పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. చాదస్తం గురించి Bhushan అభిప్రాయం:

    06/27/2008 10:19 pm

    కథ నాకు బాగా నచ్చింది. ఎటొచ్చీ కామేశ్వర్రావుగారి అభిప్రాయం్ “ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు” – ఆవిడ జీవితం మాత్రమే కాదు, ఆవిడ భర్త జీవితం ఈవిడతో ముడిపడలేదా? ఆవిడ స్నేహాలు తన భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని ఆలోచించే మనిషి, తన భర్త స్నేహాలు కూడా తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని అనుకోదా? అది అహంభావమా? ఆత్మోన్నతా ?

    రంగనాయకమ్మగారు తన పేరు ముందు ఇంటి పేరు వొదిలేసి చాలా కాలమైంది. ఈ విషయం రచయిత్రి తన ఒకానొక వ్యాసంలో కూడా చెప్పారు.

  2. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    06/27/2008 6:49 pm

    శ్రీనివాస్ గారూ
    మీ కొటేషన్ గుర్తులు గమనించాను కానీ కాస్త ఆంబిగ్యుటీ ఉన్నట్లనిపించి, పై అభిప్రాయం పోస్ట్ చేసాను. ఆంగ్లంలో వాడే sic లాంటి పదాలు తెలుగులో ఉన్నాయా? సృష్టించుకోవాలా?
    మీ
    శ్రీనివాస్

  3. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    06/27/2008 12:15 pm

    శ్రీనివాస్ గారు,

    మీరు చెప్పినట్లు జార్జ్ ఇలియట్ అనేది Mary Ann (Marian) Evans అన్న రచయిత్రి మారుపేరే!
    కాకపోతే ఆ వాక్యం నాది కాదు. “విజయచిత్ర” సంచికలోనుండి ఉన్నదున్నట్లుగా కోట్ చేసాను. అందువల్లే ఆ వాక్యం మొదట్లో, చివరిలో ” గుర్తులు :-). ఏదైనా ఆ పత్రికలోని తప్పుని (తెలిసికూడా) సరిదిద్దక పోవడం నా తప్పే. క్షంతవ్యుణ్ణి!

    మహేష్ కుమార్ గారు: “స్వర్గసీమ”కు షా నవల స్ఫూర్తి అన్నది ఆ సినిమా తీసిన పెద్ద మనిషే చెప్పారు. నేను కూడా “కొంత” పోలిక వుందనే నమ్ముతాను. మీ యీ వాక్యంతో
    “ఇది ఒక కుటుంబాన్ని ముక్కలుచేసే పడతి కథ కదా!” మాత్రం అంగీకరించలేను. దానిపైన మరోచోటెక్కడైనా మాట్లాడుకుందామ్.

    పరుచూరి శ్రీనివాస్

  4. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    06/27/2008 9:24 am

    శ్రీనివాస్ గారూ

    “ఈ చిత్రంలో ఎస్‌.వి. రంగారావు నటనను,లండన్‌లో చూసిన చార్లీ చాప్లిన్‌, ఇలియట్‌ “బ్రతికి వుంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు” అని రాసారు. చిన్నప్పుడు, Mill on the Floss నుంచి ఓ సంఘటనని పాఠంగా చదువుకున్నాము మేము. Silas Marner, ఇంకా Mill on the Floss రాసిన జార్జ్ ఇలియట్ నిజానికి Mary Evans అనే పేరు గల రచయిత్రి కదా!

    శ్రీనివాస్

  5. ప్రతీకగా శరీరం గురించి bollojubaba అభిప్రాయం:

    06/27/2008 8:28 am

    మంచి వ్యాసం. పరిచయం చేసిన పద్యాలు అద్భుతాలు. మూడు కవితలు మూడు ప్రపంచాలకు ప్రతినిధులు. ఒకటి ఆధ్యాత్మికత, రెండు అధివాస్తవికత, మూడు భావుకత. మూడూ హృదయంలోని భిన్న నాడులను స్పందింపచేసేవే.
    ఇంతకంటే మాటలు రావటం లేదు.

  6. ట్రాఫిక్ సిగ్నల్ – A Twenty first century love story గురించి narish అభిప్రాయం:

    06/27/2008 1:03 am

    చాలా బావుంది.

  7. నువ్వు నాకొద్దు గురించి నెటిజన్ అభిప్రాయం:

    06/26/2008 9:49 pm

    కొత్తపాళీ గారి బ్లాగునుండి ఇక్కడకు చేరడం జరిగింది.
    వైద్యులకి empathy కూడ ఉండాలి.
    దురదృష్టం చాల మందికి అది ఉండదు.
    కధలో నిషి దానిని ఎలా ఆచరించిందో చక్కగా చెప్పారు.

