పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. నామాట గురించి విహారి అభిప్రాయం:

    03/02/2007 11:50 am

    వేంకటేశ్వర రావ్ గారూ,

    మీరన్న మాటల్లొ ఎంతో నిజం వుంది. ఎన్ని సంఘాలు వున్నా వాటి ఆదర్శాలు పూర్తిగా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. అలా అని అవి లేకుండా పోతే మొదటికే మోసం వస్తుంది. ఇవన్నీ కంటికి రెప్ప ఇస్తున్నంత రక్షణ అని నా అభిప్రాయం. ఇవి కూడా లేకపోతే మన సంప్రదాయాలు పూర్తి అంతరించే ప్రమాదమున్నది. ఇక్కడే నేను కూడ తెలుగు సంఘం లో వున్న ప్రధాన కార్య వర్గ సభ్యుణ్ణే. దీని గురించి చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. మొన్న మేము చేసిన దీపావళి సంబరాల్లో గాయకులు కొన్ని చిరంజీవి పాటలు పాడారు. దానికి పిల్ల పీచు అందరూ పెద్ద ఎత్తున స్టేజ్ ఎక్కి డ్యాన్సులు చేశారు. తరువాత ఒక “రామ దాసు” సినిమాలోని పాట డ్యాన్సులు చెయ్యడానికి ముందుకు రమ్మంటే ఒక్కరు కూడా రాలేదు. అలాగే ఈ కార్యక్రమాల్లో సినిమా పాటల మీద మసాల మాటల కామెడీల మీద చూపించే ఇంట్రెస్ట్ మిగతా వాటి మీద వుండదు. సినిమా పాటంటే హాలు ఫుల్లు త్యాగరాజ కీర్తనంటే హాలు నిల్లు. అంత మందిని ఒక చోటకు తీసుకు రావడానికి ఎన్నెన్నో తంటాలు పడాల్సి వస్తోంది.

    శ్రీ శ్రీ గారు చెప్పింది కరక్టే. శంకరాభరణం సినిమా చూసి హిట్ చేసిందీ తెలుగు జనులే…మంగమ్మ గారి మనవడు, అల్లుడా మజాకా లాంటి డబుల్ మీనింగ్ డైలాగుల సినిమాలను హిట్ చేసింది అదే తెలుగు జనులే. మన కీర్తిని చెప్పడానికి ప్రతి సారీ బాపు నో, సి.నా.రె. నో, ఆత్రేయ నో, బాల మురళీ కృష్ణ నో తీసుకు వస్తే ఇప్పుడున్న నలభై ఏళ్ళ లోపు వాళ్ళలో థొంభై శాతం మంది గుర్తుపట్టలేక పోవచ్చు. అదే ఏ సినిమా వాడినో పట్టు కొస్తే సులభంగా పబ్లిసిటీ వస్తుంది. పనిలో పనిగా ఆ తెప్పించిన వాళ్ళకూ పబ్లిసిటీ వస్తుంది.

    అలాగే విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధన మొదట్లో బాగానే వుంటుంది. తరువాతే సమస్య అంతా. కొంత మంది దాతలు డబ్బు ఇచ్చినా అందులో చేరే వారు కరువవుతారు. రోహిణి ప్రసాద్ గారన్నట్లు అర్థ కాని ఫుట్ బాల్ మ్యాచ్ ను అర్థం చేసుకోవడానికి వెచ్చించే సమయాన్ని తెలుగు బాష మీద సంస్కృతి మీద పెడితే మనం తెలుగు ను ఇంకొంత కాలం బతికించుకో గలుగుతాము.

    ప్రమంచంలో వున్న తెలుగు సంఘాలన్నీ తెలుగు వాళ్ళ కోసం కాకుండా తెలుగు మీద అభిమానమున్న వాళ్ళకు మాత్రమే పనిచేస్తాం అనే ఆదర్శం తో ముందుకు పోతే కాస్త సఫలమవుతారు.

  2. నామాట గురించి మురళి అభిప్రాయం:

    03/02/2007 10:00 am

    మూడేళ్ల క్రింద యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో ప్రారంభించిన తెలుగు బోధన 2007 ఏప్రిల్ తో మూసివేస్తున్నారని తెలిసింది. సంవత్సరానికి $40,000 ఖర్చయ్యే ఈ కోర్సు నిధుల లేమి వల్ల ఆపివేస్తునారట.

    గతమూడేళ్లు స్థానిక తెలుగు సంఘం ప్రతీ ఏటా $20,000 తమ వంతుగా జమ చేసారు. ఈ ఏడది యూనివర్సిటీ వారు తమ వంతు కూడా కలుపుకొని $40,000 ఇమ్మన్నారట. అది శక్తికి మించిన పని కావటంతో స్థానిక సంఘం చేతులెత్తేసారు.

  3. నామాట గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/02/2007 7:58 am

    ఉన్న సంస్కారం సంతృప్తికరంగా లేదనీ, మంచి విలువలు పెంపొందితే బావుంటుందనీ అనుకునేవారు యువతరంలో నేటికీ చాలామందే ఉన్నారని తెలుస్తోంది. ఆసక్తి ఉన్నా లేకపోయినా మర్నాడు ఆఫీసు కొలీగ్స్ తో్ మాట్లాడగలగడానికి రాత్రంతా టీవీ లో గేమ్స్ చూసేవాళ్ళున్నట్టే ఇతరులు ఏమైనా అనుకుంటారేమోనని తమ మంచి టేస్టును బైటపెట్టుకోకుండా కొందరు “జాగ్రత్త పడతారని” నాకనిపిస్తుంది.

