పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16451

  1. మదర్స్ డే గురించి Bhushan అభిప్రాయం:

    05/15/2008 7:21 pm

    “సరిగా” అర్థం చేసుకోవడం అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకాల్ని సరిగా అర్థం చేసుకోవడం. ఏది సరి? ఏది సరి కాదు? అనేది వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆ నమ్మకాల ఫలితాలే “సరి”నో “కాదు”నో నిర్ణయిస్తాయి. అందరికీ “సరి” ఒకటి కాదు. చాలా మందికి “తప్పు” కూడా “సరే”. అందరికీ ఒకటే “సరి” అయితే లోకంలో ఇన్ని వాదనలెందుకూ?

  2. లింకన్ తో ఓ రాత్రి గురించి V.B.Sowmya అభిప్రాయం:

    05/15/2008 5:35 pm

    అజయ్ గారికి & వినీల్ గారికి:
    రాయ్ కథలు చదివిన మీ నుండి వచ్చిన వ్యాఖ్యలు నాకు విలువైనవి. ధన్యవాదాలు.

    బ్రహ్మానందం గారికి:
    మీరన్నది కొంతవరకు నిజం, నా దృష్టిలో. మిగితా సగం, రచయితలే కాదు, రచయితల అభిమానులు కూడా కారణం :). తమ అభిమాన రచయిత ని విమర్శిస్తే తట్టుకోలేనంత అభిమానం ఉన్న అభిమానులు :).

  3. లింకన్ తో ఓ రాత్రి గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    05/15/2008 1:42 pm

    “తెలుగులో సాహిత్య విమర్శ”

    హనుమంత రావు గారూ, మీరు అనుకున్నట్లుగా చాలామంది రచయితలుండరు. వ్యక్తులకీ, వస్తువుకీ తేడా తెలియదు చాలామందికి. కథ బాగుందని రాసారా, సంతోషిస్తారు, మంచి పాఠకులుగా దండేస్తారు. కాస్త ఏదయినా వాస్తవానికి దూరంగా అనిపించిందా, రచయితలు ఒప్పుకోడానికి సిద్ధంగా ఉండరు. విమర్శించే వాళ్ళ దాంట్లో విషయం ఉన్నా, రాసేవాళ్ళ అహం ఒప్పుకోదు. ఒక కథ అందరికీ ఆమోద యోగ్యంగా రాయాలనేం లేదు. చిన్న చిన్న విమర్శలు పరవాలేదు చాలా మందికి. కాస్త ఘాటుగా రాస్తే, విమర్శ పై విమర్శ దారితప్పి, వ్యక్తిగతం అయ్యే ప్రమాదం ఉంది. మరీ గట్టిగా గదమాయిస్తే, మేం మామూలు పాఠకులకోసం రాసామంటూ చర్చనుండి తప్పిస్తారు. తెలుగు సాహిత్యంలో విమర్శ ఎదగకపోవడానికి రచయితలే ముఖ్య కారణం. పొగడ్తలు ఇచ్చే వాళ్ళు మిత్రులూ, విమర్శకులు శత్రువులుగా పరిగణించడం సర్వ సాధారణం. రాసేవాళ్ళు ఎప్పుడూ పైనే ఉంటారు, చదివేవాళ్ళు క్రిందనే ఉంటారు అన్న భావన చాలా మందికుంటుంది. రాసేవాళ్ళు తమ తప్పులు ఒప్పుకోరు. అంగీకరించినా, లేకపోయినా ఇది మాత్రం వాస్తవం.
    ఈ కథపై వచ్చిన చర్చ బాగుంది. దీని వల్ల రాసేవాళ్ళకీ, చదివే వాళ్ళకీ ఉపయోగమే!

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  4. హిందోళ రాగం – అనుబంధం గురించి shAradA.. అభిప్రాయం:

    05/15/2008 10:27 am

    మీరు రాషిన వ్యాషం కూలంకషంగా పరిషీలించి, కాచి, వడపోషి, షేవించిన మీదట రాష్తున్న నా అమూల్యాభిప్రాయం 🙂

    1) హిందోళం అషలు పేరు ఇండోరం, అది ఇండోర్ లో పుట్టింది కాబట్టి దాన్ని అలా అనేవారుట. ఇప్పుడు వడోదరం అనవచ్చుట. ఈ విషయం మీకు తెలియదు, అషలిప్పడివరకూ నాకే తెలియదు,. వొప్పేషుకోండొప్పేషుకోండి.

