పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16451

  1. లింకన్ తో ఓ రాత్రి గురించి malathi అభిప్రాయం:

    05/18/2008 7:17 am

    హనుమంతరావు గారూ, నాకు రాధాకృష్ణగారి వ్యాక్యాలు అర్థం కాలేదు కానీ, మీరు చెప్పింది – రచయితలు పాఠకులవిమర్శలని సహృదయతతో స్వీకరించి ఆలోచించుకోవావి అన్నది అర్థం అయింది. ఒప్పుకుంటాను. రచయితలందరితరఫునా నేను వాదించడంలేదు కానీ, నామటుకు నేను నారచయితమిత్రులతో సంప్రదించి మార్పులు చేసుకున్న సందర్బాలున్నాయి.

    బ్రహ్మానందం గారు వెలిబుచ్చిన రెండు అభిప్రాయాలు – రచయితలు తామేదో పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారు అనీ, ఈమాటవారు తమకి వచ్చిన విమర్శనలన్నిటినీ నిష్పక్షపాతంగా ప్రచురిస్తున్నారు అనీ.
    ఈమాట వారు విమర్శలని ప్రచురిస్తారు కానీ కథలకి అలా కాదు. తమ కొలమానాలకి నప్పితేనే వేసుకుంటారు. అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.
    ఇలాటికథలు రాయకండి అని రచయితలకీ, ఇలాటివి వేసుకోకండి అని సంపాదకులకీ చెప్పడం సమంజసమే అనుకునే పాఠకులు తాము పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారేమోనని అనుకోడానికి అవకాశం వుంది కదా,

  2. హిందోళ రాగం – అనుబంధం గురించి Jayasri అభిప్రాయం:

    05/18/2008 5:14 am

    Thanks to the Author & to Eemaata for giving one more informative, interesting piece of article to all music enthu people and students. Links are interesting and enjoyable.
    I wish, before publishing, Editors should filter off unwanted, and useless comments. It would save us [readers’] our time.
    Shaaradaagaru , did I write your point well?

  3. నన్నయ హంసగీతికలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/17/2008 11:24 am

    పాత సాహిత్యాన్ని చదివించడం ఎలా?

    భరద్వాజ గారూ,

    మీ సూచనలకి కృతజ్ఞతలు. మీరు చెప్పిన పుస్తకాలు కొనే శక్తీ, చదవాలనే ఆసక్తీ ఉన్నాయి. కాని అవి చాలవు; చదవాలనే దీక్షా, పట్టుదలా కావాలి! నేను పాత సాహిత్యాన్ని సులభంగా ఆకళింపు చేసుకోలేకపోవడానికి కారణం నా ఇంగ్లీషు చదువు కాదు. నేను ఇటివలి వాణ్ణీ కాదు.

    పదో తరగతిదాకా తెలుగు మీడియం లోనే చదివాను. ఇంటర్ ఇంగ్లీషు మీడియం అయినా తెలుగు కూడా ఒక సబ్జెక్ట్. కాలేజీ చదువుల తర్వాత గత పాతికేళ్ళుగా సాహిత్యపరిచయం తక్కువ. వావిళ్ళా, దేవస్థానం వాళ్ళూ చేస్తున్న కృషి చెప్పుకోదగ్గదే కాని, సామాన్య పాఠకుడు తనంతటతాను మన కావ్యాలు – వ్యాఖ్యానాలున్నా – చదవడం శ్రమతో కోడిన వ్యవహారం అన్నది నాకు అనుభవపూర్వకం.

