పాఠకుల అభిప్రాయాలు

హనుమంతరావు results: 290

  1. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/16/2008 7:24 am

    నవీన్ గారూ,

    L(x,y) అనే ఉండాలి. తప్పు సరిదిద్దినందుకూ ప్రోత్సాహానికీ థాంక్స్.

    Y2K భాగ్యాన గానీ సెల్ ఫోన్ల మహత్యాన గానీ, ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ప్రాముఖ్యత మన పల్లెటూళ్ళ వాళ్ళకీ తెలుసు. అయితే దాని వెనుక ఉన్న శుద్ధ ఆలోచన (abstract thought) గురించి కంప్యూటర్ ఉద్యోగాలు చేసేవాళ్ళకే చాలా మందికి తెలియదు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ ఆలోచననీ దానికి మూలమైన కొందరు మేధావులనీ పరిచయం చేసి, దానిలోని కొన్ని అందాలు చూపాలనీ, కాస్తో కూస్తో తెలుగువాళ్ళలో శాస్త్రీయ దృక్పథం పెంచాలనీ నా ఆశ.

    కొడవళ్ళ హనుమంతరావు

  2. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి నవీన్ గార్ల అభిప్రాయం:

    09/15/2008 5:22 am

    GirlInClass(x), Smart(x), Pretty(x), Loves(x, y) అన్న ప్రమేయాలు
    వీటిని క్లుప్తంగా, G(x), S(x), P(x), L(x) అని రాద్దాం.

    కొడవళ్ళ హనుమంతరావు గారు,
    పైన Loves(x,y) అన్న ప్రమేయంను క్లుప్తంగా వ్రాసేటప్పుడు L(x) అన్నారు. దీన్ని L(x,y) అని కదా వ్రాయాల్సింది?
    ఇది పెద్ద పొరపాటు, తప్పు కానప్పటికీ, అలా వ్రాయటంలో ఏమైనా ఉద్దేశం ఉందేమో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

    ఇలాంటి వ్యాసాలు తెలుగులో, అదీ ఈమాటలో చూడటం, చదవటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వ్యాసాలు మీరు పుంఖానుపుంఖలుగా వ్రాయాలని మా ఆశ,

  3. మరో గుప్పెడు మొర్మొరాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/15/2008 12:15 am

    చదివించగలిగే శక్తి ఉన్న రచనని మరీ అంత హీనంగా చూడకూడదేమో! ఈ రచన ముఖ్యోద్దేశం ఏమిటి? పాత పద్యాల గురించి సామాన్య పాఠకులకుండే భయాన్ని పోగొట్టడం. ఎలా? ఓ పుస్తక పరిచయం ద్వారా.

    దానిని మన పత్రికలలో ఏదో మొక్కుబడికో పేజీ నింపడానికో చేసినట్లు కాక తన అనుభవంతో అన్వయించుకుంటూ సొంత జీవితంలో ఎరిగిన వ్యక్తుల్ని స్మరించుకుంటూ చేశాడు. అది మెచ్చుకోదగ్గ ప్రయత్నం.

    పోయినేడు, ఈమాట మిత్రులు నన్నేమైనా వ్యాసం రాయమని పదేపదే పోరితే, సరేనని మాఊళ్ళో లైబ్రరీ కెళ్ళి పుస్తకాలు తిరగేశా – Essay Writing for Dummies లాంటిదేమైనా దొరుకుతుందని. వ్యాస రచన నాకంత సులభం కాదని తెలిసిపోయింది. ఈ వ్యాసమూ, అబిప్రాయాలూ చదివాక, ఆ పుస్తకాలలో చదివినదొకటి గుర్తుకొచ్చింది:

    “The hallmark of the personal essay is its intimacy. The writer seems to be speaking directly into your ear, confiding everything from gossip to wisdom. Through sharing thoughts, memories, desires, complaints, and whimsies, the personal essayist sets up a relationship with the reader, a dialogue – a friendship, if you will based on identification, understanding, testiness, and companionship.” [1]

    Montaigne, “Every man has within himself the entire human condition,” అన్నాడట. అంటే బాబ్జీలు గారు తన గురించి చెప్తున్నప్పుడు నిజంగా మన (అంటే నాలాంటి వాళ్ళు, కామేశ్వరరావు గారి లాంటి వారు కాదు) గురించి చెప్తున్నట్లు.

