పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. పునశ్చరణం గురించి baabjeelu అభిప్రాయం:

    07/25/2008 7:41 am

    ఇదీ “ఈ మాట” గొప్పతనం.
    క్లుప్తత గురించి వొకరు, దానికి ప్రతివాదం తో ఇంకొకరు. అద్భుతం.
    కవయిత్రి వొక్క ముక్క కూడా రాయలేదు, కవిత తప్ప. అది సరైన పధ్ధతి.
    రాస్తూ వుండడవే, విమర్శకులకీ, అభిమానులకీ సరైన సమాధానం.
    మీరు రాస్తూ వుండండి వైదేహి గారూ. భావవ్యక్తీకరణ ముఖ్యం. భావాన్ని ఏదో వొక నడకతో చకచకా నడిపించడం కవిత. అంతే కదా కవులూ, కవయిత్రులూ చెయ్యవలసిన పని.
    అభిప్రాయాల్ని జాగ్రత్తగా చదవండి. మీ కవితల్లో కవిత్వం, మీ ఈ కవితలో చెప్పిన పసికందులాగా పెరిగి పెద్దవాడయిపోతుంది. మామూలుగా కాదు, “ఏడాదికే నాలుగేళ్ళు రావాలీ….. ఎప్పటికి ముప్ఫయ్యిలోపె వుండాలీ…” లాగ.

  2. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి baabjeelu అభిప్రాయం:

    07/25/2008 7:16 am

    అద్భుతవయిన వ్యాసం. అనుక్షనికం “ఆంధ్రజ్యోతి” లో సీరియల్ గా వచ్చిన రోజుల్లోకి వెళిపోయేను.

    ఒకసారి కె.ఎన్. వై. పతంజలి గార్ని కలిసినపుడు “అనుక్షనికం” గురించి అడిగితే “వుపస్థ మీద రాసిన..” అంటూ ఏదో చెప్పేరు ఆయన. చివుక్కుమంది మనసు.

    తనివి తీరలేదు, “అనుక్షనికం” మీద ఇంకో పెద్ద వ్యాసం రాయండి.

    రావి శాస్త్రి గారి నవలల తరవాత “అనుక్షనికం” అంత గొప్ప గా వుంటుంది.

    ధన్యోస్మి.

  3. ఏకాకితనం గురించి baabjeelu అభిప్రాయం:

    07/25/2008 6:30 am

    సాయిగారూ,
    ఎంత చక్కని భావ వ్యక్తీకరణ. హ్రుదయ విస్తారం కేంద్రంలోకి కుచించుకు పోవడం, చోటూ(టు) చాలని మనసులో మనసులో కుటుంబం ఇరుకుగా సర్దుకోవడం, నీకు నువ్వే అయిన ప్రపంచంలో జనాభా ఒంటరి సంఖ్య, పరిమితులకలవాటయిపోయిన మనం నిజంగానే మరుగుజ్జులం. మీరు రాసినట్టు పక్కింట్లో చావూ, పెళ్ళీ ఒకటే.
    మహాప్రభో, మీకో దండం.

    బావి గోడల్ని దాటించెస్తే, మరుగుజ్జులు అమితాబ్ లయిపోతారని రాయడానికి చాలా దమ్ము కావాలి. వుంది కాబట్టే రాయ గలిగేరు.

    మహాప్రభో మీకు మళ్ళీ మరో దండం.

    స్పెల్లింగ్ మిస్టేకులెలా వచ్చేయి. జివిత నిఘంటువు వేవిటి? జాగ్రత్తగా చూసుకోండి. పాత సంచికల్లో కవితలేవేనా రాసేరా? నేను వెతుక్కుంటాను లెండి. మీ వచనం మీ కవితంత అందంగా వుండదెందుకని?

  4. ఈ-మెయిలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/25/2008 3:36 am

    ఇది కవిత్వం. తేటయిన కవిత్వం. హాయి హాయి కవిత్వం.”గరళమును ఇత్తువో” ఇస్తే ఇయ్యి గరళాన్ని కూడా నిభాయించుకోగలనన్న ధీమా,”మరల అమ్రుతమునిత్తు” మళ్ళీ అమ్రుతాన్నే ఇస్తానని భరోసా ఇవ్వడం. బేహద్బీగా వుంది.”ఇత్తువో” బదులు “నిత్తువో” అని వుంటే ఇంకా సాఫీగా వుండేదేమో?ఏ ఛందస్సయినా అవనీండి. నడక చక్కగా వుంది. నడత చక్కగా వుంది. “నను జూడకుండినను, నీ కుశలమే చాలు” గరళమిచ్చినా అమ్రుతమే ఇస్తాను లాటివి చూసి స్త్రీ వాద కవిత్వం రాసీ వాళ్ళందరూ ఉదయకళ గారిని దెబ్బలాడతారేమో? అయితే వాళ్ళు దెబ్బలాడీది కవిత లో కవిత్వం లేదని కాదు. కవిత లోని వస్తువు ని చూసి అనుకుంటాను. ఈ మెయిల్ చూసి, రిప్లై మీద క్లిక్ కొట్టి, సారీ బాస్ చెయ్యి కాళీ లేదు సెండ్ క్లిక్ కొడితే, స్త్రీ వాద కవిత్వం రాసీ వాళ్ళందరూ ఈ కవితని ఊరూరా మోసుకు తిరుగుతారు. ఆహా, ఓహో అంటారు.
    వాళ్ళదీ తప్పు కాదు కాబోలు. పెద్దలెవరయినా వివరిస్తే బాగుంటుంది.