    అయితే ఎవరైనా సందర్భోచితంగా ఏదన్నా పద్యాన్ని ఉదహరిస్తే, దాని గురించి ఇంకాస్త తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అందుకు స్వానుభవం నుంచి ముచ్చటగా మూడు ఉదాహరణలు :

    1.. ఉప్పల లక్ష్మణరావు రాసిన “అతడు-ఆమె” నవలలో ‘కమ్యూనిస్టు’ చెల్లి అక్కదగ్గర కెళ్ళి పెద్దన మీద ఫిర్యాదు చేస్తుంది – వరూధిని, “నిన్ను వలచి వచ్చాను,” అని ప్రవరుడితో అంటే చులకనయిపోతుందా? అని:

    “అనుటయు మాటలేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
    కనలుచు నీరుదేరు తెలిగన్నుల నాతనిఁ బుల్కుపుల్కునం
    గనుఁగొని మాటలంబొదువుగద్గదికందలయూచి యక్కటా
    వనిత తనంతఁ దా వలచి వచ్చినెఁ జుల్కనగాదె యేరికిన్.”

    నేను మనుచరిత్ర కాస్తయినా చదవడానికి ఇదే కారణం!

    2. తానా 2005 సూవనీర్లో వెలగా వెంకటప్పయ్య వ్యాసం, “తెలుగునాట చదివే అలవాటు పెంచిన గ్రంథాలయోద్యమం,” లో మనరాష్ట్రంలో ప్రస్తుత గ్రంథాలయాల దుస్థితిని వివరిస్తూ ఈ పద్యం ఉదహరించారు. “యుద్ధం ఆపడం నీ చేతిలో ఉంది,” అని ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు హెచ్చరించే సందర్భం:

    “సారపు ధర్మమున్ విమల సత్యము బాపముచేత బొంకుచేఁ
    భారము బొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
    వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని
    స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.”

    “సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే శక్తి కలిగి ఉండి, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికి, సర్వ అనర్థాలకు కారణం అవుతుంది.”

    3. సైన్సూ, సాహిత్యాలలో ప్రతిభావంతుడైన మహీధర నళినీమోహన్ రాసిన “కేలెండర్ కథ” లో మన దేశంలో కాలాన్ని ఎలా విభజించారో విశదపరుస్తూ, క్రీడాభిరామంలో ఇద్దరు మిత్రులు ఓరుగల్లు వీధుల్లో తిరుగుతూ నగర విశేషాలని వర్ణించిన పద్యం ప్రస్తావన ఉంది:

    “ఉడువీథిన్ శిఖరావలంబియగు నంధ్రోర్వీశు మోసాలపై
    గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్ ఘంటా ఘణత్కారముల్
    సడలెన్ భానుడు పశ్చిమంబునకు వైశ్యా! పూటకూటింటికిన్
    కడువుం బోదమె లెక్క యిచ్చి? కడు నాకొన్నార మిప్పట్టునన్.”

    అది చదివి క్రీడాభిరామం ఇంకాస్త చదవాలనే ఆసక్తి పెరిగింది.

    ఈ రీతిన అప్పుడప్పుడు అరా ముక్కా చదివితే ఎన్నేళ్ళకి ఏ కావ్యమైనా గట్టెక్కుతుంది? నిజమే, బహుశా ఇది కావ్య పఠనా మార్గం కాదు. కాని యుక్త వయసులో ఇలా పాత సాహిత్యంతో పరిచయం పెరిగితే కొన్నాళ్ళకి తమంతట తామే చదువుకోగల స్థాయికి చేరుకోవచ్చు. అందుకు తెలుగునాడి లో “రసధుని” శిర్షికా, ఈమాటలో పాత సాహిత్యంపై వచ్చే కొన్ని వ్యాసాలూ సహాయపడతాయి.

    ఇది నేను రాయడానికి కారణం మిమ్మల్ని ఖండించడానికి కాదు; నా అనుభవం మిగిలినవాళ్ళకి కొంత ఉపయోగపడుతుందేమోనని ఆశతో.

    కొడవళ్ళ హనుమంతరావు

  4. లింకన్ తో ఓ రాత్రి గురించి Sowmya అభిప్రాయం:

    05/17/2008 10:10 am

    బ్రహ్మానందం గారు:

    “ఇది తెలుగు సాహిత్యానికి పట్టిన దౌర్భాగ్యం.”

    తెలుగు సాహిత్యానికి మాత్రమే నంటారా?
    నాకు అది ఎక్కడన్నా కనిపించే సహజ గుణమేమో అని అనుమానం.

