వైదేహి గారి అభిప్రాయముతో నేను వంద శాతము ఏకీభవిస్తున్నాను.
పెళ్ళి రాఘవ్ స్వంత విషయం. అది ఎలా చేసుకోవాలన్నది అతనే నిర్ణయించుకోవాలి. పెద్దలు అనుభవంతో సహాయపడాలే గానీ అన్న పెద్దావిడ సలహాతోనే సరిపెట్టి పెళ్ళికి వెళ్ళి వుండాల్సింది. అలాగాక తను నమ్మిందే ఇతరులు నమ్మాలనే చాదస్తంతో ముఖ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళకపోవడం అనుచితం.
–ప్రసాద్ http://blog.charasala.com
కథ చాలా బాగుంది. సంభాషణలు ఎక్కడా దారి తప్పకుండా బాగున్నాయి.
“గోపీ పీన పయోధర” అన్నప్పుడు నాకు నవీన్ “అంపశయ్య” గుర్తుకు వచ్చింది. అందులో కథానాయకుడికి ఇది ఇలాగే మరిన్ని బూతులు మళ్ళి మళ్ళీ మెదడులోకి వచ్చి విసుక్కుంటాడు.
ప్రసాద్ http://blog.charasala.com
చక్కని వ్యాసం! సంగీతాన్ని ఆనందించటం తప్ప విశ్లేషించటం తెలియని వారిని,సంగీతం పై అపారమైన అభిమానమే తప్ప అధికారం,విజ్ఞానం లేని వారిని కూడా ఆసక్తి కరంగా చదివించిన వ్యాసం. ప్రాక్పశ్చిమ సంప్రదాయాలలోని దిగ్గజాల జీవిత విశేషాలను,విభిన్న సంగీత రీతుల లోని కొన్ని విశేషాలను వివరించిన తీరు బావుంది.ఆకట్టు కునే శైలి వచనంలో దాగిన కవిత్వంలా ఉంది.
నాకు ఎందుకో ఇండో-యూరోపియను భాషలు ఎలాగో, అలాగే ఈ సంగీతము కూడా అయి ఉండవచ్చు అనిపిస్తుంది.
చావా గారు: అన్ని విషయాలను ఇండో-యూరోపియన్ అద్దం లోంచి చూస్తే ఎలాగండీ? 🙂 ఇండో-యూరోపియన్ భాషల మధ్య జన్మ సంబంధం నిరూపించే భాషాశాస్త్ర ఆధారాలు కోకొల్లలు. గత అయిదారు వందల ఏండ్లలోనే బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య కర్ణాటక సంగీత సంప్రదాయాలకు, సుమారు అయిదు వేల యేండ్ల కింద విడిపోయిన ఇండో-యూరోపియన్ భాషలకు లంకె లేదు. ఈ వ్యాసంలో సంగీత సంప్రదాయాల మధ్య సారూప్యం ఎత్తిచూపడానికి ప్రయత్నించిన నాగరాజు గారు సైతం ఆ పోలికలకు కారణం మానవుని ఆలోచనల్లో నిగూఢమైన ఏకత్వమనే వాదించాడే గాని వాటి మధ్య ఏ రకమైన జన్మ సంబంధం అంటగట్టలేదు. ఏవో కొన్ని యాదృచ్ఛిక సారూప్యాలను (chance similarities) ఆధారం చేసుకొని తయారు చేసిన సజాతిత్వ సిద్ధాంతాలు శాస్త్ర విమర్శకు నిలవలేవని మీకు తెలుసు కదా?
కథ చాలా బాగా వుంది. తను మాత్రమే బాగా చేయగలమనుకొనే వారి బలహీనతను, ఎదురింటావిడ భర్తను పొగిడే భార్యల సోదిని బాగా చెప్పారు.
–ప్రసాద్ http://blog.charasala.com
అద్భుతంగా వుంది. రామ, సీత పేర్లు కొద్దిగా కన్ఫ్యూజన్ కలిగించినా చదువుతున్న కొద్దీ వారి అంతరంగాల్లో లీనమయిపోయాను.
డబ్బే జీవితమనుకొనే జీవాలు కొన్నైనా ఈ కథ చదివి బఇష్యత్తు వూహించుకోగలిగితే బాగుండును.
–ప్రసాద్ http://blog.charasala.com
చాదస్తం గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/06/2007 12:10 pm
వైదేహి గారి అభిప్రాయముతో నేను వంద శాతము ఏకీభవిస్తున్నాను.
పెళ్ళి రాఘవ్ స్వంత విషయం. అది ఎలా చేసుకోవాలన్నది అతనే నిర్ణయించుకోవాలి. పెద్దలు అనుభవంతో సహాయపడాలే గానీ అన్న పెద్దావిడ సలహాతోనే సరిపెట్టి పెళ్ళికి వెళ్ళి వుండాల్సింది. అలాగాక తను నమ్మిందే ఇతరులు నమ్మాలనే చాదస్తంతో ముఖ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళకపోవడం అనుచితం.
