కనుమరుగై పోయిన ఈ పాటల ఆణిముత్యాల్ని ఈమాట పాఠకులకు ఆలోచనామృతాలుగా అందిస్తున్న నారాయణ రావు గారికి కృతజ్ఞతలు. చిన్నప్పటి విన్నప్పటి జ్ఞాపకాల్ని నిద్రలేపుతున్నాయి ఈ వ్యాసాలు. మా అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మలు మధ్యాన్నం కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ కూనిరాగాలుగా రామాయణం పాటల్ని పాడుకుంటున్న దృశ్యాలు మసకమసగ్గా గుర్తుకొస్తున్నాయి. ఊర్మిళాదేవి నిద్ర ఎన్నోసార్లు విన్న గుర్తు. ఈ సీత గడియ మాత్రం ఎప్పుడూ విన్నది కాదు.
రామాయణ కథని అన్ని కుటుంబాల నిరంతర జీవనవాహినిగా గుర్తించి, తరతరాలుగా విస్తరింప చేసింది ఆడవాళ్లే. ప్రతి స్త్రీ ఒక సీత. సీత నుంచి వాళ్లు జీవితాన్ని నేర్చుకున్నారు; షైర్యాన్నీ ధైర్యాన్నీ కుటుంబభారాన్ని అవలీలగా మోసే శక్తినీ స్ఫూర్తినీ సంపాదించుకున్నారు. సీత కష్టాల ముందు మావెంతలే అని ఎలాటి ఒడుదుడుకుల్నైనా ఎదుర్కున్నారు. సీతని ఇంట్లోని ఒక వ్యక్తిగా చూసుకున్నారు. అందుకే మగవాళ్ల రామాయణాలకీ వాళ్ల రామాయణానికీ ఎంతో దూరం.
ఏభై ఏళ్ల క్రితం వరకు పల్లెటూళ్ల ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు స్కూల్ కి వెళ్లే వయసుకు వచ్చేవరకు వాళ్ల బాధ్యతలన్నీ ఇంట్లో ఆడవాళ్లే చూసేవారు. ఇంట్లో ఏ పిల్లలు ఎవరో కూడ తెలియని మగవాళ్లు ఉండేవాళ్లనటం అతిశయోక్తి కాదు. ఆ వయసులో ఆడా మగా అని లేకుండా పిల్లలందరికీ ఆడవాళ్ల వ్యాపకాల్లో ప్రవేశం ఉండేది. సంస్కృతి గురించి, మంచిచెడుల గురించి, జీవితాన్ని గురించి పిల్లలకు మౌలికమైన పునాదులు పడేది అప్పుడే, అక్కడే.
అప్పటి జీవనసరళిని ప్రతిబింబించే ఈ పాటలు ఇప్పటి తరాలకు అర్థం కావటానికి నారాయణ రావు గారి వ్యాఖ్యానం ఎంతగానో అవసరం. స్త్రీల రామాయణం పాటలన్నిటి మీదా వారు రాయాలి. రాస్తారని నా ఆకాంక్ష.
ఎప్పుడో ఆకాశవాణి హైద్రాబాద్ “భక్తి రంజని”లో ప్రసారం అయ్యిందనన్న మాట కూడా చెప్పితేనే గుర్తుకొచ్చింది- మరిచిపోయిన మధురమైన గతజన్మ స్మృతినేదో పొందినంత సంతోషం కలిగించినందుకు కృతజ్ఞతలు.
మూడవ శ్లోకంలో “మతో నైవ మేనవై” అని వినిపిస్తుంది. మతి కాదు మదం. “మదో నైవ మేనైవ మాత్సర్య భావ” అనే ఉంటుంది వినిపిస్తుంది ఎక్కడైనా. మద మాత్సర్యాలు లేవు అన్న స్థితిని వ్యక్తపరచే పదాలు.
ఆది శంకరులు చివరి ఘడియల్లో చెప్పినట్లు ప్రశస్తి పొందిన ఈ నిర్వాణ శట్కం ప్రతి శ్లోకంలో మూడు లైన్లు తాను ఏది కాదో ఏదేది కాదో చెప్పుకొని, చివరిగా మాత్రం ఆరు మార్లు అన్ని సార్లు ఒక్కటే లైన్ చెప్పడం సొంతానికి అనుభువ వాక్యమైనా అందరికి ఉపదేశ వాక్యంగా అనిపిస్తుంది. అంతటి ఉదాత్తమైన అద్వైతానుభూతి ఆనందానుభూతితో “చిదానంద రూప” అని సాగే షట్కంలో ఆనందం కన్నా ఎందుకో కొంత విచారమైన జీర వినిపించింది. చిదానందరూపున్ని నేను అన్నప్పుడు ఇంక విచారమేముంటుంది! అయినా భక్తి భావంతో పాడినందుకు సంతృప్తినే ఇచ్చింది.
