పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. గుల్మొహర్ గురించి baabjeelu అభిప్రాయం:

    07/29/2008 8:04 am

    వైదేహి గారూ,

    సమకాలీనులు మెచ్చరు ఎలారాసినా అని ఓ పాత కవిగారి బాధ నాకర్థం కాలేదు. మీ పునశ్చరణ కి “రవికిరణు”, “ఈ మాట” లో మీ సహవాసి, పులకించడం ముచ్చటేసింది.

    చక్కని అనుభూతి; అనుభూతిని అంతకన్నా చక్కగా అభివ్యక్తీకరించడం; అంతేకదా కవిత్వం అంటే.

    “నిరలంకారం” అంటే సరిగ్గా అర్ధం కాలేదు. మీరేం రాయకండి. ఏ భైరవభట్లగారో, కొడవళ్ళవారో ఇంకెవరో తీరికా ఓపికా వుంటే రాస్తారు.

    అభిప్రాయాల్ని పట్టించుకోకండి. పట్టించుకున్నా సమాధానాలివ్వకండి. కవిత్వం రాయండి.

  2. గ్రేడింగ్ అమ్మలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/29/2008 7:46 am

    మహానుభావా,

    మీరసలు ఈ అనుభవాలన్నీ “ఏజిటీజ్” గా రాయండి. “అమరావతి కథ”లో, “గౌతమీ గాథ”లో, “పచ్చ నాకు సాక్షిగా” నో, “పసలపూడి కథలు” గానో తయారవుతాయి.

    నాలుగ్గంటలకే తిమ్మిరెక్కిన మీకాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తే అది మాఅద్రుష్టం తప్ప మా గొప్ప కానీ సంస్కారం కానీ కాదు.

    ఎన్నాళ్ళు వాళ్ళూ వీళ్ళూ రాసిన వాటికి వ్యాసాలు రాస్తారు? గోపీచంద్ చెప్పినట్టు, భాష రాని రచయత కి భాష నేర్పొచ్చు, బతుకు తెలియని రచయతకి ఏవీ నేర్పలేం. బతుకూ, భాషా రెండూ తెలిసిన మీరు రాయాలి. దయచేసి రాయండి.

  3. కవుల వాగ్వాదాల్లోంచి కవిత్వం – గీరతం గురించి baabjeelu అభిప్రాయం:

    07/29/2008 7:32 am

    అళియ రామరాయల సమయంలో హంపీ “పీక్ పీరియడ్” చేరుకుంది. సుఖాలకలవాటయిన సైనికులు బహమనీ సుల్తానుల్ని అడ్డుకోలేకపోయేరు. “తళ్ళికోట” యుధ్ధంలో అళియరామరాయలు ఓడిపోయేడు. తరవాత ఏవయిందీ అందరికీ తెలుసు.

    “శ్రీ తిరుపతి వేంకట కవులు” అళియరామరాయలు లాటివారు తెలుగు సాహిత్యం వరకూ. ఏంచేసినా “పడ్డ చన్నునెత్త బ్రహ్మ వశమే?” లాగా అయింది వ్యవహారం.

    “తిరుపతి వేంకట కవులు” అద్భుతవయిన కవులు. అయితే “ఒరిజినాలిటీ” లేని కవులు. మన అద్రుష్టం. “పాండవోద్యోగవిజయాలు” సహజవయిన ప్రక్రియ. కవిత్రయం ఏం సాధించారో మామూలు ప్రజకి అర్ధం కావడం కష్టం. “పాండవోద్యోగవిజయాలు” ద్వారా “తిరుపతి వేంకటకవులు” అంతకన్నా ఎక్కువ సాధించేరు. ఇంతకుముందు ప్రజా కవులని వ్యాసం, ఇప్పుడుఇలాటి వ్యాసాలు “చెళ్ళపిళ్ళ” వారు చదివితే రాసిన వాళ్ళ మర్యాద మిగల్చరు.

    “కొప్పరపు కవులూ, వేంకట రామక్రుష్ణ కవులూ” “తిరుపతి వేంకటకవు” లకి విమర్శకులు మాత్రవే. “తిరుపతి వేంకటకవుల్ని” ఢీ కొన్న కవులుగానే వాళ్ళు చరిత్రలో మిగిలి పోతారు. వారెవరివీ స్వతంత్ర రచనలు నిలబడలేదు కదా తరవాత.

    ఇప్పటికీ మా వూరి “సర్పంచ్” “చెల్లియో చెల్లకో..”అనీ, “బావా సత్యవతీ పౌత్రా..” అనీ”సెట్ పట్” లాడించీసి, ఇప్పటి కుర్రకారు ఈ పద్యాల్ని విని ఎందుకానందించరని తెగ బాధపడిపోతుంటాడు. “తెగ దీర్గాలు తీస్తాడెస్ ” అంటాడు వాళ్ళబ్బాయి.

    తెగ దీర్ఘాలే అనర్ధాలు, సాహిత్యవయినా, బతుకయినా.

  4. అమెరి గల్పిక ఆదా గురించి ఇంకో సుబ్బారావు అభిప్రాయం:

    07/28/2008 11:06 am

    అందరూ కాదనుకుంటానండీ సుబ్బారావు గారూ. ఎలాగో ఒకలాగా మహా కక్కుర్తిగా డాలర్లు ఆదా చేద్దామనుకునేవారే ఇలా సుబ్బారావులు అవుతారనుకుంటాను. పార్కింగు కూడా ఆదా చేద్దామనుకుని, కక్కుర్తి కొద్దీ, బోర్డులు చూసుకోకుండా, నష్టబోయి, సుబ్బారావయ్యాడు ఈ కధ హీరో. అలా కాకపోతే, చవగ్గా సంతలో చక్కగా కూరగాయలు దొరికేవే ఇంకగ్గా. ఆదా చెయ్యడం వేరూ, పిసినారి లాగా వుండటం వేరూ.

