పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. మంచులో తడిసిన ఉదయం గురించి jayaprabha అభిప్రాయం:

    08/12/2008 10:11 am

    వైదేహి, చాలా బాగుంది మీ కవిత. చాలా రోజుల తరువాత originality వున్న images చూస్తున్నాను. మంచి హేమంతం, చంద్రునిలో అవ్వ రాట్నం వడకడం (వహ్!), అదంతా మంచులా రాలిపడటం!! గొప్ప ఊహా చిత్రం సుమా.

    మీరు మీ కవితలతో కవ్విస్తున్నారు నన్ను. మరీ చెలరేగి వస్తున్నాయి మీ వూహలు. వాటిని రానివ్వండి అలా. కానీ తలుపు తీయను నేను. మంచు గాలి వణుకుకి జడిసి. మరి మీ హేమంత సుందరి తో చేయి కలపటం ఎలా? మీరే ఏదైనా వుపాయం చెప్పాలి.

    జయప్రభ.

  2. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Ramakrishna అభిప్రాయం:

    08/11/2008 2:01 pm

    కృష్ణుడికి వాడిన పర్యాయపదం “సరసిజనాభ” – అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తే నాకు సోదరుడై కూడా నాకీ గతి పట్టిందే అన్న ద్రౌపది వేదనని యీ పదం స్ఫురింపజేస్తుంది.

    ఇదే ఊహ నాకు శ్రీనాదుడి పద్యం ‘కుల్లా యుంచితి, కోక చుట్టితి …. కన్నడ రాజ్యలక్ష్మి, దయలేదా, నేను శ్రీనాధుడన్ ‘ లో కనిపించింది (లేకపోతే ఎక్కడో ఆ మాట చదివి ఉంటాను). ఒక వేఫు, నేను శ్రీనాధుడను అనటమే కాక, కన్నడ రాజ్యలక్ష్మి అని సంబోధించినందువల్ల ఎవరో third party తో కాకుండా, direct-గా తనతో (మోటుగా చెప్పాలంటే ‘నేను నీ మొగుణ్ణి!’) అంటున్నది స్పష్టం చేస్తున్నాడు.

  3. నాకు నచ్చిన పద్యం: పోతనామాత్యుని జీవన దృక్పథం గురించి rAmakRshNa అభిప్రాయం:

    08/11/2008 1:45 pm

    లక్ష్మన్నగారికి,
    విశ్వనాధ సత్యనారాయణ గారి ‘అల్లసాని వాని అల్లిక జిగిబిగి’లో మీకు కావలసిన వివరణ ఉంటుందనుకుంటాను.

  4. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి rAmakRshNa అభిప్రాయం:

    08/11/2008 11:23 am

    దీనికి నేను విన్న పాఠం “పర్ణాని, స్వర్ణ వర్ణాని, కర్ణాంతాకీర్ణ లోచనే”. ఒక అణా ఎక్కువుంది 🙂

    ఇద్దరూ స్నేహితుల లాగా ఉన్నారు, ఒక అణా అటూ-ఇటూ అవుతే ఏం?

  5. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu అభిప్రాయం:

    08/11/2008 11:18 am

    కామేశ్వర రావు గారూ,
    దాసన్నపేటతో మొదలెట్టి, గుమ్ చీ మీంచి, బొంకులదిబ్బ దాటి, మూళ్ళాంతర్లు దాటి, గంటస్తంభం మీంచి, కన్యకాపరమేశ్వరి కోవెల దాకా వచ్చినా, మీరు “ఈ పద్యాన్ని చదవడం గురించి..” రాసిన వ్యాసం దొరకలేదు.
    పెచ్చెరువు దాటి, రైల్వే స్టేషను మీంచి, “కంటోన్మెంటు” వెళ్ళమంటే వెళ్తాను.
    “చాలా కష్టపడ్డావొయ్” అని “ఈ పద్యాన్ని” ఎలా చదవాలో చెబ్తే “ధన్యోస్మి” అనుకుంటాను.
    దాంతో పాటూ, రాసీ ఛందస్సుకీ, “రిసైట్” చేసీ పధ్ధతికీ తేడా తెలిపితే, నేనూ నాతోపాటూ చాలా మంది “క్రుతార్థులవుతారు”.
    మీ దయ, మా ప్రాప్తి.

  6. మంచులో తడిసిన ఉదయం గురించి baabjeelu అభిప్రాయం:

    08/11/2008 10:57 am

    వైదేహిగారూ,
    అద్భుతవయిన చమత్కారం చూపించేరు. వుదాసీన ప్రేయసి చూడ్డానికి ఎంత బాగున్నా, వుత్సాహంగా మది తలుపు తీస్తే, కరడు కత్తి లాటి కఠిన వీక్షణం తో గుండెల్ని వణికిస్తుంది.

