పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. రాగాలూ స్వరాలూ గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/17/2008 7:37 am

    అర్థవంతంగా, అర్థమయ్యేలా పాట సాగితే, అది శాస్త్రీయమా,జానపదమా,సినిమా పాటా లేక విప్లవ గీతమా అనే తేడా లేకుండా ఆస్వాదించొచ్చు. ఆస్వాదన సద్యోజనిత మన:స్పందన. కానీ, శాస్త్రీయ సంగీతాన్ని మెచ్చుకోవడానికి రాగ,తాళ జ్ఞానాలు కావాలంటారు.

    నాకంత జ్ఞానం లేదుకానీ, పదాల్ని ఎటుబడితేఅటు విరిచేసి, భావ సంకరం, అర్థవంకరం చేసే శాస్త్రీయ సంగీతం యొక్క శాస్త్రీయతను మాత్రం నేను నిరసిస్తాను. రాగంతో పాటూ భావయుక్తంగా ఆలపిస్తే అది వీనులవిందు, లేకుంటే అది అర్థరహితమైన రాగయుక్తమైన అరుపు అంతే!

  2. రాగాలూ స్వరాలూ గురించి Jayasri అభిప్రాయం:

    07/17/2008 7:31 am

    బాబ్జీలు గారి పుణ్యమా అంటు ఎప్పుడొ చదివి మరిచి పోయిన ఒక చక్కటి వ్యాసమ్ మళ్ళి చదవగలిగాను. రొహిణి ప్రసాద్ గారి articles are always, Timeless, informative and interesting, with innovative comments. It seems, swarams are necessary in a ragam, but not sufficient., like mathematical conditions. Right sir?

  3. ఓహో యాత్రికుడా.. గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/17/2008 7:29 am

    పగలైతే దొరవేరా అనే పాటకు క్రెడిట్ బి.గోపాలంగారికి కూడా దక్కాలనుకుంటాను. పరుచూరి శ్రీనివాస్ గారు బహుశా చెప్పగలరు. రాజేశ్వర్రావుగారి గురించి ఎంత రాసినా తక్కువే. చరణదాసిలోని గులాబీల తావులు పాట దగ్గర్నుంచీ అన్నీ అద్భుతమే. మొదట్లో శ్రీ పెండ్యాల కూడా కావాలని ఆయన దగ్గర అసిస్టెంటుగా కొన్నాళ్ళు పనిచేశారట.

    స్వర్గసీమ రోజులనుంచీ బి.ఎన్. గారికి ఆనందభైరవి రాగమంటే ఇష్టం. బంగారుపాప (సత్యం పాడిన ఆటమ్మా పాటమ్మా) మొదలైన సినిమాల్లో దాన్ని సంప్రదాయపద్ధతిలో వాడారు. గుర్తుపట్టడం కష్టం కావచ్చుగాని భాగ్యరేఖలో పెండ్యాల స్వరపరిచిన నీవుండే దాకొండపై అనే పాట ఆనందభైరవి రాగమే. అలాగే బంగారు పంజరంలో రాజేశ్వర్రావు చేసిన మనిషే మారేరా అనే అద్భుత యుగళగీతం కూడా http://chimatamusic.com/. ఇటువంటి subtleties ఈరోజుల్లో కోట్లు గడించే కంపోజర్ల నుంచి ఆశించడం వృథా.

  4. రాగాలూ స్వరాలూ గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/17/2008 6:34 am

    శాస్త్రీయసంగీతమంతా ఆత్మానందం కోసమే అని చెప్పినవారు డా. నేరెళ్ళ వేణుమాధవ్. దాన్ని కాదనడం కష్టమని నాకూ అనిపించింది. ఒకప్పుడు ‘మార్గ’ సంగీతానికి సోషల్ రెలెవెన్సు ఉండే ఉంటుంది కాని ఈరోజుల్లో అటువంటిదేమీ కనబడదు. సాహిత్యం, నాటకం, కొంతవరకూ చిత్రకళ సమకాలీన సమాజానికి సంబంధించినవిగా ఉంటాయనేది తెలిసినదే.

