Really it is an excellent work and is highly informative. It has all the potential and need for inclusion in our text books. Please write some more articles. Keep it up. I wanted to write this in telugu but my lack of key board knowledge has prevented me.
Murthy
@వికట కవి గారూ: ఈ ఒక్క ప్రతిస్పందనలో మాత్రం మీరు చెప్పిన తీరు ఎలావుంది అంటే, న్యాయమూర్తి వాదన వినకుండ తీర్పుని ఇచ్చినట్టుగా ఉంది!
నచ్చకాపోతే దులిపేసుకోండీ అనడం ఇంకా విడ్డూరంగా వుంది. మీరు చెసిన వ్యాఖ్య “సగటు కధలని” దృష్టిలో పెట్టుకుని చేసినది అయినా, కధ చదవకుండ ఈ రచయిత ని అదే గాటకి కట్టడం ఎంతరకు సమంజసం?
@ప్రసాద్ గారూ: అన్నీ కధలూ నీతిని బోధించాలి అనిగాని ఏమైనా వుందా, లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా. పాత్రల స్వరూప స్వభవాలని విశ్లేషించడం, పాఠకునిగా మన భాద్యత కావచ్చుగాని, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడం మన హక్కుమాత్రం కాదు…
ఇటువంటి కధని ఎంచుకున్నందుకు రచయిత ధైర్యన్ని మెచ్చుకుంటూన్నాను. (వి)విమర్శలు చేసిన రచనా “దురంధురల” (దుస్)సాహసాన్ని కూడా!!!
ఇంటర్వ్యూ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. భద్రిరాజు గారితో పూర్తిగా ఏకీభవించక పోయినా, వారి తాత్పర్యం శ్రోతని ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా “అపోహ” ల విషయం. ఒక చిన్న మనవి. ఇంటర్వ్యూ నిడివీ, అందులోని ముఖ్యంశాలూ, వక్తా, పరిచయ కర్తల క్లుప్త సమాచారం పొందుపరిస్తే వీలుగా ఉంటుంది.
మీ అభిప్రాయములు బాగున్నాయి. వున్న మాటలు అవి. భద్రిరాజు గారు ఒప్పినా మానినా సత్యం సత్యమే కాదా?!
మీరు సైన్సు ల్లొ పరిశోధన గురించి బాధ పడ్డారు. తెలుగులో ఇవ్వాళ ఏం పరిశోధన జరుగుతోంది?? అక్కడికి వున్న వాళ్ళు ఎవరూ జాయిన్ కావటం లేదు. ఒక కారణం వుద్యోగాలు లేవు. అక్కడ చేరి చేయగలపని ఏమీ లేదన్న స్థితి ని ఆ డిపార్టుమెంటులు రుజువు చెసేసేయి.
తెలుగు కి విద్య ప్రమాణాలలో ఎటువంటి స్థాయి వుందో అక్కడ వున్న పాఠ్య పుస్తకాలని గమనించి చూస్తే ఇట్టే తెలుస్తుంది ఎవరికైనా. ఇందుకు అక్కడ వున్న ఆచార్యుల పూచీ లేదా? వారు ఇవ్వాళ్టి ఈ స్థితి కి కారణం కాదా?
తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు ఈ నిరాసక్తత వెనక ఎందరో మహానుభావులు మరి.
బహుశా వచ్చేనాళ్ళలో, వీరు సంస్కృతంలో, వీరు గ్రీకు, లాటిన్ భాషలలో పండితులు అని చెప్పుకున్నట్టే వీరు తెలుగులో పండితులండీ అని పరిచయం చేసే రోజులు ఆట్టే దూరం లో లేవనుకుంటాను.
డబ్బులు ఎక్కడ వుంటే బతికే అవకాశాలు ఎందులో వుంటే తల్లితండ్రులు వాటి వైపు తమ పిల్లల్ని పంపించాలని అనుకోవటం సహజం. దాన్ని తప్పు పట్టలేం.
