పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16440

  1. రచయితలకు సూచనలు గురించి Vamshidhar Kudikala అభిప్రాయం:

    05/14/2007 6:22 am

    ఈ రోజే మీ సైటు చూశాను. చాలా బగుంది. మీకు నా అభినందనలు.
    ఇందులోని గ్రంధలయములో మరిన్ని పుస్తకాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నాను.
    ఇందులో పంపిన రచనలు ప్రచురించేది లేనిది ముందుగా రచయితలకు మెయిల్ ద్వార తెలియజేస్తారా? ప్రచురణకు ఎంత సమయం పడుతుందో తెలుపగలరు.
    వంశీధర్ కుడికాల

  2. లోపలికి గురించి Prasuna అభిప్రాయం:

    05/13/2007 10:41 pm

    చాలా బాగున్నాయి. చిరు మంచు జల్లుల్లా.

  3. మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం గురించి పిన్నమనేని మృత్యుంజయరావు అభిప్రాయం:

    05/11/2007 3:04 am

    ప్రాచ్య, పాశ్చాత్య భావజాలాల మధ్య ఉన్న తీవ్రమైన అంతరాన్ని అల్పమైన మాటల్లో అనల్పార్ధమొచ్చేలా మీరు చెప్పిన విధానం బావుంది. ప్రపంచీకరణ, దాని దుష్ప్రభావాల గురించి పెద్ద చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఈ రెండు సంస్కృతుల మధ్యనున్న తేడాని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రపంచమంతా పాశ్చాత్య వ్యామోహంలో కొట్టుకు పోతున్న ఈ సమయంలో ఈ వ్యాసంలో సూక్ష్మంగా చర్చించిన అంశాలను మరింత విస్తృత పరచాల్సి ఉందని భావిస్తున్నాను. ఆపనిని చక్రపాణి రావు గారు సమర్ధంగా నిర్వహించగలరని నమ్ముతున్నాను. వారికి ధన్యవాదాలు తెళుపుకుంటున్నాను.

  4. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి పిన్నమనేని మృత్యుంజయరావు అభిప్రాయం:

    05/11/2007 2:52 am

    అవధానం చూస్తూ అందరితో పాటు చప్పట్లు కొట్టడం తప్ప అందులోని లగువు బిగువుల్ని అర్ధం చేసుకోలేక పోతున్న నాలాంటి వారికి ఈ వ్యాసం చక్కని మార్గదర్శిగా ఉపయోగిస్తుంది. మీరు లక్షించిన మూడు ప్రయోజనాల్నీ మీ వ్యాసం నెరవేర్చగలదని నమ్ముతున్నాను. మంచి టాపిక్ మీద మంచి వ్యాసాన్ని అందించినందుకు రచయితకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  5. న త్వం శోచితుమర్హసి గురించి మురళీకృష్ణ కూనపరెడ్డి అభిప్రాయం:

    05/10/2007 11:13 am

    “నా బొంది ఆణ్ణేబెట్టుకోని వారంరోజులు ఏడిస్తే నాకేమొస్సాది! నా తోలుగూడా పనికిరాకండాబోతాది గదా!? ”

    ఎంత నిజం!

    మంచికథ రానారే!

  6. తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి రానారె అభిప్రాయం:

    05/08/2007 1:55 pm

    “మారిపోయిన కాలాన్ని గురించీ, కూలిపోతోన్న కులవృత్తుల గురించీ ఆవేదనగా” మాత్రమే చెప్పుకొస్తున్నారనుకొన్నాను. మనసుల్లోకి చూసి చెప్పినట్లుగా పాత్రలను నడిపించిన ఈ రచయితకు వాపోవడం మాత్రమే తెలుసునా అనుకొంటూ ఆసాంతం చదివిన నాకు సాలోచనగా ఇచ్చిన ముగింపుతో సమాధానం దొరికింది. గ్రామంలో పరిస్థితి అంతా చూసికూడా పోకమాను మోయించాలనే అమాయకత్వం (తెగువ!?) వారి కళా సంప్రదాయంలో భాగం అని కాస్త సర్దుకొంటే, ఈ ఘటనతో మంచి ముగింపుకు మార్గం ఏర్పడింది అనిపిస్తుంది. నాబోటివాడు అద్భుతమైన ఈ రచనను పొగడటమో విమర్శించడమో చేయడం తప్పేకావొచ్చునేమోగానీ, ఇదీ నా అభిప్రాయం.

