పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. అమెరికా సంక్రాంతి గురించి M.S.Prasad అభిప్రాయం:

    02/11/2009 3:36 am

    చా లా బాగుంది. యతి కావాలనే చాలా చోట్ల వదిలేసినట్టుంది కానీ ఈ విషయాలు మన పద సంపదను పెంచుకోదానికి వుపయోగపదుతాయి కాబట్టి తప్పకుందా పాటించాలి. మిమ్మల్ని చూసి ప్ర్రారంభకులు అనుకరణ వల్ల చాలా పద సంపద పెంచుకోకుందా నష్ట పోతారు

  2. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి రాఘవ అభిప్రాయం:

    02/10/2009 10:14 pm

    కామేశ్వరరావుగారూ, చాలా విషయాలు తెలిసాయండీ ఈ వ్యాసం చదివాక. ముఖ్యంగా సోమన ఎందుకు విలక్షణమైన కవి అని మీరు ప్రతిపాదించిన మూడు లక్షణాలు గమనించదగినవి. మీకు కృతజ్ఞతాదర ప్రణామాలు.

  3. నందిని గురించి మురళి అభిప్రాయం:

    02/07/2009 10:33 pm

    ‘గేటెడ్ కమ్యునిటీ’ చదివాక అక్కిరాజు భట్టిప్రోలు పేరు బాగా గుర్తు పెట్టుకున్నాను. కాని చదివిన కథలు తక్కువే..రాసినవే తక్కువని ఇప్పుడే తెలిసింది. కొత్తపాళీ గారి వల్ల ఈ కథ చదవగాలిగా. నేను ఊహించినట్టుగానే బాగుంది కథ. రాస్తూ ఉండండి..

  4. అంతర్మథనం గురించి nutakki Raghavendra Rao అభిప్రాయం:

    02/07/2009 5:15 pm

    గొప్ప రచయితలు మీరు. రాస్తూనే ఉండాలి. స్థానికత తొంగిచూసింది కథలో. మనిషి మనసులో వివిధ సందర్భాల్లో కొనసాగే వాస్తవ భావసంచలనమే మీ కథా సంవిథానం. మీ కథా, కథనం రెండూ బాగున్నాయి. ఇంకా కథలు రాయండి.

  5. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి K. Rohiniprasad అభిప్రాయం:

    02/06/2009 10:12 am

    అభిప్రాయాలు రాసే పద్ధతి మర్యాదపూర్వకంగా ఉంటే bickerings తగ్గుతాయి. ఈ విషయంలో మోహనరావుగార్ని ఆదర్శంగా తీసుకోవచ్చు.

  6. రచయితలకు సూచనలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/06/2009 9:33 am

    చాలా మంచి సూచన చేసేరు మీరు రోహిణీప్రసాద్ గారూ!!

    ఒక ఝంపా లహరి వంటి రచయిత్రి..ఇన్నేళ్ళ ల్లోనూ తెలుగు వారి లోంచి రాలేదేమన్న విమర్శ ఆంధ్రదేశం లో ఎప్పట్టునుంచో ఉంది. తెలుగు వాళ్ళు తెలుగులో ఎక్కువ రాయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప.. అమెరికాలో ఉన్న మిగతా జాతుల వారికి…తెలుగు జీవితాన్ని పరిచయం చేసే పని ఇప్పటిదాకా సృజనాత్మక రంగాల్లో ఏ మేరకు చేసేరో ఇక్కడ స్పష్టంగా ఎవరికీ తెలీదు మరి.

    .. మీరన్న ట్టుగా అమెరికా లోనూ..అలాగే యూరోప్ లోనూ ఉన్న తెలుగు వారి జీవితాల్లో వస్తున్న అనేక రకాల మార్పులు ఏ తరహా లో ఉన్నవీ కూడా..చెప్పడం… అందులోని క్లిష్టత ల్లోంచి వ్యక్తంచెయ్యగల్గితే ఎవరైనా… అప్పుడు మాత్రమే వైవిధ్య మైన రచనలు రాగల వీలు ఎక్కువ ఉంది.

    ఇప్పటికీ అక్కడ ఉన్న వారు ఎక్కువగా nostalgia నే చూపించడం కన్పిస్తుంది. ఇది తప్పు కాదు..కానీ తప్పని అంశం అయిపోతే మాత్రం..కాస్త కష్టమే చదివే వాళ్ళకి. ఇదివరలో వేరే దేశాల గురించిన కుతూహలం..అలాగే అక్కడ ఎలా బతుకుని నెట్టుకొస్తున్నారా అన్న భయం ఇక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటికొకరు చొప్పున వేరే దేశాల్లో ఉంటున్నారు. గనక అంత కుతూహలం ఇవాళ కన్పించదు .నా ఉద్దేశ్యంలో తెలుగు వాళ్ళకి వేరే భాషల్లో చెప్పగల నైపుణ్యం అవసరం.