అయితే అంత మాత్రాన నిజంగా భాషకి ముప్పు రాదు. తెలుగు లో రుచి పోవడానికి లేదా చదువుకున్న వాళ్ళకి చక్కటి తెలుగు పలుకుబడి రాకపోవడానికి పిల్లల అమ్మానాన్నలకి తెలుగు రాకపోవడం అసలు కారణం. ముందు వీళ్ళకి చక్కటి భాష వస్తే కదా వాళ్ళ సంతానానికి రావడానికి. నేను ఇట్లా అంటున్నానని ఎవరికైన కోపం రావచ్చుగాక, కానీ వాస్తవం చాలా చోట్ల ఇదే. ఇంట్లో తెలుగుని మాట్లాడే కుటుంబాలలో లేదా ప్రొత్సహించే కుటుంబాలలో భాష బాగానే వుంటోంది. పిల్లలకి అమ్మనాన్నలు ముందు మార్గదర్శకం కావాలి కదా? వాళ్ళే మొదట తెలుగు వదిలేస్తుంటే పిల్లలు ఎవర్ని చూసి తెలుగుని నిలుపుకొవలిటా?
అందుకని కర్ణుడి చావుకి అనేక కారణాలన్నట్టు అందరు ఇంతో అంతో బాధ్యులే!!
గురువుగారూ,
“మురళీ మాధురి” అని వి.బందా గారు “సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర” బాలమురళీది, రాసేరు.
భారతీరాధ పబ్లికేషన్స్, ఏలూరు వారు ప్రింట్ చేసేరు 2003 లో.
సినారె గారి “స్టేండర్డ్” మాటల తరవాత, “చెలికాడు” మురళి శీర్షికన “మహామహోపాధ్యాయ” నూకల వారి వ్యాసం. నాలాటి వారికి కనువిప్పు ఈ వ్యాసం. నూకల వారి లాటి సాంప్రదాయ సంగీతకారుడు, బాలమురళీ గురించి రాసింది చదివి నాలాటివారునమ్మలేరు. లయలో నందీశ్వరుడే వగైరాలు, “ఏమోయ్” అంటే “ఏమోయ్” అనుకుంటాం లాటివి.
అన్నవరపు రామస్వామి గారి “ఆశీర్వచనం”. ఇంకా కొంతమంది వ్రాతల తరవాత బాలమురళీయం ప్రారంభమవుతుంది.
అయితే ఈ జీవితచరిత్ర ని “శ్రీపాద”వారి అనుభవాలూ జ్నాపకాల పక్కన్ని గానీ, “వుప్పల” వారి బతుకు పుస్తకం పక్కన గానీ, “దాశరధి” గారి జీవనయానం పక్కనగానీ, “తిరుమల రామచంద్ర” గారి హంపీ నుంచీ హరప్పా పక్కనగానీ “భరాగో”గారి ఆరామ గోపాలం పక్కన గానీ ఊహించలేం.
ఈ ఏడాది విజయవాడ పుస్తక మహోస్తవంలో నవయుగా వారి స్టాల్ లో రేక్స్ వెనకాల పడిపోయి వున్న పుస్తకం దొరికింది. అద్రుష్టం.
రజని గారు పుస్తకాన్ని ఆవిష్కరించేరు.
నేనీ వ్యాసం రాసినప్పుడు సంగీతరావుగారి manuscript digital camera తో పేజీలవారీగా ఫోటోలు తీసుకున్నాను. ఆ తరవాత మొత్తం పుస్తకం soft copy అందింది. అందులో ఆయన రాసినది ఇది:
“శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారి సహాధ్యాయి శ్రీ శరభశాస్త్రిగారు మురళీవాదకులు. ఆయన సౌకర్యార్థమే యిరువురూ కలిసి పాఠం చేసే విధంగా ఒప్పించి త్యాగరాజకీర్తనల వ్రాత గ్రంథం శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారికి అనుగ్రహించేరుట శ్రీ సుబ్బయ్యగారు”
శరభశాస్త్రిగారు నేత్రహీనులనేది ఇందుకు కారణం.
త్యాగరాజు రచనలను 1830 ప్రాంతాల్లో వాలాజాపేట కుటుంబంవారు మొదటగా మద్రాసు శ్రోతలకు పరిచయం చేశారట. అలాగే లాల్గుడి కుటుంబానికి కూడా డైరెక్ట్ శిష్యరికం ఉండేది.
శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారి తరంలో త్యాగరాజు రచనలను కచేరీల్లో పాడడం మొదలయిందనుకోవచ్చు. తెలుగువారికి త్యాగరాజ కీర్తనలను పరిచయం చేసినది ఆయనే నంటారు.
