పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఓహో యాత్రికుడా.. గురించి baabjeelu అభిప్రాయం:

    07/16/2008 6:27 pm

    రోహిణీప్రసాదుగారూ,
    రాజే”స్వర” రావు గారి తబలా వింతగా, వైవిధ్యంగా వుంటుంది. దాని గురించి ఓ రెండుముక్కలు రాయండీ. ప్లీజు.

  2. ఓహో యాత్రికుడా.. గురించి baabjeelu అభిప్రాయం:

    07/16/2008 6:06 pm

    తెలుగు సినిమా సంగీతం సాలూరు వారితోనే మారిందా? గాలిపెంచల వారు మార్చేరా? ఎవరు మార్చినా, సహజ పరిణామం గానే మారుతుంది. అయితే ఆ సమయంలో రాజేశ్వర రావు గారి లాటి వారుండడం మన అద్రుష్టం. ఇంకొక విషయం. ఘర్షణ లో ఇళయరాజా “నిన్నుకోరి వర్ణం..” గురించి విజయచిత్ర లో సాలూరి వారు పొగడ్డం గొప్ప. అప్పటికి ఆయన సినిమాల్లో “ఏక్టివ్” గా లేరు. బి.ఎన్.రెడ్డి గారికి, సాలూరు వారికీ కుదరడం తెలుగు సినిమా అదృష్టం.

    “పగలైతే దొరవేరా..” పాట లాటిది మరోటి లేదని నా అభిప్రాయం. అద్భుతవయిన సాహిత్యానికి, అత్యద్భుతవయిన సంగీతం. జానకి గారు కూడా అంత లాలిత్యంతో పాడేరు. దొర అంటే యజమాని. రాజు అంటే చంద్రుడు అనికూడా అందుకే పక్కన ఆ దొరగారుంటే ప్రతి రాత్రీ పున్నమే. గట్టుకాడ ఎవరో, జానపద గీతం. జానపద గీతంలాగే పాడించడం సంస్కారం.అయితే పల్లెటూరు పిల్ల, మొగుడికి ఉత్తరం, చాకలి పద్దు రాయగలిగినంత చదువు వున్నదానిలా ఉంటుందీ జానపద గీతం. వింజమూరి సీత, అనసూయ గార్లయితే “ఫక్తు” జానపదులు కాబట్టి అలానే పాడేరు.జానపదం లో ఎవరో కి ఎవరో మధ్య వచ్చీ మురళి బిట్స్ జానపదంలో వుండవలసిన పచ్చ(చ్చి)తనాన్ని పచ్చగా వుంచేయి.ఎప్పుడు “హమ్” చేసినా “ఫ్లూటు” కూడా పాడాలి. లేకపోతే మహాపరాధం చేసినట్టుంటుంది.

    పూజాఫలం లో బి.ఎన్ కన్నా సాలూరివారు మార్కులెక్కువ కొట్టేసేరు. అందుకే సినిమా క్లిక్ అవలేదు. ఇంకో పాట, బొబ్బిలి యుధ్ధంలో ముత్యాల చెమ్మచెక్క. దీని గురించి మీలాటివాళ్ళు విపులంగా రాస్తే బాగుంటుంది. అలాగే భానుమతి శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా. ఈ సినిమా కూడా, పూజాఫలం లాగే, “చందమామ” టెక్నిక్కు వాడకపోవడం వల్ల బాగా ఆడలేదు.

  3. విలువలు గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    07/16/2008 4:12 pm

    చాలా ఏళ్ళ క్రితం సన్నీవేల్ కాలిఫోర్నియా లో ఒక తెలుగతను ప్రమాదంలో మరణించాడు. చిత్రంగా అతని అంత్యక్రియలకి సహాయం చేసిన వాళ్ళు మాత్రం తెలుగు వాళ్ళు, ఇండియన్స్ మాత్రం కారు. రెండు వేర్వేరు సంఘటనల చూసాక రాసిన కధిది. స్కాట్ అనే అతని పాత్ర నిజం. పేరు మార్చి రాయడం జరిగింది.

  4. సంగీతరస పానశాల ఘంటసాల గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    07/16/2008 1:21 pm

    “వివాహ భోజనంబు” కూడా పాడించిన ఘనత ఆయనదే. ఇది Laughing policeman అనే పాత ఇంగ్లీషు పాటకు అనుకరణ.

