పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. కిరానా సంప్రదాయపు భీమబలుడు గురించి శారద అభిప్రాయం:

    09/06/2011 12:27 am

    వ్యాసం చాలా ఆసక్తికరంగా, చాలా బాగుంది. గొప్ప సంగీత విద్వాంసుల గురించి వినటం, తెలుసుకోవటం మంచి అనుభూతి. ధన్యవాదాలు.

    శారద

  2. ఈమాట సెప్టెంబర్ 2011 సంచికకు స్వాగతం! గురించి lyla yerneni అభిప్రాయం:

    09/05/2011 3:46 pm

    సెప్టెంబర్ 2011 సంచిక ముందుమాట రాసినదెవరు?

    రచన: పక్కన పేరు లేదు.

    దాని కిందే చూస్తే ఒక చిత్రం, ఒక రచయిత వివరాలు ఉన్నాయి. ఈ సంచికకు, ఈ ముందుమాట గాని, వారు రాసినారా? కాని మరణ తేదీ చూస్తే అది సంభవమా? కాదు.

    మరి ఆయన గురించిన వివరాలు అక్కడ ఉంటానికి కారణం?

    ఇంకా కొంచెం కిందికి వస్తే – ఈ సంచికలో మీకోసం: అని ఒక రచయితల – రచనల చిట్టా ఉంది.
    అవి మాకోసం ఐతే, మరి దానికి పైన ఉన్న సమాచారం ఎవరికోసం? మో కోసమా?

    ఆ రచన ఎవరిది?

    అసలెవరికీ ముందుమాట? ఎవరికి ఈ స్వాగతం? పత్రిక ఎన్నో సంచికో చెపితే చాలు. ఈ పేజీ తెల్లగా వదిలేసినా, పాఠకులు ఎడమ పక్కకి వెళ్ళి సంచిక ఎంచుకుంటారు. కుడిపక్క స్పష్టంగా రచనలు కనిపిస్తున్నాయి. రచయితల పేర్లు అక్కడే ఉన్నయి కూడాను.

    ఈ పత్రికలో, నిజంగా ఆ జాగాను తాజా మరణాలకు ఎలాట్ చేశారని, ఎవరికో, ఏదో ఒక మూఢ నమ్మకం ఉంది, అందువల్ల ఆ పేజీ Template మార్చలేకపోతున్నారనీ నాకనిపిస్తున్నది.
    Is a break thru possible? can we have a simple ‘table of contents’ page like any other modern magazine?

    లైలా

  3. కోనసీమ కథలు: సత్తెవతి గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    09/05/2011 3:09 pm

    మీమాట అంటూ అజ్ఞాతంగా ఒక వ్యాఖ్య చేసారు.

    కథ గురించి మీ అభిప్రాయం రాసారు. దాన్ని గౌరవిస్తాను.

    కానీ మధ్యలో మీరు చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరంగా వున్నాయి. సామాజిక వర్గాలూ, కులాల ప్రస్తావన లేకుండా కథలు చదవలేరా? తెలుగు సాహిత్యానికి పట్టిన దౌర్భాగ్యాల్లో ఇదొకటి. ఏ సామాజిక వర్గమయితేనేం? మనుషుల గురించి నాకు తెలిసింది రాసాను. మంచో, చెడో చూపిద్దామని. వేరే సామాజిక వర్గాల గురించి రాస్తే, అదిగో వాళ్ళని తక్కువ చేస్తూనో, కించపరచడానికో రాసారంటూ మీరే మరో మారుపేరుతో గగ్గోలు పేట్టే అవకాశం వుంది.

    ఏ రచయితయినా రాసిన కథని పత్రికకి ఎందుకు పంపుతారూ? పుస్తకం అచ్చేద్దామని పైలెట్ టెస్టు కోసం కథలు రాస్తారన్న కొత్త విషయం ఇప్పుడే తెలిసింది.

    మీ అసహనపు వ్యాఖ్యలు ఎవరికీ మంచి చెయ్యవు. గమనించండి.

    మీరెవరో పేరు చెప్పుంటే మీ వ్యాఖ్యలకి గౌరవం పెరిగేది.

    సామాజిక వర్గాల ప్రస్తావన వచ్చిందనే ఇది రాయాల్సొచ్చింది. లేకపోతే రాసుండేవాణ్ణి కాదు.

    -సాయి బ్రహ్మానందం

  4. కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి prasad అభిప్రాయం:

    09/05/2011 2:51 pm

    ఈ వ్యాసం వలన ఇప్పటీ అప్పటీ సినిమా మరియూ సినీ జర్నలిజం రంగాల్లో ఉన్న సామ్యాలనూ, తేడాలనూ గురించి ఆలోచించే అవకాశం కలిగింది. రోహిణీప్రసాద్ గారు చెప్పినట్లు ఇది కో.కు గారు రాయలేదనేది ఈ వ్యాసంలో కనపరచిన భావాలవలనా శైలి వలనా స్పష్టం.

  5. రావు బాలసరస్వతీదేవి గురించి prasad అభిప్రాయం:

    09/05/2011 2:47 pm

    ఈ వ్యాసం వలన మా తరం వారికి ఆ తరం విశేషాలు తెలిశాయి. బేగం అక్తర్ లా బాల సరస్వతి గారు తిరిగి పాడలేక పోవటం మీరు సబబు గా చెప్పినట్లు మన తెలుగు జాతి కి సంస్కృతి, కళలపై ఉన్న వైఖరికి తార్కాణం గా ఉంది.

