కృష్ణమోహన్ గారూ,
ఛందస్సు అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా రాసేవాళ్ళకి, అంతకన్నా ముఖ్యంగా చదివేవాళ్ళకి. అయితే ఛందోబధ్ధంగా రాయకపోతే కవిత్వంకాదు అని మీరు రాసిన సంధియుగం సీనియర్ కవులు కుర్రాళ్ళని నిర్బంధించకపోయినట్టయితే, లేక కవులు కాదు అని ఈసడించకపోయివుంటే ఎలావుండునో కథ. అప్పటి యూరోపియన్ కవిత్వపు ఇన్ఫ్లూయెన్స్, ఇంగ్లీషు చదువులు, పట్టించుకోకుండా, సంస్కృతం ఇంకా రాజభాషే అన్న అపస్మారక స్థితిలో వుండి, సంస్కృతం నుంచి డిరైవై న ఛందోబధ్ధవయిన తెలుగు కవిత్వం మాత్రమే కవిత్వమని అనుకున్నవాళ్ళ వల్లే కుర్రాళ్ళందరూ ఇటు మారిపోయేరు.
ఇంకొక విషయం, ఛందోబధ్ధవయిన తెలుగు పద్యం, గురజాడ ముందు తరంలో మహానుభావుడనే కవికి ఎంత గేప్ వుందో చూడండి. సంధి యుగం అని ఎందుకన్నారూ?
ఛందస్సు నుంచి ముత్యాల సరాలు నుంచి శ్రీశ్రీ కవిత్వం నుంచి కుందుర్తి ఆంజనేయులు వరకూ అని మీ అభిప్రాయమా? అందుకని ఛందస్సు కీ శ్రీశ్రీ కీ మధ్యది సంధియుగమా?
చందస్సు మీద ఇప్పటికీ ఎవరికీ కోపంలేదు, అసహ్యంలేదు. అక్కరలేదు కాబట్టి మానీసేరు. మానేస్తున్నారు. ఛందొబధ్ధవయిన కవిత్వం రాస్తున్నవాళ్ళు అనుభూతికి, భావానికి రెండో పీట వేసి ఛందస్సుకి పెద్దపీట వెయ్యడం వల్లే వాళ్ళ కవిత్వంలో ఛందస్సు తప్ప కవిత్వం వుండకుండాపోతోంది.
ఘంటసాలగారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంతమాత్రమే. పెద్ద రికార్డింగ్ ఏదైనా జరిగితే ఆ మర్నాడు ఆయన విశ్రాంతి తీసుకోక తప్పేదికాదని సావిత్రిగారు ఏదో సందర్భంలో చెప్పారు. ఎటొచ్చీ ఆయన ఇంకొన్నేళ్ళు జీవించినా తమిళంలో టి.ఎం. సౌందరరాజన్ లాగే రిటైర్ కావలసి వచ్చేదేమో. వయసుతో మారిపోయే గాత్రపటిమ కన్నా ఘంటసాలకు మొదటినుంచీ ఉండిన సంగీత సంస్కారమే గొప్పదని నేననుకుంటూ ఉంటాను.
త్రిపురనేని మహారథి ఒక సంగతి చెప్పారు. రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన ఒక రికార్డింగుకు ఘంటసాల వెళ్ళి తయారుగా కూర్చున్నప్పటికీ రాజేశ్వరరావుగారు ఎంతకీ తన గదినుంచి బైటకు రాలేదట. ఘంటసాలగారు విసుక్కుంటూ ‘నేనింతమందికి పాడానుగాని రాజేశ్వర్రావుగారిలా ఇలా హింసపెట్టేవాళ్ళని ఎక్కడా చూళ్ళేదు’ అన్నాడట. దానికి మహారథి ‘దానికేముందండీ, పాడనని చెప్పి వెళ్ళిపోవచ్చుగా?’ అన్నాడట. వెంటనే ఘంటసాల ‘అమ్మమ్మమ్మ, ఎంతమాట? రాజేశ్వర్రావు రికార్డింగు మానుకోవడమా? అలా ఎన్నటికీ చెయ్యను’ అన్నారట. అది ఆయన వినయానికీ, సంస్కారానికీ కూడా మంచి ఉదాహరణ.
సెప్టంబరు 99 లో ప్రచురితమైన కధని మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఎనిమిది లో బయటకు తీసుకురావడంలో ఉద్దేశం ఏమైనా ఒక మంచి కధను అందించినందుకు ఈమాట వారికి అభినందనలు. కధతో బాటు అప్పుడు వెలువడిన అభిప్రాయలు కూడా ప్రచురించి ఉంటే బాగుండేది. ఆ నాటి పరిస్థితులలో ఆ చదువరుల స్పందన తెలుసుకునే అవకాశం ఉండేది. దాదాపు దశాబ్దం తరువాత అదే కధకి, అదే చదువరి స్పందనలో మార్పు ఉండే అవకాశం ఉంటుంది.