    Now Indian diaspora is no more an isolated segment in the US. It is playing vital and vibrant role in social mileu as well as political field in the country they adopted. Telugus, for that matter all ethnic groups ,are very strategically placed, from where they can globalise the local isssue and at the same time localize the things that are global.

    ఝుంపాలహరి ఒక అనుభవానికి ఉదాహరణ అయితే..రాజారావు ఇంకొక అనుభవానికి ఉదాహరణ. అలాగ అని నా అభిప్రాయం.

    రమ.

    note: మీరు కాల్పనిక సాహిత్యం్ కాకుండా అని____ అన్న ది..నేను గమనించాను. కానీ కాల్పనిక సాహిత్యానికి బలం ఎక్కువ. దాని వల్ల ఒకజాతికి వచ్చే గుర్తింపు ప్రత్యేకమైంది. అయితే రచయితల్ని ఎవరూ తయారుచేయలేరు. అందువల్ల ఆ లోటుని మిగతా అంశాలు పూర్తిచేయగల్గితే మంచిదే!! అయితే వీలైనంత వరకూ తెలుగువాళ్ళు తెలుగు వాళ్ళ కన్నా..వేరే భాషల వాళ్ళకి తెలుగు వారిని గురించి చెప్పటమే ఎక్కువ అవసరం.

  7. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/06/2009 12:25 am

    అక్షర గారూ !!

    నాలుగో గోడ పుస్తకం మీద నాకున్న అభిప్రాయం మాత్రమే అది. నాతో విభేదించే హక్కు … ఎవరికైనా కూడా ఉంది. మీ కుతూహలాల విషయం లో నాకు కుతూహలం లేదు. నాటకం ప్రస్తావన లో ..చర్చని కొత్త దిశగా మ లుపు తిప్పడం కోసం కొన్ని కొత్త అంశాలు లేవనెత్తడం జరుగుతుంది. నాది అటువంటి ఒక ప్రయత్నం మాత్రమే! కొత్త అంశాల ప్రస్తావన ఎప్పుడూ కూడా పత్రిక లోని చర్చల పరిధిని పెంచుతుంది.అయితే వ్యంగ్యం మాత్రమే ముఖ్యమైపోవడం వల్ల… అసలు విషయం పోయి కొసరు మిగులుతుంది. నాకు అటువంటి వాటిల్లో ఏమాత్రం ఆసక్తి లేదు. నాకు “అక్షరం” విలువ బాగా తెలుసు. గనక క్లుప్తంగా నే చెబుతున్నాను.నా అభిప్రాయాన్ని…… నాటకం గురించి ఎవరు ఏం మాట్లాడినా..ఎక్కడ మాట్లాడినా..పుస్తకంగా నాలుగో గోడ నీ..రచయిత్రి గా జయప్రభ గారి కృషినీ..చెప్పటం లో ఔచిత్యం ఉంటుంది. నా అభిప్రాయాన్ని చెప్పే హక్కు నాకు ఉంది.
    నా ఉద్దేశ్యం ఇంత మాత్రమే !!
    రమ

  8. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి అక్షర అభిప్రాయం:

    02/05/2009 2:14 am

    @rama bharadwaj (February 4, 2009 10:18 am )
    >>నాటకం గురించి వచ్చిన మంచి పుస్తకం జయప్రభ గారి “నాలుగో గోడ”. తెలుగు నాటకం మీద వచ్చిన మంచి పరిశోధన ఇది.. తెలుగు నాటకరంగం మీద అదివరకు ఎవరూ చేయని కొత్త చర్చలన్నీ… మొదటగా 91 ప్రాంతాల్లోనే ఈ పుస్తకం లో చోటుచేసుకున్నాయి.

    ఇది మీ సొంత అభిప్రాయమనుకుంటున్నాను. మీకు నచ్చింది కాబట్టి మీకు మంచి పుస్తకమై ఉండొచ్చు. అలాగే మంచి పరిశోధనగా మీకు అనిపించి ఉండొచ్చు. పరుచూరి శ్రీనివాస్ గారన్నట్లు, ఈ మంచి పుస్తకం గురించి మీరే ఒక పరిచయ వ్యాసం వ్రాస్తే , ఆ పుస్తకం గురించి కనీసం మాలాంటి ఈమాట పాఠకులకైనా తెలుస్తుంది కదా!

    >మరి నాటకం గురించి మాట్లాడేవారెవ్వరూ ..ఈ పుస్తకం ప్రస్తావనే చేయడం లేదు.??

