వ్యాసం పేరు నాకూ అంత నచ్చలేదు. Deadline దృష్ట్యా రాసేసి పంపాను. అయితే ఇప్పటికీ ఇంతకన్నా మంచి శీర్షిక నాకు తట్టలేదు. (కథల, పాత్ర పేర్ల విషయంలో మా నాన్నగారికి కూడా అంత పట్టింపు ఉండేది కాదు!)
యవ్వనమే గొప్పదని నేననను కాని అది మనం ఎన్నుకున్న మార్గంలో క్రియాశీలంగా ఉండేందుకు అనువైన వయసు. ఇక్కడ నేను ఉద్దేశించినది మానసిక యవ్వనమే అని తెలుస్తూనే ఉంది కదా. ఎంత అనుభవం ఉన్నప్పటికీ కొత్తవి తెలుసుకోవాలనే కుతూహలం ఉండడం ఆ వయసులో అరుదైన విషయం.
వ్యాసంలో విషయాలు చక్కగానే వున్నాయి గానీ, వ్యాసం పేరే బాగోలేదు.
“88 ఏళ్ళ యువకులూ”, “22 ఏళ్ళ వృద్ధులూ” లాంటి పేర్లని వాడడం వల్ల, మనం ఏం చెబుతున్నామంటే, “యువకులు గొప్ప అనీ, వృద్ధులు పనికిరాని వార”నీ. మన వుద్దేశ్యం ఇది కాకపోయినా, ఇటువంటి పేర్ల వల్ల అటువంటి అర్థాలే వస్తాయి. వృద్ధాప్యాన్ని తక్కువ చెయ్యడమూ, యవ్వనాన్ని గొప్ప చెయ్యడమూ అవుతుంది. ఏ వయసు లక్షణాలు ఆ వయసు కుంటాయి? ఒకదానితో ఒకటి పోల్చి, వేరే దాన్ని కించపరచడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి దయచేసి.
ఆ పత్రికల మాదిరిగానే ఈమాట వారు కూడా అచ్చుతప్పులు పట్టుకోవడం లేదు. విలేకరి ఏమిటండి? విలేఖరి అని వ్రాయాలిగాని. తెలుగు పత్రికల్లో ఈ మధ్య క-ఖ తికమక బాగా పెరిగింది.
[విలేకరి, విలేఖరి అన్న పదాలలో ఏది సరైనదో నిర్ణయించడం అంత సులభం కాదు. -అరి అన్న తెలుగు ప్రత్యయాన్ని సుంకరి, కుమ్మరి, కమ్మరి మొ॥ తెలుగు పదాల్లో వాడితే, -కర/కరి /కార అన్న సంస్కృత ప్రత్యయాలను సుధాకర, అహంకారి మొ॥ సంస్కృత ప్రత్యయాల్లో వాడుతాము. అంటే లెక్క ప్రకారం విలేఖ(సంస్కృతం) లను సృష్టించే వాడు విలేఖకరుడు, విలేఖకరి అవ్వాలి. అయితే, రెండు సన్నిహిత ధ్వనులు పక్కపక్కనే ఉన్నప్పుడు, రెండు ధ్వనులకు మారుగా ఒక్క ధ్వనిని మాత్రమే పలకడం అన్ని భాషలలో జరిగే ధ్వని పరిణామమే (ఈ ధ్వని పరిణామాన్ని సదృశ వర్ణలోపం (Haplology) అని అంటారు). ఈరకమైన ధ్వని పరిణామం వలన విలేఖకరి అన్న పదం విలేఖరి/విలేకరి గా మారిందని చెప్పుకోవచ్చు. బూదరాజు గారెప్పుడూ విలేకరి అనే రాసేవారు – సం.]
కధ బాగానే వుంది.
కధలో తల్లితండ్రులు సరిగానే వున్నారు.
“ఇదంతా విన్నా వాడి నాన్నకి ఏమీ పట్టలేదు. ఫెళ్ళున ఒక్క నవ్వు నవ్వీసేడు” అని రచయిత రాయడం సరిగా లేదు. పిల్లాడు తన బాధలో అలా అనుకుంటే ఫరవాలేదు గానీ, రచయిత తండ్రి పాత్ర గురించి “ఏమీ పట్టలేదు” అని రాయడం సరి కాదు. తండ్రి బాధ్యతా పూర్వకంగానే వున్నాడు ఈ కధలో.
చాలా చోట్ల డ్రామా ఎక్కువైంది. టీచరూ, హెడ్ మాస్టరూ, ఇనస్పెక్టరూ – వీళ్ళ పాత్ర చిత్రణ అస్సలు సరిగా లేదు.
పిల్లాడి తల్లితండ్రుల పాత్ర చిత్రణ బాగుంది.
డ్రామా సన్నివేశాల వల్ల కధ సహజత్వానికి దూరంగానూ, అసహజత్వానికి దగ్గర గానూ అయింది.
కధలో విషయం మాత్రం మంచిది. మొత్తానికి బాగానే వుంది.
అద్భుతవయిన అసంపూర్తి కవితలా వుంది.
