పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. బోడి పద్యం గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:

    03/31/2009 4:39 pm

    ఈ కవితని, కవిని అర్థం చేసుకోవడానికి ఈ లంకెలోని వ్యాసం ఉపయోగపడుతుంది “అఫ్సర్‌ “వలస”, కల్పనా రెంటాల “కనిపించే పదం”” – మే 2002 ఈ మాట సంచిక http://www.eemaata.com/em/issues/200205/552.html

    గరికపాటి పవన్ కుమార్

  2. బోడి పద్యం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    03/31/2009 2:29 pm

    నర్సింహ గారు,

    పూలు, పూబోడులు, పిరుదులు మీకొంటబట్టవని చెప్పేరు గానె, ఎవరిష్టం వాళ్ళది దానికెవరేం జేస్తాం దేనికైనా అదురుష్టవుండాల. మీరోరంలో ఏడ్రోజులు దిద్దుతారా అ, ఆలు. మీ మందల మీరు జెప్పేరు, మీ దోస్తుల మందల కూడా మీరే జెప్పాలా, ఏంది వాళ్ళకి అ,ఆ లు దిద్దడం ఇంకా వొగదెగలా?

    శానరోజులకి ఈమాటలొ టీ గురించి, టీ పొడి గురించి ఇన్నాను. టీ తాక్కుండా, టీ పొడి తింటే వచ్చే కెఫిన్ హైలో ఈమాట సంపాదకత్వానికి మీరిచ్చిన చరిటిపికెట్టు వాళ్ళు ప్రేంగట్టిచ్చుకుని పెట్టుకోవాల. మరీ అంత డయిరెట్టుగా ఎవరోజెప్తే గాని ఈమాట సదవనంటే వోళ్ళు పీలవుతారేవో. అద్సరేగానె, తెల్ల పవరేంది? అదేడనుంచి పట్తకొచ్చావు. కెఫిన్ లెవెల్స్ కొంచం తగ్గిన తర్వాత, అప్సరు గోరి కవిత మీద ఒక అదరగొట్టే ఇమర్స రాయగూడదా మీరు.

    రవి

  3. బోడి పద్యం గురించి యాద్గిరి అభిప్రాయం:

    03/31/2009 12:02 pm

    అన్నా నర్సిమ్మన్నా, మస్తుగ రాసినవే.

    ఎవురో సెప్పిన్రు, అఫ్సర్ కవిత మీద మస్తు లొల్లి పడ్తున్నరని ఈడ.

    గీ లొల్లి పడుడేందే? మా ఊళ్ళ లొల్లి జేస్తరు. ఇంకొన్ని ఊర్లళ్ళ గొడవ జేస్తరు/పడ్తరు. నీ బాస జరింత అటీటు గాకుండుంది. నువ్వు అ,ఆలు ఏడ నేర్సినవే?

    తెల్ల పొగరు అణగిపోవాల.

    గీడ తెల్లోల్లెవరె? ఎప్పుడో మనదేశం ఇడిసిపెట్టిండ్రు గదనే. కొంపదీసి గీ కైత అమ్రికోళ్ళ మీదన యేంది?

    ఈ మాటలో కూడా జబర్దస్తు కయితలు వస్తయని ఎడిటర్లు జర సమజున్నోళ్ళే అని ఇయ్యాల్నె సమజయ్యింది.

    ఈమాటల కైతలు ఏడిటర్లు రాయరె నర్సిమ్మన్నా. శనాది వారలల్ల అ,ఆ,ఇ,ఈ లు నేర్సినోల్లే రాస్తరే. ఎడిటర్లు ఎస్కోవల్నా లేదా అని డిసైడ్ జేస్తరు. నీకేం సమజయిందో నాకైతే సమజ్ గాలె.

