పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16438

  1. కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    12/14/2025 2:02 pm

    >> ఫారడే జీవితంలో సాండెమానియన్ విశ్వాసం ముఖ్యమైనది. చర్చిలో ప్రార్థనలకి వెళ్ళడం, ఆచారాలు పాటించడం, ఆ సంఘ సభ్యులతో కలసి మెలసి ఉండటం, దాని బోధనలు పాటించడం శ్రద్ధగా చేసేవాడు. తన భార్య కుటుంబం కూడా సాండెమానియన్లే

    ఇది నా స్వంత ఘోష కనక ఎవరికీ నచ్చకపోవచ్చు. స్కూల్ లేదా కాలేజీ లెవెల్లో మనకి ఫారడే వంటి వారు తారసపడుతూ ఉంటారు. వీళ్ళు క్లాసులకి రారు, నేర్చుకోరు. వచ్చినా ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళడం. వీళ్ళకి మరికొంతమంది భజనపరులు ఉండడం కూడా చూడొచ్చు. ఈ భజనపరులు చెప్పడం ప్రకారం “వాడికి మంచి సబ్జక్ట్ ఉంది కానీ రాయలేడు, అందువల్ల అస్తమానూ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు, వగైరా.” ఇదీ సుత్తి పెద్ద నాన్సెన్స్ మాట. వీళ్ళకి ఇక్కడో పనిచేసే రేడియో, లేదా ఒక పాట కంప్యూటర్ ఇస్తే దాన్ని తిరగేసి మరగేసి ఏదో చేయగలరు. ఆ తర్వాత మిగతా విషయాలు నేర్చుకోరు కనక అలా ఫెయిల్ అవుతూ అక్కడే ఉంటారు.

    మరో రెండు మూడేళ్ళకి జరిగేది ఏమిటంటే, పూర్తిగా జీవితంలో ఫెయిల్ అయి రోడ్డుమీద నుంచుంటారు. మెల్లిగా సిగరెట్టూ, మందూ అలవాటు అవుతాయి. అక్కడనుంచి జారుడు కిందకి. మరి కొన్నాళ్ళకి ఏదో పనిలో కుదురుకుంటారు. జీవితం తెల్లవారి పోతుంది. అయితే ఇటువంటి వారందరూ ఫారడేలు అయిపోతారని కాదు కానీ, వీళ్ళకి సరైన దిశా నిర్దేశం చేసేవారుంటే ఏదో బతికి బయట కట్టే అవకాశం ఉంది. కొండొకచో ఈ దిశా నిర్దేశానికి దండం కావాల్సి రావొచ్చు. ఫారడే జీవితంలో ఈ “సాండెమానియన్ విశ్వాసం” వల్ల ఆయన దారిలో పడ్డాడనుకుంటా. లేకపోతే మనకి రోజూ కనిపించే “వాడికి మంచి సబ్జక్ట్ ఉంది కానీ రాయలేడు, అందువల్ల అస్తమానూ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు” అనే దారిలోనే వెళ్ళి ఉండేవాడేమో అనిపించింది ఈ వ్యాసం చదివాక.

  2. పోతన భాగవతంలో దృశ్యీకరణం – 3 గురించి Giri అభిప్రాయం:

    12/13/2025 9:41 am

    తెలుగుభాషని పాలసముద్రంగా చేసి స్వయంగా చిలికి భాగవతరసామృతాన్ని మనకి అందించిన పరమభాగవతోత్తముడు భక్తపోతనగారు. లక్మీదేవితో సరసాలాడిన ఆ చేతితో, బలిచక్రవర్తిదగ్గర చాపిన ఆ చేతితో మన తెలుగుభాషలో పద్యం రాయించి తెలుగుభాషని పునీతం చేసిన భక్తశిఖామణి. భాగవతరసామృతాన్ని ఆస్వాదించడానికి ఆసక్తి కలిగినవారికి ఆ సిరిపతి దీర్ఘాయుని ప్రసాదించాలి.

  3. Walked into a bar గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    12/12/2025 12:20 am

    నిజమే.. ఇక మానవకల్పిత కథలు ఉండవు. యాంత్రిక సృజన అప్పుడే సాహిత్యాకాశాన్ని కమ్మేసింది. నువ్వు, నేను అందరం అందులో కలిసిపోవాల్సిందే అనిపిస్తోంది. అయితే రచయిత ఈ వినూత్న ప్రయోగం ద్వారా ఏమి చెప్పదలచుకున్నారు అన్నది అయోమయంగానే మిగిలిపోయింది.

  4. ‘దిద్దు’బాటు గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    12/11/2025 11:59 pm

    ముసలోళ్లు అనుకుంటాము కానీ కాలాంతకులు. మనకు ఎప్పుడు ఏమి అవసరమో ముందుగానే ఊహించి భవిష్యత్తుకు మదుపు చేయగల ముందు చూపు కచ్చితంగా వారికి ఉంటుంది. ఈ సత్యాన్ని పొన్నాడ గౌరి గారి కథ, అందమైన శ్రీకాకుళం యాసలో మరోసారి నిరూపించింది.