  6. తిక్కన భారతంలో పలుకులపొందు గురించి N.Vijayaramulu అభిప్రాయం:

    09/05/2011 10:01 am

    భద్రిరాజు కృష్ణమూర్తి గారి కలము నుండి ఎన్నో ఈలాంటి వ్యాసాలను ఆశించే అభిమానుల్లో నేనొకణ్ణి.
    -విజయ రాములు.

  7. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    09/05/2011 12:50 am

    నమస్తే.
    కథ బాగా రాసారు.నవ్విస్తూనే, నేటి సామాజిక, కుటుంబ వ్యవస్థ తీరుతెన్నుల పై వ్యంగ్యం బాణాలు గుప్పించారు. బాగుంది. మీరు మరిన్ని హాస్య రచన లు చేయాల ని అభిలషిస్తూ..
    ఆర్.దమయంతి.

  8. About eemaata గురించి Ramchander Deekonda అభిప్రాయం:

    09/05/2011 12:12 am

    నమస్తే,

    ఈ మధ్యే మీ “ఈమాట” చూసాను. చాల బాగుంది. ప్రవాస తెలుగు వారిని సాహిత్య ప్రపంచంతో సంబంధం కొనసాగించడం లో మీ ప్రయాస విజయవంతం అయ్యింది.

    నా పేరు రామచందర్ దీకొండ. నేను సాహితీ ప్రియున్ని అని చెప్పుకుంటాను. సంస్కృత తెలుగు, ఉర్దూ భాషలలో ప్రవేశముంది. నేను గాలిబ్ దివాన్ లోని కొన్ని నాకిష్టమైన షేర్లను తెలుగులోకి అనువదించాను. మిత్రులు బాగా ఉన్నాయన్నారు. కొందరయితే మూలం లోని భావానికి అతి దగ్గరగా ఉన్నాయన్నారు. ఉర్దూ ప్రపంచం లో పెరిగి పెద్దవాన్నయినందు వల్ల ఉర్దూ భాష idiom ని తెలుగులోని తేవడం లో మిగతా అనువాదాలకంటే భిన్నంగా ఒచ్చాయని భావిస్తున్నాను. నేను ఇంతవరకు ఏ పత్రికకు వీటిని పంపలేదు.

    మీరు పంపమంటే కొన్ని అనువాదాలు మచ్చు కు పంపుతాను.

    మీ,

    రామచందర్ దీకొండ
    హైదరాబాద్, 9966354106

    [తప్పకుండా. రచయితలకు సూచనలు అన్న లంకెలో వివరించినట్లుగా submissions@eemaata.com కు పంపగలరు. సం.]

  9. About eemaata గురించి Ramchander అభిప్రాయం:

    09/05/2011 12:04 am

    Please do not write “peer” as పీర్. It is pronounced as “peeyar” like beer, here and near.
    Thanks

    Ramchander

  10. కోనసీమ కథలు: సత్తెవతి గురించి na’ma’t’a అభిప్రాయం:

    09/04/2011 2:37 am

    పాఠకుల అభిప్రాయాలు అన్న పేజీలో ఈ కథ పై మోహన గారి అభిప్రాయం పైన ఉన్న ఈ కథ లింకు పట్టుకుని వస్తే ఈ కథ మూడో పేజీలోకి వచ్చాను. అదే మొదలనుకుని చదవడం మొదలెట్టాను. కొంచెం చదవగానే కథలో ఏదో చిన్న లోటున్నా, “ఓహో సంపాదకులు మరీ ఎడిట్ చేశేశేరేమో, పాత్రలని పరిచయం గట్రా చేసే పేరాగ్రాఫులు నరికేసేరేమో!” అనుకున్నాను. కథ మాత్రం అర్థమయింది, లోటేమీ అనిపించలేదు. కిందదాకా వచ్చేక, ముందరొక రెండు పేజీలు ఉన్నాయని తెలిసింది. మొత్తం కథంతా చదివాక “క్లీషే”లతో నిండిన పాత్ర చిత్రణ, వాతావరణ కల్పన చూసేక “ముందు రెండు పేజీలు చదవకపోయినా పరవాలేదులే” అనిపించింది.

    ఈ సిరీస్ (శ్రేఢి?)లో కథలు సరళంగా చదివించగలిగేలా ఉన్నాయి, కథకి కావలసిన లక్షణాలు అవిమాత్రమే కాదు. ఈ కథలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పుస్తకంగా వేస్తారనుకుంటాను. (అందుకు ఈ సైట్‌ లో పైలట్ టెస్ట్ చేస్తున్నారనుకుంటాను) అన్ని కథలు ఓకే వాతావరణంలో ఒకే సామాజిక/ఆర్థిక వర్గాలకి చెందిన వారి కథలు, అన్నీ first person narration లో ఉన్నవి అయినప్పుడు కథలన్నీ ఇలా మూసలో పోసినట్లు ఉంటే మొహం మొత్తడం ఖాయం. వైవిధ్యం చాలా అవసరం. భిన్న దృక్పథాలనించి చెప్పడం– కాదు నడిపించడం– చాలా అవసరం.

    శ్రీపాద, మ.రా, శాస్త్రి, రావి శాస్త్రి, ఆర్.కే. నారాయణ్ లాంటి వాళ్ళ కథల్లో ఈ విధమయిన మూస ధోరణి కనిపించదు.

    ఇన్ని కథలు రాసినా అచ్చు తప్పులమీద దృష్టి పెట్టకపోవడం విచారకరం. “వ్యాహ్యాళి” తప్పు. కొన్ని చోట్ల “విశ్వనాధం” అనీ కొన్ని చోట్ల “విశ్వనాథం” అనీ అన్నారు. ఇలాంటివే మరికొన్ని.