–ప్రసాద్
http://blog.charasala.com
ఒక చలిపొద్దు గురించి ఫణి డొక్కా అభిప్రాయం:
03/06/2007 11:15 am
చాలా బాగా రాసారు.
ఆకులు రాల్చే చెట్టైనా, ఆకులు రాలని చెట్టైనా, మీ కవితలో ఎంతో అందంగా వొదిగిపోతుంది. చూడగలిగిన వారికి మీకవితల్లో మనోహర దృశ్యాలు కనిపిస్తాయి.
నా మట్టుకు నేను మీ కవితలకోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ వుంటాను, ఆసక్తిగా..
మీ ఫణి డొక్కా.
ఇద్దరు దుర్మార్గులు గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/06/2007 9:46 am
కథ చాలా బాగుంది. సంభాషణలు ఎక్కడా దారి తప్పకుండా బాగున్నాయి.
“గోపీ పీన పయోధర” అన్నప్పుడు నాకు నవీన్ “అంపశయ్య” గుర్తుకు వచ్చింది. అందులో కథానాయకుడికి ఇది ఇలాగే మరిన్ని బూతులు మళ్ళి మళ్ళీ మెదడులోకి వచ్చి విసుక్కుంటాడు.
ప్రసాద్
http://blog.charasala.com
రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:
03/06/2007 9:13 am
చక్కని వ్యాసం! సంగీతాన్ని ఆనందించటం తప్ప విశ్లేషించటం తెలియని వారిని,సంగీతం పై అపారమైన అభిమానమే తప్ప అధికారం,విజ్ఞానం లేని వారిని కూడా ఆసక్తి కరంగా చదివించిన వ్యాసం. ప్రాక్పశ్చిమ సంప్రదాయాలలోని దిగ్గజాల జీవిత విశేషాలను,విభిన్న సంగీత రీతుల లోని కొన్ని విశేషాలను వివరించిన తీరు బావుంది.ఆకట్టు కునే శైలి వచనంలో దాగిన కవిత్వంలా ఉంది.
రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
03/06/2007 7:43 am
చావా గారు: అన్ని విషయాలను ఇండో-యూరోపియన్ అద్దం లోంచి చూస్తే ఎలాగండీ? 🙂 ఇండో-యూరోపియన్ భాషల మధ్య జన్మ సంబంధం నిరూపించే భాషాశాస్త్ర ఆధారాలు కోకొల్లలు. గత అయిదారు వందల ఏండ్లలోనే బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య కర్ణాటక సంగీత సంప్రదాయాలకు, సుమారు అయిదు వేల యేండ్ల కింద విడిపోయిన ఇండో-యూరోపియన్ భాషలకు లంకె లేదు. ఈ వ్యాసంలో సంగీత సంప్రదాయాల మధ్య సారూప్యం ఎత్తిచూపడానికి ప్రయత్నించిన నాగరాజు గారు సైతం ఆ పోలికలకు కారణం మానవుని ఆలోచనల్లో నిగూఢమైన ఏకత్వమనే వాదించాడే గాని వాటి మధ్య ఏ రకమైన జన్మ సంబంధం అంటగట్టలేదు. ఏవో కొన్ని యాదృచ్ఛిక సారూప్యాలను (chance similarities) ఆధారం చేసుకొని తయారు చేసిన సజాతిత్వ సిద్ధాంతాలు శాస్త్ర విమర్శకు నిలవలేవని మీకు తెలుసు కదా?
రిగార్డులతో,
సురేశ్.
అంతరం గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/06/2007 7:38 am
కథ చాలా బాగా వుంది. తను మాత్రమే బాగా చేయగలమనుకొనే వారి బలహీనతను, ఎదురింటావిడ భర్తను పొగిడే భార్యల సోదిని బాగా చెప్పారు.
–ప్రసాద్
http://blog.charasala.com
సీతా-రామా గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/06/2007 7:12 am
అద్భుతంగా వుంది. రామ, సీత పేర్లు కొద్దిగా కన్ఫ్యూజన్ కలిగించినా చదువుతున్న కొద్దీ వారి అంతరంగాల్లో లీనమయిపోయాను.
డబ్బే జీవితమనుకొనే జీవాలు కొన్నైనా ఈ కథ చదివి బఇష్యత్తు వూహించుకోగలిగితే బాగుండును.
–ప్రసాద్
http://blog.charasala.com
ది బీచ్ గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/06/2007 6:13 am
కథ చాలా బాగుంది. నీళ్ళలో మునిగినప్పుడు తన అంతరంగాన్ని మరింత విశదపరిచి వుంటే బాగుండేదేమొ!
–ప్రసాద్
http://blog.charasala.com
ఇద్దరు దుర్మార్గులు గురించి ప్రసాదం అభిప్రాయం:
03/05/2007 9:42 pm
చాల మంచి కథ, బాగా రాసారు. అభినందనలు
నామాట గురించి chavakiran అభిప్రాయం:
03/05/2007 9:26 pm
Generic comment.
It is time to install some more word press plug in’s to eemaata. isn’t it?
particularly plugins like Ajax comments and etc…