  5. అమెరి గల్పిక ఆదా గురించి subbarao అభిప్రాయం:

    07/27/2008 5:01 pm

    ఈ దేశంలో అందరూ ఏదో ఒక రోజు “సుబ్బారావు” లే.

  6. సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    07/27/2008 3:16 pm

    కామేశ్వర రావు గారూ,

    మృణాలిని గారే “సామాజిక నవలల్లో కథనా శిల్పం” అన్న అంశం ఇచ్చారు. గంటన్నర పాటు ఉన్న చోటునుండి ఎవరూ కదలలేదు. అందరికీ, ఉపన్యాసం అప్పుడే అయిపోయిందా అన్న భావన కలిగింది.

    హాస్య నవలల గురించీ చెప్పారు. ముళ్ళపూడి వెంకట రమణ గురించీ ప్రస్తావించారని బాగా గుర్తు. ఎక్కడ మిస్సయ్యిందో తెలియదు.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  7. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:

    07/27/2008 10:22 am

    “ఐనా రాధాకృష్ణన్ యేమంత చెప్పుకోదగ్గ ఫిలాసఫర్ కాదు. యూనివర్సిటీ పంతులు. మంచి స్కాలర్. భారతీయ దర్శన గ్రంధాలు బాగా చదివినవాడు. ప్రెసిడెంటు సింహాసనం అధిష్ఠించాడు. అలాంటి వున్నత రాజకీయస్థితిలోని వాడి ప్రాపకం కోసం గొప్ప తత్వవేత్త అంటూ వందిమాగధ గీతాలు వోండ్ర పెట్టటం ప్రారంభించారు. ఆయన సొంతం అంటూ చెప్పుకోదగ్గదేం లేదు.”

    –దాదాపుగా ఈ అర్ధమొచ్చేట్టే మామిడిపూడి వెంకటరంగయ్య గారు రాసినట్లు గుర్తు…

  8. ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం గురించి Krishna అభిప్రాయం:

    07/26/2008 12:15 pm

    మీ సంపాదకీయం రెండుసార్లు చదివాను. పొగడతాండా, తిడతాండా అన్నట్లు ఉంది. ఎవరు ఏమి చేసినా గూండాగిరీ, దౌర్జన్యం సమర్ధనీయాలు కావు. పత్రిక yellow journalism చేస్తే దానిని ఎదుర్కొనడానికి ప్రజాస్వామిక మార్గాలు ఉన్నాయి – న్యాయవ్యవస్థ, అదే పత్రికలో rebuttal మొదలైనవి. ఇక్కడ జరిగినది పత్రికాస్వేఛ్చ పైన మాత్రమే దాడి కాదు. ప్రాథమిక హక్కు అయిన వాక్స్వాతంత్ర్యము మీదనే దాడి.

  9. సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి Kameswara Rao అభిప్రాయం:

    07/26/2008 10:45 am

    శ్రోతలని కట్టిపడేసేలా మాట్లాడే నేర్పు మృణాళినిగారి గొప్పదనం. మంచి ఉపన్యాసాన్ని అందరికీ అందించిన సాయిగారికి ఈమాటకీ ధన్యవాదాలు. శీర్షిక మాత్రం కాస్త తప్పుదోవపట్టించేదిగా ఉంది. ఇది “తెలుగు నవలా చరిత్ర” గురించిన ఉపన్యాసం కాని “సాంఘిక నవలల్లోని కథన శిల్పా”న్ని గురించి కాదు కదా.
    ఉపన్యాసం, తర్వాత ప్రశ్నలకిచ్చిన జవాబులూ విన్నాక వచ్చిన అనుమానం. మృణాళినిగారు తెలుగులో హాస్యరచనలకి ప్రాముఖ్యం ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. మరి తన ఉపన్యాసంలో హాస్య నవలలని ఆవిడ పేర్కోకపోవడానికి కారణం ఏమిటి? అలానే, ఈ కాలంలో ఉద్యమాలకతీతమైన నవలలు మంచివి వస్తున్నా వాటికి గుర్తింపు రావడం లేదని కూడా చింతించారు. అటువంటి వాటి గురించి తన ఉపన్యాసంలో ఎందుకు ప్రస్తావించలేదు? ప్రశ్నకి సమాధానంగా అంపశయ్య నవీన్ మొదలైనవాళ్ళని గురించి చెప్పారు. అది తన ఉపన్యాసంలోనే ప్రస్తావించి ఉంటే బావుండేది.

  10. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/25/2008 11:06 pm

    బాబ్జీలు గారూ,

    దాదాపు ఇరవై ఏళ్ళపాటు సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా గడిపేసి, కాస్త బుద్ధొచ్చింతర్వాత, కొంచం దగ్గరయాను. చండీదాస్ చనిపోయినప్పుడు బాధపడి రాసిన వ్యాసం నా మొదటి రచన. మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు.

    పతంజలి గారన్న మాటకి అర్థం తెలియలేదు. నిఘంటువులో వెతికి అవాక్కయ్యాను.

    రావిశాస్త్రిని చండీదాస్ రచనలు చదివారా అని అడిగితే, బుచ్చిబాబులా రాయాలనుకునే రచయిత రచనలని చదవాల్సిన అవసరం తనకు లేదన్నాడు!

    ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వీలు చూసుకొని “అనుక్షణికం” మీద మరో వ్యాసం రాయాలన్నది నా కోరిక కూడా.

    కొడవళ్ళ హనుమంతరావు