పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి baabjeelu అభిప్రాయం:

    11/12/2008 6:05 am

    కొడవళ్ళ హనుమంతరావు గారూ, నమస్తే. మీరు రాసినట్టు ఈ పుస్తకాన్ని తెలుగులో రాసినట్టుంటే మరీ బాగుండేది. వేలూరి గారు ఇచ్చిన synopsis బాగుందనడం మాత్రం బాగోలేదు.

    She concludes it with clear understanding of feminism అని వేలూరి వారు వొప్పుకున్న paragraph ని ఎలా వొప్పుకోవాలీ? “blaming it on entirely on male population” lopsided ఎలా అయిందీ? మగవాళ్ళ వల్ల కాకపోతే ఇంకెవరివల్ల ఆడవాళ్ళు అలా వున్నారు? పశు పక్ష్యాదులూ, చెట్లూ చేమలూ అష్టదిక్పాలకులూ మరియూ పంచభూతములూ మధ్యలో జొరబడలేదే?
    లూషన్ చెప్పింది అక్షరలక్షలు కదా? ఆడపిల్ల పాడయిపోయిందని సంఘం బాధపడి పోవడం మగవాడివల్లేకదా? పాడైపోయింది, పాడైపోయింది. మన పరువు గంగలో కలిసిపోయింది అని గగ్గోలు పెట్టేది ఆ ఆడపిల్లని పుట్టించిన వాడూ, ఆ పిల్ల టోడబుట్టిన మగవాళ్ళూ కాదా? కాదా?

    ఆయనెవరో, “లక్ష్మన్న” గారి “రే” వ్యాసం కి రాసిన అభిప్రాయంలో ఇక్కడంతా పాత తరం అనీసేరు. నిజవేఁ కాబోలు. కానీ ఇంత పాత తరం అనుకోలేదు. పుస్తకాన్ని సమీక్ష చెయ్యడం అంటే అబ్బో అబ్బో అని పొగడక్కర్లేదు. వొప్పుకోని విషయాల్లో ? పెట్టలి సమీక్షకుడో, synopsis రాసేవాళ్ళో.

    హనుమంతరావుగారూ, మీరు చెప్పినట్టు ఈ పుస్తకం needs more critical review. అయినా 2008 లో డెబ్భయ్యైదు ముందు నవలామణులు రాసిన వాటి గురించి రాసిన పుస్తకం పాచి బూరి. పర్లేదు, బానేవుంది అనడం “సరస్పతికి” అపచారం. అలా అనడం వలన నిడదవోలు మాలతి గారిని అవమానించినట్టు కాదు. మనలోని lopsidedness ఇంకా అలాగేవుందని వొప్పుకోడం.
    హనుమంతరావుగారూ, మీరొప్పుకుంటారేమో గానీ, నేనొప్పుకోను.

  2. నాకు నచ్చిన పద్యం: భాస్కర రామాయణంలో వర్షాగమన వర్ణన గురించి mOhana అభిప్రాయం:

    11/12/2008 6:00 am

    మనకు దొరికిన పుస్తకాలనుండి శార్దూలవిక్రీడితాన్ని అశ్వఘోషుడే మొట్టమొదట వాడినట్లు అనిపిస్తుంది. భాసుడు అశ్వఘోషుని పిదప జీవించాడు. సంస్కృత నాటకకర్తలలో ఇతడే బహుశా మొదటివాడు.
    కాళిదాసు కూడా ఇతడిని చాలా ప్రశంసించాడు. వెన్నెలపైన భాసుడి చాటువును కింద ఇస్తున్నాను –

    కపోలే మార్జారః పయ ఇతి కరాల్లోఢి శశిన-
    స్తరుచ్ఛిద్రప్రోతాన్ బిసమితి కరీ సంకలయతి
    రతాంతే తల్పస్థాన్ హరతి వనితాప్యంశుకమితి
    ప్రభామత్తశ్చంద్రో జగదిదమహో విప్లవయతి

    నేను తెలుగులో దీనిని అనువదించే బదులు ప్రొఫెసర్ బెర్రీడేల్ కీత్ గారి ఆంగ్లానువాదాన్ని ఇస్తున్నాను –

    When its rays fall on its cheeks
    the cat licks them, thinking them milk;
    When they are caught in the cleft of a tree
    the elephant deems them a lotus;
    When they rest on the couch of lovers
    the maiden seizes them, saying,
    “”Tis my robe”;
    The moon in truth, proud of its brilliance,
    doth lead astray all this world.