    2) వ్యాషం మొదట మీరు రాషిన కామెంట్లకి ష్క్వేరు బ్రాకెట్లు వాడడం వల్ల వ్యాషం అందం చెడిపోయిండి. ఫ్లవర్ బ్రాకెట్లు వాడితే బాగుండేది. అషలు ఫ్లవర్ బ్రాకెట్లే ఎందుకు వాడాలో తెలియాలంటే నా పరిషోధనా వ్యాషం చదివి తెలుషుకోవాళి. రాయంగానే పంపిష్తాను.

    3) మీరువాడిన కీబోర్డు బొమ్మ బాగాలేదు, కలర్ పిక్చరు వాడుంటే మీ వ్యాషం అందంగా వుండేది.

    దొరకునా ఇటువంటి షేవా..ఆ..ఆ..ఆ..వా..వా..వా..

  5. ఈమాట మే 2008 సంచిక విడుదల గురించి వాసు.బొజ్జ అభిప్రాయం:

    05/15/2008 5:20 am

    నాకు ఈమాట కొత్త రూపం పసిబిడ్డ నవ్వులా,హరివిల్లులా,పాపి కొండల దగ్గరి గోదావరిలా,వేటూరి గీతం,బాలు జానకి పాడినట్టుగా తియ్య తియ్యగా వుంది.కొత్త సంపాదక వర్గానికి,రచయితలకు అభినందనలు. చావా కిరణ్ గారన్నట్టు ఇంకొక అందమయిన ఫాంట్ వాడి చూడండి.ఈ మధ్య చాల బ్లాగులు, వెబ్ సైట్లు ఈ మాట సౌజన్యముతో నేరుగా వారి వెబ్ సైట్ లోనే తెలుగులో వ్రాసుకునే సౌకర్యం కలిపించినందుకు,తెలుగు బాషాభివ్రుద్దికి పాటు పడుతున్నందుకు మిమ్మల్నందరిని అభినందిస్తూ..

  6. ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా గురించి B.AJAY PRASAD అభిప్రాయం:

    05/15/2008 4:20 am

    లక్ష్మన్నగారూ మీరు రాసిన వ్యాసం చాలా బాగుంది. చారులత నాకు ఇష్టమైన సినిమాలలో ఒకటి. ముఖ్యంగా చారులత (మాధవి ముఖర్జి ) కవిత రాస్తున్నప్పుడు ఆమె కంటిపాపలో కనిపించే పడవ, ఆ వెంటనే కొలిమి అదొక ఎన్నటికీ మరచిపోలేని దృశ్యం. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    అభినందనలతో..
    బి.అజయ్ ప్రసాద్

  7. లింకన్ తో ఓ రాత్రి గురించి B.AJAY PRASAD అభిప్రాయం:

    05/15/2008 4:02 am

    సౌమ్యగారూ.. మీరు రాసిన కథ బాగుంది. పై విమర్శలలో సహేతుకమైన వాటిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని మంచి కథలు రాయండి.

    సత్యజిత్ రాయ్ రాసిన “టాడ్ పోల్ గుడ్డు” కథ నాకు చాలా ఇష్టం. అసంఖ్యాకమైన రాయ్ అభిమానుల్లో నేనూ ఒకడిని.
    అభినందనలతో..

    బి.అజయ్ ప్రసాద్

  8. లింకన్ తో ఓ రాత్రి గురించి వినీల్ అభిప్రాయం:

    05/14/2008 11:54 am

    సౌమ్య గారు, నేను సత్యజిత్ రాయ్ కథలు చదివి కనీసం పదేళ్ళయింది. కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. మీ కథ కూడా ఇంచుమించు అలాగే ఉంది. అభినందనలు.

  9. నన్నయ హంసగీతికలు గురించి Kameswara Rao అభిప్రాయం:

    05/14/2008 8:16 am

    లైలా గారు,
    “అబ్జజుయానము” అంటే ప్రతిపదార్థం మీరనట్టు బ్రహ్మ వాహనం అయిన హంస అనే. ఇక్కడ హంస మీద సరస్వతి, బ్రహ్మఇద్దరూ ఉన్నారు కాబట్టి సరస్వతి హంసకూడా అని అనుకోడంలో తప్పులేదనుకుంటాను. బ్రహ్మకీ సరస్వతికీ ఈ మధ్య తగువు వచ్చి వేరే వేరే వాహనాలు ఏర్పాటు చేసుకుంటే మాత్రం నాకు తెలీదనుకోండి 🙂

  10. “చందమామ” జ్ఞాపకాలు గురించి Ch.Venu అభిప్రాయం:

    05/14/2008 7:47 am

    Dear Sivaram Prasad garu,

    Now Chandamama Old editions are available http://www.chandamama.com. You can find them at ‘Archives’ and download those precious old editions. At last I could see the great illustrations of MTV Acharya garu through this site! How wonderful are they!

    I am greatful to Sri Rohiniprasad for describing about such a great artist.

    — Venu, Hyd.