పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. గుప్పెడంత మనసు గురించి essem.chelluru అభిప్రాయం:

    09/25/2008 3:38 am

    చాలా బాగుంది. చాలా అవసరము కూడా.

  2. నాన్నగారు కట్టిన ఇల్లు గురించి vasu M.S.C. అభిప్రాయం:

    09/25/2008 2:34 am

    మీ ఇంటి కథ బాగుంది. ఇల్లు కట్టడము ఎంత గొప్పో చెప్పారు.

  3. తెలుగు సినిమాలు స్త్రీ గురించి murali అభిప్రాయం:

    09/24/2008 9:03 pm

    సినిమాలపై మీ అభిప్రాయం చాలా బాగుంది. మనది హిపోక్రసీ సమాజం. వాస్తవాల టోన్ సినిమాలు తీస్తే చూసేది యెవరు? మీ ఆవేదనాపూరితమైన అభిప్రాయం బాగుంది. – మురళి.

  4. కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? గురించి baabjeelu అభిప్రాయం:

    09/24/2008 8:59 am

    కొడవళ్ళ వారికి,
    కుటుంబరావుగారి రచనా ప్రపంచం వస్తుందన్న ఆనందం, నిజంగా ఆనందవేఁ.
    మాకందరికీ, ఇవాల్టికికూడా, మమ్మల్ని వుధ్ధరించడానికి, ఆలోచన రేకెత్తించే అక్షరం వస్తోందంటే, ” దేవ దేవ రమ్ము, కావుమయ్య మమ్ము” అని చిన్నప్పుడు చదువుకున్న పెద్దబాలశిక్ష మళ్ళీ చదువుకుంటున్నాం.
    “ఆయన” పుస్తకాలు, outdated అయిపోలేదు. అందుకు కారణం మేవేఁ. మేం మారం గాక మారం. అది మా దగుల్బాజీతనవేఁనని నా నమ్మకం. ఈసారైనా “ఆయన” అక్షరాలు, మాలో కొంతమందినైనా వుధ్ధరించాలని ఆశిస్తున్నాను.
    అయితే, “ఆయన” పేర సభలకీ మిగతావాటికీ తగలెట్టే ధనాన్ని, ఆయొక్క సభలకీ గట్రాలకీ తగలెట్టకుండా, “బోల్డు” పుస్తకాలూ అచ్చేసి, “ప్రెపెంచెం” మీదకొదిలేస్తే, “అ, ఆ” లు నేర్చుకొనేవాళ్ళు, ఆలోచింపచేసే “అ, ఆ” లని నేర్చుకుంటారు.
    అదేకదా “ఆయనకి” కావల్సింది. అదేకదా కాళిదాసుకి మల్లినాధసూరి చేసింది.

  5. ఈమాట గురించి గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/23/2008 6:24 pm

    నా మునుపటి కామెంటులో ఈ కింది వాక్యం పొరపాటున ఎగిరిపోయింది. క్షమించాలి:

    ‘ఈమాటలో రాస్తున్నవారూ, కామెంట్లు చేస్తున్నవారూ ఎక్కువగా తెలుగు మీది అభిమానంతో రాస్తున్నవారే’.

  6. ఈమాట గురించి గురించి baabjeelu అభిప్రాయం:

    09/23/2008 9:12 am

    రోహిణీ ప్రసాద్ గారికి,
    పాలూ నీళ్ళూ వేరు చేసీసేరు. ఖచ్చితంగా చెప్పేరు.
    అయితే, పడక్కుర్చీ విమర్శకుల విలువ, informed (?) public opinion, సాహిత్య సేవ, ఎక్కువ తక్కువలయినా, ఎలాగో విపులీకరించి విశ్లేషించాలి దయచేసి.