త్యాగరాజు ఆనాటి ‘ఇళయరాజా’ అయి ఉండాలి. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న సంగీతమంతా వెనక్కి నెట్టినట్టుగా అయిపోయింది.
సంగీతరావుగారు అనుమతిస్తే ఆయన పుస్తకాన్ని రిలీజ్ చెయ్యవచ్చు.
బాలమురళిగారి cousin మంగళంపల్లి సూర్య నారాయణ అనే ఒకాయన చాలా ఏళ్ళ క్రితం ఆయన జీవితచరిత్ర రాశాడు. కొంతవరకూ hagiography లాగా అనిపించినప్పటికీ అందులో ఆసక్తికరమైన విషయాలూ, పాత ఫోటోలూ ఉన్నాయి. పెద్దవాళ్ళ జీవితచరిత్ర రాయడం సులువైన పని కాదు. ఎవరైనా రచయిత సులువైన శైలిలో రాయగలగడం అనేది అందులోని ఒక చిన్న అంశం మాత్రమే!
తెలుగు భాష వయస్సెంత? గురించి Prof. C.Parameswara Murthy అభిప్రాయం:
07/22/2008 5:43 am
Really it is an excellent work and is highly informative. It has all the potential and need for inclusion in our text books. Please write some more articles. Keep it up. I wanted to write this in telugu but my lack of key board knowledge has prevented me.
Murthy
ఇద్దరు దుర్మార్గులు గురించి అసంఖ్య ధవళ అభిప్రాయం:
07/21/2008 12:27 am
@వికట కవి గారూ: ఈ ఒక్క ప్రతిస్పందనలో మాత్రం మీరు చెప్పిన తీరు ఎలావుంది అంటే, న్యాయమూర్తి వాదన వినకుండ తీర్పుని ఇచ్చినట్టుగా ఉంది!
నచ్చకాపోతే దులిపేసుకోండీ అనడం ఇంకా విడ్డూరంగా వుంది. మీరు చెసిన వ్యాఖ్య “సగటు కధలని” దృష్టిలో పెట్టుకుని చేసినది అయినా, కధ చదవకుండ ఈ రచయిత ని అదే గాటకి కట్టడం ఎంతరకు సమంజసం?
@ప్రసాద్ గారూ: అన్నీ కధలూ నీతిని బోధించాలి అనిగాని ఏమైనా వుందా, లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా. పాత్రల స్వరూప స్వభవాలని విశ్లేషించడం, పాఠకునిగా మన భాద్యత కావచ్చుగాని, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడం మన హక్కుమాత్రం కాదు…
ఇటువంటి కధని ఎంచుకున్నందుకు రచయిత ధైర్యన్ని మెచ్చుకుంటూన్నాను. (వి)విమర్శలు చేసిన రచనా “దురంధురల” (దుస్)సాహసాన్ని కూడా!!!
-అసంఖ్య ధవళ
అంతర్మథనం గురించి kumar అభిప్రాయం:
07/20/2008 10:24 am
one of the best on eemaata site
భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ గురించి చిన్నమయ్య అభిప్రాయం:
07/20/2008 10:12 am
ఇంటర్వ్యూ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. భద్రిరాజు గారితో పూర్తిగా ఏకీభవించక పోయినా, వారి తాత్పర్యం శ్రోతని ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా “అపోహ” ల విషయం. ఒక చిన్న మనవి. ఇంటర్వ్యూ నిడివీ, అందులోని ముఖ్యంశాలూ, వక్తా, పరిచయ కర్తల క్లుప్త సమాచారం పొందుపరిస్తే వీలుగా ఉంటుంది.
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి rama అభిప్రాయం:
07/20/2008 7:16 am
అయ్య బాబ్జీలు గారు,
మీ అభిప్రాయములు బాగున్నాయి. వున్న మాటలు అవి. భద్రిరాజు గారు ఒప్పినా మానినా సత్యం సత్యమే కాదా?!
మీరు సైన్సు ల్లొ పరిశోధన గురించి బాధ పడ్డారు. తెలుగులో ఇవ్వాళ ఏం పరిశోధన జరుగుతోంది?? అక్కడికి వున్న వాళ్ళు ఎవరూ జాయిన్ కావటం లేదు. ఒక కారణం వుద్యోగాలు లేవు. అక్కడ చేరి చేయగలపని ఏమీ లేదన్న స్థితి ని ఆ డిపార్టుమెంటులు రుజువు చెసేసేయి.