  7. తోలుబొమ్మలాట – 03వ భాగం గురించి రానారె అభిప్రాయం:

    05/08/2007 11:22 am

    పరధర్మో నిధనం శ్రేయః – స్వధర్మో భయావహః!!! ఇలా మార్చుకోవాల్సిందే. ఒళ్లు జలదరించేంతగా ఉన్న ఇంతటి పట్టైన కథనం నేనెప్పుడూ చదవలేదు. ఆ ప్రాంతాలు, పరిసరాలు, ఆ మనుషులు, మార్పులు దగ్గరగా చూసిన చివరి తరానికి చెందినవాడిని కావడంతో కాబోలు మాటకందని భయం కలిగిస్తున్నదీ రచన.

  8. తోలుబొమ్మలాట – 01వ భాగం గురించి రానారె అభిప్రాయం:

    05/08/2007 10:35 am

    ఆహా!! మహానుభావుడు. తోలుబొమ్మలాట ఆడటమే బతుకుదెరువుగా ఉన్న పాతకాలం మనిషికి ఆ కళపట్ల ఉన్న ఆరాధనను కళ్లకు కట్టినట్లు రాసినాడు. సన్నపురెడ్డీ దీర్ఘాయుష్మాన్ భవ. చిన్నవాణ్ణైనా ఇదీ నా ఆశీర్వాదం.

  9. న త్వం శోచితుమర్హసి గురించి JUBV Prasad అభిప్రాయం:

    05/07/2007 3:29 pm

    ఈ కధలో వాడిన భాషా, కధ చెప్పిన తీరూ, మాటలూ, విషయాలూ చాలా బాగున్నాయి. ఎటొచ్చీ, జంతువు బదులు ఏ పాలేరు లాంటీ మనిషినో తీసుకుంటే, ఇంకా అద్భుతంగా వుండేదనిపించింది. కడప జిల్లా మాండలీకం లోని పదాలకి అర్ధాలు ఇచ్చి వుండకపోతే, కధ అందరికీ ఇంత చక్కగా అర్థం అయి వుండేది కాదు. ఈ పద్ధతి బాగుంది. జంతువు ఘోష అనేసరికి, అంతా వూహే నన్నమాట అని అనిపించి, వుసూరుమనిపిస్తుంది. మనుషుల కష్టాలు అయితే ఇంకా హృదయాన్ని కదిలిస్తాయి. మొత్తానికి కధ బాగుంది.

    ప్రసాద్

  10. ఆరు చిత్తు రూపాలు గురించి విహారి అభిప్రాయం:

    05/07/2007 2:46 pm

    “ఎవర్ని నేను, ఇక్కడ అమెరికన్ ని కాదు, పోనీ ఇండియాలో? నార్త్ లో మదరాసీని, తమిళ్ నాడు లో గొల్టీని, హైదరాబాద్ లో ఆంద్రోడ్ని, ఆంధ్రాలో రెడ్డిని, కమ్మోడ్ని, బాపనోడ్ని, మాలోడ్ని, మాదిగోడ్ని, ఎరుకలోడ్ని, ఏనాదోడ్ని. ఎవర్ని నేను, రంగు, కులాని కతీతంగా?”

    నేను కు మీరిచ్చిన నిర్వచనం చాలా బాగుంది. ప్రతిదీ చాలా లోతుగా చెప్పబడింది.

    విహారి