పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. హలాల్‌ గురించి Imran అభిప్రాయం:

    04/18/2023 3:38 pm

    చాలా మంచి సందేశం ఇచ్చారు.

  2. ఊహల ఊట – 23 గురించి sumanaspati reddy అభిప్రాయం:

    04/18/2023 4:09 am

    ఊరంతటితో కలిసి ఉత్సవ సంబురం జరుపుకొనే తీర్లు, సంప్రదాయాలు చాలా మట్టుకు పోగొట్టుకున్న కాలంలో, విజయనగరం వంటి గొప్ప సాంస్కృతిక ఆవరణం, గొప్ప కళాకారులు, పండితులు, నైశిత్యం ఉన్న ఊర్లో 70, 80 ఏళ్ల క్రితపు దసరా పండుగ రోజుల తిరుగాడే అనుభవాన్ని అనేక పాత్రలు, తావులు, డృష్టికోణాల మధ్య లంకెలు వేస్తూ నిండుగా, సకలేంద్రియ సమాహారంగా అవిష్కరించి పెట్టారు ఈ గల్పికలో తులసి గారు.

    వయసుతో వచ్చే శారీరక ఇబ్బందులు ఎన్ని పైబడుతున్నా, తులసి గారి కథన సృజన సంవిధానం సరికొత్త సొగసులతో దిట్టంగా సాగుతున్న తీరులో ఎంతటి జీవనోల్లాసం! అదొక కొండ ఊట నీటి తీపి! అడవి కొండ శిఖరం చేరుకొన్నప్పుడు ఎగసి వచ్చే నిండైన ఊపిరి కలిగించే ఉన్మత్త భావన!

    బతుకు సంగతుల్నన్నింటినీ ఆవురావురుమని అనుభవించి ఆకళింపు చేసుకొందామని ఉరకలేస్తున్న చిట్టి అమ్మాయికి సమాజం, ఇతరులు ఎన్ని అందించినా “ఒసే జడ్డీ! మనం ఎవరినీ కాపీ కొట్టకూడదే మనమే కొత్తగా ఆలోచించి కొత్తకొత్తగా చెయ్యాలి” అని సుబ్బులత్తయ్య చిట్టి చురక వేయడంలో రక్తపుటెరుకలాంటి విజ్ఞతను తళుక్కుమనిపించారు.

    సంతస సమయం ఇది చేసుకుంటే అని మాటి మాటికీ బోధపరచడమే పనిగా ఉబికి వస్తున్నాయి ఊహల ఊట గల్పికలు!! వాటితో కలిసి ప్రవహించడమే పని!

  3. దానవోద్రేక స్తంభకుడు గురించి Haribabu అభిప్రాయం:

    04/17/2023 9:05 am

    మీరూ చెప్పిన విధం చాలా బావుంది. కానీ ఇది ఒక ఇతిహాసం ఒక చరిత్ర. ఈ చరిత్రలో రహస్యంగా దాగి ఉన్న భౌగోళిక స్థితులను కూడా గమనికలో చేర్చి ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది. ఇంద్రలోకం గురించి ఈ భూమండలం కాదు అని అంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఒక చారిత్రక సంఘటనల ఆధారంతో రూపొందించిన రామాయణ చిత్రీకరణలో రావణుడు యమలోకంపై దండయాత్రకు వెళ్లకుండా రావణున్ని, అతని గురువు ఆపినట్టుగా ఉంది. ఇక్కడ కూడా పుట్టినవారు గిట్టక మానరు అని చెప్పిన చందంలో యముడంటే మృత్యువే. కోరుకుంటూ మృత్యువును ఆహ్వానిస్తావా? అని ఆపినట్టుగా ఉంది. అది సమంజసం అనిపించింది. కారణం రావణుడి కోరిక చిరంజీవిగా ఉండాలని. కానీ రావణుడు అందుకు అనర్హుడు అని కొన్ని మెలికలతో ఆయన మృత్యువుకు ముడి వేశారు. ఇంతవరకూ చరిత్ర. బావుంది.నేను ఒక చోట చదివాను, పాతాళం అంటే భారత దేశంకు దిగువ అని. ఇక్కడ పగలు అయితే అక్కడ రాత్రి. అలాగే అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు అని. పాతాళం అనే ప్రదేశంకు శ్రీమహావిష్ణువు రక్షకుడుగా ఉంటాడు. మీరూ రాసారు. ఇదే విషయం నేటి భౌగోళిక స్థితులను పోల్చితే అమెరికాకు మన దేశంకు మధ్య రాత్రి పగలు వేళల్లో దాదాపు 12 గంటలు వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసంను పోల్చితే నేటి అమెరికాయే ఆనాటి పాతాళం అని అనిపిస్తుంది. అలానే శ్రీమహవిష్ణువు రక్షకుడుగా అంటే ఆయన వాహనం గరుడుడు ఎక్కడుంటే అక్కడే శ్రీహరి. నేటి అమెరికా ఈ భూమండలంలో ఎదురు లేని శక్తిగా ఉంది. దాని లోగో గుర్తు కూడా గరుడ పక్షి. ఇలా అన్వేషణ చేస్తే చరిత్రకు న్యాయం. మానవుల మధ్య సామరస్యం నెలకొంటానికి పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాగే ఉత్తర కొరియా వాసులకు, సీతామాత వారసులతో సంబంధం ఉన్నట్టు చదివాను. అలానే ఉత్తర కొరియా వాసులు సీతామాత జననస్థలంను వారు పవిత్ర స్థలంగా ఎంచి వస్తుంటారు, నాకు తెలిసినంతలో. తప్పులుంటే మన్నించగలరు. 🙏