    సవ్వడి లేని రవ్వలు ధరించి మీ తోటలో తిరుగాడిన హేమసుందరికీ, మిక్కిలి మక్కువగా ఆవిడని సన్నజాజులతో అలంకరించిన హేమంతుడికీ, రాత్రంతా అవిశ్రాంతంగా కష్టపడ్డ అవ్వకీ, మిగిలిన వాటికీ ఇదే మా ఆహ్వానం, మా పెరట్లో కూడా తిరగొచ్చుకదా? తిరిగినా మాబోంట్లు పట్టించుకోవనేమో?

    మామూలు కవులయితే, వుత్సాహంగా తలుపుతీసిన తరవాత కూడా “ఆహా, వోహో” అని రాస్తారు. మీరు కాబట్టి, తలుపు తీసేక కరడు కత్తి లాటి కఠిన వీక్షణాన్ని చూడగలిగేరు.

  7. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి independent అభిప్రాయం:

    08/10/2008 7:15 pm

    “The third-person narrative is a narrative that is not from a player in the story, hence, assumed to be providing the illusion of subjectivity to the story”

    illusion of objectivity అనా మీ ఉద్దేశం?

    వర్మ చిత్రాల్లో నా మట్టుకు నాకు బాగా నచ్చిన సినిమా “Company”.

    అలాగే గోవింద నిహ్లానీది ద్రోహి సినిమా కూడా నాకు ఇష్టమైన చిత్రం..అందులోనూ ఆఖరి సీన్…”డ్యూటీ(కర్తవ్యం)” అనే దానికి అల్టిమేట్ నిర్వచనం.

    Good work Mahesh.

  8. డాలర్ దేహాన్నొదిలి గురించి Suresh అభిప్రాయం:

    08/10/2008 12:55 am

    చాలా బాగా వుంది

  9. అతిథి వ్యయో భవ గురించి Madhusudana rao అభిప్రాయం:

    08/09/2008 9:39 pm

    నెల్లాళ్ళ క్రితం ఆటాకి విచ్చేసిన “మంది” లో కొందరికి ఆతిధ్యం ఇచ్చి మా పాట్లు మేం పడ్డాం. ఈ కథలో వెంకీ లాగే మాకూ జరిగింది.

  10. సన్మాన లాటరీ గురించి baabjeelu అభిప్రాయం:

    08/09/2008 5:19 am

    మురళీగారూ,
    “హయ్య బాబోయ్ మురళీగారూ” అని రాజేంద్రకుమార్ గారి అభిప్రాయం చదివడంవల్ల మీ విన్యాసం చూడగలిగేను. మీరు రాసింది చదివేక, రాజేంద్రగారి అభిప్రాయం లో “యురేకా” అని అరుస్తూ పరుగులెట్టిన “ఆర్కిమెడిస్” కనిపించేడు.
    పదిసార్లు చదివుంటాను. గొప్ప “టెక్నిక్”. అద్భుతవయిన “టెక్నిక్”. రచయిత మధ్యలో జొరబడకుండానే, కథ నడిపించడం సులువు కాదు. మీరు నడిపించేరు

    “క్ స్ గ్ ర్ ” మీద మన పేరు తగిలిందండీ. పెద్దపులుల్లాటి కుర్రకవులు… సై అనగానే “రంకెలేస్తూ” ( పులులు రంకెలెయ్యవుకదా, అయినా పాపం ఆకలి మీదున్నకుర్రకవులు కళ్ళ ముందు కనబడి, పగలబడి నవ్వుకున్నాను).
    “విమర్శా? అదెందుకులెండి” వాక్యంలో “భవిష్యద్సన్మాన గ్రహీత” మొహం వొకేసారి చికాగ్గానూ, సంతోషంగానూ కనిపించింది. చరిత్రదుందుభి, సంగీతకోకిల,నాట్యతటల్లిత, ఉత్తమపుత్ర పుచ్చుకోకతప్పలేదా?

    మీ వాక్యాల్లోనే ఆ వాక్యం తాలూకూ “టోన్ & టెనర్” వుండడం గొప్పవిషయం. ఎదురుగుండా “సన్మాన గ్రహీత”, “సరస్వతీ స్వామిదేవ” మాట్లాడుకున్నట్టనిపించింది. “రేసీ ప్రోజ్”
    వుపసంహారం అద్భుతం. వొక్కసారి, నవ్వాపుకోలేక దొర్లుతున్న నాలాటివాడిని, టక్కున నవ్వాపించి నిజమేనేమో అనిపించింది. “ఇగటాలు” మాయవయిపోయేయి.

    మీ “టెక్నిక్” గురించి: దేవులపల్లి క్రుష్ణశాస్త్రి గారు రాసిన సినిమా పాట లా వుంది.
    ఏమిరామకథ శబరీ, శబరీ/ఏదీ మరియొకసారి లాటి “టెక్నిక్”
    అందులోని చరణాలు చూడండి,
    “వాలుకనుల ఆ జానకిని, ఓరకనుల ఒకసారిగని, కేల శివుని విల్లందుకొని…”
    “మౌని భార్య మరియాద చెడి, ధూలిపడి, రాయైన జాలిపడి…”

    క్రియాశబ్దాలు నడకకి అడ్డుబడకుండా, ఆయన పాట, మీ “సన్మాన లాటరీ”
    ధన్యోస్మి.