     

  5. ఈమాట గురించి గురించి baabjeelu అభిప్రాయం:

    07/24/2008 7:19 pm

    కాలంతోపాటూ పరుగెత్తడవంటే వుదాహరణ “ఈ మాట”.
    టెక్నాలజీ ని మనక్కావల్సినట్టు వాడుకోడానికి కూడా వుదాహరణ “ఈ మాట”
    మామూలు పత్రికలో ఒక వుపన్యాసం చదువుతాం, ఇక్కడ వింటాం.
    మామూలు పత్రికలో ఒక పాట పాఠం చదువుతాం, ఇక్కడ పాట వింటాం.
    మామూలు పత్రికకి అభిప్రాయం సాధారణంగా ఇలావుంటుంది:
    “ఎడిటర్జీ, ఇలియానా ముఖచిత్రంతో మీ(మా) పత్రిక సర్వాంగసుందరంగా వుంది.
    సాయి బ్రహ్మానందం గారి మనోవైజ్ఞానిక సీరియల్ మా ఇంటిల్లిపాదినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. లక్ష్మన్న గారి కవిత మమ్మల్నందరినీ అలోచింపచేసింది. రోహిణీప్రసాదుగారి కార్టూనులు మమ్మల్ని కడుపుబ్బ నవ్వించేయి.
    కొడవళ్ళ వారి వ్యాసం ఆవునేతితో అరటికాయ బజ్జీలు అద్భుతం…”
    ఈ మాట లో అలాటి ముసుగులో గుద్దులాటల్లేవు.
    పాఠకుల “పార్టిసిపేషన్” వల్ల, అదికూడా అతి సులువుగా, పత్రిక ఇంకా “లైవ్లీ” గా వుండడానికి ఆస్కారం ఏర్పడింది.
    పాత సంచికలలో ని శీర్షికలు కూడా ప్రస్తుతం అభిప్రాయ వేదికలోకి రాగలగడం, మళ్ళీ దానిమీద అభిప్రాయాలూ నిజంగానే వింత.
    పాఠకుల అభిప్రాయాలు విమర్శలు కావు. విమర్శలని పట్టించుకోవాలి అవి రచయత బాగుపడ్డానికి పనికొస్తే, లేకపోతే “వోటర్ల” లిస్ట్ లోంచీ తీసెయాలి ఆ విమర్శని. అభిప్రాయాల్ని మామూలు పాఠకులు రాసినవి గానే తీసుకోవాలి. అంతేగానీ, “..తాడి ఎత్తు గాండీవము తో ముత్తాడి ఎత్తుగా ఎదిగి, చండకోపముతొ..” “సెట్ పట్” లాడించకూడదు.
    (సాక్షి దినపత్రికలో,జూలై 21న, చేరా తో మొదలెట్టి కొంతమంది విమర్శకులు తమతమ అభిప్రాయాలు రాసేరు)
    “చూపుల కన్నా ఎదురుచూపులే తీయన..”. ఒప్పుకుంటాం.
    ద్వై మాసిక ఎదురుచూపులు చూడ్డం చాలా కష్టమయిపోతోంది. ఆదివిష్ణుగారి స్నేహితులు “ఆషాఢ మాసం” ఎన్ని నెలలుంటుంది అని అడిగినట్టు.
    కనీసం “వీక్లీ” కూడా అవదా?

  6. సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి baabjeelu అభిప్రాయం:

    07/24/2008 6:50 am

    సాయి బ్రహ్మానందం గారూ,

    అద్భుతవయిన వుపన్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

    ఇలాటి ప్రక్రియల్లో సహజంగానే నిరాశలుంటాయి. నా వరకైతే రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారి “రాజు-మహిషి”, “రత్తాలు,రాంబాబు” అక్కినేని కుటుంబరావు గారి “సొరాజ్జెం”, అంగర వారు, ముళ్ళపూడి వారు నవలలు లాంటివాటి గురించి ప్రస్తావించకపోవడం. కాలపరిమితి వల్ల అయివుండొచ్చు. అయితే మ్రుణాళిని గారిని ఈ సారి కలిసినప్పుడు రావిశాస్త్రి గారి వి, ముళ్ళపూడి గారివి, మిగిలినవి చర్చించొచ్చు.