    పిల్లలూ, పెద్దవారూ కూడా సంగీతానికి ‘సహజం’గా స్పందించడం స్వాభావికమే. సాహిత్యప్రధానమైన గద్దర్ పాటలవంటివి vibrantగా అనిపించడానికి కారణం వాటికి సమాజంతో ఉండే సంబంధమే కదా.

  5. రాగాలూ స్వరాలూ గురించి baabjeelu అభిప్రాయం:

    07/17/2008 6:03 am

    శాస్త్రీయ సంగీతానికి సామాజిక స్పృహ లేదు అని రాయగలగడం సాహసం. మీరే రాయగలరు. వర్చువల్ రియాలిటీ లో విహరించడానికేనా శాస్త్రీయ సంగీతం? అలౌకికానందం అని కొంచెం మర్యాదాగా రాయవలసిందేమో? రాగం ఫలానా అని తెలియకుండానే సినిమా పాటలు ఆనందించెస్తున్నాంకదా? అలాగే రాగం తెలియకపోయినా శాస్త్రీయ సంగీతపు కీర్తనలు వింటున్నప్పుడు ఆనందం లో తేడా వుంటుందా?

    రాణీ సీతై హాలు లో చిట్టిబాబు వీణ కచేరీ లో మూడేళ్ళ పిల్ల ఆయన వాయించిన దానికి, అదేవిటో మాకూ తెలీదు, డేన్సు చెయ్యడం నేను చూసేను. డేన్సు అనకూడదు. షి స్వేయ్డ్ విత్ ది మ్యూజిక్. ఆ మేజిక్ స్రుష్టించడవేకదా మ్యూజిక్ పని. “..మంజుల మోహన మురళీ రవళి రాగ వల్లరీ మనో రంజిత తాళ శబ్ద ఝల్లరీ..” అంటూ తిల్లానా విన్నప్పుడు ఎవరయినా స్టెప్పులెయ్యాలి కదా? “సతులకై కొన్నాళ్ళాస్తికై సుతులకై కొనాళ్ళూ…” విన్నప్పుడు చెస్ ఎదవ బతుకు నిపించెస్తుందికదా? ఇంతా రాసేక ఇంకో సందేహం.చేగోడీ లేక నిప్పుచెక్క పేరు తెలియకపోయినా రుచి తగ్గదుకదా? బాలమురళీ సంగీతవయినా, మంచి సినిమా పాటయినా, గద్దర్ పాటయినా భక్తో, రక్తో, కార్యోన్ముఖుల్ని చెయ్యడవో చేస్తాయి కదా?

    ఏవంటారు?

  6. 88 ఏళ్ళ యువకులు గురించి చిన్నమయ్య అభిప్రాయం:

    07/17/2008 5:43 am

    అప్పట్లో ఆకాశవాణి కి, ముఖ్యంగా విజయవాడ కేంద్రానికి ఎంతో ప్రాముఖ్యత వుండేది. బాలాంత్రపు వారు, గొల్లపూడి, ఉషశ్రీ,…. మొ. వారు ఎనలేని సేవలందించేరు. “వాణి” అనే పత్రిక కూడా వచ్చేదినేఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీ వ్యాసం ద్వారా తెలిసేయి.. పుచ్చా పూర్ణానందం గారి గురించెప్పుడయినా రాయవలసిందిగా కోరిక.
    “కర్నాటక”, “యౌవనం” – సరైన ఉచ్చారణ అని బావిస్తున్నాను. గమనించగలరు.