    సల్లగుండు మరి.
    యాద్గిరి

  4. బోడి పద్యం గురించి baabjeelu అభిప్రాయం:

    03/31/2009 9:26 am

    నర్సింహ గారూ,
    పని మాల సదివిన కవిత్వం గురించి ఒక్కముక్కకూడా రాయలేదు మీరు.
    తెల్ల పొగరు అణిగిపోయేట్టు ఈ “బోడి పద్యం” దేని గురించో రాయరూ, దయచేసి.
    అక్షరలక్షలు చేసీ ముక్కొహటి అన్నారు, ఈ మాట ఎడిటర్ల గురించి “అనాడీ” లు కారని. సంతోషం. మిగతావన్నీ పక్కనబెట్టి పైనున్న కవిత్వం లో ని విశేషాలగురించి రాయండీ. దెబ్బకు ఠా దొంగలముఠా అయిపోతుంది.

  5. బోడి పద్యం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    03/31/2009 8:12 am

    రాళ్ళపల్లి గారు,

    నెల్లూరులో పుట్టి పెరిగిన వాడిని, మస్తాన్ రెడ్లు, రసూలమ్మలు బంధు వర్గంలో వుండటం నాకనుభవవే. అయితే ఒక కవితని చదివినప్పుడు, ఫలాని మతవో, కులం గురించి ప్రస్తావన అవసరవా?

    మీకు కవిత ఎందుకు నచ్చిందో మీరు చెప్పేరు, ఆ వివరణతో నేనీకభవించకపోయినా, కనీసం మీరు చెప్పేరు, నేల మీద నిలబడి, అందుకు నా ధన్యవాదాలు.

    ఇంకా “ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది.” అన్నారు. నిజవే, అందరి బతుకుని సృశించడం వీలుకాదు, కానీ పదుగురి బతుకుని సృశించి, పదుగురు స్పందించేవిధంగా వ్రాస్తే మరింత బాగుంటుందికదా, కాదంటారా.

    రవి

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    03/31/2009 7:37 am

    రమ గారు,

    ఏ శాస్త్రం తెలియని మనుషుల్ని కూడా ఆకట్టుకునే గుణం వలననే త్యాగరాజుల వారి కీర్తనలు ప్రజల్లోకి అంతగా చొచ్చుకుపోగలిగినాయి. కత్తి పీట మీద కూర్చోనో, తిరగమాత వేస్తూనో, బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకునో, నిద్ర పుచ్చుతూనో, ఏ శాస్త్ర పరిచయం లేని అమ్మలు తీసే కూని రాగాల్లోకి కూడా పాకిపోయిన త్యాగయ్య, అన్నమయ్య, గద్దరు పాటలకి మీరే ప్రమాణాలని నిర్వచిస్తారు?

    రవి

  7. బోడి పద్యం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    03/31/2009 6:31 am

    నర్సింహన్న మాటలు చాన్నాళ్ళకింద ఆల్ఫా హోటల్్ కాడ చాయ్్ తాగినట్లనిపించింది. సుట్టుపక్కల ఎవరి మాటలు వారివి. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, కప్పు సాసర్ల చప్పుడు, ఆటోరిక్షాల అరుపులు, సిగరెట్ల కంపులు, అయినా దిల్ ఏక్దం ఖుషీ! ఆ చాయ్ లెక్క ఏ చాయ్ లేదు.

    “తెల్ల పొగరు” అంటే సరిగ్గా ఎరుకగాలె. రంగు తక్కువయితే మాత్రం పొగరు తక్కువయితదా అనిపించింది.