    అలా చూస్తే ఇది చదవదగ్గ రచనే. లోపాల్లేవని కాదు. ఉదాహరణకి, “పోతన్న కవిత్వ పటుత్వం,” వ్యాసం గురించి రాజాజీ వ్యాఖ్య కన్నా చెప్పదగ్గ విషయం లేదా? (తేల్చుకోడానికి ఈ పుస్తకం నాకందుబాటులో లేదు.) మరొకటి, వాళ్ళ చిన్నాన్న పక్కన ఆయవారాలు చేసుకునే ఆయన్ని చూసి చికాకు పడే నాన్నమ్మ – ఇది పాఠకుడిలో సరయిన స్పందన కలిగిస్తుందా?

    “ఈ యువతరం వారు సుప్రసిద్ధాలయిన పాత విషయాలు,” తెలుసుకోవాలనే కోరికతో రాశానన్నారు తాపీధర్మారావు, అవి బూజుపట్టిన మరమరాలు, why the heck you are reintroducing us to something passé? అంటోంది యువత!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] From “Introduction,” in “The Art of the Personal Essay: An Anthology from the Classical Era to the Present,” by Philip Lopate.

  4. కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/14/2008 1:46 pm

    “కొకు రచనా ప్రపంచం”

    సాహిత్యం గురించీ, దాని ప్రయోజనం గురించీ, నిర్దుష్టమైన అభిప్రాయాలుండి, జీవితంలో సాహిత్యానికున్న ప్రాముఖ్యత పరిమితమైనదని గుర్తిస్తూనే, దానికో ఉత్కృష్టమైన స్థానాన్నిచ్చిన వాళ్ళలో అగ్రగణ్యుడు కొడవటిగంటి కుటుంబరావు.

    కొకు శతజయంతి సందర్భంగా, విరసం ఆయన రచనా సర్వస్వాన్ని ప్రచురించాలని నిర్ణయించిందనీ, జనవరిలో మొదటి దఫాగా నాలుగు సంపుటాలూ, 2009 చివరికల్లా మిగిలిన పన్నెండూ వచ్చేస్తాయనీ, ఈ మధ్యనే ఓ ప్రకటనలో చదివాను. “చదువు” లాంటివి ఒకటీ అరా రచనలు తప్ప కుటుంబరావువి మిగిలినవి దొరకడం కష్టంగా ఉంది కనుక ఇది పుస్తక ప్రియులందరికీ ఎంతో సంతోషకరమైన విషయం.

    దీంట్లో నాకు కొంత ఐరనీ కూడా కనిపిస్తుంది. నిజమైన సాహిత్యానికి చిరత్వం లేదని నొక్కి వక్కాణించినవాడు కుటుంబరావు. తన రచనల వలన పాఠకులలో కొంత సంస్కారం కలగాలనీ, సమాజంలో అలాంటి సంస్కారం పెరిగే కొలదీ తన రచనల అవసరం ఉండకూడదనీ, తన సాహిత్యం ఎంత త్వరగా మరుగునపడితే అంత మంచిదనీ గాఢంగా ఆకాంక్షించాడు. మరి ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా కొకు రచనల అవసరం మనం గుర్తిస్తున్నామంటే, మన సమాజం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లా? లేక కొకు రచనల లోని సాహిత్యేతర లక్షణాలకోసం వాటిని చదువుతున్నామా? అదీకాకపోతే అసలు కొకు సాహిత్య ప్రయోజనం గురించిన ఆలోచనలో లోపముందా? అన్న సందేహాలొస్తాయి నాకు.