మనలో, మనతో నిత్యం ప్రయాణించేవి మననుంచి వేరెలా అవుతాయి? ఎందుకవుతాయి?
చివరి రెండు పంక్తులు అస్పష్టంగా వున్నాయి, ఊపున్నా సరే.
అవి లేకపోతే, చక్కని అక్షరాంజలి.
“మహాకవి…….వొదిగిపోయే ఈ అక్షరాలు” కోటబుల్ కోట్సు.
బహుశా, “మనలో ఒకటై..”పడ్డ తరవాత పధ్ధతికలవాటు పడిపోయిన కవితా స్రవంతి లా అనిపిస్తోంది.
అలాటి అలవాట్లే వదిలించుకోవాలి.
మీ కవిత్వం లో ఇలాటివి ఎక్కువ. మంచివి కావేమో?
చిన్నప్పుడు చూసిన పులి మళ్ళీ స్క్రీను మీద “డేంచాడీసింది”
అమరావతి కథ గుర్తొచ్చింది.
“విజినారం” గుర్తొచ్చింది.
మొన్న వేసవి సెలవలకి విజయనగరం వెళ్ళిన మా అయిదేళ్ళబ్బయి, మొదటి సారిగపులివేషం చూసి, నా చిన్నప్పుడు నాలాగే, భయపడిపోయి దాన్నిఎంత ఎగ్జైటింగా చెప్పేడంటే, మీ కవితలో మొదటి సగంలాగే.
అయితే, ఇలాటి కవితలు “టుమ్రీల్లాటివి”. కచేరీ లొ లాస్టులొ పాడేవి.
మీరింకా అసలు కచేరీ మొదలెట్టేరా కిరణు?
నాకు వివరాలు సరిగ్గా తెలియవుగాని కొన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పుస్తకాలూ వగైరాలున్నాయని విన్నాను. వాటితో బాటుగా ఆడియో బుక్స్ జాబితాలో సంగీతరావుగారి సీడీ చేర్చదగినది అని నా ఉద్దేశం. రికమెండ్ చెయ్యగలిగినవారు దాన్ని (గై) కొని, విని సిఫార్సు చెయ్యగలరు.
Thank you, Rohini prasadgaru, for an interesting article. There is no doubt that the present music scenario misses such great personalities. It is the duty of the telugu organizations to make the present generation, aware of such ‘culture’ful music, as you rightly pointed out in another article.
88 ఏళ్ళ యువకులు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/07/2008 5:54 pm

88 ఏళ్ళ యువకులు గురించి Reader అభిప్రాయం:
07/07/2008 10:37 am
వ్యాసంలో విషయాలు చక్కగానే వున్నాయి గానీ, వ్యాసం పేరే బాగోలేదు.
“88 ఏళ్ళ యువకులూ”, “22 ఏళ్ళ వృద్ధులూ” లాంటి పేర్లని వాడడం వల్ల, మనం ఏం చెబుతున్నామంటే, “యువకులు గొప్ప అనీ, వృద్ధులు పనికిరాని వార”నీ. మన వుద్దేశ్యం ఇది కాకపోయినా, ఇటువంటి పేర్ల వల్ల అటువంటి అర్థాలే వస్తాయి. వృద్ధాప్యాన్ని తక్కువ చెయ్యడమూ, యవ్వనాన్ని గొప్ప చెయ్యడమూ అవుతుంది. ఏ వయసు లక్షణాలు ఆ వయసు కుంటాయి? ఒకదానితో ఒకటి పోల్చి, వేరే దాన్ని కించపరచడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి దయచేసి.
రచయితలకు సూచనలు గురించి Saisahithi అభిప్రాయం:
07/07/2008 8:33 am
అందరికి నమస్కారములు,
మీ పత్రిక చాలా బాగుంది. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న మీకృషి
అధ్భుతంగా ఉంది.
స్పందన: పత్రికా ప్రభుతా మనం గురించి కిరణ్ అభిప్రాయం:
07/07/2008 6:56 am
ఆ పత్రికల మాదిరిగానే ఈమాట వారు కూడా అచ్చుతప్పులు పట్టుకోవడం లేదు. విలేకరి ఏమిటండి? విలేఖరి అని వ్రాయాలిగాని. తెలుగు పత్రికల్లో ఈ మధ్య క-ఖ తికమక బాగా పెరిగింది.
[విలేకరి, విలేఖరి అన్న పదాలలో ఏది సరైనదో నిర్ణయించడం అంత సులభం కాదు. -అరి అన్న తెలుగు ప్రత్యయాన్ని సుంకరి, కుమ్మరి, కమ్మరి మొ॥ తెలుగు పదాల్లో వాడితే, -కర/కరి /కార అన్న సంస్కృత ప్రత్యయాలను సుధాకర, అహంకారి మొ॥ సంస్కృత ప్రత్యయాల్లో వాడుతాము. అంటే లెక్క ప్రకారం విలేఖ(సంస్కృతం) లను సృష్టించే వాడు విలేఖకరుడు, విలేఖకరి అవ్వాలి. అయితే, రెండు సన్నిహిత ధ్వనులు పక్కపక్కనే ఉన్నప్పుడు, రెండు ధ్వనులకు మారుగా ఒక్క ధ్వనిని మాత్రమే పలకడం అన్ని భాషలలో జరిగే ధ్వని పరిణామమే (ఈ ధ్వని పరిణామాన్ని సదృశ వర్ణలోపం (Haplology) అని అంటారు). ఈరకమైన ధ్వని పరిణామం వలన విలేఖకరి అన్న పదం విలేఖరి/విలేకరి గా మారిందని చెప్పుకోవచ్చు. బూదరాజు గారెప్పుడూ విలేకరి అనే రాసేవారు – సం.]
