పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Bhanu అభిప్రాయం:

    03/04/2010 1:33 am

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
    నాగయ్య గారి గురించి రాసిన వ్యాసం బాగుంది. ఆయన సంగీత ప్రతిభ గురించి రాయగలిగితే ఎంతో కృతజ్ఞుడ్ని.

  2. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/04/2010 1:18 am

    వేంకటేశ్వరరావుగారూ!!

    మీ పరిశీలన బాగుంది. అయితే మూర్తిగారు చెప్పినట్టు అది తెలుగుదేశమైనా.. లేక అమెరికా అయినా వస్తువైవిధ్యమూ ఉండటం లేదు. శిల్పవైవిధ్యమూ ఉండటం లేదు.

    వచన కవిత్వం వచ్చేకా..రాసేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టే..కధలు రాసేవాళ్ళుకూడా సంఖ్యలో పెరిగారు. అయితే “కల్పన” అన్నది ఆ రాస్తున్నవాళ్ళలో సహజంగా ఉండాలి. అది లేని వాళ్ళు జీవితాంతం రాసినా వాళ్ళ సమకాలంలోని పరిచయాలవల్ల “రచయితలు” అని ఒక ముద్ర వేయించుకోగలరేమో గాని..వాళ్ళు పోఏకా వాళ్ళమీద ఉన్న ముద్రా పోతుంది. మీరు డయాస్పోరా తెలుగుకధకి చెప్పిన లక్షణాలన్నీ కాస్త అటూ ఇటుగా తెలుగుదేశం లోని “కధలు” అనబడే వాటికి కూడా వర్తిస్తాయి.

    ప్రధానమైన సమస్య సమకాలీన సాహిత్యం మీద రావలసిన “విమర్శ” రాకపోవడమే!! అద్దంలో మనముఖం మనకి బాగానే ఉన్నట్టుగా కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా రాసిన వాళ్ళకి ఆ రచన బాగా ఉన్నట్టే అన్పిస్తుంది కూడా!!కానీ అది మంచి కధ కాదని ఆ రచయిత కి చెప్పగల విమర్శ చాలాసార్లు ఉండదు. ఇందుకు కారణం ఒకటి విమర్శకుల జాతి సంఖ్యలో తక్కువ రచయితల సంఖ్యతో పోలిస్తే! రెండోది మన దగ్గర ఎవరూ కూడా వ్యక్తులపట్ల నిబధ్ధత కల్గిన వాళ్ళేగానీ..నిజంగా సాహిత్యంపట్ల నిబధ్ధత కల్గిన వాళ్ళు కన్పించరు. చాలామందికి చాలా రకాల మొహమాటాలు. ఆ కధ వాళ్ళకి తెలిసిన వాళ్ళు రాసినదైతే వీళ్ళు దాని మంచిచెడ్డల్ని నిజాయితీగా చెప్పలేరు.

    అనిటికన్నా ముఖ్యం creativity అన్నది స్వతహాగా ఉండాలి. రకరకాల కారణాలకి వేరేపనులు మాత్రమే చేయగల్గిన వాళ్ళూ రచనలో రాణించలేని వాళ్ళూ కూడా కావులుగానూ..రచయితల గానూ చెలామణీ కావడానికి తెలుగున ఈ అన్నిటి కారణాలవలనా అవకాశం ఎక్కువ. మీరు ఎన్ని రాసినా మీలో రచయితకాగల్గిన లక్షణాలు లేవయ్యా అని ఎవరూ చెప్పరు గనక అలాంటి వాళ్ళు రాస్తూనే ఉంటారు. అంతే కాదు అలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఆచ్చువేయడానికి పూనుకుంటే దొరికే రచనల సంఖ్య కూడా ఈ పరిమితిలో ఉండక తప్పదు కదా!!

    చివరగా నాకు ఎప్పుడూ ఉన్న ప్రశ్నే అనుకోండి. నేను ఇదివరకూ కూడా వేసాను. మళ్ళీ అడుగుతున్నాను. తెలుగు డయాస్పోరా తమ రచనలని తెలుగులోనే ఎందుకు రాస్తున్నట్టూ?? ఝుమ్పా లాహిరి లాగా అక్కడి దేశంలోని వాళ్ళకోసం ఎందుకు రాయడంలేదూ??