    శతజయంతి అంటే మరొకటి కూడా గుర్తొస్తుంది. తన షష్టిపూర్తి సందర్భంగా కొకు ఓ వ్యాసం రాశాడు – అయితే ఏమిటీ అని! పుట్టినరోజు ఉత్సవాలూ, ఊరేగింపులూ చాలా కృత్రిమమైన వేడుకలనీ, మల్లినాధసూరి కాళిదాసుకి శతజయంతులు జరపలేదు – వ్యాఖ్య రాశాడనీ, ప్రముఖ రచయితల గురించి కావాల్సింది అర్థంలేని పొగడ్తలు కాదు, విమర్శలు, అంటూ తన సహజ ధోరణిలో చాలా రాశాడు. అవన్నీ మనం ఆయన శత జయంతి సందర్భంగా చర్చించుకోడానికి ఈ “కొకు రచనా ప్రపంచం” చేతికొస్తుంది. చాలా చవక గూడాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. ఏటి ఒడ్డున గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    09/13/2008 7:45 pm

    నా “ఏటి ఒడ్డున” కవిత పై తమ స్పందనని,అభిప్రాయాలని తెలియజేసిన బాబ్జీలు,నిషిగంధ,మాలతి,కొడవళ్ళ హనుమంతరావు,కాళ్ళకూరి సాయిలక్ష్మి,సాయికిరణ్ కుమార్,కొత్తపాళీ,కొ స్యా సు రా, యెర్నేని లైలా, రాధిక,రవికిరణ్ తిమ్మిరెడ్డి గార్లకు ధన్యవాదాలు.
    I am truly happy that my poem could evoke a warm response from such gifted readership.
    Vaidehi Sasidhar.

  6. పుస్తక సమీక్షల గురించి… గురించి vElUri VEMkaTESvara raavu అభిప్రాయం:

    09/11/2008 1:46 pm

    —రామ (రమ) భరద్వాజ్ గారికి:
    మీరు ఉదహరించిన రెండు సమీక్షలు/విమర్శలూ నాకు తెలుసు. వాటి ప్రతులు నా దగ్గిర లేకపోవటంతో, నేను వాటి ప్రస్తావన తేలేదు. నా సంపాదకీయం/వ్యాసం (?)(సరేనా విప్లవ్ గారూ! మీకు అభినందనలు) లో నేను ఉదహరించిన వాటన్నిటికీ నాదగ్గిర ప్రతులున్నాయి! మీరు ఆ రెండుసమీక్షలూ గుర్తుకితెచ్చి నన్ను మందలించినందుకు కృతజ్ఞుడిని.
    —రోహిణీప్రసాద్ గారికి:
    ఈ మాట గురించి మీరు చెప్పిన రెండు మంచి మాటలు మాకెంతో ఆనందం; గర్వకారణం. మీకు నా నమస్సులు.
    —కొత్తపాళీ గారికి:
    నిష్పాక్షికము అన్న మాట నేను without bias కి అనువాదంగా వాడాను. నా ఉద్దేశంలో విమర్శలలోసాధ్యమైనంతవరకూ ఏవిధమైన bias (పక్షపాతం అన్న మాట ఒప్పుకుంటారా?) ఉండకూడదు. అంటే విమర్శకుడి biases సమీక్షలోను, విమర్శలోనూ కనపడకూడదు, అని! తన భావస్పందన స్పష్టం గా ఉండకూడదనే అర్థం నావ్యాసం(?)/సంపాదకీయంలో వచ్చిఉంటే, రచయితగా అది నా చేతకానితనం. క్షమార్హుణ్ణి.

    హనుమంతరావుగారికి:

    కొ.కు. చెప్పినా, రా .రా. వ్రాసినా, తా.ధ. మందలించినా; — అసలు నిజం ఇది: కీట్స్ మరణానికి కారణం అతని క్షయ వ్యాధి. తన క్షయ వ్యాధి, దరిమిలా తన రాబోవు మరణం గురించి కీట్స్ చాలా మథన పడ్డాడు. కీట్స్ apothecary గా ( అంటే, మన భాషలో కాంపౌండర్ అనవచ్చనుకుంటా!) శిక్షణ పొందాడు!