మీరు రాసిన “భారతి, భావాంబర వీధి విశ్రుతి విహారి” అన్న ఒక్క మాట చాలు, వచన కవిత్వమైనా ఛందోబద్ధ కవిత్వమైనా ఒకటే నని. ఆ అమ్మ కృపతొ మన ఈ తెలుగు భాష రోజు రోజు క్రొత్త పుంతలు తొక్కుత్తున్నది. వాఙ్మయం నుండి ప్రబంధ కవిత్వము నుండి, గురజాడ, గిడుగు వారి నుండి, శ్రీ శ్రీ నుండి భారతి, భావాంబర వీధి విశ్రుతి విహారి! వాగర్ధావివ సంప్రుక్తౌ, వాగర్ధౌ ప్రతిపత్తయెత్ అన్నట్టు……
దమయంతి గారు మీ సిరుల సంక్రాంతి బాగా నచ్చింది. నా చిన్నతనం జ్ఞాపకాలు మల్లి గుర్తుకువచ్చాయి. మీకు, మీ అమ్మాయి లావణ్య గారికి కృతజ్ఞతలు. లావణ్య గారి వల్ల నేను మీ గురించి తెలుసుకున్నాను.
పూర్ణిమా
చాల బావుంది. అసలు అనువాదం చదువుతున్నట్టుగానే అనిపించలేదు. మొదటి నుంచీ చివరి దాకా ఆ టెన్షన్ బాగా మైంటైన్ చేసారు. ఇంకా ఇలాంటివి ఎన్నో మీనుంచి ఆశిస్తూ .. పద్మ
అఫ్సర్, సృజనలో అనుకుంటా వెల్చేరు కవిత ఒకటి చదివి వావ్ అనుకున్నాను, సుమారు 1973-74 ప్రాంతాల్లో. పదాలు సరిగ్గా గుర్తు లేవు. ‘మనది గొప్ప జాతి / నాకు ఆకలేస్తోంది// మన సంస్కృతి చాల గొప్పది…. ../ నాకు ఆకలేస్తోందిరా// నన్నయ ఫలానా./రేయ్ నాకు ఆకలేస్తోందంటే వినవేం’ ఇలా ఉంటుంది. ఇలా కాదు, ఈ పదాల కన్న చాల బాగుంటుంది. ఇది ఇప్పటికే మీ దగ్గరుండొచ్చు. మీ దగ్గర లేక పోతే, ఎన్. వేణు దగ్గరున్న సృజన బైండింగ్స్ లో దొరకొచ్చు.
అవునండీ, నాక్కూడా ఇదే సందేహం కలిగింది… ఉగాది శుభాకాంక్షలు చెప్పలేదేంటీ? అని అడగడంలో అంత వెటకారంగా సమాధానం ఇవ్వాల్సిన తప్పు ఏమి ఉందీ? అని (ఎలా అడిగినా కూడా!). కానీ, మేధావుల మధ్య తలకాయ పెట్టి ఇరుక్కుపోవడం ఎందుకని ఊరుకుండిపోయాను. ఇంకొకరు కూడా వ్యాఖ్యానించేసరికి ధైర్యం వచ్చి రాస్తున్నా. ఉగాది కి ఒక చక్కటి తెలుగు పత్రిక ఉగాది శుభాకాంక్షలు ఎందుకు రాయకూడదండీ? తెలీకే అడుగుతున్నాను. మళ్ళీ నాకు తలంటుతారేమో అన్న భయం ఉండనే ఉంది కానీ, భయం సందేహాన్ని తీర్చదు కదా!!
సీత గడియ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
03/09/2012 5:10 pm

శివోహం! శివోహం! గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
03/09/2012 1:43 pm
ఎప్పుడో ఆకాశవాణి హైద్రాబాద్ “భక్తి రంజని”లో ప్రసారం అయ్యిందనన్న మాట కూడా చెప్పితేనే గుర్తుకొచ్చింది- మరిచిపోయిన మధురమైన గతజన్మ స్మృతినేదో పొందినంత సంతోషం కలిగించినందుకు కృతజ్ఞతలు.
మూడవ శ్లోకంలో “మతో నైవ మేనవై” అని వినిపిస్తుంది. మతి కాదు మదం. “మదో నైవ మేనైవ మాత్సర్య భావ” అనే ఉంటుంది వినిపిస్తుంది ఎక్కడైనా. మద మాత్సర్యాలు లేవు అన్న స్థితిని వ్యక్తపరచే పదాలు.
ఆది శంకరులు చివరి ఘడియల్లో చెప్పినట్లు ప్రశస్తి పొందిన ఈ నిర్వాణ శట్కం ప్రతి శ్లోకంలో మూడు లైన్లు తాను ఏది కాదో ఏదేది కాదో చెప్పుకొని, చివరిగా మాత్రం ఆరు మార్లు అన్ని సార్లు ఒక్కటే లైన్ చెప్పడం సొంతానికి అనుభువ వాక్యమైనా అందరికి ఉపదేశ వాక్యంగా అనిపిస్తుంది. అంతటి ఉదాత్తమైన అద్వైతానుభూతి ఆనందానుభూతితో “చిదానంద రూప” అని సాగే షట్కంలో ఆనందం కన్నా ఎందుకో కొంత విచారమైన జీర వినిపించింది. చిదానందరూపున్ని నేను అన్నప్పుడు ఇంక విచారమేముంటుంది! అయినా భక్తి భావంతో పాడినందుకు సంతృప్తినే ఇచ్చింది.