    దయాస్పోరా తెలుగువారినించీ వేరే భాషల్లో చేసే రచన రావాలని..వాళ్ళకి కూడా ఒక బుకర్ ప్రైజ్ , ఒక పులిజర్ ప్రైజ్ రావాలని కోరుకుంటాను. అది రానన్నాళ్ళూ తెలుగులో వస్తున్న”దళిత కధలు..మైనారిటీ కధలు” లాఅగానే “ప్రవాసాంధ్రుల కధలు” అన్న ఒక విభాగమ్ తెరుచుకుని అమీరికాంధ్రుల కధలు ఓ మూల కూచుంటాయి. అంతే!!
    రమ.

  3. తడిస్తే కదా తెలిసేది! గురించి subrahmanyam అభిప్రాయం:

    03/03/2010 2:46 pm

    పద్యం చాలా బాగుంది. సుబ్రహ్మణ్యం

  4. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    03/03/2010 2:34 pm

    గమనిక: సొంతడబ్బా
    నాగయ్య గారి గురించి నవతరంగం.కాం లో రాశాను. ఎస్‌. వరలక్ష్మి గారి గురించి త్వరలో యిక్కడే వివరంగా రాసే ప్రయత్నం చేస్తాను.
    — శ్రీనివాస్

  5. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Dr. P. Kumar Babu అభిప్రాయం:

    03/03/2010 12:21 pm

    Dear Srinivas
    Hats off to you. I have been searching for S.varalakshmi songs in the lalita geyalu and other sites. Thanks for providing the songs. As I am interested to save them and keep them with me, can you please tell me how to download them?

    Yours
    Dr. Kumar Babu
    (pkumarbabu@yahoo.com)

  6. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి నిడదవోలు మాలతి అభిప్రాయం:

    03/03/2010 9:30 am

    బాగుంది పెద్ద సమీక్ష.
    నాకు కలిగిన సందేహాలు. – వెంకటేశ్వరరావుగారు డయాస్ఫొరా రచయితలందరూ సాంకేతిక నిపుణులూ, పెద్ద పెద్ద ఉద్యోగాలలోవారూ అన్నారు. భర్తల అడుగుజాడల్లో అమెరికా వచ్చిన రచయిత్రుల, మరియు, ఇక్కడికి రాకముందునించి రాస్తున్నవారి ప్రసక్తి ఉన్నట్టు లేదు. నేను మిస్సయి ఉంటే, ముందే క్షమాపణలు చెప్పుకుంటున్నాను.
    రెండోది, పైన లక్ష్మన్నగారు చెప్పినట్టు ఒక్కమంచికథ కూడా ప్రస్తావించలేదు. మంచి డయాస్ఫొరా కథ అంటే ఎలా ఉండాలి అని నేను అడగను. ఎంచేతంటే నిర్వచనాలు చెప్పడం తేలిక. వెంకటేశ్వరరావుగారు కానీ మరొకరు కానీ ఒక మంచి కథ తీసుకునో, రాసో, ఇలా ఉండాలి, ఈకథలో డయాస్ఫరా లక్షణాలు ఇవీ అని చూపిస్తే, అలాటి మంచి డయాస్ఫొరా కథలు వస్తాయేమో.
    నిడదవోలు మాలతి

  7. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Bhanu అభిప్రాయం:

    03/03/2010 9:16 am

    నమస్కారం అండి,

    వరలక్ష్మి గారి పాటలు ఎంతో బాగున్నాయి. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    చిత్తూరు నాగయ్య గారి గురించి కూడా చెప్పగలరని ఆశిస్తున్నాను. ముఖ్యంగా యోగి వేమన చిత్రం నుంచి “ఇదియేనా. ఇంతేనా”, “అందాల నా జ్యొతి”, “జీవహింస మానండి” , త్యాగయ్య నుంచి “నిధి చాల సుఖమా”, “ఎందరో మహానుభావులు” వినడానికి ఎంతో బాగుంటాయి. అంతే కాదు, పాడుకోవటానికి కూడా ఎంతో బాగుంటాయి.
    ఆ మహానుభావుడి గురించి ఒక వ్యాసం రాస్తారని ఆశిస్తున్నాను.
    ఇట్లు,
    భాను ప్రకాశ్

  8. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Prashanthi Mulumudi అభిప్రాయం:

    03/03/2010 7:14 am

    I love the quality of her voice.

    aavida paadina manchi manchi paatha paatalu kottaga telisaayi! meeku chaala dhanyavaadaalu Sreenivaas gaaru!

    “nava vasantha” paata sounds like a hindi tune. Does it have a Hindi counterpart?

  9. *ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి madhuri krishna అభిప్రాయం:

    03/03/2010 5:14 am

    This is a very good presentation on different styles of writing or or maybe, interpreting previous works, at the same time softly but effectively mocking a writer”s wrong perception. This stands as an example for a decent presentation of criticism.

