ఈ పై పద్యం గురించే మీరు చెప్పేది! ఈ పద్యం ఉత్పల మాల ఐతే అవునేమో గాని పద్యం స్ఫుట బలోక్తితో మాత్రం పిటపిట లాడిపోటల్లేదు. మొత్తం కలిపి చదివితే ఈ పద్యానికి అసలు అర్థమే లేదు అనిపిస్తున్నది. The conclusion (or rather the advice given ) is incongruous.
Care to explain?
-లైలా యెర్నేని
ఈ పద్యానికి అర్థమే లేదన్నారు. మొదట మీరు వ్రాసింది అదేనా అని ఒక రెండు సార్లు చదివాను. తర్వాత. వ్యంగ్య ప్రయోగమా అని సరి చూసాను. అదీ కాదు. అంటే నిజంగా మీకు అర్థం కాలేదు.
ఒక పద్యానికి అర్థమే లేదు అని చెప్పాలంటే కొంత మీమాంస అవసరమే. మీరు ఎంత ఆలోచించారొ తెలియదు. చాలా మంది ప్రస్తుతం తెలుగు “కవులు” ‘తెలియని వన్ని తప్పులని…” చెప్పడం పరిపాటి అయ్యింది. మీరలా కాదనుకొన్నాను. ఇక పద్యం లోకి వస్తే
ఇది చాలా సూటిగా దూసుకు పోయే పద్యం – భారతీయ తత్వంలో కర్మ ఫలానికి ఉన్న గొప్ప దనం కాస్తో కూస్తో పూర్వ రచనలతో పరిచయమున్న ప్రతి వారికి తెలుసు. జీవితంలో ఏది అశాశ్వతం , ఏది శాశ్వతం అనేది నిక్కచ్చి పదాలతో బలంగా చెపుతోందీ పద్యం. అర్థం అశాశ్వతం అనే బలమైన ఎత్తుగడతో మొదలై (కవి కాలాన్ని గమనించండి). శరీరం అశాశ్వతం అని ఆ తర్వాత ఏది శాశ్వతం అని చెపుతోందీ పద్యం. (మోహన గారి వివరణ తర్వాత అసలు ఈ పద్యానికి ఇంకా వివరణ అనవసరమనుకున్నాను. )
లైలా గారు అప్పుడప్పుడు కొంచెం భారతీయ సాహిత్యం చదువుతూ ఉండండి నిదానంగా అదే అర్దమవటం మొదలవుతుంది.
రిత్విక్ ఘటక్ ఒక ఇంటర్వూలో (ఈ పేజిలో పన్నెండవ ప్రశ్శకి సమాధానంలో) పథేర్ పాంచాలీ నేపథ్య సంగీతాన్ని మెచ్చుకుంటూ థీమ్ మ్యూజిక్ కి స్పూర్తి నల్ల అమెరికన్ల జానపద పాట అంటాడు –
“I enjoyed Pather Panchali’s music a lot, but the theme music Ravi Shankar copied from a black American folk song named Swan’s River.”
సాయి గారు,
ఆనంద భైరవి గురించి సాంబమూర్తి గారి ఆధారంతో మీరు రాసిన కథ కూచిపూడి భాగవతులకు త్యాగయ్య చేసిన ఉపకారముగా మా నాన్నగారు అంటుండేవారు. కూచిపూడి భాగవతుల సంచారము ఆ నాటికే తంజావూరు-తిరువాన్కూరు కు చేరింది.