    కొడవళ్ళ హనుమంతరావు గారికి,
    “ఎడ్మెంటు” సంగతి వదిలెయ్యండి. అది మీరెవరూ చూసే చాన్సు లేదు.మీకు చికాకు కలిగించినట్టు రాయడం నా చేతకాని తనం. “శ్రధ్ధ” “సబూరి” లేకపోతే ఇన్ని ఇబ్బందులు.మొదటి సారి రాసినపుడు, సరిగ్గా రాయలేకపోడానికి, కర్ణుడి చావుకున్న కారణాల్లా లక్షాతొంభైయున్నాయి. వాటినొదిలెయ్యండి.
    క్షమించాలి.
    రోహిణీ ప్రసాదు గారు సరిగ్గా పట్టీసేరు. అదే నా “ప్రెశ్న”?
    ఖానా గట్టు మీద బీడీలు కాల్చుకుంటూ “ప్రెపెంచకాన్ని” గుప్పు గుప్పు మని విమర్శంచడం రైటేనా? ఖానా గట్ల గురించి, సందేహం వుంటే, భైరవభట్ల వారు పూర్తిగా తీర్చగలరు. బీడీల గురించి సందేహంవుంటే, నాలాటి వాడెవడైనా తీర్చగలడని అనుకుంటున్నాను.సాఫ్ సాఫ్ గా అడుగుతున్నాను. ఎవరైనా ఎందుకు రాయాలి? ఎందుకు రాస్తారు?
    రజనీ గారడిగిన ప్రశ్నకి చలం గారు సమాధానమిస్తూAIR ఇంటర్వ్యూలో:
    “నన్ను, నాలో ఏఏ మచ్చలున్నాయో, వాటిని నేను గట్టిగా తిట్టుకోడంతో, వాటిని గట్టిగా గోక్కోడంలో, ఆ పుస్తకాలు-నేను వ్రాసిన పుస్తకాలన్నీ బయలుదేరాయి. అవి మిమ్మల్ని అనుకుని మీరు చాలా కోప్పడ్డారు. మిమ్మల్ని కాదు- నన్ను నేను తిట్టు కున్నది.”
    ఇందుకేనా రాస్తారు? ఇందుకేనా రాయాలి? ఇలా రాయకపోతే విమర్శకులు “కోర్ కోర్ శరణు కోర్” అని గగ్గోలెట్టడం రైటేనా? అలా గగ్గోలెట్టకపోతే తప్పా?
    ఈ మాట రచయిత(త్రు)లకీ, అభిప్రాయాలు రాసీవాళ్ళకీ వున్న సుఖం మిగిలిన పత్రికలకి రాసీ వాళ్ళకి లేదు. మా బతుకులు మేం బతుకుతూ, తీరికున్నపుడు “బాగా రాసేరు” అని అభిప్రాయమ్ముక్క పడేస్తే ఈ మాట వాళ్ళు, చక్కగా వేస్తారు. కొంపదీసి ఇదా సాహిత్య సేవ?

  7. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి vasu M.S.C. అభిప్రాయం:

    09/23/2008 6:56 am

    మీరు రాసిన ఈ వ్యాసము బాగుంది.

  8. పడవ మునుగుతోంది గురించి aswartha అభిప్రాయం:

    09/23/2008 4:53 am

    మనసును తాకిన మానవత్వపు వాస్తవం…

  9. ఈమాట గురించి గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/22/2008 8:44 pm

    బాబ్జీలుగారు అడిగిన ప్రశ్న సబబే. సంగీతమైనా, సాహిత్యమైనా, సినిమాలైనా వాటి గురించి కామెంట్లు చేసే ఒక మేధావి (?) వర్గం ఎప్పుడూ ఉంటుంది. ఇది ఒకరకంగా arm chair criticism. ‘వేళ్ళకు మట్టి అంటుకోకుండా’ వెలిబుచ్చే అభిప్రాయాలు ఎటువంటివైనా వాటికి ground realities తో సంబంధం లేకపోవచ్చు (కొన్ని సందర్భాల్లో). ఉదాహరణకు ఫలానా సినిమా, లేదా పాట గురించి చేసే కామెంట్లు in isolation అనిపించవచ్చు. సినిమా తీసిన దశాబ్దాల అనంతరం కూడా వాటి మంచిచెడ్డల గురించి చెప్పుకోవడం పరిపాటి. అప్పటి దర్శకులూ, సంగీత దర్శకులూ, నటులూ ఎటువంటి సమకాలీన సమస్యలకు లోనయారో ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు. అయినా మన విమర్శ కటువుగానే ఉంటుంది. రచయితల్లో ‘కూటి కోసం’ పాకులాడేవాళ్ళు తక్కువే కనక వారి గురించిన ప్రతి విమర్శా కర్కశంగానే ఉంటుంది.

    అయితే ఈ పడక్కుర్చీ విమర్శకుల విలువ చాలా ఎక్కువ. ఇదొక రకమైన informed (?) public opinion. అంచేత ఇది సాహిత్య సేవా అనడిగితే అవుననే చెప్పాలి. అందులో కాస్త ఎక్కువతక్కువలుండచ్చుగాక.

  10. ఈమాట గురించి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/22/2008 7:56 pm

    బాబ్జీలు గారూ,

    మీరేమడుగుతున్నారో నాకు బొత్తిగా అర్థమవలేదు. సందర్భం ఏమిటో గూడా తెలియలేదు. “నైన్ టూ ఫైవ్” ఎడ్మెంట్ లో సదాశివ్ అమ్రాపుర్కార్ బాధలా – అంటే ఏమిటో అసలే తెలియదు. ఇంటర్నెట్ లో వెతికితే అమ్రాపుర్కార్ సినిమా మనిషని తెలిసింది. సంబంధం అగమ్యగోచరం.

    మిగిలిన రచయితలకుండి ఈమాట రచయితలకి లేని ఇబ్బందులేమిటి? పొట్టపోషణకి సంబంధించినదా? వెంటనే సాహిత్య సేవ ని తెచ్చారు. నాకయోమయంగా ఉంది. క్షమించండి. కాస్త విపులీకరిస్తే సంతోషిస్తాను.

    కొడవళ్ళ హనుమంతరావు