పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. కృష్ణం వందే జగద్గురుం గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/22/2010 10:14 pm

    నారాయణగారూ,
    నేను రాసే విషయాల గురించి (ప్రవేశం అనేకన్నా) ఆసక్తి ఉంది. ఆ కారణంగానే నేను రాస్తూ ఉంటాను. నా కిష్టమైన కొన్ని విషయాలు ఎన్నేళ్ళయినా నాకు గుర్తుంటాయి కనక ఇప్పటి తరం వారితో అవి పంచుకోవాలనిపిస్తే వాటి గురించి రాస్తాను.
    సంగీతం గురించి చిన్నప్పటినుంచీ అభిరుచి ఉంది. కొన్నేళ్ళు సితార్ నేర్చుకుని కచేరీలు చేశాను.
    పాప్యులర్ సైన్స్ వ్యాసాలు రాయాలనేది నాకున్న ఆసక్తి. అవన్నీ ప్రస్తుతం సంపుటాలుగా వస్తున్నాయి. బాగానే అమ్ముడుపోతున్నాయని విన్నాను.

  2. కృష్ణం వందే జగద్గురుం గురించి నారాయణ గరిమెళ్ళ అభిప్రాయం:

    01/21/2010 12:14 am

    రోహిణీ ప్రసాద్ గారూ,

    నాకు ఆశ్చర్యంగా ఉంది.

    ఇంతకీ మీకు ఎన్ని రంగాలలో ప్రవేశం ఉంది?

    మీ వ్యాసాలను ప్రజాసాహితి లోనూ, కౌముది లోనూ, ఈమాట లోనూ, ఆంధ్రప్రభ లోనూ అనేకమైన విషయాల గురించి చదివాను.

    నాకు తెలిసి మీరు సాహిత్యం, హేతువాదం, క్రోమోజోములూ జన్యువుల గురించి చెప్పే శరీర ధర్మ శాస్త్రం, దేశపరిస్థితులు గురించి వ్రాశారు. మరి ఇప్పుడు సంగీతం గురించి చూస్తున్నాను.

    నారాయణ గరిమెళ్ళ

  3. మరో ప్రపంచం పిలిచింది గురించి Jagannadha Rao అభిప్రాయం:

    01/20/2010 7:19 am

    అనందం
    అద్భుతం
    ఆశ్చర్యం
    నా జీవితం ధన్యం
    శ్రీ శ్రీ కి జొహరులు

  4. గాలిపటం గురించి నారాయణ గరిమెళ్ళ అభిప్రాయం:

    01/20/2010 2:23 am

    గాలి పటాలు అందు బాటులో ఉండి ఎగురుతుంటేనే, వాటి స్వేచ్చకు
    ఎగరేసినవారి స్పూర్తి/సామర్ధ్యాని కి అందం/అర్థం.

    ఏ దిక్కు గాలుల్నైనా ఎలాగూ నిలువరించలేము, కాబట్టి,
    తయారీ సమయములోనే బాధ్యతగా ఎగరడమెలాగో నేర్పించాలి.
    అంతేనంటారా, సమీర్ గారూ?

    నారాయణ గరిమెళ్ళ.

  5. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/19/2010 1:11 pm

    మోహన గారి అభిప్రాయం అంతగా స్పస్టపడలేదు నాకు. ఆయన పదాలతో ఉదాహరిస్తూ మరింత వివరించి ఉండిఉంటే బాగుండేది.

    “త్ర్యంబక” లాంటి పదాల్లోని ” త్ర్య” అన్నది కూడా సయుంక్తాక్షరం తో మొదలౌతున్న ఒక అరుదైన పదం. ఇందులో రెండు కాదు మూడు అక్షరాలు కలిసి ఒక అక్షరం కాగా పదాదిన ఈ సంయుక్తాక్షరం రావడం విశేషం.

    రమ.

  6. కలైన గోర్వెచ్చని పాట గురించి rajendra kumar devarapalli అభిప్రాయం:

    01/19/2010 1:17 am

    ఈ మధ్య కాలంలో చదివిన కవితల్లో అత్యంతాఅహ్లాదాన్ని పంచిన కవిత ఇది.నులకమంచం పేనటం ఏ రాజభవనాల్లోని తివాచీలకూ తీసిపోదు,కలలు చెదరకుండా ఆకులు చుక్కలు కావలి కాయటం అన్నభావనే ఎంతో ఆత్మీయంగా ఉంది.కానీ జాన్ గారు మీరు ఇకపైన నులకకౌశలం కోసం వెతుకుతూనే ఉండాలేమోనండి!ఇంకెక్కడి నులక మంచాలు?
    మంచి కవితను మాచే మరలామరలా చదివింపజేసినందుకు గాను ధన్యవాదాలు.

  7. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి mOhana అభిప్రాయం:

    01/18/2010 9:33 pm

    శాయి గారూ, భారతి వ్యాసాన్ని అందించినందులకు వందనా లండీ. నాకు తెలిసి ష-కారపు ఒత్తు క-కారముతో, ర-కారముతో మాత్రమే వస్తుంది. ల-కారముతో, ష-కారపు ఒత్తుతో ఏమైనా పదాలున్నాయా? లేదనే అనుకొంటాను. ర్ష
    సంయుక్తాక్షరము ముందున్న పదాలు ఏవీ లేవు. ష-కారపు ఒత్తుతో ప్రారంభమయ్యే పదాలు క-అక్షరముతో మాత్రమే. అందువల్ల దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నదేమో? ఇలా మరేదైనా సంయుక్తాక్షరం తెలుగులో ఉందా?
    విధేయుడు – మోహన

  8. నాకు నచ్చిన పద్యం: ధర్మజుని గుణవిశేషం గురించి Ramakrishna అభిప్రాయం:

    01/16/2010 7:22 am

    డియర్ సర్
    పై పద్యము యొక్క ఎత్తుగడ నర్తనశాల చిత్రం లో ఘంటసాల గారి కంఠం లో గొప్పగా కళ్యాణి రాగం లో ఆవిష్కరింపబడింది.
    రామకృష్ణ

  9. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి Vadapalli SeshaTalpaSayee అభిప్రాయం:

    01/16/2010 6:55 am

    పై చర్చకు సంబంధించి కొన్ని వ్యాసములు –

    1936 ఏప్రెలు (ధాత చైత్ర) “భారతి”లో కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారి వ్యాసము- వర్ణసమామ్నాయమున ‘క్ష’కారము

    1940 అక్టోబరు (విక్రమ ఆశ్వయుజ) “భారతి”లో చెరుకూరి వేంకటజోగారావుగారి వ్యాసము – జ్ఞకార విమర్శనము గిడుగు వేంకటసీతాపతిగారి వ్యాసము – జ్ఞకారము (ఈసంచిక దొరకలేదు).

    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  10. అమ్మ ఉత్తరం గురించి Lakshmi Tulasi Ramineni అభిప్రాయం:

    01/15/2010 6:09 pm

    చాలా బాగుంది . చాలా చాలా బాగుంది