తెలుగు కి విద్య ప్రమాణాలలో ఎటువంటి స్థాయి వుందో అక్కడ వున్న పాఠ్య పుస్తకాలని గమనించి చూస్తే ఇట్టే తెలుస్తుంది ఎవరికైనా. ఇందుకు అక్కడ వున్న ఆచార్యుల పూచీ లేదా? వారు ఇవ్వాళ్టి ఈ స్థితి కి కారణం కాదా?
తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు ఈ నిరాసక్తత వెనక ఎందరో మహానుభావులు మరి.
బహుశా వచ్చేనాళ్ళలో, వీరు సంస్కృతంలో, వీరు గ్రీకు, లాటిన్ భాషలలో పండితులు అని చెప్పుకున్నట్టే వీరు తెలుగులో పండితులండీ అని పరిచయం చేసే రోజులు ఆట్టే దూరం లో లేవనుకుంటాను.
డబ్బులు ఎక్కడ వుంటే బతికే అవకాశాలు ఎందులో వుంటే తల్లితండ్రులు వాటి వైపు తమ పిల్లల్ని పంపించాలని అనుకోవటం సహజం. దాన్ని తప్పు పట్టలేం.
అయితే అంత మాత్రాన నిజంగా భాషకి ముప్పు రాదు. తెలుగు లో రుచి పోవడానికి లేదా చదువుకున్న వాళ్ళకి చక్కటి తెలుగు పలుకుబడి రాకపోవడానికి పిల్లల అమ్మానాన్నలకి తెలుగు రాకపోవడం అసలు కారణం. ముందు వీళ్ళకి చక్కటి భాష వస్తే కదా వాళ్ళ సంతానానికి రావడానికి. నేను ఇట్లా అంటున్నానని ఎవరికైన కోపం రావచ్చుగాక, కానీ వాస్తవం చాలా చోట్ల ఇదే. ఇంట్లో తెలుగుని మాట్లాడే కుటుంబాలలో లేదా ప్రొత్సహించే కుటుంబాలలో భాష బాగానే వుంటోంది. పిల్లలకి అమ్మనాన్నలు ముందు మార్గదర్శకం కావాలి కదా? వాళ్ళే మొదట తెలుగు వదిలేస్తుంటే పిల్లలు ఎవర్ని చూసి తెలుగుని నిలుపుకొవలిటా?
అందుకని కర్ణుడి చావుకి అనేక కారణాలన్నట్టు అందరు ఇంతో అంతో బాధ్యులే!!
రామ
ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి tantravahi seshagirirao అభిప్రాయం:
07/20/2008 7:03 am
కథ చక్క్గగా వివరించారు. కానీ ప్రద్యుమ్నుడు రెండు అర్థాలు వచ్చే విధంగా చెప్పిన మాటలు యథాతథంగా వ్రాస్తే ఇంకా బాగుండేది.
సంగీతంతో కుస్తీ గురించి babbjeelu అభిప్రాయం:
07/20/2008 5:22 am
గురువుగారూ,
“మురళీ మాధురి” అని వి.బందా గారు “సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర” బాలమురళీది, రాసేరు.
భారతీరాధ పబ్లికేషన్స్, ఏలూరు వారు ప్రింట్ చేసేరు 2003 లో.
సినారె గారి “స్టేండర్డ్” మాటల తరవాత, “చెలికాడు” మురళి శీర్షికన “మహామహోపాధ్యాయ” నూకల వారి వ్యాసం. నాలాటి వారికి కనువిప్పు ఈ వ్యాసం. నూకల వారి లాటి సాంప్రదాయ సంగీతకారుడు, బాలమురళీ గురించి రాసింది చదివి నాలాటివారునమ్మలేరు. లయలో నందీశ్వరుడే వగైరాలు, “ఏమోయ్” అంటే “ఏమోయ్” అనుకుంటాం లాటివి.
అన్నవరపు రామస్వామి గారి “ఆశీర్వచనం”. ఇంకా కొంతమంది వ్రాతల తరవాత బాలమురళీయం ప్రారంభమవుతుంది.
