ఈ రానారె కథలు చదువుతుంటే నా బాల్యం ఙ్ఞాపకం వస్తుంది. అర్రె, సరిగ్గా నా చిన్నప్పటి సంఘటన లానే ఉంది అనిపిస్తుంది. అయితే, ఈ విషయం కథ చదివిన తర్వాత గుర్తొస్తుంది. చదవక మునుపు అలాంటివి గుర్తుకు రావు.
మరీ పొగడ్డం బావోదు. అందుకే ఇంతటితో ఆపేస్తున్నాను.
మోహనరావు గారిచ్చిన లింకులు ఈ వ్యాసాన్ని చదివే వారికి సహయపడతాయి. అమి చినిగొ, చినితొ పాట ఆడియోలోనే కాక వీడియోగా ఇవ్వటం బాగుంది. నటి మాధవి ఈ పాటకి స్పందనతో అమల్ పాత్రపై తనకున్న ఇష్టాన్ని చక్కగా చూపించింది.
రాయ్ సినిమాల్లో పాటకి ప్లేబాక్ సింగరుగా కిషోర్ కుమార్ ని వాడుకోటం ఇదే మొదలు, చివర అనుకుంటా.
చారులతను గురించి చక్కగా రాసిన రచయితకు అభినందనలు, ధన్యవాదాలు. నాకు నచ్చిన చలనచిత్రాలలో చారులత ఒకటి. ఈ కథను చిత్రం చూడడానికి ముందే కన్నడములో చదివాను. ఇది ఒక పెద్ద కథ లేక నవలిక. కొద్దిగా రవీంద్రుని జీవితంలోని సంఘటనలపైన ఆధారపడిందే. చారులతలాగే కాదంబరీదేవికి కూడా బంకించంద్రునిపై మక్కువ ఎక్కువ. చారులత బొంకిం, బొంకిం అని పాటలా కూడా పాడుతుంది ఈ చిత్రంలో. కాదంబరీదేవికి రవీంద్రుని ముద్దు పేరు హెకేట్ (ఒక నిగూఢ దేవత). ఆమె రవీంద్రుని భాను అని పిలిచేది. తన మొదటి రచనలను రవీంద్రుడు భానుసింహుని పేరుతో రాశాడు. చిత్రంలోని ముగింపు కథకు విరుద్ధమైనది. కథలో భూపతి మైసూరికి వెళ్తాడు. నేను కూడా రావచ్చా అని చారు అడిగితే మాట్లాడ లేదు భూపతి. ఆమె సరే ఇలాగే ఉండనీ అంటుంది. కానీ చిత్రం ఫ్రీజ్ షాట్తో సందిగ్ధంగా అంతమవుతుంది. భారతీయ చిత్రసీమలో ఇదే మొదటి ఫ్రీజ్ షాట్ అట. ఇందులో అమల్ చారుల మధ్య ఆకర్షణ క్రమేణా వస్తుంది. అతని చనువు, భర్త అశ్రద్ధ, ఆమె ఒంటరిదనం దీనికి దారి తీసింది. భర్తకు చివర తాను అశ్రద్ధ చేశాననే పశ్చాత్తాపం, అమల్కు హద్దు మీరరాదనే భావం, కాని ఆమెకు ఇట్టివి ఏమీ లేదు. అందువల్ల ఆమె చివర రాజీ పడటానికి సంసిద్ధురాలైంది. రాయ్ గారు ఇందులో మొట్ట మొదట నేపథ్య గాయకుని ఉపయోగించారు. కిశోర్ కుమార్ గంగూలీ పాడిన ఆమి చినిగొ చిని తుమారే ఆ పాట. దీనికి బ్యాక్ గ్రవుండ్ మ్యూసిక్ కూడా ఉంది. సామాన్యంగా రాయ్ గారి చిత్రాలలో ఇది అరుదు. ఆ పాటను ఇక్కడ చూచి, విని ఆనందించగలరు –
భువన మెల్ల వెదకి
నిను గంటి క్రొత్త చోట
నే నతిథి నీ గృహాన, ఒహో విదేశినీ
ఈ పాటను 1895లో కవిగారు రాశారట. దీని తన స్వంత అనువాదాన్ని ఆర్జెంటీనాకు చెందిన విక్టోరియా ఒకాంపోకు ఆ దేశాన్ని సందర్శించినప్పుడు కవిగారు ఇచ్చారట. ఆమెయే టాగూరు విదేశిని! చిత్రంలో ఈ పాట చివర అమల్ బౌ ఠాకూరాణీ అని తన వదినగారిని ఉద్దేశించి అంటాడు.
చారులతను గురించి రాయ్ గారి కుమారుడు సందీప్ చెప్పినవి కింది లింకులో రొష్మీలా భట్టాచార్య రచనలో చదువగలరు –
తెలుగులని కించపరుస్తూ సంబోధించడానికి ఉపయోగించే ఒక తల్లకిందుల మాటతో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారే .. ఒకవేలు ఎదుటి వారి మీదకి చూపిస్తే మూడూ వేళ్ళు మననే చూపిస్తాయిట. ముందు ఆ మూడు వేళ్ళు ఏం చెబుతున్నాయో చూడండి.