  5. మదర్స్ డే గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/17/2008 8:55 am

    రవికిరణ్ గారూ,

    కథనంలోని లోపాలకి బాధ్యుడు రచయిత. వాటిని పాత్రకి ఆపాదించడం భావ్యం కాదేమో. దానివలన మన దృష్టి కథ ముఖ్యోద్దేశం మీద కాక వేరే వాటి మీదకి మళ్ళే ప్రమాదం ఉంది.

    సుందరం ముందర మదర్స్ డే అంటే అనుమానంగానో తృణీకారంతోనో చూసినా, ఆరోజు ఎలా గడపాలి అన్న చర్చలో అతని వాదన సవ్యంగానే ఉంది.

    మీకు సుందరం, వరలక్ష్మి, జీవితంలో అనేక సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద చాలా అనుమానాలుండొచ్చు. కాని ఇది కథానిక – ఓ సంఘటన ఆధారంగా ఒక జీవిత కోణంపై వెలుగు చూపే ప్రయత్నం. పాత్రల విస్తార జీవితాన్ని విశ్లేషించడానికి నవల కాదు.

    ఈ మాటల్లో నాకు లింగ వివక్షతతో కూడిన కుటుంబ జీవనంనుంచి స్వేచ్ఛ కన్నా గానుగెద్దు బతుకైపోయిన జీవితంనుంచి వొకరోజు ఆటవిడుపు కోసం తపనే కనిపిస్తుంది.

    బ్రతుకలా తయారుకావడానికి పిల్లల బరువూ, ఇంటి పనీ మగవాడి కంటె ఆడదే ఎక్కువ భరించడాన కాదా? ఈ కథ మనం మదర్స్ డే జరుపుకునే తీరులోని అసంబద్ధతని చూపెడుతున్నా, దీని ప్రాధాన్యత నిత్యజీవితంలో మన ఇంట్లో కళ్ళెదుటే సాగే అసమానత గురించి కాస్తన్నా ఆలోచింపచేయడమే.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. చివరకు మిగిలేది గురించి anand అభిప్రాయం:

    05/16/2008 10:25 am

    చాలా బాగుందండి, మనసుకు హత్తుకుంది. its good.

  7. మదర్స్ డే గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:

    05/16/2008 10:11 am

    హనుమంత రావు గారు,

    మీ అభిప్రాయంతో నేనేకీభవిస్తాను కొంతవరకు, కథాంశం మంచిది అన్న అభిప్రాయంతో సహా. ఐతే రచయిత ఏ వ్యక్తుల్ని బానిస సంబంధాలకి దూరంగా చూపించ దలచుకున్నారో ఆ సుందరం, వరలక్ష్మీ కూడా అవే బానిస సంబంధాల పరిధిలో (కాకపోతే మరి కోచెం మెరుగైన బానిస సంబంధాలు) వున్నారనే నా అభిప్రాయం, నా అభ్యంతరం.

    మీరు చెప్పిన “జీవితాన్ని విమర్శించడం, అలంకరించడం, ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం,” అన్న కుటుంబరావు మాటలు కాదనలేని నిజాలు. ఐతే జీవితం మీద ఆ విమర్శ, అలంకరణలు ఈ కథలో అతి చిన్న పరిధికే పరిమితమైపోయేఏమోనని నా అభిప్రాయం. సుందరం, వరలక్ష్మిలు మిగిలిన వాళ్ళ కన్నా బతుకులో స్వేచ్ఛని తద్వారా వచ్చే సుఖాన్నీ అనుభవిస్తున్నా, వారి స్వేచ్ఛా, సుఖాలు కూడా మరో (సాపేక్షంగా) చిన్న పరిధిలో ఇరుక్కుపోయ్యయని నేననుకుంటున్నాను. వాళ్ళు మిగిలిన వారికన్నా వొకడుగు ముందుకేసి వుండవచ్చు, కానీ ఆ ముందుకేసిన అడుగు వల్ల వాళ్ళకొచ్చిన స్వేచ్ఛ తెచ్చిన ఙ్ఞానం వారిని మరో అడుగు ముందుకేయిపించి, తమ తోటివారిపట్ల మరింత అవగాహనని, సహనాన్ని ఇవ్వడానికి బదులు వారికి మరింత గర్వాన్ని, తమ పరిధిలో లేనివారిపట్ల మరింత త్రుణీకారాన్నీ కలిగించాయని నా అనుమానం.

