రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అమెరికా సంక్రాంతి

రచన: పింగళి నరసింహ రావు
జనవరి 1999

సీ. పుష్య మాసము చాల పుణ్యకాలమ్మని
ఉదయ వేళకు కాస్త మునుపెలేచి
ఇంటి వాకిట చిమ్మి ఇంతులోపిక తోడ
ఇంపైన ముగ్గులు తీర్చు వేళ
ఆవు పేడను దెచ్చి యందాల పాపలు
గొబ్బెమ్మలను బాగ గూర్చు వేళ
పెద్దగా తల్లి గొబ్బెమ్మ యొక్కటి చేసి
పిల్ల గొబ్బెమ్మల బేర్చు వేళ

తే. నింగి గాలి పటములతో నిండు వేళ
గంగిరెద్దులు నర్తనమాడు వేళ
గుమ్మముల ముందు ముగ్గులు గొబ్బియమ్మ
బార్లు కిలకిల నవ్వెడి పర్వ వేళ

ఆ. రంగు రంగుల ముగ్గులు రంగవల్లి
పూలు గొబ్బెమ్మ బారులు భోగి మంట
గంగిరెద్దులు సన్నాయి గాలి పటము
అమెరికా దేశమందివి ప్రాప్తి లేదు!

తే. సున్నమున రంగవల్లిని సోయగమున
ఎట్టులో దిద్దుటిచటి కార్పెట్టు మీద
ఆవు పేడమ్ము గ్రోసరీ షాపు లేదె
గొబ్బియమ్మల నిచ్చట గూర్చుటెట్లొ

తే. ఎట్టులో కష్ట పడి ముగ్గు పెట్ట వచ్చు
కాని మంచది కురిసిన క్షణములోన
మాయమగు ముగ్గు, తెల్లటి మంచు తెరలె
ప్రకృతి తీర్చి కూర్చిన రంగ వల్లి ఇచట

ఆ. భోగి పళ్ళు పోయ రేగు పళ్ళవి లేవు
క్రాన్‌బెరీలు చాలు క్వార్టరులును
భోగి మంట లేక పోయినా హీటరు
నింపు వేడి గదుల నిండ ఇచట

సీ. న్యూయార్కు నగరపు నూత్న వీధుల మీద
బుడబుక్కలాడిని బోలినట్టి
చిత్ర వేష ధరులు ఎందరో ఉన్నారు
గంగిరెద్దు లొకటె కాన రావు
వదలక మీడియా వందల సారులు
మోనికా పై పాడు బుర్ర కథలు
నింగిని కానరావిట గాలి పటములు
డౌ జోన్సె గాలి పటమ్ముసుమ్ము

తే. కాంగ్రెసున మదగజములు గాడిదలును
గంగిరెద్దుల వేషముల్‌ గట్టినారు
బిల్లు క్లింటను స్టారును వేయు తాళ
గతికి గుడ్డిగ నాట్యమ్ము లాడినారు

తే. ఆంధ్ర దేశపు పల్లెల యందములకు
అమెరికా దేశమున గల యాధునికపు
జీవ గతికి సామ్యము లేదు జావళీకి,
మోనికా రిపోర్టుకు పోల్కె లేని రీతి

ఆ. చింత చిగురు చింత చెట్టున దొరకును
మల్టి ఫ్లోరు భవనమందు గాదు
సంకురాత్రి యంద చందాలు చవిచూడ
సీమ కాదు పల్లె సీమ మేలు!

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    M.S.Prasad February 11, 2009 3:36 am

    చా లా బాగుంది. యతి కావాలనే చాలా చోట్ల వదిలేసినట్టుంది కానీ ఈ విషయాలు మన పద సంపదను పెంచుకోదానికి వుపయోగపదుతాయి కాబట్టి తప్పకుందా పాటించాలి. మిమ్మల్ని చూసి ప్ర్రారంభకులు అనుకరణ వల్ల చాలా పద సంపద పెంచుకోకుందా నష్ట పోతారు

  2. 2
    Vidya June 1, 2011 9:39 pm

    బాగుంది. నాకు తెలుగు వ్యాకరణము తెలియదు. ఇందు మీరు సీసం, తేటగీతి, ఆటవెలది అనే ఉపజాతులు వాడారు.
    తెలుగు వ్యాకరణము గురించి మంచి పుస్తకములు యేమయినా వుంటే తెలుపగలరు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రాయాలని ఉంది!
  • అమెరికా సంక్రాంతి

ఇటువంటివే…

  1. అమెరికా ఆంధ్రుల ఆహ్వానం
  2. సిరుల సంక్రాంతి
  3. సంక్రాంతి
  4. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం (పాట )
  5. ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

జనవరి 1999 సంచికలో ...

  • అబ్బ.. పోనిద్దూ!
  • అమెరికా సంక్రాంతి
  • కట్నానికి కంప్యూటర్‌ముఖం
  • చేగోడీ కంప్యూటర్‌కంపెనీ
  • జనవరి 1999
  • జాషువా పిరదౌసి
  • డబల్‌యూ డబల్‌యూ డబల్‌యూ డాట్ నోస్టాల్జియా డాట్ కాం
  • పద్యశిల్పం
  • పాఠాలూపీఠాలూ
  • మన భాషలో అంకెలు, సంఖ్యలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పద్యశిల్పం
మన భాషలో అంకెలు, సంఖ్యలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.