    చిత్రం ఏవిటంటే, “ఫక్తు” నవల చర్చలో శ్రీశ్రీ “రిఫరెన్సులు”. వుద్యమాలంటే అంత భయమెందుకు? వుద్యమం బతుకు బాగుపడడానికి, బతుకులోంచీ సాహిత్యం వస్తుంది. రాజశేఖర చరిత్రము సంస్కరణోద్యమం లోంచి వచ్చిందంటున్నారు. మాలపల్లి హరిజనోద్యమం “ప్లస్” జాతీయోద్యమం వల్ల వచ్చింది కాదా? మీరు క్షమించకపోయినా నా “కామెంట్” కి వున్నవ వారు నవ్వి వూరుకుంటారు. అలాగే మిగిలిన సాహిత్యం కూడా.

    ఒకటే ఇబ్బందికరవయిన తప్పు దొర్లింది. అది మ్రుణాళిని గారి మీ పరిచయం. మొదటి మూడు పంక్తులు, తరవాత వాక్యంలోని”కానీ,” వరకు నా దృష్టిలో నిజంగా అవసరం లేని వాక్యాలు. ఈ “పేరాగ్రాఫ్” ని చేరా గారికో, భద్రిరాజు గారికో, బూదరాజు గారికో పంపించండి. నవల విమర్శలేకపోవడానికీ రచయిత్రులు అన్ని అంత అద్భుతవయిననవలలు రాయడానికీ సంబంధం ఏవిటీ? (అయితే నవలామణి పదప్రయోగానికి, “సెబాస్” అనాలనిపించింది. “సెహబాస్”).

    మామూలు పాఠకులవి అభిప్రాయాలు మీ లాటి వారు రాస్తే విమర్శ.

  7. అంతర్మథనం గురించి narsi అభిప్రాయం:

    07/24/2008 2:57 am

    నిజంగా చాలా బాగుంది.

  8. నేను – నువ్వు గురించి sravanthi అభిప్రాయం:

    07/24/2008 2:14 am

    “ఆ క్షణం నేను
    నీ మనసున మనసవుతాను
    నేను నువ్వవుతాను”
    కవిత లోని ఈ చివరి వాక్యాలు మనసుని స్పందించేల చేసాయి..

  9. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    07/23/2008 10:14 pm

    బాబ్జీలు గారూ,

    మీకు ఈ వ్యాసం నచ్చితే సంతోషం. నచ్చ లేదని రాస్తే నేనేమీ అనుకోను. జిహ్వ కో రుచి అని సరిపెట్టుకుంటాను. రాసిన విషయంలో తప్పులు దొర్లాయా చెప్పండి, సరిదిద్దుకుంటాను.
    ఈ వ్యాసం చదివాక నాటకం అంటే ఇదీ అన్న విషయం తెలియాలని కాస్త విస్తృతం గా రాసాను. ఇంకా చాలా విషయాలు చర్చించ వచ్చు. “ఈ మాట” లో ప్రోమినెంట్ రైటర్ల లో మీరు ముఖ్యులు అంటూ రాసారు. మీరు రాసిన కామెంటుకీ, ఈ వ్యాసానికీ, నా జవాబుకీ అది ఏ విధంగా వర్తిస్తుంది? నాకు అనిపించిన సమాధానం రాసాను.
    చివరిగా, మీరు ఎద్దేవా చేసినట్లుగా నేను “పి.హెచ్.డి” కోసం ఈ వ్యాసం రాయలేదు. ఈ సారి నాటకాల మీద వ్యాసం రాయదల్చుకుంటే మీ సలహాలు తప్పకుండా తీసుకుంటాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.

  10. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి baabjeelu అభిప్రాయం:

    07/23/2008 5:02 pm

    సాయి గారూ,
    2008 లో రాసిన వ్యాసం ఇది. 1900 లలో రాసినట్టుంది.
    నిజవే నాటకరంగం లో వచ్చిన నాటకాల లిస్టు ఇవ్వడం శుధ్ధ దండగ.
    “ఈ మాట” లో ప్రోమినెంట్ రైటర్ల లో మీరు ముఖ్యులు.

    “నా ఈ వ్యాసం పరిధి, పరిమితి ఉద్దేశ్యం వేరు” అని సెలవిచ్చేరు.
    ఈ వ్యాసానికి పరిధి లేదు. పరిమితి అసలు లేదు. సదుద్దేశం వుంది. అందుకే పదకొండు పేజీలు చదివేను.
    పదకొండు పేజీల “ఉద్గ్రంథం”. “పి.హెచ్.డి” సంపాదించగలదేమో.