సరిగ్గా నలభై సంవత్సరాల క్రిందట బాలమురళిగారి కచేరిని నేను దెహ్రాదూన్ లోవిన్నాను. అక్కడకు వచ్చేముందు ఆయన ఢిల్లీలో కూడా కచేరి చేశారు. అప్పుడు హిందూ పత్రికలో వచ్చిన తమిళ రసికుని విమర్శేమిటంటే బాలమురళి రెండవ స్థాయి వాద్యకారులను పెట్టుకొని తాను వెలిగిపోయే ప్రయత్నాలు చేశారని. ఆకారణంగానో మరెందువల్లనో గాని ఆయన దెహ్రాదూన్ చేరుకొనేసరికి వాయులీన సహకారుడు లేకుండాపోయాడు. స్థానిక ఆహ్వానసంఘంవారు అక్కడే హిమాలయన్ రేడియో ప్రోపగేషన్ సెంటరు లో పనిచేస్తున్న శ్రీ ఎ వి యస్ కృష్ణారావు గారిని యేర్పాటు చేశారు. కృష్ణారావుగారి వయొలిన్ వాదనను అంతకు ముందు ఆంధ్రాయూనివర్శిటీ రోజులనుంచీ విన్నవారెందరో సభలో వున్నారు. ఆనాటి చాలామంది శ్రోతలలో యేర్పడిన అభిప్రాయమేమిటంటే బాలమురళి గాత్రంకన్నా వాయులీన సహవాద్యమే ఒకమెట్టుపైనవుందని. ఒకటి రెండు సార్లు కృష్ణారావుగారిని పక్కకునెట్టే ప్రయత్నంచేసి సఫలంకాకపోగా చివరకు వారిని అభినందించక తప్పని పరిస్తితి యేర్పడ్డది. అమెరికాలో గత పుష్కరకాలంలో ఆయనను చాలా కచేరీల్లో చూశాను, విన్నాను. కాని ఆ నాటి ధోరణి కనపడలేదు. మరి అప్పటి ప్రవర్తనకు వర్ధమాన గాయకులకుండే భద్రతారాహిత్యమేనా కారణం? లేక తోటి కళాకారులపట్ల గౌరవంపెరిగిందా?
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Indrani Palaparthy అభిప్రాయం:
11/13/2008 10:11 pm
కృష్ణ గారు, ఎవరిని అడగాలా అని తికమక పడడం ఎవరి ఆనందాన్ని భంగం చేయడం ఇష్టం లేకే.ఆ మాటకొస్తే సన్యాసిని కూడా అడగ వచ్చును కదా!.
పాలపర్తి ఇంద్రాణి.
ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి Jyothi అభిప్రాయం:
11/13/2008 9:51 pm
ఈమాట సంపాదకవర్గానికి, పాఠకులందరికి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
చంపకోత్పలమాలల కథ గురించి Garikapati అభిప్రాయం:
11/13/2008 7:07 pm
ఈ పద్యానికి అర్థమే లేదన్నారు. మొదట మీరు వ్రాసింది అదేనా అని ఒక రెండు సార్లు చదివాను. తర్వాత. వ్యంగ్య ప్రయోగమా అని సరి చూసాను. అదీ కాదు. అంటే నిజంగా మీకు అర్థం కాలేదు.
ఒక పద్యానికి అర్థమే లేదు అని చెప్పాలంటే కొంత మీమాంస అవసరమే. మీరు ఎంత ఆలోచించారొ తెలియదు. చాలా మంది ప్రస్తుతం తెలుగు “కవులు” ‘తెలియని వన్ని తప్పులని…” చెప్పడం పరిపాటి అయ్యింది. మీరలా కాదనుకొన్నాను. ఇక పద్యం లోకి వస్తే
ఇది చాలా సూటిగా దూసుకు పోయే పద్యం – భారతీయ తత్వంలో కర్మ ఫలానికి ఉన్న గొప్ప దనం కాస్తో కూస్తో పూర్వ రచనలతో పరిచయమున్న ప్రతి వారికి తెలుసు. జీవితంలో ఏది అశాశ్వతం , ఏది శాశ్వతం అనేది నిక్కచ్చి పదాలతో బలంగా చెపుతోందీ పద్యం. అర్థం అశాశ్వతం అనే బలమైన ఎత్తుగడతో మొదలై (కవి కాలాన్ని గమనించండి). శరీరం అశాశ్వతం అని ఆ తర్వాత ఏది శాశ్వతం అని చెపుతోందీ పద్యం. (మోహన గారి వివరణ తర్వాత అసలు ఈ పద్యానికి ఇంకా వివరణ అనవసరమనుకున్నాను. )
లైలా గారు అప్పుడప్పుడు కొంచెం భారతీయ సాహిత్యం చదువుతూ ఉండండి నిదానంగా అదే అర్దమవటం మొదలవుతుంది.
భవదీయుడు
గరికపాటి
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి lyla yerneni అభిప్రాయం:
11/13/2008 2:44 pm
“For the record, my book is not about feminism.”-Malathi Nidadavolu
Thank God!
Very interested in reading what you had to say about these women writers. I read some of them, and I love their story telling. They are very lively.
Veluri increased my interest in the book.