  5. త్యాగరాజ అష్టోత్తరశతనామములు గురించి హనుమ కుమారి గురజాల అభిప్రాయం:

    12/09/2025 9:48 am

    ఓం శ్రీ త్యాగరాజు గారి నామావళి చాలా బాగుంది.అంతటి మహానుభావుల నామాలు జపించటం చాలా యోగం. చాలాబాగా వ్రాసారు mam. ధన్యవాదములు.

  6. తిక్కనగారి భారతంలో ఒక పద్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    12/09/2025 9:34 am

    సుధేష్ణ కోసం వెతుకుతూ ఇక్కడకి యథాలాపముగ వచ్చాను. వేలూరి గారి ప్రశ్నకి విశ్వనాథ వారి జవాబు [1]:

    “తిక్కన్న గారు మరియొక పద్యమును వ్రాయగలరు కదా! వ్రాయలేదు. ఎందుచేత వ్రాయలేదు.

    ఈ పద్యములోని అన్వయము, కూర్పు, మాటలు, సర్వమును ద్రౌపది కీచకునితో మాటాడునపుడు సహజముగా వచ్చినవి. ఈమాటలలో ఆమెయొక్క మనోయధార్ధ్యము విస్పష్టముగా గోచరించుచున్నది. మరల నదే పద్యము భర్తతో మాటాడినపుడు చెప్పినచో నామె మనోయధార్ధ్యము, ఆమె కోపము, కీచకునితో నన్నప్పు డెట్లున్నవో అట్లు వెలయించుటకు చెప్పినది. భర్త కదా! అతడు నమ్మవలయును. ఇప్పుడు నమ్మక తప్పదు. అప్పుడున్న కోపపుటొత్తిడి యిప్పుడుండదు. ఇంకేవో మాటలు వచ్చును. భర్తకు నమ్మకము కుదురును కుదరదు. ఇప్పుడు కుదరక తప్పదు.

    ఆ వెనుకటి స్థితిని సరిగా నదే పద్యముతో రూపుకట్టించుట గొప్పకవులు చేసెడి శిల్పములో నొకటి.”

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] విశ్వనాథ విమర్శ గ్రంథ నిdhi – II. తృతీయ ముద్రణ. 2021. పేజి 56.

  7. Walked into a bar గురించి Sreenivaas Sathiraju అభిప్రాయం:

    12/08/2025 6:06 pm

    కొత్తగా అనిపించలేదు, కానీ కొంచెం చెత్తగా మనసులోని అసలు సగటు మనిషిలోని దుర్మార్గాలు అన్నీ భాషలో పెట్టగలిగే చందమామ మనసులోని గుంటలు అన్నీ గంటు పెట్టినట్టు ఉంది కథనం… హర్రర్ కామెడీ సినిమా తీద్దామనుకుని బూతు సినిమా తీసిన దర్శకనిర్మాతల్లా రచయిత మనోభావాలు వ్యక్తీకృతమవడం సాహిత్యాభిమానులకు తీరని దాహంగా మిగిలిపోయింది. ఓ బూతు కథ సూటిగా రాసినా హాయిగా ఉండేది… అనిపించింది నిజాయితీగా చెప్పాలంటే! నేటి ఫేస్‌బుక్ రచయితల సాహిత్య కలయికలా ఇది అనిపించింది.

  8. కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి Srinivas అభిప్రాయం:

    12/07/2025 11:16 pm

    Linking mythology with science is not appropriate. you may wish to listen about black holes in this vide and think.
    https://www.youtube.com/watch?v=lzKkt8BPzg0

  9. భవ్య కవుల భావసారూప్యం గురించి నరసింహారావు కోటపల్లి అభిప్రాయం:

    12/06/2025 10:11 pm

    చక్కని విషయ విశ్లేషణాత్మక వ్యాసం. సర్వమంగళ గౌరి గారికి నమస్కారములు.

    చాలా బాగుంది. నన్నయ తిక్కనాదులకేమాత్రం తీసిపోకుండా, వారి సరసన పీటవేసుకున్నారనిపించింది విశ్వనాథ వారి వర్ణన చూస్తే. దేవులపల్లి వారి సరేసరి: పద లాలిత్యంతోపాటుగా వర్ణనాగాఢత అద్భుతం.

    పాండిత్యం, కవిత్వాలను పూర్వదిగ్దంతుల నుండి పుణికిపుచ్చుకొని మెరుగులద్దుతూ తమ ప్రత్యేకతను నిలుపుకున్న ఈనాటి వారిని చూస్తే గౌరవం, అభిమానం, గర్వంగా ఉంటుంది. ఈ పరంపర యిలాగే కొనసాగుతూ వుండాలి.

  10. వైరాగ్య రాగంలో మీటిన ఏక్‌తార: బైరాగి కవిత్వం గురించి అక్కినపల్లి మధుసూదనరావు అభిప్రాయం:

    12/05/2025 10:39 am

    అద్భుతమైన, ప్రామాణికమైన రచన. మనఃపూర్వక అభినందనలు 🙏