  7. పలాయనం గురించి చిన్నమయ్య అభిప్రాయం:

    07/17/2008 5:23 am

    కధ మొదలుపెట్టి చదువుతున్నప్పుడు, అదేవిటి మొత్తం అంతా సాఫీగా సాగిపోతోంతోంఅని కంగారు పడ్డను. రెండో పుట తెరిచేక ఘర్షణ తెలిసింది. శైలీ బావుంది, సమస్య ఎత్తి చూపిన పద్ధతీ బావుంది. “రోటి పచ్చడి” – బాగా జ్ఞాపకం తెప్పించేరు. తిని ఎన్నాళ్లయిందో!
    ప్రవాసులమాటే ఎందుకు, మన మహానగరాల్లో, ఆర్ధికంగా పైకెదుగుతున్న నివాసుల జీవితమూ ఇంచుమించూ ఇదే! బాగా రాసేరు. అభినందనలు.

  8. తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి baabjeelu అభిప్రాయం:

    07/17/2008 5:16 am

    భక్తిరంజని లో ఆదివారంపూట ముందు “శ్రీ సూర్యనారాయణా మేలుకో, హరిసూర్యనారాయణా..” వచ్చీది సూర్యనారాయణుడి రంగుల్ని అంత “పెర్ఫెక్టుగా” చిత్రించిన తరవాత “సూర్యనారాయణా, వేదపారాయణా..” వచ్చీది.మొదట్లోనచ్చీది కాదు. కానీ “హాంటింగ్ మెలోడీ” లాగ వదిలీది కాదు. అందులో “..దేవతాచక్రవర్తీ, పరబ్రహ్మమూర్తీ..” ఇంకా “… భాస్కరా, హస్కరా” అని అంత ఆర్తి గా అనడం అద్భుతంగా వుండీది.
    తరవాత్తరవాత రజనీ బ్రుందం వారిదే ఎక్కువయిపోయింది. ఆలిండియా రేడియో వారి ఆర్కైవ్స్ లో కేసెట్ కొనుక్కున్న రోజు పండగే.

    ఇట్టి నీ కీర్తి కీర్తించ మేమెంత వాళ్ళవి.

  9. సంగీతరస పానశాల ఘంటసాల గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/16/2008 9:21 pm

    ‘పరుచూరి శ్రీనివాస్‌గారు అభ్యంతరం చెపితే తప్పక సోదా చెయ్యవలసిందే సుమా’ అనే భావనతో నేను Edmundo పాడిన పాట దొరికినంతవరకూ విన్నాను. అది త్రిశ్రగతిలో శంకరాభరణం స్కేల్‌లో ఉందన్నమాటేగాని ‘వివాహభోజనంబు’లో ఉన్నట్టుగా అందులో రాక్షసుడికి సరిపోయే ‘వికటాట్టహాసం’ లేదు. చప్పగా ఉంది.

    Laughing policeman చతురశ్రగతిలో సాగుతున్నప్పటికీ (దాన్ని త్రిశ్రంలోకి మార్చడమే జీనియస్) అందులో గాయకుడి నవ్వే ప్రధానాంశం. మాధవపెద్ది సత్యం తప్ప అంతటి ‘దమ్ము’తో మరెవ్వరూ అహ్హహ్హ అనలేరు కనకనే ఆయనను అనుకరించగలిగినవారు తక్కువ. (తమిళంలో తిరుచ్చి లోకనాథన్ పాడిన వర్షన్ విని మేము ఆ రోజుల్లోనే చప్పరించేశాం!)

    Laughing policeman పాటని నా స్కూలు రోజుల్లో (1962 ప్రాంతాల) మద్రాస్ రేడియోలో వెస్టర్న్ మ్యూజిక్ ప్రోగ్రాంలో తరుచుగా వినేవాణ్ణి. అది అప్పటికే పాతబడిపోయిన పాట. శ్రీనివాస్‌గారు ఉదహరించిన పాటలో (పూర్తిగా లభించలేదు) నవ్వు వినబడలేదు. Swing rhythmలో, major scaleలో ఉండడంవల్ల అది వివాహభోజనంబును పోలినదిగా అనిపిస్తుంది. కేవలం swing rhythm కోసమని ఇటువంటి ట్యూన్ ని అనుకరించవలసిన అవసరం మనవాళ్ళకు లేదనుకుంటాను.