  10. తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    03/03/2010 2:23 am

    వాదం వచ్చిన ప్రతిసారీ ఇంత భయంకరంగా వుండనవసరం లేదు వేణుగోపాల్ గారూ. 🙂

    చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో లో వార్తలు చదివే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయి వుంటారనుకుంటుండే వాడిని. ఒక సారి ఒక అనౌన్సర్ పొరపాటున ‘సిబ్బంది’ అనడానికి బదులు ‘సిద్దంబి’ అనడం నేను స్పష్టంగా విన్నాను. ఆ రోజంతా కనపడ్డ వాళ్లందరికీ రేడియో లో వార్తలు చదివే ఆయన చేసిన పొరపాటు గురించి చెప్పుకుంటూ తిరిగాను. నేను అట్లా ప్రచారం చేసినందు వల్లన ఆ అనౌన్సర్ ఖ్యాతికి ఏమీ నష్టం వచ్చి వుంటుందనుకొను. నిజానికి ఆ పొరపాటు పట్టుకోవటం వలన నా దృష్టిలో కూడా అనౌన్సర్లు గొప్ప వాళ్ళు అయి వుంటారన్న నమ్మకం కూడా ఏమీ తగ్గలేదు. కాక పోతే, గొప్ప వాళ్ళు కూడా మామూలు మనుషులే అన్న జ్ఞానం మాత్రం నాకు వచ్చింది.
    అట్లాగే, శ్రీశ్రీ రాసిన పాటలో పొరపాటు దొర్లిందట అని ఒక పది మంది వింతగా చెప్పుకుంటే అందులో పెద్ద నేరమేమిటో నాకు అర్ధం కావటం లేదు. దాని వలన శ్రీశ్రీ కి వచ్చిన నష్టమేమీ లేక పోగా, ఒకరికో ఇద్దరికో శ్రీశ్రీ కూడా మానవమాతృడే అన్న స్పృహ కలుగుతుంది. అది మంచిదే.

    అట్లా చెప్పుకునే వాళ్ళ మీద తెలిసిన వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు విరుచుకు పడితే – ఆహా , ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద నేరంగా లెక్క కట్టి ఇంత వుద్రేక పడుతున్నారంటే, అసలు విషయం ఇంకెదో వుంది వుంటుంది అన్న అభిప్రాయం కలిగే ప్రమాదం కూడా వుంటుంది.

    ఇక పోతే, అచ్చు తప్పులు , వ్యాకరణ పొల్లులూ దిద్దుకోవడం రచయితకి కనీస బాధ్యత. రచయిత గొప్పదనానికి అదేమంత పెద్ద తార్కాణం కాదు.

    శ్రీ శ్రీ , ఒకటీ రెండూ కాదు, ఏకంగా కొన్ని తరాల తెలుగు యువతీ యువకులని ప్రభావితం చేసిన కవి. ఇది ఎలాటి ప్రభావమూ, ఈ ప్రభావం మంచికొచ్చిందా చెడ్డకొచ్చిందా, ఏ కవితా ఎప్పుడూ ఏ ప్రయోజనాన్ని సాధించింది, ఇలాటి విషయాలని మాట్లాడుకోవలసిన అవసరం ఈ రోజున వున్నది. అవకాశం కూడా కొద్ది కొద్దిగా కనపడుతోంది.

    బాధ్యత కల మనుషులు, ఆ అవకాశాన్ని చేజారనీయకుండా మాట్లాడాలి. మాకు తెలుసు, మీకు తెలియదు, మాకున్న రసజ్ఞానం మీకు లేదు, శ్రీశ్రీ ని అంచనా వేసే టంత గొప్పవాళ్ళా మీరు ? అంటూ శ్రీశ్రీ వ్యాకరణ దోషం గురించి చెప్పుకున్న వాళ్లంతా రాళ్ళు విసురుతున్న అలాగా జనం అన్నట్టు కలియబడితే, జవాబు చెప్పక తప్పదు.

    పి.ఎస్.
    మొసళ్ళ గుంపుల మధ్య అలవోకగా బ్రతకడం అలవాటయిపోయిన వాడిని కాబట్టి నామీద వేస్తే సంభాళించుకోగలిగాను కానీ, మీరిలాగ అలవాటుగా ఇంటి పేర్లతో గాలాలు వెయ్యరనే ఆశిస్తున్నాను. విషయం శ్రీరంగం వదిలిపెట్టి కంచి దోవ పట్టటం ఎవరికి మాత్రం మంచిది ?