    వేలం వెర్రి సినిమా పిచ్చిని ధనబలంతో పనిగట్టుకుని ప్రోత్సహిస్తారు కనక దాన్ని అడ్డుకోవడం సులభం కాదు. మంచి అభిరుచిని బలపరిచే ప్రయత్నాలు కొనసాగించడమే ఉత్తమం. పెద్ద సంచలనం కలిగించలేకపోయినా, కమర్షియల్ ఒత్తిళ్ళు లేని ఈమాట వంటివి అందుకు ఫోరమ్ గా పనికివస్తాయి.

  4. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/02/2007 5:02 am

    అన్నమయ్య గురించి మీరు ప్రస్తావించిన కొన్ని విషయాలు సరియైనవి కావని నా అభిప్రాయం.

    1. “అన్నమయ్య పద సాహిత్యమంతా మనకి కేవలం పాటల రూపంలోనే లభ్యమవుతోంది గాని, ఆ పాటలకి ఆయన కూర్చిన రాగాలు, వరుసలు, స్వరాలు, లయలు, తాళాలు మనకి తెలియవు. ఈ మహానుభావుడు తన పాటలని ఏ రాగంలో, ఏ స్వరాలతో పాడేడో మనకి తెలియక పోవడం మన దురదృష్టం.” అని రాసారు. అన్నమయ్య రాసిన ప్రతీ పదం క్రిందా రాగం పేరు ఉంది. కానీ అప్పటికి మేళ కర్త రాగాల విభజన జరగలేదు. అంతే కాదు కొన్ని రాగాలు పేర్లు మారాయి కూడా. నేను ప్రత్యక్షంగా అన్నమయ్య పదాల రాగిరేకులు చూసాను. అందులో ప్రతీ పదానికి రాగం ఉంది. కావాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన అన్నమయ్య పుస్తకాలు చదవితే వాస్తవం తెలుస్తుంది.

    2. ‘జో అచ్యుతానంద, జో జో ముకుందా’ అని పాడితేనే గాని ఏ తెలుగు పాపాయి నిదురా పోదు” . ఇది కూడా నిజం కాదు. జో అచ్యుతానందా అన్నమయ్య రాయలేదు. కానీ అన్నమయ్య రాసినట్లు గా చెలామణీ అవుతూ వస్తోంది. వేరే ఇంకెవరో రాసారు. ఇది అన్నమయ్య రాయలేదనడానికి అనేక అధారాలు ఉన్నాయి. అవన్నీ రాస్తే ఇంకో పెద్ద వ్యాసం అవుతుంది. కావాలంటే మొత్తం పాట చూడండి. అన్నమయ్య పేరు ఉంటుంది కానీ ఆయన ముద్రలు ” వేంక టేశ “, “తిరువేంకటేశ” కానీ ఏమీ ఉండవు. కేవలం అన్న మయ్య పేరు ఒక చరణంలో వస్తుందంతే! దీనికి నా వద్ద ఆధారాలతో కూడిన విషయాలు చాలా ఉన్నాయి. కీరిశేషులు రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కూడా అన్నమయ్య రాసింది కాదు అన్న విషయం మీద ఒక వ్యాసంలో ప్రస్తావించారు.

    మీ వ్యాసం చదివేక మీరు అన్నమయ్య గురించి, మిగిలిన వారిగురించి, ఇంకాస్త లోతుగా పరిశోధించి రాస్తే బాగుండేదనిపించింది.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  5. ఓ.పీ.నయ్యర్‌ గురించి Sowmya అభిప్రాయం:

    03/02/2007 1:17 am

    చాలా బాగుందండీ వ్యాసం. ఎన్నో విషయాలు తెలిపారు. ధన్యవాదాలు.
    “ఏ హై బాంబే మేరీ జాన్” పాట కంపోజర్ నయ్యరా! నాకీ రోజే తెలిసింది.
    ఆ పాట అంటే నాకెంతో ఇష్టం.
    “సాజ్” సినిమా గురించిన విషయం కూడా నాకు ఆసక్తికరంగా అనిపించింది.

  6. అంతరం గురించి Sowmya అభిప్రాయం:

    03/02/2007 12:58 am

    అస్తమానం ఈ మందు గోలేంటండీ బాబూ!!
    నాకు ఎందుకో సడెన్ గా ఆగిపోయినట్ల్నిపించింది కథ.
    వస్తువు interesting గా ఉంది.

  7. భయం గురించి Santhi అభిప్రాయం:

    02/28/2007 3:42 pm

    good story, an unexpected twist. 🙂

  8. నువ్వు నాకొద్దు గురించి Santhi అభిప్రాయం:

    02/28/2007 10:48 am

    I like this story. It tells how a doctor should be understandingwith their patients. A patient will have a lot of concerns and questions about their sickness, and they are probably scared. It is the duty of the doctor to take the time to get to know a patient and treat them to their best effort. Well Done and Thank you for a nice story, లైలా గారు.

  9. ఊర్మిళ రేఖ గురించి Santhi అభిప్రాయం:

    02/28/2007 9:44 am

    This is a great story. I already read this story twice and will probably read many more times. Thank you very much for an awesome story like this… Sai గారు.

  10. ఫిష్‌ దట్‌ గాట్‌ అవే గురించి Santhi అభిప్రాయం:

    02/28/2007 9:18 am

    very nice touching story… Thank you, Viplav గారు.