    సంవత్సరవంతా గౌరవం, భక్తి లేదనేనా మనం ఏడాదికోకసారి స్వాతంత్ర దినాలు, పండగలూ చేసుకుంటున్నాం? “అయినా యేడాదంతా తల్లుల్ని గౌరవించరా ఏమిటీ?” అని అనడంలో తనకు తెలియని వొక జీవన విధానం గూర్చి, తనకు ఏమాత్రం అవగాహనలేని సంఘం గురించి అంత తేలికగా మాట్లాడగలగటం సుందరం అవగాహన పరిధి ఎంత మితవైనదో తెలుస్తుంది. ఆ పరిమితమైన అవగాహనలోంచి వచ్చే స్వేచ్ఛా, సంతోషాల పరిధి ఎంతమాత్రం అనే నా ప్రశ్న.

    ఏడాదిలో వచ్చే వొక ప్రత్యేక దినాన్ని, వొక పండుగని వాళ్ళ, వాళ్ళ దేశ, కాల, జీవనవిధాలననుసరించి జరుపుకోవటం సహజవే కదా! అదికూడా సమాజవంతటికీ ఒకరకంగానే వుండాల్సిన అవసరం లేదు, వాళ్ళ, వాళ్ళ వ్యక్తిగత ఇష్టాఇష్టాలని బట్టికూడా ఎలా గడపడం (పండుగ దినాన్ని) అనేది మార్పు కావచ్చుకదా. ఈ సమాజం పట్ల ఏ మాత్రం అవగాహనలేని సుందరం, వరలక్ష్మిలు, “ ‘మదర్స్ డే’ సెలబ్రేషను అనంటూ, ఆ రోజున మీరు పిల్లలకి దూరంగా, ‘మదర్స్’ లా కాకుండా గడపడం ఏమిటీ? ఇందులో అసలు అర్థమే లేదు” అనడం వాళ్ళ సాధారణ పరిధి దాటిన కానీ మరో చిన్న పరిధికి పరిమితవైన స్వేచ్ఛ ఇచ్చిన ఙ్ఞానం పెంచిన గర్వంగానే నాకు కనపడుతుంది.

    “యేడాదంతా కుటుంబాన్నంటి పెట్టుకునే వుంటాం కదా? ఒక్క రోజు స్వేచ్ఛగా వుంటే తప్పేంటీ?” అంది ఇంకొకావిడ ఘాటుగా. ఇది మనం సాధారణంగా వినే మాటే. కాస్త ఆలోచిస్తే దీంట్లో ఉన్న అమానుషం తెలుస్తుంది. సంవత్సరం పొడుగూతా లేని స్వేచ్ఛ గురించి ఆలోచింపచేస్తుంది.” ఈ మాటల్లో నాకు లింగ వివక్షతతో కూడిన కుటుంబ జీవనంనుంచి స్వేచ్ఛ కన్నా గానుగెద్దు బతుకైపోయిన జీవితంనుంచి వొకరోజు ఆటవిడుపు కోసం తపనే కనిపిస్తుంది. అందుకు సుందరం కూడా వొప్పుకుంటాడు చూడండి సుందరం ఏవంటాడో, “అసలు అది యేడాదిలో ఒక్క రోజే కాకుండా, అప్పుడప్పుడు మీ ఆడ వాళ్ళంతా స్నేహితుల్లాగా కాస్త బయట తిరిగి రావచ్చు. కొంచెం తేడాగా అయినా వుంటుంది.” ఆయన అభ్యంతరవల్లా మదర్స్ డే నాడు తనపరిధిలో తాను నిర్వచించిన విధంగా మిగిలిన వాళ్ళు వుండాలనేదే. అప్పుడప్పుడూ ఆడవాళ్ళు కలసి బయటకు పోయినప్పుడు, మిగిలిన మగవాళ్ళతో కూడి బీరు త్రాగుతూ, అసురుడైవుంటే కోక్ త్రాగుతూ గడపడానికి సుందరాని అభ్యంతరవేవీ లేదని ఈ మాటలవల్ల తెలుస్తూనే వుంది.