తెల్ల కాయితం గురించి Reader అభిప్రాయం:
07/07/2008 6:40 am
కధ బాగానే వుంది.
కధలో తల్లితండ్రులు సరిగానే వున్నారు.
“ఇదంతా విన్నా వాడి నాన్నకి ఏమీ పట్టలేదు. ఫెళ్ళున ఒక్క నవ్వు నవ్వీసేడు” అని రచయిత రాయడం సరిగా లేదు. పిల్లాడు తన బాధలో అలా అనుకుంటే ఫరవాలేదు గానీ, రచయిత తండ్రి పాత్ర గురించి “ఏమీ పట్టలేదు” అని రాయడం సరి కాదు. తండ్రి బాధ్యతా పూర్వకంగానే వున్నాడు ఈ కధలో.
చాలా చోట్ల డ్రామా ఎక్కువైంది. టీచరూ, హెడ్ మాస్టరూ, ఇనస్పెక్టరూ – వీళ్ళ పాత్ర చిత్రణ అస్సలు సరిగా లేదు.
పిల్లాడి తల్లితండ్రుల పాత్ర చిత్రణ బాగుంది.
డ్రామా సన్నివేశాల వల్ల కధ సహజత్వానికి దూరంగానూ, అసహజత్వానికి దగ్గర గానూ అయింది.
కధలో విషయం మాత్రం మంచిది. మొత్తానికి బాగానే వుంది.
చీకటి పరచుకున్న ఆకాశంలో…. గురించి baabjeelu అభిప్రాయం:
07/07/2008 5:17 am
అనుభూతి అందరిదీ. కవిత్వం కిరణుది. ఆవేశాలు అనుభవాలయి చచ్చిపోవడం నిజం. మినుకుమినుకు మంటున్న ఆ జ్ఞాపకాలే మిగిలిన బతుకంతా వెలిగిస్తాయి.
అక్షరాలు గురించి baabjeelu అభిప్రాయం:
07/07/2008 5:01 am
అద్భుతవయిన అసంపూర్తి కవితలా వుంది.
మనలో, మనతో నిత్యం ప్రయాణించేవి మననుంచి వేరెలా అవుతాయి? ఎందుకవుతాయి?
చివరి రెండు పంక్తులు అస్పష్టంగా వున్నాయి, ఊపున్నా సరే.
అవి లేకపోతే, చక్కని అక్షరాంజలి.
“మహాకవి…….వొదిగిపోయే ఈ అక్షరాలు” కోటబుల్ కోట్సు.
బహుశా, “మనలో ఒకటై..”పడ్డ తరవాత పధ్ధతికలవాటు పడిపోయిన కవితా స్రవంతి లా అనిపిస్తోంది.
అలాటి అలవాట్లే వదిలించుకోవాలి.
మీ కవిత్వం లో ఇలాటివి ఎక్కువ. మంచివి కావేమో?
అక్టోబరు పులి గురించి baabjeelu అభిప్రాయం:
07/07/2008 4:28 am
చిన్నప్పుడు చూసిన పులి మళ్ళీ స్క్రీను మీద “డేంచాడీసింది”
అమరావతి కథ గుర్తొచ్చింది.
“విజినారం” గుర్తొచ్చింది.
మొన్న వేసవి సెలవలకి విజయనగరం వెళ్ళిన మా అయిదేళ్ళబ్బయి, మొదటి సారిగపులివేషం చూసి, నా చిన్నప్పుడు నాలాగే, భయపడిపోయి దాన్నిఎంత ఎగ్జైటింగా చెప్పేడంటే, మీ కవితలో మొదటి సగంలాగే.
అయితే, ఇలాటి కవితలు “టుమ్రీల్లాటివి”. కచేరీ లొ లాస్టులొ పాడేవి.
మీరింకా అసలు కచేరీ మొదలెట్టేరా కిరణు?
88 ఏళ్ళ యువకులు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/06/2008 7:49 pm
నాకు వివరాలు సరిగ్గా తెలియవుగాని కొన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పుస్తకాలూ వగైరాలున్నాయని విన్నాను. వాటితో బాటుగా ఆడియో బుక్స్ జాబితాలో సంగీతరావుగారి సీడీ చేర్చదగినది అని నా ఉద్దేశం. రికమెండ్ చెయ్యగలిగినవారు దాన్ని (గై) కొని, విని సిఫార్సు చెయ్యగలరు.
88 ఏళ్ళ యువకులు గురించి Jayasri అభిప్రాయం:
07/06/2008 7:59 am