    “సగం కూలిన మసీదు గోడలు” అన్న లైను కూడా కొంచెం అర్థం కాలేదు.
    నమాజు చేసేచోటే మసీదు. నమాజు లేకుంటే మసీదెట్లయితదో తెలవదు.
    అట్లనే ప్రార్థనచేస్తే మందిర్్ కాని, పంచాయితీ చేస్తే అయితదా అనిపించింది.
    చిన్నప్పుడు కవిత్వం చదవాలంటే భయమయితుండె, అర్థం కావేమో అని. ఇప్పుడు కూడా భయ మయితది, ఎక్కడ అర్థమయిపోతదేమో అని.
    ========
    విధేయుడు
    -Srinivas

  8. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి sudha అభిప్రాయం:

    03/31/2009 2:15 am

    జ్యోతిష్యంపై ఎవరి అభిప్రాయము వారికి ఉంటుంది. కాని దానిలో వారికి సంభందించి మంచి జరుగుతాయి అనే విషయాలు ఉంటేనే వారు దాని ఇష్టపడతారు. చెడు జరుగుతుందేమో అని ఉంటే వారు నమ్మాలి అనుకోరు. మనస్సులో భయం ఉన్నప్పటికి ఇదంతా వట్టిదే అంటారు. వారికి జాతకాలు కావాలి కాని వారికి అనుగుణంగా మాత్రమే కావాలి.

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/30/2009 10:37 pm

    మీరు త్యాగరాజ కీర్తనని ఆనందించటంలో మనోధర్మ సంగీతం ప్రకారం ఆనందించటం్ చేయాలంటే మీకు శాస్త్రస్పృహ ఎంతోకొంత ఉండాలి కదా!?
    ఒక శాస్త్రం ..నిర్దిష్ట ప్రమాణాలతొ వృద్ది చెందినప్పుడు..ఆ ప్రమాణాల ప్రకారమే విద్వత్తుని నిర్నయిస్తారు. ఏ దేశం లోనైనా ఏ శాస్త్రంకైనా ప్రమాణాలుంటాయి. వాటిని ఒకరోజులో ఎవరో కూర్చుని పెట్టినవి కావు. “సామాన్యులు” ఎవరోమీరు నిర్వచించలేదు. అందువల్ల ఆ విషయంలో నేనేమీ చెప్పలేను.పాండిత్య ప్రమాణాల్ని మీరు ఒప్పుకోనని అన్నా..లేదా మీకు మీవైన వేరే ప్రమాణాలు ఉన్నాయని అన్నా..నాకు మీ అభిప్రాయాల్తో వాదన గానీ..విభేదం గానీ లేవు. మీ అభిప్రాయం అటువంటిది అనుకుని మిన్నకుంటాను…రవికిరణ్ గారూ!!

    రమ.

  10. బోడి పద్యం గురించి narsimha అభిప్రాయం:

    03/30/2009 10:40 am

    ఈమాట్లో కయిత్వం చదువుడు నాకూ, మా దోస్తుల్కూ ఆదతు పళ్లేదు. పూల్ గురించి, పూబోడుల గురించీ, పిరుదుల గురించీ, అమ్మాయి కోసమో, అబ్బాయ్ కోసం రాసిందో తెలియని నయా భావ కవిత్వం జర ఎక్కువ. ఈ మాట కయితల్లో. అమెరికా వెళ్లి సనాది వారాలు ఆంధ్రా యాదొచ్చి, అ ఆలు నేర్చుకుని రాసే వోళ్లు ఈడ మస్తుగా కనిపిస్తరు.

    ఎవురో సెప్పిన్రు, అఫ్సర్ కవిత మీద మస్తు లొల్లి పడ్తున్నరని ఈడ.

    పని మాల సదివిన. నాకయితే ఇంక కడక్ చాయ్ లాగా రాసుండాలన్పించింది. చాయ్ పత్తా జర తక్కువయింది కదన్నా! ఇంకా జోరుగా మాటలు పడాలన్నా! ఇంకా ఇలాంటి కయితలు రావాల. తెల్ల పొగరు అణగిపోవాల. ఈ మాటలో కూడా జబర్దస్తు కయితలు వస్తయని ఎడిటర్లు జర సమజున్నోళ్ళే అని ఇయ్యాల్నె సమజయ్యింది.

    నర్సింహ