  4. మనోధర్మపరాగం: ఒక మంచి నవల గురించి madhuranthakam narendra అభిప్రాయం:

    04/17/2023 12:03 am

    ఈమాటలో ఈ పోస్టింగును ఆలస్యంగా చూసాను.
    మనోధర్మ పరాగం నవలకు ఆటా వాళ్ళ బహుమతిని ప్రకటించిన తర్వాత ఒక వాక్యమైనా చేర్చలేదు. రెండవ ముద్రణలో మొదటి ముద్రణలో దొర్లిన రెండు పదాలను మాత్రం సవరించడం జరిగింది.

  5. యాత్ర గురించి అ. హరిమోహన్ అభిప్రాయం:

    04/15/2023 5:50 am

    ఊహా ప్రపంచం ఎక్కడ ఉందో తెలుసుకోవడం ఒక సత్యం ఐతే, దాన్ని శారీరకాతీత స్థితిలో అనుభవించడం, మీరనుభవిస్తున్నారని మీచుట్టూవున్న వారు ఆభావాతీతస్థితిలో తన్మయులవడం – ఇది కాదా సత్యం శివం సుందరం! భగవాన్ రమణుల జీవన చరమాంక ప్రభావం స్పష్టంగా కనపడుతోంది.

  6. సా విరహే తవ దీనా గురించి Subbarao అభిప్రాయం:

    04/14/2023 10:49 am

    మోహన్ గారూ
    చక్కటి వ్యాసం అందించిన మీ కృషికి మీ సాహిత్యాభిలాషకి ముందుగా అభినందన వందన శతములు.

    మీ అనువాదం మనోహరం.

    నాపై దయతో తాత్పర్య సహిత లేదా సవ్యాఖ్యాన గీత గోవింద కావ్య లింకు పంపగలరా? తెలుగు. నాదగ్గర టిటిడి వారిది (పింగళి పాండురంగారావు) ఉంది. మీ రిఫరన్స్ పుస్తకాలు ఇంటర్నెట్ లో పట్టలేకపోయాను.

    ధన్యవాదములతో.

  7. యాత్ర గురించి Padmavathi Rambhakta అభిప్రాయం:

    04/13/2023 7:28 am

    What a story? No words to praise. Spellbound!

  8. యాత్ర గురించి S Sridevi అభిప్రాయం:

    04/12/2023 10:45 am

    So intense. 🙏

  9. హలాల్‌ గురించి సురేష్ కొత్తపల్లి అభిప్రాయం:

    04/11/2023 10:35 pm

    పల్లెల్లో వుండే నిష్కల్మషమైన స్నేహం… కథలో ఎంతో ఫ్రెష్ గా అనిపించింది. బెల్లగాళ్లను కథలోకి తెచ్చి నన్ను బాల్యంలోకి తీసుకెళ్లావ్ అన్నా! కథ చాలా బాగుందన్నా! మీకు హృదయపూర్వకంగా అభినందనలు💐💐

  10. హలాల్‌ గురించి వేంపల్లె షరీఫ్ అభిప్రాయం:

    04/11/2023 4:25 pm

    కథను ప్రచురించిన నిర్వాహకులకు, కథపై ఇక్కడ స్పందించిన మిత్రులకు… ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పైన Jeevan Raj గారు చెప్పిన అభిప్రాయంతో ఏకీభావం ఉంది. థాంక్యూ.