తెల్లకాయితం ఇతివృత్తం కింద రానారె కథకి ఎందుకు బహుమతి రాలేదో అతనికి తెలుసు, నాకు తెలుసు. పురజనులు ఇలా కడుపులు చించుకుని వీధిన పడనక్కర్లేదు.
అటో యిటో గురించి Sujatha అభిప్రాయం:
05/07/2008 4:21 am
బాగా రాశారు. వ్యక్తుల పట్ల మన అంచనాలెలా తల్లకిందులవుతాయో, మానవ స్వభావాలెలా మారుతాయో బాగా చూపించారు. Beautiful nerration too!
అటో యిటో గురించి ramani అభిప్రాయం:
05/07/2008 3:46 am
బాగుంది.
అటో యిటో గురించి varudhini అభిప్రాయం:
05/07/2008 2:15 am
చాలా బాగా రాసారు. పరిస్థితుల్ని బట్ట మారే మానవ స్వభావాల్ని చక్కగా వర్ణించారు.
పేరు గలవాడేను మనిషోయ్ గురించి ravi అభిప్రాయం:
05/07/2008 2:13 am
ఈ రానారె కథలు చదువుతుంటే నా బాల్యం ఙ్ఞాపకం వస్తుంది. అర్రె, సరిగ్గా నా చిన్నప్పటి సంఘటన లానే ఉంది అనిపిస్తుంది. అయితే, ఈ విషయం కథ చదివిన తర్వాత గుర్తొస్తుంది. చదవక మునుపు అలాంటివి గుర్తుకు రావు.
మరీ పొగడ్డం బావోదు. అందుకే ఇంతటితో ఆపేస్తున్నాను.
లింకన్ తో ఓ రాత్రి గురించి vijay అభిప్రాయం:
05/07/2008 12:46 am
చాలా బాగుందండి… చాలా బాగా హాస్యాన్ని పండించారు…
ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
05/06/2008 11:44 pm
రాజేంద్ర గారికి, మోహన రావు గారికి:
నా వ్యాసం నచ్చినందుకు సంతోషం.
మోహనరావు గారిచ్చిన లింకులు ఈ వ్యాసాన్ని చదివే వారికి సహయపడతాయి. అమి చినిగొ, చినితొ పాట ఆడియోలోనే కాక వీడియోగా ఇవ్వటం బాగుంది. నటి మాధవి ఈ పాటకి స్పందనతో అమల్ పాత్రపై తనకున్న ఇష్టాన్ని చక్కగా చూపించింది.
రాయ్ సినిమాల్లో పాటకి ప్లేబాక్ సింగరుగా కిషోర్ కుమార్ ని వాడుకోటం ఇదే మొదలు, చివర అనుకుంటా.
ఈ లింకులు ఇచ్చి మోహనరావు గారు మంచి పని చేసారు.
లక్ష్మన్న
అటో యిటో గురించి lalithasravanthi అభిప్రాయం:
05/06/2008 9:44 pm
బాగుంది. సినిమా చూసిన అనుభూతి కలిగీంచారు.
ఆఖరు వరకు కథా నాయకుడి పాత్ర లో మార్పు వస్తుందెమొ అనుకున్నాను
హిందోళ రాగం – అనుబంధం గురించి Rohiniprasad అభిప్రాయం:
05/06/2008 6:02 pm
ధైవతం గురించి మోహనరావుగారు రాసినది రైటు. నేను హిందూస్తానీ నేర్చుకున్నాను కనక ద అనడానికి నాకు మనసొప్పదు.
ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా గురించి mOhana అభిప్రాయం:
05/06/2008 6:31 pm
చారులతను గురించి చక్కగా రాసిన రచయితకు అభినందనలు, ధన్యవాదాలు. నాకు నచ్చిన చలనచిత్రాలలో చారులత ఒకటి. ఈ కథను చిత్రం చూడడానికి ముందే కన్నడములో చదివాను. ఇది ఒక పెద్ద కథ లేక నవలిక. కొద్దిగా రవీంద్రుని జీవితంలోని సంఘటనలపైన ఆధారపడిందే. చారులతలాగే కాదంబరీదేవికి కూడా బంకించంద్రునిపై మక్కువ ఎక్కువ. చారులత బొంకిం, బొంకిం అని పాటలా కూడా పాడుతుంది ఈ చిత్రంలో. కాదంబరీదేవికి రవీంద్రుని ముద్దు పేరు హెకేట్ (ఒక నిగూఢ దేవత). ఆమె రవీంద్రుని భాను అని పిలిచేది. తన మొదటి రచనలను రవీంద్రుడు భానుసింహుని పేరుతో రాశాడు. చిత్రంలోని ముగింపు కథకు విరుద్ధమైనది. కథలో భూపతి మైసూరికి వెళ్తాడు. నేను కూడా రావచ్చా అని చారు అడిగితే మాట్లాడ లేదు భూపతి. ఆమె సరే ఇలాగే ఉండనీ అంటుంది. కానీ చిత్రం ఫ్రీజ్ షాట్తో సందిగ్ధంగా అంతమవుతుంది. భారతీయ చిత్రసీమలో ఇదే మొదటి ఫ్రీజ్ షాట్ అట. ఇందులో అమల్ చారుల మధ్య ఆకర్షణ క్రమేణా వస్తుంది. అతని చనువు, భర్త అశ్రద్ధ, ఆమె ఒంటరిదనం దీనికి దారి తీసింది. భర్తకు చివర తాను అశ్రద్ధ చేశాననే పశ్చాత్తాపం, అమల్కు హద్దు మీరరాదనే భావం, కాని ఆమెకు ఇట్టివి ఏమీ లేదు. అందువల్ల ఆమె చివర రాజీ పడటానికి సంసిద్ధురాలైంది. రాయ్ గారు ఇందులో మొట్ట మొదట నేపథ్య గాయకుని ఉపయోగించారు. కిశోర్ కుమార్ గంగూలీ పాడిన ఆమి చినిగొ చిని తుమారే ఆ పాట. దీనికి బ్యాక్ గ్రవుండ్ మ్యూసిక్ కూడా ఉంది. సామాన్యంగా రాయ్ గారి చిత్రాలలో ఇది అరుదు. ఆ పాటను ఇక్కడ చూచి, విని ఆనందించగలరు –
http://www.chakpak.com/video/ami-chini-go-chini—charulatha/25532
ఆ పాట, అదే మెట్టులో దానికి నా తెలుగు భావానువాదం కింద –
ఆమి చిని గొ చిని తొమారే, ఓగొ బిదేశినీ
తుమి థాకొ సింధు పారే, ఓగొ బిదేశినీ
నిను తెలుసు తెలుసు నాకు ఒహో విదేశినీ
ఆ సంద్ర మావ లున్న నిన్నో విదేశినీ
తొమాయ్ దేఖేచి శారద ప్రాతే
తొమాయ్ దేఖేచి మాధవి రాతే
తొమాయ్ దేఖేచి
హృది మాఝారే, ఓగొ బిదేశినీ
నిను జూచేను శారద వేళ
నిను జూచేను ఆమని రేయి
నిను జూచేను
హృది లోలోన, ఒహో విదేశినీ
ఆమి ఆకాశే పాతియ కాన్
సూనేచి సూనేచి తొమారే గాన్
ఆమి తొమారే సోంపేచి ప్రాణ్, ఓగొ బిదేశినీ
నే నాకాశ మంత చెవులై
విన్నాను విన్నాను త్వదీయ గీతి
నే నిచ్చేను ప్రాణమ్ము నీకు, ఒహో విదేశినీ
భూబన భ్రొమియ శేషే
ఆమి ఏసేచి నూతన దేశే
ఆమి అతిథి తొమారి ద్వారే, ఓగొ బిదేశినీ
భువన మెల్ల వెదకి
నిను గంటి క్రొత్త చోట
నే నతిథి నీ గృహాన, ఒహో విదేశినీ
ఈ పాటను 1895లో కవిగారు రాశారట. దీని తన స్వంత అనువాదాన్ని ఆర్జెంటీనాకు చెందిన విక్టోరియా ఒకాంపోకు ఆ దేశాన్ని సందర్శించినప్పుడు కవిగారు ఇచ్చారట. ఆమెయే టాగూరు విదేశిని! చిత్రంలో ఈ పాట చివర అమల్ బౌ ఠాకూరాణీ అని తన వదినగారిని ఉద్దేశించి అంటాడు.
చారులతను గురించి రాయ్ గారి కుమారుడు సందీప్ చెప్పినవి కింది లింకులో రొష్మీలా భట్టాచార్య రచనలో చదువగలరు –
http://www.screenindia.com/old/fullstory.php?content_id=15822
ఇందులోని మిగిలిన పాటలు ఎలా ధ్వనిస్తాయో అని మీకు ఆసక్తి
ఉంటే కింది లింకులలో వినవచ్చు –
మమ చిత్తే, నితి నృత్తే – ఇక్కడ
ఫూలే, ఫూలే ఢోలే ఢోలే – ఇక్కడ
ఈ ఫూలే ఫూలే పాట ఛాయలు ఈ మధ్య వచ్చిన పరిణీత చిత్రంలోని పీయూ బోలే, జియా డోలే అనే పాటలో ఉన్నవి అని గమనించగలరు.
– మోహన
పేరు గలవాడేను మనిషోయ్ గురించి కొత్తపాళీ అభిప్రాయం:
05/06/2008 3:49 pm