ఇక “తుపాకి” అనే పేరుతో ఒక ప్రవాసాంధ్రుడు, అమెరికా దేశ నేపధ్యంలో కధ మొదలిడగానే, ఆ ఏముంది, అమెరికన్లు వారి తుపాకుల సంస్కృతి, దాని ప్రభావం మీదే కధే ఐవుంటుంది అని అనుకునే వారికి కధ ఆసాంతం చదివిన తరువాత గాని అర్ధం కాదు, ఆ తుపాకుల సంస్కృతి ఒక పార్స్వమే కధకుడు స్పర్శించాడు అని.
కులాలు వాటి మధ్య పోరు, అంధ్రదేశంలో దళితుల మధ్య పెరుగుతున్న అగాధాల నేపధ్యంలో ఈ కధ చదివినప్పుడు, “మాట్”, కిరణ్ మధ్య స్నేహాన్ని వారి శరీర చాయ నిర్దేశించలేకపోవడానికి కారణం వారిలో తోటివారిపట్ల ఉండవలసిన సద్భావన పెంచి పోషించవలసినది శంకర్ లాంటి మానవతావాది అన్నది కధకుడు చాలా చక్కగా చెప్పారు.
షరా: అప్పుతచ్చులు .
హనుమంతరావు గారూ,
మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఈ శాస్త్ర విషయాలు, వాటితో పాటే శాస్త్రవేత్తల జీవిత విశేషాలూ కమ్మటి తెలుగులో చదువూతూంటే … ఎంత ఆనందంగా వుందో.
గత పదేళ్ళుగా సాఫ్ట్వేర్ లో వున్నా ఇలా మీలాంటి వారి అనుభవాలు చదువుతుంటే స్పూర్తిదాయకంగా వుంటుంది. ఈ P, NPల గురించి ఆంగ్లంలో చదివుంటే ఇలా అర్థమయ్యేది కాదేమొ. మీ శైలి అద్భుతంగా వుంది. చదువుతున్నంత సేపూ ఏదో సాంకేతిక వ్యాసం చదువుతున్నట్లుగా గాక కథ చదువుతున్నట్లుగా చదివింప జేసింది. సాధారణ పాఠకుడిగా నాకు distract అనిపించలేదు. మీరిలానే కొనసాగించండి.
వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి baabjeelu అభిప్రాయం:
07/12/2008 7:59 am

సంగీతరస పానశాల ఘంటసాల గురించి Rohiniprasad అభిప్రాయం:
07/11/2008 9:33 pm
ఘంటసాలగారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంతమాత్రమే. పెద్ద రికార్డింగ్ ఏదైనా జరిగితే ఆ మర్నాడు ఆయన విశ్రాంతి తీసుకోక తప్పేదికాదని సావిత్రిగారు ఏదో సందర్భంలో చెప్పారు. ఎటొచ్చీ ఆయన ఇంకొన్నేళ్ళు జీవించినా తమిళంలో టి.ఎం. సౌందరరాజన్ లాగే రిటైర్ కావలసి వచ్చేదేమో. వయసుతో మారిపోయే గాత్రపటిమ కన్నా ఘంటసాలకు మొదటినుంచీ ఉండిన సంగీత సంస్కారమే గొప్పదని నేననుకుంటూ ఉంటాను.
త్రిపురనేని మహారథి ఒక సంగతి చెప్పారు. రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన ఒక రికార్డింగుకు ఘంటసాల వెళ్ళి తయారుగా కూర్చున్నప్పటికీ రాజేశ్వరరావుగారు ఎంతకీ తన గదినుంచి బైటకు రాలేదట. ఘంటసాలగారు విసుక్కుంటూ ‘నేనింతమందికి పాడానుగాని రాజేశ్వర్రావుగారిలా ఇలా హింసపెట్టేవాళ్ళని ఎక్కడా చూళ్ళేదు’ అన్నాడట. దానికి మహారథి ‘దానికేముందండీ, పాడనని చెప్పి వెళ్ళిపోవచ్చుగా?’ అన్నాడట. వెంటనే ఘంటసాల ‘అమ్మమ్మమ్మ, ఎంతమాట? రాజేశ్వర్రావు రికార్డింగు మానుకోవడమా? అలా ఎన్నటికీ చెయ్యను’ అన్నారట. అది ఆయన వినయానికీ, సంస్కారానికీ కూడా మంచి ఉదాహరణ.
తుపాకి గురించి నెటిజన్ అభిప్రాయం:
07/11/2008 6:00 pm
సెప్టంబరు 99 లో ప్రచురితమైన కధని మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఎనిమిది లో బయటకు తీసుకురావడంలో ఉద్దేశం ఏమైనా ఒక మంచి కధను అందించినందుకు ఈమాట వారికి అభినందనలు. కధతో బాటు అప్పుడు వెలువడిన అభిప్రాయలు కూడా ప్రచురించి ఉంటే బాగుండేది. ఆ నాటి పరిస్థితులలో ఆ చదువరుల స్పందన తెలుసుకునే అవకాశం ఉండేది. దాదాపు దశాబ్దం తరువాత అదే కధకి, అదే చదువరి స్పందనలో మార్పు ఉండే అవకాశం ఉంటుంది.
