అవకాశం ఉండేది. మరో వ్యాసంలోనైనా నాటి తెలుగుకు నేటి తెలుగుకు వ్యత్యాసం తెలిపితే బాగుండును. చిత్రమేమిటంటే త్యాగయ్య పాటలు సింహభాగం తెలుగులో వున్నప్పటికీ తెలుగునాట ఆదరణ లేదు. తమిళులకు కృతులలోని భాష భావం పెద్దగా అర్ధంగాకపోయినా వారు బాగా ఆదరిస్తున్నారు. త్యాగయ్యకన్నా చాల ఏళ్ళు ముందు జీవించిన అన్నమయ్య సంకీర్తనల్లో భక్తితో పాటు ప్రాపంచిక విషయాలమీదగూడా పాటలు వున్నాయి. కానీ ఆనాటికి గురుశిష్య పరంపర వ్యవస్థ లేకపోవటంతో అన్నమయ్య పాటలు ఎలా పాడాడో మనకు తెలియదు. త్యాగయ్య ఎలా పాడాడో తెలుసు మనకు. నేటికీ అలానే పాడుతున్నాము.
గ్రంథ చౌర్యం మీద చర్చ బాగుంది. ఒకరు రాసింది మరొకరిదిగా చెప్పుకుంటే గ్రంథచౌర్యం అంటాముగదా! మరి ఒకరు రాయనిదాన్ని ఆపాదించితే దానిని ఏమంటారో తెలుసుకోవాలని వుంది. ఉదాహరణకు త్యాగరాజ కృతులుగా చలామణి అయ్యే కృతులు అన్నే త్యాగరాజు రచించినవి కాదు అనే వాదన వుంది. అన్నమయ్య సంకీర్తనలు, వేంసన పద్యాలలో గూడా వారు రాయనివి వారికి ఆపాదించారు అని నమ్మేవారు వున్నారు. మన ఆలోచన మనదిగా చెబితే పట్టించుకోని లోకం, అదే ఆలోచనను ఏ పెద్దమనిషికొ ఆపాదించితే ప్రజలు ఆదరిస్తారు. అందుకని, కొందరు తమ ఆలోచనలను ఇతరులకు ఆపాదించి తమ మాటలకు వచ్చిన గుర్తింపుని వైకారియస్ ప్లెషర్ తో ఆనందిస్తారు. సాహిత్యంలో ఈ ప్రక్రియను ఏ మందురో ఎవరైనా పెద్దలు చెప్పాలని మనవి.
చిన్నప్పుడు ఈ పాటని మా నాన్నమ్మ పాడేది. ఇంకా ఎన్నో కథలు చెప్పేది, ఆ తర్వాత మా నాన్న, ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు. ఎంతో ఆనందంగా ఉండేది జీవితం. చీకటి పడిందంటే చాలు నాన్న పక్కలోనో, లేదా నానమ్మ పక్కలోనో దూరి వాళ్ళు చెప్పే కథలు వింటూ, చందమామను చూసుకుంటూ, సన్నజాజి పందిరి కింద హాయిగా నిద్రపోయేవాళ్ళం. ఎంతో మధురంగా ఉండేవి ఆ రోజులు. అలాంటి అనుభూతులు గాని,జ్ఞాపకాలు గాని ఈతరం పిల్లలు తర్వాత తరానికి తీసుకెళ్లలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి లేవు కదా. ఇప్పుడు వాళ్లకున్న జ్ఞాపకం ఒకటే వాళ్ళ చేతిలో ఉండే సెల్‍ఫోన్ ఏ బ్రాండ్ అని. రారండోయ్… అనే పాట మా పిల్లలకు వినిపించాలని చాలా అనుకున్నాను. ఇన్నాళ్ళకి ఆ కోరిక తీరింది మీ ద్వారా. ధన్యవాదములు 🙏🙏
వంద కుర్చీలు గురించి డా.జి.వి.రత్నాకర్ అభిప్రాయం:
12/02/2022 4:19 am
విషాదకరమైన
అంటరాని ఆదివాసీల అవమానాల కథ ఇది…
మనసును కలచివేసే యథార్థ జీవిత కథనం ఇది…
మూల రచయితకి
అద్భుతమైన అనువాదం చేసిన
అనువాదకులకు…నా జైభీమ్ లు
నువు గురించి Rekha Jyothi అభిప్రాయం:
12/02/2022 3:08 am
ఎంత తేలికగా ఉందో కవిత!