    ఎవరో ఏదో పిలిచారని మనకిష్టం లేకపోయినా చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడో ఎక్సెప్షన్ వుంది. సుందరం ఈ దేశానికి క్రొత్త, పెద్ద పరిచాయాలున్నట్టు లేవు. మదర్స్ డేని ఫలాని విధంగానే గడపాలనే సెన్టిమెన్టల్ అటాచ్మెంట్లేవీ లేవు సుందరానికి (మదర్స్ డే అంటేనే తెలియదు కదా). తనని గుర్తు పెట్టుకుని, తనని పిలచిన తన స్నేహితుల పిలుపుని తిరస్కరించడంలోనూ, వారిపై పిడివాదపు మాటల్తో తన అధిక్యాన్ని ప్రదర్శించటంలోనూ సుందరం ఏమాత్రం సందేహించలేదు. పోనీ ఈ విషయంలో కనీసం వరలక్ష్మి అభిప్రాయం ముందర తెలుసుకునే ప్రయత్నవైనా చెయ్యలేదు. వరలక్ష్మి సుందరంతో అంగీకరించింది కదా అనిమీరు అనవచ్చేవో. కానీ నాకు వరలక్ష్మి, మొగుళ్ళ ప్రతి ప్రవర్తననీ సమర్ధించే, ఎది కోల్పోయావో తెలుసుకోలేని పతివ్రతల బాటలోనే నడిచిందని నా అభిప్రాయం. మీరన్నట్లు “స్వేచ్ఛాలేమిలో వుండే (ఆత్మవంచనవల్ల కలిగే) సుఖం” వరలక్ష్మికి కూడా అనుభవమేమో నని నా అనుమానం. అందుకు ప్రతిగా సుందరం కూడా ఇంకా గాడిద బరువు మోస్తున్నాడని అనొచ్చేవో. అంట్లు తోవడం, వంట చెయ్యడవనే సాధారణ పనుల్లో సుందరం వరలక్ష్మికి చేయందించ గలిగేడేవో కానీ, మానవ జీవన సంబంధాల్లో, వంట చెయ్యడం రాదనే తన స్నేహితుడికన్న సుందరం ఏవంత సుందరవైన వాడు కాదనిపిస్తుంది.

    The engine that drives the understanding of the change (biological, social, economical) is an open mind, but the arrogance that was created in the process of that understanding becomes an impediment, incrementally closing the very requirement to understand and assimilate change. మన సుందరం కూడా అదేవిధవైన గోడల్ని తన చుట్టూ కట్టుకున్నాడని నా అభిప్రాయం.

    ఇంతెందుకు వ్రాయాల్సొచ్చిందీ కథమీద. బహుశా ఈ అభిప్రాయం వ్రాయకపోయుందునేవో, రచయిత ఆ ఆఖరుపేరాలో సుందరాన్ని తన స్నేహితులతో పోల్చి చూపకపోతే. ఆ పేరాలో సుందరాన్ని ఆకాశానికెత్తి, స్నేహితుల్ని పాతాళానికి త్రొక్కకపోతే. కథని ఒక కరపత్రంగా మార్చకపోతే.

  8. హిందోళ రాగం – అనుబంధం గురించి Patakudu అభిప్రాయం:

    05/16/2008 7:37 am

    As a reader I want these discussions to be more productive and enlightening . But unfortunately it looks like some of the comments are emanating from ego. They appear to be made just for the sake of embarrasing the writers. I sincerely thank Eemaata and Rohini Prasad garu for publishing the good articles on Ragas. These are very useful for the people like me who have limited knowledge on Classical Music.