విధేయుడు
_శ్రీనివాస్
తడిస్తే కదా తెలిసేది! గురించి Venkateswara Rao .D అభిప్రాయం:
03/09/2012 11:25 am
గన్నవరపు నరసింహమూర్తి గారు,
మీరు రాసిన “భారతి, భావాంబర వీధి విశ్రుతి విహారి” అన్న ఒక్క మాట చాలు, వచన కవిత్వమైనా ఛందోబద్ధ కవిత్వమైనా ఒకటే నని. ఆ అమ్మ కృపతొ మన ఈ తెలుగు భాష రోజు రోజు క్రొత్త పుంతలు తొక్కుత్తున్నది. వాఙ్మయం నుండి ప్రబంధ కవిత్వము నుండి, గురజాడ, గిడుగు వారి నుండి, శ్రీ శ్రీ నుండి భారతి, భావాంబర వీధి విశ్రుతి విహారి! వాగర్ధావివ సంప్రుక్తౌ, వాగర్ధౌ ప్రతిపత్తయెత్ అన్నట్టు……
స్నానాల గదిలో గురించి బొక్కా ప్రేమ్ కుమార్ అభిప్రాయం:
03/09/2012 7:18 am
ఆవిరి నిండిన ఈ గదిలో
నేనొక్కదానినే
మునివేళ్ళతో నీళ్ళని తాకి చూస్తాను
తేనీటి కప్పుని పెదవులకి ఆనించినట్టు.
కవిత అర్ధాంతరంగా ఆపేసినట్టు ఉంది, ఇంకా కంటిన్యూ చేస్తే బావుండేది.
– బొక్కా ప్రేమ్ కుమార్
వెల్చేరు కవితలు కావలెను గురించి afsar అభిప్రాయం:
03/08/2012 1:55 am
హెచ్చార్కే: ఆ కవిత మా దగ్గిర వుంది. అది ఇతర సంకలనాల్లో కూడా వచ్చింది కదా! అవి కాక, ఇంకా ఏమయినా వుంటే చెప్పండి.
సిరుల సంక్రాంతి గురించి Rushi అభిప్రాయం:
03/07/2012 4:03 am
దమయంతి గారు మీ సిరుల సంక్రాంతి బాగా నచ్చింది. నా చిన్నతనం జ్ఞాపకాలు మల్లి గుర్తుకువచ్చాయి. మీకు, మీ అమ్మాయి లావణ్య గారికి కృతజ్ఞతలు. లావణ్య గారి వల్ల నేను మీ గురించి తెలుసుకున్నాను.
ఋషి కుమర్
Bangalore
చిరునవ్వుగాది గురించి మోహన అభిప్రాయం:
03/06/2012 5:20 pm
మీ యుగాది గీతులు చిరునవ్వునే తెప్పించింది. రెండు యింద్రగణాలను ముచ్చటైన మూడు సూర్య గణాలుగా మార్చే కిటుకు బాగా తెలిసికొన్నారు.
ఆటవెలదు లెల్ల నందమ్ముగా నాడి
పాట బాడి రెంతొ పరవశాన
మేటి నందనమ్ము మీటు విరులవీణ
నోట జార తెలుగు తేట పాట
ఉ(యు)గాది శుభాశయాలతో – మోహన
భయం గురించి Padmavalli అభిప్రాయం:
03/06/2012 3:37 pm
పూర్ణిమా
చాల బావుంది. అసలు అనువాదం చదువుతున్నట్టుగానే అనిపించలేదు. మొదటి నుంచీ చివరి దాకా ఆ టెన్షన్ బాగా మైంటైన్ చేసారు. ఇంకా ఇలాంటివి ఎన్నో మీనుంచి ఆశిస్తూ .. పద్మ
వెల్చేరు కవితలు కావలెను గురించి హెచ్చార్కె అభిప్రాయం:
03/06/2012 1:52 pm
అఫ్సర్, సృజనలో అనుకుంటా వెల్చేరు కవిత ఒకటి చదివి వావ్ అనుకున్నాను, సుమారు 1973-74 ప్రాంతాల్లో. పదాలు సరిగ్గా గుర్తు లేవు. ‘మనది గొప్ప జాతి / నాకు ఆకలేస్తోంది// మన సంస్కృతి చాల గొప్పది…. ../ నాకు ఆకలేస్తోందిరా// నన్నయ ఫలానా./రేయ్ నాకు ఆకలేస్తోందంటే వినవేం’ ఇలా ఉంటుంది. ఇలా కాదు, ఈ పదాల కన్న చాల బాగుంటుంది. ఇది ఇప్పటికే మీ దగ్గరుండొచ్చు. మీ దగ్గర లేక పోతే, ఎన్. వేణు దగ్గరున్న సృజన బైండింగ్స్ లో దొరకొచ్చు.
ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి Asooryampasya అభిప్రాయం:
03/06/2012 1:00 pm