పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. ప్రతీకగా శరీరం గురించి Saikrishna అభిప్రాయం:

    06/16/2008 12:25 am

    మీ వ్యాసం చాలా బాగుంది. ఉదాహరణం గా ఇచ్చిన అన్నమయ్య పద్యం అద్భుతం .. మీకు ధన్యవాదాలు ఎలా తెల్పాలో తెలియటం లేదు.

    భవదీయుడు,
    సాయిక్రిష్ణ

  2. లింకన్ తో ఓ రాత్రి గురించి B.Srikanth అభిప్రాయం:

    06/14/2008 12:07 am

    కధ బాగుంది. సరదాగా ఉంది.

  3. వ్యవహారిక భాషా వికాసం గురించి రాజేంద్ర అభిప్రాయం:

    06/13/2008 10:57 am

    మా మాష్టారి వ్యాసం ఆయన చాయాచిత్రంతో సహా — ఆహా ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు

  4. బ్లాగుల గురించి – నా మాట గురించి satyanand అభిప్రాయం:

    06/12/2008 10:01 am

    ఏదెమైనీగానీ నాకీమద్యన ఒక విషయం బోధపడింది. మన తెలుగువారు కూడా బ్లాగుతున్నారని. ఎందుకంటె నాకు ఇంతవరకూ తెలుగులో కూడా బ్లాగ్ రాయగలమనే విషయం తెలియదు. ఇక నేను కూడ బ్లాగుతాను.

  5. ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి Lyla yerneni అభిప్రాయం:

    06/12/2008 9:55 am

    ఈనాటి భాషాసమస్యలకు, కొంత శాస్త్ర విశ్లేషణతో, పరిష్కారాల కోసం అన్వేషించే వ్యాసాలను రాబట్టగలిగితే ఈ ప్రత్యేక సంచికకు సాఫల్యత సిద్ధించినట్టే.

    ఈ నాటి భాషా సమస్యలేమిటో గుర్తించబడ్డాయని అర్థం చేసుకోవాలా?
    గుర్తించబడితే ఆ జాబితా ఇస్తారా?
    ఇస్తే,

    1. ఇవి సమస్యలే కావు. ఇవీ మా ఉద్దేశంలో అసలైన సమస్యలు – అని కొన్ని వ్యాసాలు రావచ్చు.
    2. సమస్యలు గుర్తించి చెబితే, వాటికి పరిష్కారం సూచించే వ్యాసాలు భాషా శాస్త్రంతో మాత్రమే పరిచయం కాకుండా, ఇతర రంగాలలో పని చేసిన , చేస్తున్న వారినుండి కూడా రావచ్చు.
    3. చరిత్రతో సంబంధంలేకుండా, అంటే బూదరాజు ఎవరో, గిడుగు రామ్మూర్తి ఎవరో ఏమాత్రం తెలియకుండానే, వారి పాత ఆలోచనలు తమ ప్రస్తుత మేధాశక్తిని మబ్బుకమ్మించడం ఇష్టపడని వాళ్ళు -అప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో, వాళ్ళూ రాయవచ్చు.
    4. మనకున్న పరికరాలూ అవకాశాలు ఎంతో మారిపోయాయి. మన మేథ, మన ఇష్టమైన గురువుగారి మేథస్సును ఎప్పుడో దాటిపోయిందని గుర్తిస్తే, అప్పుడు, రోజూ రెండడుగులు వెనక్కు వేసి, మూడడుగులు ముందుకు వేసే బదులు, ఆ వేసే అడుగులు ముందుకే వేస్తే, మంచి ఫలితాలు మనమే త్వరితంగా సాధించగలం; ఇప్పటి మహోన్నతులు, మహారాజశ్రీలు – ఇంకొకరికి అర్జీ పెట్టే పనిలేదు.

    అని
    గమనిస్తారేమోనని
    ఈ మనవి.

    లైలా.