    విధేయుడు – మోహన

  3. కరుణ ముఖ్యం గురించి appaji అభిప్రాయం:

    11/12/2008 3:33 am

    అర్ధమే లేని చదువు ఎందుకో తెలీక
    మృత దీవుల్లో కుళ్ళి పోయే నా మీద,
    చలానికి జాలేమో పాపం
    ఆనందపు అత్తర్ల
    తుంపర్లు అలా అలా జల్లుతాడు
    ఎంత అందం జీవితం!”

  4. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/11/2008 9:19 pm

    Congratulations to Malathi గారు on completing the project she started a quarter century ago! I wish she wrote this in Telugu as it would have gained a much wider well-deserved discussion. Veluri గారు gave a good synopsis of the work but what the book needs is a more critical review.

    Kodavalla Hanumantha Rao

  5. చంపకోత్పలమాలల కథ గురించి mOhana అభిప్రాయం:

    11/11/2008 6:17 pm

    పుస్తకాలను తిరగవేస్తుంటే క్రింది పద్యము కనబడింది. ఇది కడప జిల్లా చదిపిరాళ్ళ గ్రామంలో క్రీస్తుశకం 9 – 10 శతాబ్దాల మధ్య కాలపు శాసనంలోని ఉత్పలమాల.
    ఈ పద్యాన్ని ఆదినారాయణ శాస్త్రి వ్రాసిన రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం అనే పుస్తకంలో చూచాను.

    అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
    త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
    రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
    ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్

    ధనము శాశ్వతమైనది కాదు. శరీరము నశ్వరమైనది. జీవము తత్వార్థము కాదు. యమునిచే దండనార్హమైనది. దీనిని నమ్మరాదు. పరార్థానికై, ఎన్నడు మాసిపోని ధర్మార్థమును అందఱు అమ్మన ప్రెగ్గడలా గొప్పగా చేయండి.

    ఈ ఉత్పలమాల బహుశా తెలుగులో మొదటి ఉత్పలమాలలలో ఒకటి అనుకొంటాను. విధేయుడు – మోహన

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి ప్రజాపతి అభిప్రాయం:

    11/11/2008 9:47 am

    మంచి రచన. చాలా పరిశోధన చేసి వ్రాసారు. త్యాగరాజు గురించిన ఇన్ని విశేషాలు ఒకే చోట చదవడం ఇదే ప్రథమం. రీసెర్చి పేపర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న వ్యాసం.

  7. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష గురించి baabjeelu అభిప్రాయం:

    11/11/2008 6:16 am

    కృష్ణమోహన్ గారూ, నమస్తే.
    చాలా వివరంగా, బాగా రాశేరు. పూర్తిగా చదివేక నాలాటి సత్తరకాయగాడికి తెలిసిందేటంటే, ఒకప్పటి “ఖర్గపూర్” కీ లేదా తత్సమానికీ, ఇప్పటి “డెట్రాయిట్” లేదా తత్సమానికీ తేడా ఏటీ లేదని.

  8. అసమర్థులు గురించి lyla yerneni అభిప్రాయం:

    11/10/2008 3:18 pm

    “an excellent story on the psychological suppression of women by family, before and after marriage. No society can be called civilized, till its women are free, physically and psychologically”.

    -venkat chitta అభిప్రాయం

    మీరు కథ సాంతం చదివారా?

    ఈ కథలో ఎన్ని పాత్రలు ఉన్నాయి? కథలో మగవాళ్ళున్నారా? ఒకవేళ ఉంటే ఎందరున్నారు? వారి మానసిక స్థితిగతుల మీద, వారి స్వాతంత్ర్యం మీద మీ అభిప్రాయం ఏమిటి?

    లైలా.

  9. ప్రేమ కవితలు గురించి mOhana అభిప్రాయం:

    11/10/2008 7:49 am

    నాకు మూడవ అభిప్రాయం అర్థం కాలేదు. దానిని సంస్తుతి అనుకోవచ్చా లేక నింద అనుకోవాలా? నాకేమో కవిత చక్కగా ఉంది. కవితలో చెప్పిన దానికంటే చెప్పనిది ఎంతో ఉంది. పాఠకుల ఊహకు, ప్రేమికుల ఊహకు ఈ కవిత పల్లవి అయితే చరణాలను వారే వ్రాసికోవాలి. విధేయుడు – మోహన

  10. అసమర్థులు గురించి srinivas అభిప్రాయం:

    11/09/2008 10:29 pm

    అద్బుతంగా రాసారు . డాక్టర్ కూడా ఆమె లాగానే అని భలే ట్విస్ట్ ఇచ్చారు. నాకు ఇది ప్రెడిక్టబుల్ కాదు అనిపిస్తుంది. ఆల్రెడి అనురాధ గారు చెప్పారు. మనలో చాలా మంది ఇలా ఉన్నారు. నైస్ స్టోరీ.