ఇక “తుపాకి” అనే పేరుతో ఒక ప్రవాసాంధ్రుడు, అమెరికా దేశ నేపధ్యంలో కధ మొదలిడగానే, ఆ ఏముంది, అమెరికన్లు వారి తుపాకుల సంస్కృతి, దాని ప్రభావం మీదే కధే ఐవుంటుంది అని అనుకునే వారికి కధ ఆసాంతం చదివిన తరువాత గాని అర్ధం కాదు, ఆ తుపాకుల సంస్కృతి ఒక పార్స్వమే కధకుడు స్పర్శించాడు అని.
కులాలు వాటి మధ్య పోరు, అంధ్రదేశంలో దళితుల మధ్య పెరుగుతున్న అగాధాల నేపధ్యంలో ఈ కధ చదివినప్పుడు, “మాట్”, కిరణ్ మధ్య స్నేహాన్ని వారి శరీర చాయ నిర్దేశించలేకపోవడానికి కారణం వారిలో తోటివారిపట్ల ఉండవలసిన సద్భావన పెంచి పోషించవలసినది శంకర్ లాంటి మానవతావాది అన్నది కధకుడు చాలా చక్కగా చెప్పారు.
షరా: అప్పుతచ్చులు .
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం గురించి ప్రసాద్ అభిప్రాయం:
07/11/2008 4:20 pm
హనుమంతరావు గారూ,
మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఈ శాస్త్ర విషయాలు, వాటితో పాటే శాస్త్రవేత్తల జీవిత విశేషాలూ కమ్మటి తెలుగులో చదువూతూంటే … ఎంత ఆనందంగా వుందో.
మీకూ ఈమాటకూ కృతజ్ఞతలు.
–ప్రసాద్
http://blog.charasala.com
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి ప్రసాద్ అభిప్రాయం:
07/11/2008 3:27 pm
గత పదేళ్ళుగా సాఫ్ట్వేర్ లో వున్నా ఇలా మీలాంటి వారి అనుభవాలు చదువుతుంటే స్పూర్తిదాయకంగా వుంటుంది. ఈ P, NPల గురించి ఆంగ్లంలో చదివుంటే ఇలా అర్థమయ్యేది కాదేమొ. మీ శైలి అద్భుతంగా వుంది. చదువుతున్నంత సేపూ ఏదో సాంకేతిక వ్యాసం చదువుతున్నట్లుగా గాక కథ చదువుతున్నట్లుగా చదివింప జేసింది. సాధారణ పాఠకుడిగా నాకు distract అనిపించలేదు. మీరిలానే కొనసాగించండి.
–ప్రసాద్
http://blog.charasala.com
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు గురించి ప్రసాద్ అభిప్రాయం:
07/11/2008 3:00 pm
బూల్ గురించి కూలంకషంగా వివరించి బూల్ గణితాన్ని మళ్ళీ స్మృతిలోకి తెచ్చారు.
–ప్రసాద్
http://blog.charasala.com
అమెరి గల్పిక ఆదా గురించి ప్రసాద్ అభిప్రాయం:
07/11/2008 2:10 pm
“ఇక గాసొలీన్ని కోక్ లాగా జుర్రుకునే స్పోర్ట్ యుటిలిటీ మహారథంలో రానూ పోనూ ముప్ఫై మైళ్ళకి గాస్ ఖరీదు ఎంతో సుబ్బారావుతో చెప్పకండి, మండి మసై పోగల్డు.”
ముగింపు అదుర్స్.
–ప్రసాద్
http://blog.charasala.com
అమెరిగల్పిక – ఎఫిషియెన్సీ, ప్లీజ్ గురించి ప్రసాద్ అభిప్రాయం:
07/11/2008 2:05 pm
అద్భుతంగా వుంది. పగలబడి నావ్వాను. “కాపుది”, “వాన్నా వైట్ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్ డైసీ” భలే నవ్వు తెప్పించాయి.
–ప్రసాద్
http://blog.charasala.com
అమెరి”గల్పిక” గురించి ప్రసాద్ అభిప్రాయం:
07/11/2008 11:07 am
బాగా చెప్పారు. ఎంత స్వకీర్తి గురించి డప్పేసుకోవడమేగానీ, పరాయివాళ్ల గొప్పదనం గురించి ఒప్పుకోవడం అటుంచి వినడానికే సమయం వెచ్చించం.
–ప్రసాద్
http://blog.charasala.com
సార్థక నామధేయుడు సంగీతరావు గురించి abhimaani అభిప్రాయం:
07/11/2008 9:18 am
ప్రసాద్ గారూ,
మాకు తెలియని కొత్త విషయాలు చెబుతారని ఆశించాను. మీరిలా మధ్యలో ఆపేస్తే ఎలా? మీరిలా ఈ చర్చ నుండి తప్పుకొని మమ్మల్ని నిరాశకు గురి చేసారు.
-మీ అభిమాని