  8. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    06/25/2008 9:07 pm

    హనుమంతరావుగారూ, ఎంత మాటన్నారు! 🙂
    ఏపీవీక్లీలో గత నాలుగేళ్ళకు పైగా వారానికో సైన్సు వ్యాసం చొప్పున రాస్తున్నాను. నా మొత్తం వ్యాసాల సంఖ్య 300 పైనే ఉంటుందేమో. ‘ఇంకా’ రాయమనడం భావ్యమా?!
    ‘బహుముఖప్రజ్ఞ’ మాట ఎలా ఉన్నా నలుగురికీ పనికొచ్చే విషయాల గురించి సులువైన పద్ధతిలో ఎవరు రాసినా మంచిదే.
    నిజానికి నాకున్న తక్కువ వ్యవధివల్లనే మీ వ్యాసాలన్నీ చదివి తాపీగా అభిప్రాయం రాయలేకపోతున్నాను. ఈమధ్యనే జనసాహితివాళ్ళు నా 53 వ్యాసాల సంకలనం ఒకటి విడుదల చేశారు. మీవంటివారు తేలిక భాషలో ఎన్ని పత్రికల్లో సమాచారాన్ని అందించగలిగితే అంత మంచిది. మన రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడకం చాలా తక్కువగా కనబడింది. మహా అయితే ఈ మెయిల్స్ చదువుతారేమో. అందుచేత తెలుగులో అచ్చయే పత్రికలని మనం మరిచిపోకూడదు.

  9. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    06/25/2008 8:32 pm

    స్వర్గసీమకు షా ‘పిగ్మెలియన్’ స్ఫూర్తా… కథా వస్తువులో పోలికెక్కడుందబ్బా? తను సృష్టించిన (తీర్చిదిద్దిన) ఎలైజా డూలిటిల్ తో ప్రేమలో పడే ప్రొఫెసర్ కథ అది.. ఇది ఒక కుటుంబాన్ని ముక్కలుచేసే పడతి కథ కదా!

  10. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    06/25/2008 1:35 pm

    రోహిణీప్రసాద్ గారు: దేవత (1941), స్వర్గసీమ (1945) సినిమాలు వాణిజ్యపరంగా కూడా విజయం సాధించినవే. ఆ మాటకొస్తే “రంగులరాట్నం” కంటే కూడా!

    ఎల్.వి. ప్రసాద్ కూడా హెచ్.ఎం.రెడ్డినుండి దూరంగా వచ్చేసినట్లు మీరనటానికి ఆధారేలేమయినా వున్నాయా! నిజానికి వారిద్దరూ 1931 నుండి (ఇంకా బొంబాయిలో యింకా కొంచెం ముందునుండే) 1942 వరకు కలిసి పని చేశారు (చివరిగా తెనాలి రామకృష్ణ-41, ఘరానా దొంగ-42). 1943-1951 ల మధ్యలో HM సినిమా రంగానికి దూరంగా వున్నాడు. చివరిలో తీసిన నిర్దోషి (1951), ప్రతిజ్ఞ (1953) గురించి గొప్పగా చెప్పుకోవలసినదేమీ లేదు.

    “ఓహో పావురమా” పాట గురించి యిదే పత్రికలో రజని గారిపైన రాసిన వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. ఆ పాటపైన యెప్పటికైనా ఒక చిన్న సైజు వ్యాసం రాసే ఆలోచనొకటుంది.

    సుగాత్రి గారు విజయా సంస్థకి వాహిని మాతృసంస్థ అన్నారు. ఎలాగవుతుందో అర్థం కాలేదు. “విజయ” నాగిరెడ్డి, చక్రపాణుల సంస్థ. వాళ్ళకీ B.Nకి ఆలోచనా పరంగా (/వ్యాపారపరంగా) పొత్తు కుదర(లే)దు. నా దృష్టిలో పెద్దాయన తమ్ముడి సంస్థకి సినిమా తీయకపోవడం విషాదమేమీ కాదు!

    చక్రపాణి “స్వర్గసీమ”కు నాలుగు సంవత్సరాల ముందే “ధర్మపత్ని” కి (1941, ANR మొదటి సినిమా) పని చేసారు.

    “మల్లీశ్వరి” సినిమా కథకు ఆధారాలు/ప్రేరణపైన 2-3 సంవత్సరాల క్రితం “నవ్య” వారపత్రికలో చాలా మంచి చర్చ జరిగింది. ఈ సందర్భంలో శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు, శివరాజు సుబ్బలక్ష్మి గారు (బుచ్చిబాబు గారి భార్య) ఎంతో విలువైన సమాచారం అందించడం జరిగింది. రజని గారి మొదటి వ్యాసం ముందు కాసింత వేడి పుట్టించినా చర్చ చాలా శాంతియుతమైన వాతావరణంలో 🙂 జరిగింది.

    భవదీయుడు,
    శ్రీనివాస్
    P.S.”కర్పూరవసంతరాయలు” సినిమాగా తీద్దామనుకున్నారా! ఈ విషయం నాకు తెలియదు. ఏమైనా అదృష్టవంతులం , అది విడుదల కానందులకు 🙂