  9. మదర్స్ డే గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/15/2008 11:13 pm

    ఆలోచించాల్సిన విషయం

    కొన్ని సంభాషణలు ఉపన్యాసాలుగా, కొంత కథనం ఉపదేశంగా ఉండి కథకు కాస్త లోపం వచ్చినా, భూషణ్ గారన్నట్లు కథాంశం మంచిది. “జీవితాన్ని విమర్శించడం, అలంకరించడం, ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం,” అన్న కుటుంబరావు మాటలు గుర్తొచాయి.

    “యేడాదంతా కుటుంబాన్నంటి పెట్టుకునే వుంటాం కదా? ఒక్క రోజు స్వేచ్ఛగా వుంటే తప్పేంటీ?” అంది ఇంకొకావిడ ఘాటుగా.

    ఇది మనం సాధారణంగా వినే మాటే. కాస్త ఆలోచిస్తే దీంట్లో ఉన్న అమానుషం తెలుస్తుంది. సంవత్సరం పొడుగూతా లేని స్వేచ్ఛ గురించి ఆలోచింపచేస్తుంది.

    “స్వేచ్ఛాలేమిలో వుండే (ఆత్మవంచనవల్ల కలిగే) సుఖం మరిగితే స్వేచ్ఛలో వుండే తృప్తి వో పట్టాన రుచించదు. ఆస్తిలోనూ, అధికారంలోనూ, విద్యలోనూ, వృత్తిలోనూ, సాంఘిక పరిగణనలోనూ చారిత్రకంగా విహితమైన జాతికి మానసికంగానూ శారీరకంగానూ సామర్థ్యం లేకపోవడం సహజమేగానీ; అనివార్యం కాదు.

    ఆడది అన్నింటా తనతో ఆచరణలో సరిసమానమైతే యెన్ని బరువులూ బాధ్యతలూ తప్పుతాయో తెలుసుకోలేని మూర్ఖుడు మగ వెధవ. మరి దురహంకార అధికార పదవీ వ్యామోహం ఆపైన చెల్లిచావదే! అందుగ్గాను మూర్ఖంగా గాడిద బరువు మొయ్యటానికి సిద్ధపడతాడు.”

    అంటూ ఓ రెండు పేజీల అగ్నికణాన్ని వదిలాడు వడ్డెర చండీదాస్. 1982 ఆంధ్రజ్యోతి వారపత్రిక ఉగాది ప్రత్యేక సంచికలో, “అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో” పేరిట . “చీకట్లోంచి చీకట్లోకి” కథా సంపుటి చివర “యీ కథానగ్నిక” పేరుతో అందుబాటులో ఉంది. చదవదగ్గది

    కొడవళ్ళ హనుమంతరావు

  10. లింకన్ తో ఓ రాత్రి గురించి Sai Brahamanandam Gorti అభిప్రాయం:

    05/15/2008 10:41 pm

    సౌమ్య గారూ,

    కాకి పిల్ల కాకికి ముద్దు అన్న చందంగా ఎవరి రచన వారికి బాగుంటుంది. బాగోలేదనే సరికే అసలు గొడవ ప్రారంభం అవుతుంది. అన్నవాళ్ళని తక్కువగా చూడ్డం, మీరు చెప్పినట్లు అభిమానులు గుడ్డిగా వంత పాడ్డం ఇవన్నీ తెలుగు సాహిత్యానికి మంచిని చేయలేవు. విమర్శకీ, కువిమర్శకీ తేడా తెలియని రచయితలే ఎక్కువ. మంచి విమర్శ వల్ల కొత్త విషయాలూ, కనిపించని కోణాలూ వెలుగులోకి వస్తాయన్న అవగాహన రచయితల్లో కొరవడింది. ఇది తెలుగు సాహిత్యానికి పట్టిన దౌర్భాగ్యం. ఏం చేస్తాం? ఇది మాత్రం మింగుడుపడని వాస్తవం.

    చాలా పత్రికలు బాగోలేదని విమర్శ రాసినా వేయవు. ఈ విషయంలో ఈమాట ఒక్కటే మినహాయింపు.

    -సాయి బ్రహ్మానందం గొర్తి