నువు గురించి సాంబమూర్తి లండ అభిప్రాయం:
12/01/2022 7:30 pm
సర్, ఎంతో అందంగా ఎంతో ఉదాత్తంగా ఉంది మీ ప్రపోజల్…
వంద కుర్చీలు 2 గురించి Rishi Srinivas అభిప్రాయం:
12/01/2022 7:26 pm
ఎట్రాసిటీ మీద, కులాల వెనుకబాటు మీద కథ అంటే ఇంత చిక్కగా రాయాలి. అణగారిన కులంలో పుట్టని వారు కూడా ఈ కథ చదివితే , ఆ మనుషుల జీవితం ఒక జిస్ట్ లా అవగతమవుతుంది. మాటలు రాక, ఏ పనీ చెయ్యలేక అలా కాసేపు అచలంగా ఉండిపోయాను. వంద కుర్చీలు కథ తో సాహిత్యంలో వంద సింహాసనాలు అధిరోహించిన మీకూ, జయమోహన్ కీ వెయ్యి నమస్కారాలు.
వంద కుర్చీలు 2 గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/01/2022 5:27 pm
ఇలాంటి కథలు రాయకుండా నిరోధించలేమా?
సరే వాళ్లు రాశారు – చదవడమెందుకూ కలత నిద్రలెందుకూ!
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి గుమ్మడిదల రంగారావు అభిప్రాయం:
11/30/2022 1:29 pm
వ్యాసం బాగుంది. త్యాగయ్య కీర్తనల్లొ వాడిన తెలుగు పదాలు కొన్ని నేడు అస్సలు ప్రాచుర్యంలొ లేవు. వాటిని గురించి ప్రస్తావించితే మనకి తెలియని త్యాగరాజు కాస్తైనా తెలిసె అవకాశం వుండేది. ఆయన రచనల్లొ తామసము అనే పదప్రయోగం తరచుగా కనిపిస్తుంది. ఆయన వాడిన తెలుగు పదాలు మరికొన్ని మనకు తెలియనివి వున్నాయి. మచ్చుకు కొన్నిటిని వివరిస్తే బాగుండేది. ఆయన కాలంలో సామాజిక పరిస్థితులమీద కీర్తనలు లేకపొవటం ఎప్పటికీ అర్ధంకాని విషయం. కృతులన్నీ భక్తిమీదనె కేంద్రీకృతమై వున్నాయి. అందుకేనేమో నేడు శాస్త్రీయ సంగీతం ప్రజల ఆదరణకు నోచుకోవటం లేదు. పాశ్చాత్య సంగీతంగూడా చర్చి లోనే పుట్టినప్పటికీ కాలక్రమంలో దానికి ఒక సొంత దారి ఎంచుకున్నది. అందుకే నేటికీ సామాన్య ప్రజల ఆదరణకు నోచుకున్నది. మనిషికి కలిగే అనుభూతికి అనుగుణంగా వుంది ఆ బాణీ. మన సంగీతం అలా కాదు. మన సంగీతం భక్తి నుంచి బయటపడలేకపోయింది. నేటి జీవిత సమస్యలకు భక్తి సమాధానం చెప్పలేక పోతుంది. సినిమా పాటలకున్న ఆదరణ శాస్త్రీయ సంగీతానికి లేకపోవటానికి కారణం మన శాస్త్రీయ సంగీతం సగటు మనిషి భావోద్వేగాలను అర్ధం చేసుకోలేక పోవటమే. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జీవనం. కానీ వ్యవసాయం మీద ఒక్కటంటే ఒక్క పాట కూడా రాయలేదు త్యాగయ్య. నేటి సమస్యలకు రాముడు ఏవిధంగానూ సమాధానం చెప్పలేడు. మన సంగీతంలో వున్న లోపాన్ని గూడా చూపితే బాగుండేది. చదువరులకు ఒక సమగ్ర అవగాహన కలిగే అవకాశం ఉండేది. మరో వ్యాసంలోనైనా నాటి తెలుగుకు నేటి తెలుగుకు వ్యత్యాసం తెలిపితే బాగుండును. చిత్రమేమిటంటే త్యాగయ్య పాటలు సింహభాగం తెలుగులో వున్నప్పటికీ తెలుగునాట ఆదరణ లేదు. తమిళులకు కృతులలోని భాష భావం పెద్దగా అర్ధంగాకపోయినా వారు బాగా ఆదరిస్తున్నారు. త్యాగయ్యకన్నా చాల ఏళ్ళు ముందు జీవించిన అన్నమయ్య సంకీర్తనల్లో భక్తితో పాటు ప్రాపంచిక విషయాలమీదగూడా పాటలు వున్నాయి. కానీ ఆనాటికి గురుశిష్య పరంపర వ్యవస్థ లేకపోవటంతో అన్నమయ్య పాటలు ఎలా పాడాడో మనకు తెలియదు. త్యాగయ్య ఎలా పాడాడో తెలుసు మనకు. నేటికీ అలానే పాడుతున్నాము.
ఖాళీ కవిత గురించి Anuradha అభిప్రాయం:
11/30/2022 8:06 am
Thank you Vijay Bhaskar garu; Thank you Srinivas Banda garu.
ఈ రచన నా సొంతం కాదు! గురించి గుమ్మడిదల రంగారావు అభిప్రాయం:
11/30/2022 5:06 am
గ్రంథ చౌర్యం మీద చర్చ బాగుంది. ఒకరు రాసింది మరొకరిదిగా చెప్పుకుంటే గ్రంథచౌర్యం అంటాముగదా! మరి ఒకరు రాయనిదాన్ని ఆపాదించితే దానిని ఏమంటారో తెలుసుకోవాలని వుంది. ఉదాహరణకు త్యాగరాజ కృతులుగా చలామణి అయ్యే కృతులు అన్నే త్యాగరాజు రచించినవి కాదు అనే వాదన వుంది. అన్నమయ్య సంకీర్తనలు, వేంసన పద్యాలలో గూడా వారు రాయనివి వారికి ఆపాదించారు అని నమ్మేవారు వున్నారు. మన ఆలోచన మనదిగా చెబితే పట్టించుకోని లోకం, అదే ఆలోచనను ఏ పెద్దమనిషికొ ఆపాదించితే ప్రజలు ఆదరిస్తారు. అందుకని, కొందరు తమ ఆలోచనలను ఇతరులకు ఆపాదించి తమ మాటలకు వచ్చిన గుర్తింపుని వైకారియస్ ప్లెషర్ తో ఆనందిస్తారు. సాహిత్యంలో ఈ ప్రక్రియను ఏ మందురో ఎవరైనా పెద్దలు చెప్పాలని మనవి.
ఈ రచన నా సొంతం కాదు! గురించి తఃతః అభిప్రాయం:
11/29/2022 12:10 pm
శ్రీ భూషణ్: మళ్ళీ మీ నుంచి మరొక వ్యాసం -షేక్స్పియర్ తవ్వుకున్న గనుల గురించి- వస్తుందని ఎదురు చూస్తూ -నమస్కారాలతో -తః తః
“All Shakespearean villains are Italian ” -Russell.
బాలానందం గురించి Anjali అభిప్రాయం:
11/29/2022 11:08 am