అయితే ఈ జీవితచరిత్ర ని “శ్రీపాద”వారి అనుభవాలూ జ్నాపకాల పక్కన్ని గానీ, “వుప్పల” వారి బతుకు పుస్తకం పక్కన గానీ, “దాశరధి” గారి జీవనయానం పక్కనగానీ, “తిరుమల రామచంద్ర” గారి హంపీ నుంచీ హరప్పా పక్కనగానీ “భరాగో”గారి ఆరామ గోపాలం పక్కన గానీ ఊహించలేం.
ఈ ఏడాది విజయవాడ పుస్తక మహోస్తవంలో నవయుగా వారి స్టాల్ లో రేక్స్ వెనకాల పడిపోయి వున్న పుస్తకం దొరికింది. అద్రుష్టం.
రజని గారు పుస్తకాన్ని ఆవిష్కరించేరు.
సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/19/2008 11:10 pm
నేనీ వ్యాసం రాసినప్పుడు సంగీతరావుగారి manuscript digital camera తో పేజీలవారీగా ఫోటోలు తీసుకున్నాను. ఆ తరవాత మొత్తం పుస్తకం soft copy అందింది. అందులో ఆయన రాసినది ఇది:
“శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారి సహాధ్యాయి శ్రీ శరభశాస్త్రిగారు మురళీవాదకులు. ఆయన సౌకర్యార్థమే యిరువురూ కలిసి పాఠం చేసే విధంగా ఒప్పించి త్యాగరాజకీర్తనల వ్రాత గ్రంథం శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారికి అనుగ్రహించేరుట శ్రీ సుబ్బయ్యగారు”
శరభశాస్త్రిగారు నేత్రహీనులనేది ఇందుకు కారణం.
త్యాగరాజు రచనలను 1830 ప్రాంతాల్లో వాలాజాపేట కుటుంబంవారు మొదటగా మద్రాసు శ్రోతలకు పరిచయం చేశారట. అలాగే లాల్గుడి కుటుంబానికి కూడా డైరెక్ట్ శిష్యరికం ఉండేది.
శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారి తరంలో త్యాగరాజు రచనలను కచేరీల్లో పాడడం మొదలయిందనుకోవచ్చు. తెలుగువారికి త్యాగరాజ కీర్తనలను పరిచయం చేసినది ఆయనే నంటారు.
త్యాగరాజు ఆనాటి ‘ఇళయరాజా’ అయి ఉండాలి. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న సంగీతమంతా వెనక్కి నెట్టినట్టుగా అయిపోయింది.
సంగీతరావుగారు అనుమతిస్తే ఆయన పుస్తకాన్ని రిలీజ్ చెయ్యవచ్చు.
సంగీతంతో కుస్తీ గురించి Rohiniprasad అభిప్రాయం:
07/19/2008 10:44 pm
బాలమురళిగారి cousin మంగళంపల్లి సూర్య నారాయణ అనే ఒకాయన చాలా ఏళ్ళ క్రితం ఆయన జీవితచరిత్ర రాశాడు. కొంతవరకూ hagiography లాగా అనిపించినప్పటికీ అందులో ఆసక్తికరమైన విషయాలూ, పాత ఫోటోలూ ఉన్నాయి. పెద్దవాళ్ళ జీవితచరిత్ర రాయడం సులువైన పని కాదు. ఎవరైనా రచయిత సులువైన శైలిలో రాయగలగడం అనేది అందులోని ఒక చిన్న అంశం మాత్రమే!
హిందూస్తానీ సంగీతం గురించి Rohiniprasad అభిప్రాయం:
07/19/2008 10:33 pm
అమీర్ ఖుస్రో ఒక semi-mythical personality అనీ, అనేక విషయాలకు అతన్నే సృష్టికర్తగా చెపుతారనీ ఒక ఫిర్యాదు ఉంది. అవన్నీ సరిగ్గా అర్థమవుతేగాని చెప్పలేము.
బాలమురళి మునవ్వర్ అలీతో పాడిన జుగల్ బందీలో మొదటిసారి పాడిన పాట: సంగీతమే వరసుఖదాయి సరిగమపదని సుస్వర, మంగళదాయి, మనసుకు హాయి, మంజుల మురళీ రవ…(జోషీగారికి ఈమాటలు సరిగా అర్థమవకపోయి ఉండచ్చు 🙂 )