    అందుకు కారణాలు ఏమై ఉంటాయని మీరనుకుంటున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది.

    >తొలిగా వచ్చిన పుస్తకాన్ని గురించి పేర్కొన టం…ఒక మర్యాద కదా?

    అంటే ఇది తెలుగు నాటకరంగం గురించి వచ్చిన మొదటి పుస్తకమా?! అదీ 91 ప్రాంతాలలోనా? అనగా 91 కి ముందు, తెలుగు నాటకరంగం మీద అస్సలు పుస్తకాలే లేవా? ఒకవేళ ఈ నాలుగో గోడే తొలిపుస్తకమే అయితే, అందులో చర్చించిన క్రొత్త విషయాల మీద విస్తృతమైన (లేక సాధారణ) చర్చ ఏమైనా జరిగిందా? ఆ చర్చలకు సంబంధించిన వివరాలు చూడాలని ఆసక్తిగా ఉంది. అందుకు సంబంధించిన సమాచారం మీవద్ద ఏమైనా ఉంటే ఇవ్వగలరా? పోనీ సమాచారం ఎక్కడ లభ్యమౌతుందో వివరాలు ఇవ్వగలరా? ఒక మంచి పుస్తకం గురించి తెలుసుకోవాలనే తపనతో మిమ్ములను ఇవన్నీ అడుగుతున్నానని మనవి.
    ఒకానొక పుస్తకం గురించి పేర్కొనకపోవడం గురించి, వ్యాసకర్తలను నిలదీయడం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇకనుంచైనా వ్యాసాలు వ్రాసేవాళ్ళు, వ్యాస విషయమ్మీద మొదట వచ్చిన పుస్తకాన్ని మర్యాద పూర్వకంగానైనా పేర్కొంటారని ఆశిద్దాం! మొదట వచ్చిన పుస్తకాల వివరాలు వ్యాసకర్తలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఎవరైనా చేస్తే చాలా బేషుగ్గా ఉంటుంది.
    మీ ఉద్దేశ్యంలో మొదట వచ్చిన, పరిశోధనాత్మక మంచి పుస్తకం గురించి వ్యాసాల్లో (నాటకాలకు సంబంధించిన) పేర్కొనక పోవడం వెనుక, పుస్తకం గురించి వ్యాస రచయితకు తెలియక పోవడం, వ్రాసే వ్యాసానికి – పుస్తకంలో సమాచారానికి లింకు లేక పోవడం, లేక పుస్తకం నచ్చకపోవడం కాక మరేమైనా కారణాలను మీరు ఊహిస్తున్నట్లైతే, వాటి గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది.

    >మీ webzine అభిప్రాయాల్లో… ఇటువంటి వాటికి ఏమంత ప్రాముఖ్యతని ఇవ్వరు కాబోలు!

    చాలా బాగుంది. వెబ్జీన్ అభిప్రాయాల్లో పాఠకులు ఎలాంటి అభిప్రాయాలకు ప్రాముఖ్యత నివ్వాలో – ఎలాంటి అభిప్రాయాలు వ్రాయాలో, వేటి గురించి వ్రాయాలో, వేటి గురించి వ్రాయకూడదో , ఏ పుస్తకాలను కోట్ చెయ్యాలో – ఒక నియమ నిబంధనావళి తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది.

    >నాకు తెలిసినంతలో ఒక అంశం మీద మాట్లాడేవారు..ఆ అంశం మీద వచ్చిన ముఖ్యమైన పుస్తకం నించి..విషయాన్ని కోట్ చేయటం అన్న ది ..ఆ విషయానికి ప్రామాణికతని ఆపాదిస్తుంది. కన్యాశుల్కం గురించి చర్చించేటప్పుడు అప్పారావుగారి ప్రసక్తి తెచ్చిన ట్టుగా అన్నమాట.

    అంశానికి సంబంధించి మాట్లాడే వాళ్ళందరికీ ఉపయోగపడే ముఖ్యమైన ముక్క ఇది. ముఖ్యమైన పుస్తకం నుంచీ, ఏదో ఒక విషయాన్ని మీ అంశానికి సంబంధమున్నా లేక పోయినా కోట్ చేయాలి. వచన కవిత్వం గురించి వ్రాసే ప్రతి వ్యాసంలో శ్రీ.శ్రీ. మహాప్రస్థానం గురించి ప్రస్తావించడం మరచిపోకూడదు(ఇంకెవరైనా విస్మరణకు గురౌతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి కూడా ఉటంకించాలి). అలాగే కథ గురించి వ్రాస్తే గురజాడ ను స్మరించాలి(ఇంకెవరైనా విస్మరణకు గురౌతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి కూడా ఉటంకించాలి). మీ భావమిదేనా?! అయితే…అర్జంటుగా ఈ నిబంధనను కూడా వ్యాస రచయితలకు తెలియచేసి, పాటించని వాళ్ళ వ్యాసాలను పబ్లిష్ చెయ్యకూడదని సంపాదకులకు తాఖీదు పంపాలి.