    వెస్టర్న్ సంగీతానికి ఘంటసాలకన్నా రాజేశ్వరరావే ఎక్కువ స్పందించేవారు కనక ఇదికూడా మాయాబజార్ సినిమాకు ఆయన చేసి వదిలేసిన ట్యూన్ అయిఉంటుందనుకుంటున్నాను. ఇలా అనుకోవడానికి నా దగ్గర సాక్ష్యమేదీ లేదు. ఇది ఏ సింగీతం శ్రీనివాసరావుగారినో అడిగి తెలుసుకోవలసిన విషయం.

  10. మన శాస్త్రీయ సంగీతం గురించి baabjeelu అభిప్రాయం:

    07/16/2008 7:06 pm

    గురుభ్యోన్నమహ.
    బహుశా ఈ ఏటిట్ట్యూడే మీ వ్యాసాల వేపు నన్ను లాగినట్టుంది. మీరు చెప్పినట్టు మామూలు సినిమా పాటలనుంచి, అంటే “నువు రాక పోతె ఎట్టా నా రాజనిమని పండా..” డివ్వీ డివ్వీ డివ్విట్టం..” “ఎలాగుంది ఎలాగుంది అబ్బాయ్యా..” ల నుంచి సీరియస్ పాటల నుంచీ, “భక్తిరంజని” ప్రోగ్రామ్ నుంచి, బాలమురళీ రామదాసు కీర్తనలనుంచీ బాలమురళీ సంగీతం వరకూ ఎదగడం నా స్వానుభవం. ఇందులో స్నేహితులో, బంధువులో ప్రముఖ పాత్ర వహిస్తారు. మా చిన్నాన్న గారి బాలు, బాలమురళీ. నాబాలు బాలసుబ్రహ్మమణ్యం. ఈ డిస్కషన్స్ లోఇంకా అభిరుచి పెరుగుతుంది.

    మీరన్నట్టు, చిన్నప్పుడు నేర్చుకోవడం సరైనది. తబలా నేర్చుకుందావని, ఎందుకంటే చిన్నప్పట్నించీ టేబుళ్ళ మీద కుర్చీల మీదా దరువెయ్యడం అలవాటయితబలా తొందరగా వచ్చెస్తుందనుకుని, జాయినయి “ధాధిన్న, ధాతిన్న” తరవాత బధ్ధకించీసి మానేసేను. చాల బిజీ అని నాకు నేను అబధ్ధం చెప్పుకుని. నేర్పీ కుర్రాడు ఎంత ప్రొత్సాహించినా కూడా.

    అయితే మీ వ్యాసంలో “అశ్రావ్యవయిన” ఇప్పటి పాటలు గురించి ప్రస్తావించడం మీ స్థాయి కాదు. రాజేస్వరరావు గారూ మిగిలిన అప్పటి కుర్రకారు, అప్పటి కుర్రకారుకి తగ్గట్టు వాయించేరు. ఇప్పటి కుర్రకారుకి తగ్గట్టు, ఇప్పటి కుర్రకార్లు వాయిస్తున్నరు.

    నాలుగోక్లాసు, మా అమ్మయి మూడో క్లాసులో “టూట టూటా ఏక్ పరిందా..” నేర్చుకుని స్కూలు పోటీలో పాడడానికి చాలా సంతోషంగా ఒప్పుకుని, చక్కగా నేర్చుకుని, బాగా పాడీసి ప్రైజు తెచ్చుకుంది. ఇప్పుడు “ఏ మాలిక్ తేరే బందె హమ్ ..” పాడ్డానికి ఇబ్బందిగా ఒప్పుకుంది గానీ “ధూమ్మచాలే..” పాడతానంది. వాళ్ళ టీచర్ కూడా ఇంత పాత పాటొద్దు అనీసిందిట.