    1821 లో (కీట్స్ మరణానంతరం) ఈ కథ / రూమర్ మొదలయ్యింది. క్వార్టర్లీ రివ్యూ పత్రికలో ఒక “కర్కోటక” విమర్శకుడు(విమర్శకురాలు?) వ్రాసిన సమీక్ష కీట్స్ మరణానికి కారణం అని! ఈ రూమర్ కి ఆజ్యం పోసిన వాడు షెల్లీ. మీరు చదివే ఉంటారు; షెల్లీ వ్రాసిన Adonais. అది కీట్స్ పై elegy అని మీకు నేను చెప్పనక్కరలేదు. పోతే, బైరన్ వ్రాసిన Don Juan పద్యంలో, ఈ రూమర్ని కాస్త తక్కువ పాళ్ళల్లో పాడాడు:
    ‘Tis strange the mind, that very fiery particle,
    Should let itself be snuffed out by an Article.”

    Stanley Plumly ఈ మధ్యనే Posthumous Keats ( Norton, 2008) ప్రచురించాడు. అందులో ఈ కథ/రూమర్ ప్రస్తావన దొరుకుతుంది.

    విధేయుడు, — వేలూరి వేంకటేశ్వర రావు.

  7. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/09/2008 9:04 pm

    రామారావ్,

    థాంక్స్. ఈ వ్యాసాలు అర్థం చేసుకోడానికి హైస్కూలు లెక్కలకి మించిన గణిత పరిజ్ఞానం అవసరం లేకపోయినా హైస్కూలు స్థాయిని దాటిన పరిణతి కావాలి. వీటిని బడిపిల్లలకి అందుబాటులోకి తేవాలంటే మార్పులు చేర్పులు చెయ్యాలి.

    Intuitionism మీదా Brouwer గురించీ కొంత వచ్చే సంచికలో రాస్తాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/06/2008 8:01 am

    సూర్యుడు గారికి,

    కరెక్ట్ చేసినందుకు థాంక్స్. నేను చెప్పిన మిగతాది మీ అనుమానాలని తీర్చిందని ఆశిస్తాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  9. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి sUryuDu అభిప్రాయం:

    09/05/2008 9:34 am

    కొడవళ్ళ హనుమంతరావు గారు,

    నేను “ప్రవచనం” అన్న పదం గణిత పరిభాషలో వాడాను. “ప్రవచనం” అంటే, ఇంగ్లీష్ లో స్టేట్మెంట్ అని. గణితం లో ప్రవచనాలని, సత్య ప్రవచనం లేదా అసత్య ప్రవచనం అనిఅంటారు. గణితం లో అసందిగ్ద ప్రవచనాలకి స్థానం లేదు.

    సూర్యుడు 🙂

  10. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/04/2008 8:19 pm

    సూర్యుడు గారూ,

    తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలేవీ నాకు అందుబాటులో లేవు కాని ప్రవచనం అంటే గొప్ప మాట, ప్రవక్తలు చెప్పేది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది Propositional Logic – ప్రతిపాదనల తర్కం.

    ప్రమేయం (function) అంటే మీ ఆలోచన సరయినదే. నేనో ఉదాహరణ ఇచ్చాను – Square(x). అలాగే Sum(x, y). Sum(4, 5) విలువ 9. ఇది గణితంలో మనకందరికీ తెలిసినదే.

    తర్కం మన వివేచనకి సంబంధించింది. అంటే గణితం కన్నా కూడా మౌలికమైనది. అన్ని రకాల భావనలకీ, అన్ని రంగాల్లోనూ వర్తిస్తుంది. ప్రమేయాన్ని Frege కొంచం మార్చి తర్కంలో భావనకి సంకేతంగా వాడుకున్నాడు.

    దానిని గణితంలో లాగా సంఖ్యలకి పరిమితం చెయ్యకుండా అన్ని రకాల వస్తువులకీ వాడాడు. RedColored(x) అన్న ప్రమేయం x మనిషైనా, జంతువైనా, వస్తువైనా వర్తిస్తుంది – ఎర్రగాఉందన్న భావనకి సంకేతంగా.

    తను రూపొందిస్తున్నది ప్రతిపాద తర్కం కనుక ప్రమేయం తిరుగు ఇచ్చే విలువని రెండు విలువలకే పరిమితం చేశాడు. అలాంటి ప్రమేయాలని Truth-value functions అన్నాడు. ఆ రెండు విలువలు – True, False.

    కొడవళ్ళ హనుమంతరావు