    కన్యాశుల్కం లో అప్పారావుగారు విషయమా? ఆయన కన్యాశుల్కం నాటకాన్ని వ్రాసిన రచయిత కదా! పొరపాటు నాదే – మీరంటున్నది – కన్యాశుల్కం గురించి ఏదైనా వ్రాసేటప్పుడు అప్పారావు గారి ప్రసక్తి తేవడం గురించి కదూ?!

    ఇంతకీ నాటకరంగం మీద వ్రాసిన వ్యాసాల్లో “నాలుగో గోడ” ప్రసక్తి లేదనా లేక “నాలుగో గోడ” రచయిత(త్రి) ప్రస్తావన లేదనా? ఇది చాలా కన్ఫూజింగ్ గా ఉంది!

    ఇంతా వ్రాసిన తర్వాత, ముందు ముందు నేను నాటకరంగం మీద వ్యాసం వ్రాస్తే “నాలుగో గోడ” గురించి ప్రస్తావిస్తే సరిపోతుందా? రచయితను కూడా స్మరించాలా? లేక రచయితను, నాలుగో గోడను రెంటి గురించీ వ్రాయాలా?

    – అక్షర

  9. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/04/2009 10:33 pm

    బ్రహ్మానందం గారూ

    మరి మీరు..మొదలి వారినీ, అలాగే చాట్ల వారినీ “నాలుగో గోడ” గురించి అడగలేదా?? నాటకం గురించి వచ్చిన నాసిరకం పుస్తకాలు వాళ్ళకి తెలిసి “నాలుగో గోడ” వంటి విమర్శ తెలియక పోవటం సాధ్యం కాదు కదా??
    తెలుగు నాటక రంగం మీద్ కృషి చేసిన వారే లేరే?? చెప్పుకోగల్గినంతగా అని నా భావం. [మళ్ళీ పరుచూరి శ్రీనివాస్‌కి కోపం వస్తుంది కాబోలు నేనీ మాట అన్నందుకు. కానీ ఏం చెయ్యగలం? పేర్లు వల్లించినంత మాత్రాన ఆ పుస్తకం బుద్ధికి పదును పెట్టేది కూడా కావాల్సి ఉంటుందని శ్రీనివాస్‌ గారికి నేనెందుకూ చెప్పడం? ఆయనకి తెలియదు గనకా? అన్నీ తెలిసిన వారాయె!].

    బ్రహ్మానందం గారూ ! తెలుగు నాటకం మీద మీకున్న శ్రద్ధ సంతోషించదగ్గది. తెలుగు నాటకం ఈ నాటికీ నిలవ నీరు మాదిరిగా మిగిలిపోయిందని ఆ రంగం గురించి బాగా తెలిసిన వారు చాటుగా అంటూంటారు. ఇది నిజమేమో మరి శ్రీనివాస్ గారి లాంటి సర్వజ్ఞులు చెప్పాలి.

    రమ.

  10. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/04/2009 10:01 pm

    సంపాదకులకి,
    పరుచూరి శ్రీనివాస్ గారికి నా అన్ని అభిప్రాయాల పట్ల ఎందుకనో మరీ వ్యతిరేకత ఏర్పడింది. ఆయన నాకిచ్చిన సూచననే నేను ఆయనకిస్తున్నాను. చూడబోతే ఆయన భావకవిత్వం నించీ ఆధునిక తెలుగు నాటకం దాకా విషయ సంపన్నత బాగా కలిగిన వారుగా కన్పిస్తున్నారు. మంచి సాహితీవేత్త, సాహితీ విమర్శకులూ కూడా కావొచ్చు. నా దురదృష్టం ఏమో నేను ఆయన రచనలేవీ పుస్తకాలుగా ఇంత వరకూ చదవలేదు. ఆయన నా మీద ఒంటి కాలి మీద లేవటం తగ్గించి, తనకి క్షుణ్ణంగా తెలిసిన విషయాల మీద విపులంగా ఇంగ్లీషు వాక్యాల్లో కాక తెలుగు వాక్యాల్లో ప్రకటిస్తే, తెలుగు భాషా సాహిత్యాల కోసం ఈమాట చదవదలుచుకునే పాఠకులకి మరింత మేలు జరుగుతుంది కాదా??

    రమ.