Amazon లో చూశాను. ఇప్పుడు లేవు పుస్తకాలు. త్వరలో వస్తాయి అని ఉంది. మాలతీ! మీ పుస్తకం కోసం ఎదురు చూస్తాను.
లైలా.
రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి రమణ అభిప్రాయం:
11/13/2008 2:08 pm
రిత్విక్ ఘటక్ ఒక ఇంటర్వూలో (ఈ పేజిలో పన్నెండవ ప్రశ్శకి సమాధానంలో) పథేర్ పాంచాలీ నేపథ్య సంగీతాన్ని మెచ్చుకుంటూ థీమ్ మ్యూజిక్ కి స్పూర్తి నల్ల అమెరికన్ల జానపద పాట అంటాడు –
“I enjoyed Pather Panchali’s music a lot, but the theme music Ravi Shankar copied from a black American folk song named Swan’s River.”
http://dipanjanc.blogspot.com/2007/06/interview-with-ritwik-kumar-ghatak-1975.html
– రమణ
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి karverababu అభిప్రాయం:
11/13/2008 10:59 am
సాయి గారు,
ఆనంద భైరవి గురించి సాంబమూర్తి గారి ఆధారంతో మీరు రాసిన కథ కూచిపూడి భాగవతులకు త్యాగయ్య చేసిన ఉపకారముగా మా నాన్నగారు అంటుండేవారు. కూచిపూడి భాగవతుల సంచారము ఆ నాటికే తంజావూరు-తిరువాన్కూరు కు చేరింది.
బాలమురళీకృష్ణ సంగీతం గురించి Rao Pamganamamula అభిప్రాయం:
11/13/2008 9:57 am
సరిగ్గా నలభై సంవత్సరాల క్రిందట బాలమురళిగారి కచేరిని నేను దెహ్రాదూన్ లోవిన్నాను. అక్కడకు వచ్చేముందు ఆయన ఢిల్లీలో కూడా కచేరి చేశారు. అప్పుడు హిందూ పత్రికలో వచ్చిన తమిళ రసికుని విమర్శేమిటంటే బాలమురళి రెండవ స్థాయి వాద్యకారులను పెట్టుకొని తాను వెలిగిపోయే ప్రయత్నాలు చేశారని. ఆకారణంగానో మరెందువల్లనో గాని ఆయన దెహ్రాదూన్ చేరుకొనేసరికి వాయులీన సహకారుడు లేకుండాపోయాడు. స్థానిక ఆహ్వానసంఘంవారు అక్కడే హిమాలయన్ రేడియో ప్రోపగేషన్ సెంటరు లో పనిచేస్తున్న శ్రీ ఎ వి యస్ కృష్ణారావు గారిని యేర్పాటు చేశారు. కృష్ణారావుగారి వయొలిన్ వాదనను అంతకు ముందు ఆంధ్రాయూనివర్శిటీ రోజులనుంచీ విన్నవారెందరో సభలో వున్నారు. ఆనాటి చాలామంది శ్రోతలలో యేర్పడిన అభిప్రాయమేమిటంటే బాలమురళి గాత్రంకన్నా వాయులీన సహవాద్యమే ఒకమెట్టుపైనవుందని. ఒకటి రెండు సార్లు కృష్ణారావుగారిని పక్కకునెట్టే ప్రయత్నంచేసి సఫలంకాకపోగా చివరకు వారిని అభినందించక తప్పని పరిస్తితి యేర్పడ్డది. అమెరికాలో గత పుష్కరకాలంలో ఆయనను చాలా కచేరీల్లో చూశాను, విన్నాను. కాని ఆ నాటి ధోరణి కనపడలేదు. మరి అప్పటి ప్రవర్తనకు వర్ధమాన గాయకులకుండే భద్రతారాహిత్యమేనా కారణం? లేక తోటి కళాకారులపట్ల గౌరవంపెరిగిందా?
జనరంజని: మహానటి సావిత్రి గురించి PraveenReddy అభిప్రాయం:
11/13/2008 3:13 am
శ్రీనివాస్ గారు మీకు చాలా థాంక్సు.
రెండు తీరాలు గురించి kavya అభిప్రాయం:
11/13/2008 12:51 am
చాలా బాగుంది.
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి krishna a అభిప్రాయం:
11/12/2008 10:22 pm
మేకలు తోలే పిల్లని అడగ వచ్చుకదా. మరి సమస్య ఏమిటి?