  6. ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి Kameswara Rao అభిప్రాయం:

    06/12/2008 9:49 am

    అసలీ ఉద్యమం మొదలయ్యింది పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమై. మన అదృష్టమో, దురదృష్టమో అది దారితప్పి చిలికిచిలికి గాలివానయ్యింది! ఏది గ్రాంధికభాష, ఏది గ్రామ్యము అన్న వాదాలే పెరిగిపోయాయి. చిన్నయ్యసూరి వ్యాకరించినది తప్ప తక్కినదంతా గ్రామ్యమే అని కొందరు వాదిస్తే, నన్నయాదులు కూడా వాళ్ళకాలంలోని శిష్టవ్యావహారికాన్నే వాడేరని కొందరు నిరూపించడానికి ప్రయత్నించారు. బాలవ్యాకరణమే శిరోధార్యమని కొందరంటే, అసలు వ్యాకరణమే అక్కరలేదని కొందరన్నారు! పులిమీద పుట్రలా గ్రాంధికభాష కృతకభాష అని మరో వాదన. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి.

    ఇవేవీ ఎవరూ సంయమనంతో శాస్త్రదృష్టితో చేసిన వాదనలు కావని యిప్పుడు మనం చదివితే అనిపిస్తుంది. అసలు వ్యావహారిక భాషా స్వరూపం ఏమిటి, అది యేయే సందర్భాలలో, యేవిధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించిన సందర్భాలు చాలా తక్కువ.

    మధ్యే మార్గంలో కనిపించేది ప్రథానంగా కందుకూరి వారే. తర్వాతి కాలంలో పాతకొత్తల మేలికలయిక అన్నమార్గం ఎక్కువగా భావకవులలో కనిపిస్తుంది. తిరుపతి వేంకటకవులు కూడా వీరగ్రాంథిక వాదాన్ని తిరస్కరించి అప్పటికున్న శిష్టవ్యావహారికంలో కవిత్వం రాసినవారే. వ్యాకరణాన్ని తిరస్కరించకుండా, తెలుగుకి ఉన్న వ్యాకరణదీపం చిన్నదని, దాన్ని విస్తృతపరచాలనీ అన్నది ఆ కాలంలో నాకు తెలిసీ ఒక్క చెళ్ళపిళ్ళవారే!

    వచ్చిన చిక్కల్లా ఇలాటి మధ్యేమార్గస్తులు ఇరుపక్షాలవారికీ విరోధులయ్యారు!

    ఇంతకీ ఇప్పటి మన ప్రస్తుతకర్తవ్యం, ఈ కిందవాటి గురించి ఆలోచించడం:

    1. మనకి ప్రామాణిక భాష అవసరమా, సాధ్యమా? అయితే దాని స్వరూపం ఏమిటి? ఏ సందర్భాలలో అది వాడాలి? ఏ సందర్భాలలో అవసరం లేదు?
    2. మన ప్రాచీన కావ్యభాష ఎవరికి, ఎందుకు, ఎంతవరకూ రావాలి?

  7. వ్యవహారిక భాషా వికాసం గురించి Kameswara Rao అభిప్రాయం:

    06/12/2008 8:56 am

    విద్యావసతులు ఇప్పుడు మునపటిలాగా ఏ కొందరికో పరిమితంకావు కాబట్టి సామూహిక విద్యాసౌకర్యాలకు కావ్యభాష ఉపయోగించదు.

    ఇది గ్రాంధికమో వ్యావహారికమో తెలీదు కాని నాకు మాత్రం మింగుడు పడకుండా ఉంది!

