పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. డిసెంబర్ 2022 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/03/2022 5:54 am

    మంచి సంపాదకీయం. బాధ్యత నిండిస మాటలు.

    మనలో అధ్యాపక-రచయితలు చాలా మంది ఉన్నారు. కౌమార్యంలో బాలబాలికల మీద వీరి ప్రభావం చాలా గణనీయం. వారి ఆలోచనలూ రాగద్వేషాలూ తెలుసుకొనే అవకాశం వీరికి ఎక్కువ. ఈ ఏజ్ గ్రూప్ కోసం వీరిలో కొందరైనా రాస్తే బావుంటుంది.

  2. వంద కుర్చీలు 2 గురించి Manpreetam KV అభిప్రాయం:

    12/03/2022 1:02 am

    ఎన్నో ఏండ్ల వివక్షను చూపించిన కథ. చదివాక ఒక సైలెన్స్ అలుముకుంది. కథ గురించి ఏమి చెప్పలేను. ఇలాంటి కథను తెలుగులోకి తెచ్చిన భాస్కర్ గారికి ధన్యవాదాలు.

  3. వంద కుర్చీలు 2 గురించి Sudha అభిప్రాయం:

    12/02/2022 11:23 pm

    Thank you for translating this story Bhaskar garu….

  4. వంద కుర్చీలు 2 గురించి jwalitha అభిప్రాయం:

    12/02/2022 7:07 pm

    భయంకరమైన జీవితాల వాస్తవ కథ.. మొదటిసారి అటువంటి జీవితాల కథ కన్నీళ్లు తుడుచుకోడం మరిచిపోయి చదివాను.. ఇటువంటి జీవితాలు ఇంకా కొద్దిపాటి తేడాతో కొనసాగుతున్నాయి..

  5. వంద కుర్చీలు 2 గురించి తః తః అభిప్రాయం:

    12/02/2022 3:40 pm

    తమిళులకు ట్రాజెడీని బ్లో అప్ చేసే గుణం ఉన్నట్టు తోస్తుంది నాకు. బాలచందర్ ‘మరోచరిత్ర’ని ట్రాజెడీ చేశాడు. ఇద్దరు యువ ప్రేమికుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. I can not like it. అలాగే మరో చిత్రాన్నీ! సమాజంలో ఉన్న ఒక అవలక్షణాన్ని ఇంత హృదయవిదారకంగా చిత్రించి – పాఠకుల గుండెను చీల్చి, రక్తాన్ని పిండుకుని, గొప్ప రచయితగా పేరు తెచ్చుకోటం ‘కళ’ అనిపించుకోదు. బాలచందర్ పేరూ డబ్బూ కూడా తెచ్చుకున్నాడు. మాలదాసరి (ఆముక్త మాల్యద) కథను శ్రీ వేలూరి (శివరామ శాస్త్రి) వారి కాలాన ఉన్న వ్యవస్థను సున్నితంగా తెగనాడుతూ ఎంత హృద్యంగా చెప్పారో –

    భాస్కర్, మీ అనువాదాన్ని మూల కథా రచనపై పైన చెప్పిన నా అభిప్రాయానికి ఏమీ సంబంధం లేకుండా ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.

    – నమస్కారాలతో -తః తః

  6. వంద కుర్చీలు 2 గురించి KL PRASAD అభిప్రాయం:

    12/02/2022 12:28 pm

    ఎన్నో రకాల సాహిత్యం చదివాను. ఎన్నో భాషల అనువాదాలు చదివాను. Nobel బహుమతులు పొందిన సాహిత్యమూ చదివాను. అంత గొప్ప సాహిత్యం ఆధారంగా తీసిన సినిమాలూ చూశాను. ఏ సంఘటనల కారణంగా విప్లవోద్యమాలు మొదలయ్యాయో చదివాను. కానీ యీ వందకుర్చీలు లాంటి stark reality సాహిత్యం చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ కథ నుంచి తేరుకోవటం సాధ్యం కాదు ఎవరికైనా సరే. ఈ కథ చేసిన గాయం నా గుండెలో అలాగే వుంటుంది. దానిని మాననీయను. గుండెలో శాశ్వత ముద్రలు వేసిన సంఘటనలు. రచయిత జయమోహన్‍ని పరిచయం చేసిన భాస్కర్‍గారికి శతాధిక నెనరులు.

    కె. ఎల్. ప్రసాద్
    సినీ రచయిత, నటుడు, దర్శకుడు.

  7. వంద కుర్చీలు 2 గురించి N sridhar అభిప్రాయం:

    12/02/2022 11:31 am

    వివక్షపై ఇంత లోతుగా రాసినది ఇప్పటివరకూ చదవలేదు. భాస్కర్ గారూ, కృతజ్ఞతలు.

  8. వంద కుర్చీలు 2 గురించి VV JYOTHI అభిప్రాయం:

    12/02/2022 9:44 am

    ఇంకోసారి చదివే సాహసం చేయలేని కథ ఇది. వినోదిని కట్ట తర్వాత అంతగా కలత పెట్టింది.

  9. ఐదు కాళ్ళ మనిషి గురించి డా.జి.వి.రత్నాకర్ అభిప్రాయం:

    12/02/2022 4:29 am

    అద్భుతమైన
    వ్యధాభరితమైన కథ

  10. వంద కుర్చీలు 2 గురించి gs rammohan అభిప్రాయం:

    12/02/2022 4:20 am

    రాయడమే కాదు, చదవడమూ కష్టమే. ఈ మధ్య అమరేంద్ర గారి ఇంట్లో జంపాలగారితో మాట్లాడుతున్నపుడు ఒక మీమాంస ముందుకొచ్చింది. నిజంగానే ఇరుగు పొరుగు మనకంటే ఎత్తుమీదున్నాయా, లేక భాస్కర్ గారు అలాంటి ఆణిముత్యాలను ఎంపిక చేసుకోవడం వల్ల అట్లా అనిపిస్తున్నదా అని.