    నాకైతే తెలుగు పాటకీ, ఈ Laughing policeman పాటకి పోలికలు కనపడలేదు.
    నాకు తెలిసినంతలో ఈ పాటకు స్ఫూర్తి Mexican Merry go round అనే ప్రఖ్యాతి గాంచిన పాట. Edmundo Ros అనే గోప్ప పేరున్న గాయకుడు (ఇతని పాటలనేకం హిందీ సినిమాల్లో అనుకరించబడ్డాయి, ప్రముఖంగా సి. రామచంద్ర ద్వారా…) పాడిన వెర్షన్ తేలికగా లభ్యమవుతుంది. ఇక్కడ ఒక 30 సెకన్ల పాటు ఆయన గొంతుకలో వినవచ్చు.

    1936 లో ఇదే కథ “శశిరేఖా పరిణయం” (మాయాబజార్) అన్న పేరుతో వచ్చింది. ఆ సినిమాలో దాదాపుగా యిదే పాఠం (నా దగ్గర పాటల పుస్తకం వుంది), దరిదాపుగా అదే ట్యూనులో (నేనైతే ఈ పాట వినలేదు. వే.ఆ.కృ. రంగారావు గారు నాతో చెప్పిన మాటిది.) వచ్చింది. ఇదే సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్రలో కనిపించడం, ఒక రెండు (నాకు తెలిసి, నా దగ్గరున్నవి) మంచి పాటలు పాడటం జరిగింది.

    — శ్రీనివాస్

  5. విలువలు గురించి kumar అభిప్రాయం:

    07/16/2008 12:48 pm

    is it a real incident ?

  6. తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/16/2008 9:17 am

    “యూనివెర్సిటీ ల్లో..” ఏవో దొరకొచ్చు అని భద్రిరాజు గారు రాసేరు. యూనివెర్సిటీ లే ఈ మాయకి కారణం.
    యూనివెర్సిటీ లు భాషకి చేసిన సాయం కన్నా బయటి సాహితీవేత్తలు చాలా ఎక్కువచేసేరు. యూనివెర్సిటీ వాళ్ళు భుక్తికి ఉద్యోగాలు చేసుకుంటారు తప్ప ఇంకేవీ చేయరు. ప్రభుత్వాధికారులు కదా?
    యూనివెర్సిటీ వాళ్ళ పుస్తకాలు ఘోరం. వాళ్ళు “టెన్స్ టైమ్స్” లో ఏ టైమ్ లోనూ ఇమడరు. యూనివెర్సిటీ వాళ్ళు భాషా వికాసానికి చేసిన క్రుషి పూజ్యం. “టెన్స్ టైమ్ ” అంటే వేగుంట మోహన్ ప్రసాదు గార్ని అడగండి. సరిగ్గా చెబుతాడాయన.

    ప్రస్తుతం “యూనివెర్సిటీలు” “రిడండెంటు”.
    అందుకే ఇన్ని పనికిమాలిన ఇంజినీరింగ్ కాలేజీలు వెలిసేయి.
    ఏ పనికిమాలిన ఇంజినీరింగ్ కాలేజీ లో నయినా పిల్లల్ని జాయిన్ చెయ్యడానికి తల్లితండ్రులు తయ్యారు కానీ “యూనివెర్సిటీ” లో జాయిన్ చెయ్యడానికి ఎవరూ తయారుగా లేరు.
    యూనివెర్సిటీల వల్ల ఒకప్పుడు ఎమ్ ఎస్సీ లు, పి హెచ్ డీ లూ తయరయీవారు.
    అదికూడా భాషలో కాదు. సైన్సుల్లో. యూనివెర్సిటీల్లో పిహెచ్ డీ చేసి భాషనుధ్ధరించిన మహనుభావుల్ని లెక్కపెట్టండి?
    పాపం ప్రస్తుతం సైన్సుని కూడా ఉధ్ధరించడంలేదు ఈ “యూనివెర్సిటీలు”
    “అస్తు”

  7. తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/16/2008 8:59 am

    భద్రిరాజు గారితో గొడవ పడలేం కానీ, ఒక్కటి మాత్రం నిజం. “స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్స్” గొడవ తేల్చండి?

    ఇంగ్లీషు వస్తే బతుకు ఇంకా బాగుంటుంది. అందరూ ఇంగ్లీషు నేర్చుకుంటారు. రేపు “అరబ్బీ” వస్తే బాగుటుంది అంటే అందరూ “అరబ్బీ” నేర్చుకుంటారు. నేర్పే వాళ్ళు తయారుగా వుంటారు.

    భాష, కమ్యూనికేషన్ అవసరం తీర్చడానికే.