  8. శబ్ద తరంగాలు గురించి P.Anjani Kumar అభిప్రాయం:

    06/11/2008 1:23 am

    ఆత్యద్భుతం. మీరు తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవ ఆకట్టుకొంటుంది

  9. ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    06/09/2008 12:38 pm

    @అక్కిరాజు – చరిత్రకారులెప్పుడూ తమ, తమ వర్తమాన పరిస్థితులు, అవసరాలు, ఆసక్తులనుగుణంగా పూర్వ చరిత్రను పాక్షికంగానే చిత్రిస్తారని కొంతమంది చారిత్రక తత్వవేత్తల సిద్ధాంతం[1]. అంటే, ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రతి కొత్త తరం వారు వారి వారి దృక్పథాలకనుగుణంగా పాత చరిత్రను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట. ఉదాహరణకు, బూదరాజు రాసిన వ్యావహారికోద్యమ చరిత్ర వ్యాసం, 1910-20ల నాటి వ్యవహారికోద్యమం గురించి ఎంత చెబుతుందో, ఆ వ్యాసం రాసిన 1970 కాలం నాటి అవసరాలు, ఆసక్తులగురించి, ఆ రోజుల్లో బూదరాజు గారిని ఉత్తేజపరిచిన, ఉద్రేకపరిచిన ఆలోచనల గురించి కూడా చెప్పకనే చెబుతుంది (And Būdarāju is such a colorful writer!).

    వాడుక భాష, మాండలిక భాష, రచనా భాష, ప్రామాణిక భాష అన్న అంశాలపై ఈ మధ్య కాలంలో కొంత చర్చ జరుగుతున్నది. ఈ చర్చల నేపథ్యంలో వ్యవహారిక-గ్రాంధిక వాదాలను పునఃసమీక్షిస్తూ, ఈనాటి భాషాసమస్యలకు, కొంత శాస్త్ర విశ్లేషణతో, పరిష్కారాల కోసం అన్వేషించే వ్యాసాలను రాబట్టగలిగితే ఈ ప్రత్యేక సంచికకు సాఫల్యత సిద్ధించినట్టే.

    గ్రాంథిక వాదులు లేవనెత్తిన ప్రశ్నలకు వ్యవహారిక వాదుల సమాధానాలు కొన్నింటిని ఈ వారం అందిస్తున్నాము. వచ్చే సోమవారం మరికొన్ని ప్రముఖుల వ్యాసాలు అందజేస్తాము. గ్రాంథిక-వ్యవహారిక భాషా వాదాలకు సంబంధించిన రచనలను వివరించే ఒక వ్యాఖ్యాన సహిత గ్రంథసూచిక (annotated bibliography) ను శ్రీనివాస్ పరుచూరి గారు తయారుచేస్తున్నారు (అక్కిరాజు రమాపతిరాజు గారి గ్రాంథిక-వ్యవహారిక వాద సూచిక ఆధారంగా). ఇవేకాక, ఈ సంచిక కోసం ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను కూడా వచ్చే వారం అందిస్తాము. వ్యవధి తక్కువైనా, వాసి తగ్గని వ్యాసాలు రాసి పంపిన రచయితలకు మా అభివందనాలు.

    రిగార్డులతో,
    సురేశ్.

    [1]The philosophy of history: A Re-examination By William Sweet
    some have argued that what we identify as ‘past’ is determined by present interests – that the past is largely a reflection of the present [p. 15] historical testimony doesn’t stand as a fact on its own, but must be evaluated from the perspective of a historian [p. 9].

  10. వ్యవహారిక భాషా ఉద్యమంపై ఈమాట ప్రత్యేక సంచిక గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    06/09/2008 12:36 pm

    రెండు వారాల వ్యవధి ఇచ్చి రాయమంటే ఎలాగండీ!

    వేమూరి గారికి, ఇతర రచయితలకు:

    మీరు మీ వ్యాసాన్ని గడువు తేదీలోగా పూర్తిచెయ్యలేక పోతే జులై సంచికకు గాని, ఆ పై సంచికకు గాని పంపగలరని మనవి. ప్రత్యేక సంచికకు ఇంత తక్కువ వ్యవధి ఇచ్చినందుకు మా క్షమాపణలు.

    అభివాదములతో,
    సురేశ్.