    భాష గురించి ఇంత చర్చ దండగ, ఎందుకంటే రేపు యుస్ ఆఫ్ ఏ కన్నా చైనా వెళ్ళడం ఎక్కువ లాభదాయకం అనిపిస్తే అప్పుడు అందరం చైనీస్ నేర్చుకుని చైనా వెల్తాం. ఇంగ్లీషుని పట్టుకుని వేళ్ళాడం. అప్పుడు “అమీర్ పేట” నిండా ఇక్కడ “చైనీస్” నేర్పబడును అని బోర్డులు వెలుస్తాయి. గవర్నమెంటు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా.

    తెలివితేటలకీ, భాషకీ సంబంధం లేదు.

    తెలివైనవాడికి చక్కని “కమ్యూనికేషన్ ఎబిలిటీ” వుంటే బంగారానికి సువాసన అబ్బినట్టే. “కమ్యూనికేషన్ ఎబిలిటీ” అవతలి మనిషి భాష మీద “డిపెండయి” వుంటుంది.

    రాజు గారి అస్థానం లో ఉద్యోగం సంపాయించడానికి, ఒకప్పుడు సంస్కృతం, తరవాత ఉర్దూ, తరవాత ఇంగ్లీషు తరవాత ఇంకోటీ అవుతాయి.

    ఈ కాల మంతా మామూలు ప్రజలు, మామూలుగానే ఇంట్లో వాళ్ళ మాతృభాష నే వాడతారు. మరీ ఎక్కడొ ప్రవాసాంధ్రులయితే తప్ప. ప్రవాసాంధ్రుల శాతం తక్కువ.

    భాషనీ, సంస్కృతి నీ ప్రత్యేకించి ఎవరూ కపాడక్కర్లేదు.

    భద్రిరాజు గారి వంటి వారు, మన భాషకి గౌరవం, మర్యాదా, మన్ననా దొరకాలని బాధపడతారు. అంతే.

  8. తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/16/2008 8:27 am

    నేను ఇంటర్మీడియెట్ వరకూ తెలుగులోనే చదువుకున్నాను.
    ఋణవిద్యుదాత్మకత నాకు తెలుసు. ఆవర్తన పట్టిక తెలుసు.

    తెలుగు కీ దీనికీ సంబంధంలేదు. ఇంగ్లీషుకీ దీనికీ సంబంధం లేదు

    దుబాసీలని ఒకప్పుడు వుండీవారు.మొఘల్ దుబాసీలు వేరు. ఇంగ్లీషు దుబాసీలు వేరు. ప్రస్తుతం రాజ్యమేలుతున్న వాళ్ళ కీ ఏలబడుతున్న ప్రజల భాషకీ మధ్యన ఈ దుబాసీ ల ప్రాబల్యం.

    సంస్కృతాన్ని కానీ, పాలీ ని కానీ, ప్రాకృతాన్ని గానీ ఇప్పుడు ఎవరూ ఎందుకు బతికించుకో లేక పోయేరు.

    అధికారంలో ఉన్న వారు దేన్ని సమర్ధిస్తే చచ్చినట్టు ప్రజ భరిస్తారు.

    అధికారం మారిపోతే అన్నీ మారిపోతాయి. అయితే ఈ కాలం లో కూడా సామాన్య ప్రజానీకం లక్షణం గా సామాన్య విషయాల్ని జాగ్రత్త పరచుకుంటారు.

    నిజాం కాలం లో కూడా తెలంగాణా లో తెలుగు వుంది కదా?యాస వేరయి వుండొచ్చు.

    భాషని రక్షించు కోడం మామూలు ప్రజ పని. మామూలు ప్రజ వల్లే భాషయినా స్సంస్కృతయినా నిలబడుతుంది.

    ప్రభుత్వాధికారులది కాదు. వాళ్ళు వాళ్ళపొట్ట పోషించుకోడానికి ఏ వయినా చేస్తారు.
    జగన్నాధ పండిత రాయలు ఏం చేసేడండీ?

  9. తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి pedaraydu అభిప్రాయం:

    07/16/2008 3:54 am

    పందెం కాస్తున్నానండి, నేను తెలుగులోనే పది వరకు చదివాను, విషయ పరిఙ్ఞానంలో, గ్రాహ్యతలో, బుద్ది కుశలతలో నేను ఏ ఆంగ్ల మాధ్యమ విధ్యార్థికన్నా తీసిపోను. తెలుగుని అభివృద్ది చేయడం మన కర్తవ్యం. కాని ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే మన భాషా సంస్కృతులు నశించటానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు.

  10. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి pedaraydu అభిప్రాయం:

    07/16/2008 3:33 am

    జ్యోతిష్యం ఇంకా ఒక చిదంబర రహస్యంగానే వుంది. మన విశ్వవిద్యాలయాలలో వీటి మీద పరిశోధనలు నిర్వహిస్తే బాగుంటుంది.