పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి సౌమ్య అభిప్రాయం:

    04/17/2010 12:26 am

    బాగుంది. మరిన్ని వ్యాసాలు రాస్తారని ఎదురుచూస్తున్నాను.
    ఆర్కే నారాయణ్ వ్యాసాలు కూడా ఇలాగే…పర్సనల్ ఎస్సేస్ అంటారనుకుంటాను ఆయన.

  2. రాగలహరి: హిందోళం గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    04/16/2010 11:17 am

    ఈ వ్యాసంలో – “8వ మేళకర్త అయిన హనుమత్తోడి జన్యరాగం హిందోళం. ” అని రాసారు. హిందోళ రాగం 20వ మేళకర్త నటభైరవి రాగ జన్యం అని అనుకుంటాను. హిందోళంలో జీవ స్వరాలు నటభైరవికి దగ్గరగా వుంటాయి. తోడి రాగానిక్కాదు.

    చిత్ చోర్ సినిమాలో “జబ్ దీప్ చలే ఆనా…” పాట మొదట్లో మాల్ కోస్ రాగ ఆలాపన చాలా బావుంటుది.

    బాల్యమిత్రుల కథలో ఎస్ .జానకి పాడిన “గున్నమావిడి కొమ్మ మీదా గూళ్ళు రెండున్నాయి…” పాట ఆనందంగానూ, విషాదంగానూ రెండు రకాలుగా వస్తుంది. విషాద గీతంగా సినిమాల్లో హిందోళ రాగాన్ని వాడిన పాట ఇదొక్కటే కనిపిస్తుంది.

    -సాయి బ్రహ్మానందం

  3. రాగలహరి: హిందోళం గురించి krishna అభిప్రాయం:

    04/16/2010 5:54 am

    లక్ష్మన్న గారికి ధన్యవాదాలు,
    నిజంగా అద్బుతంగా వుంది. నాలాంటి సంగీతం అంటే ఇష్టం వుండి నేర్చుకోనివాళ్ళకు చాలా మేలు చేసారు. మీరు ఇంకా ఇలాంటి టపాలను వ్రాయాలని మనవి చేసుకుంటున్నాను.

  4. గాలిపటం గురించి Sameer Gunukula అభిప్రాయం:

    04/15/2010 11:47 pm

    Dear Siva Rama Prasad garu,
    Sorry for this late response. Opinions of peers serve as yardsticks as well as quality improving measures for any literary work. I do admit that your opinions as stated above do matter as well as anybody else’s opinions. However, I firmly believe, that there are certain standards for both conducting literary works as well as expressing opinions/ reviews. Please make sure that your review of Mr. Satyanand’s attempt at translation serves as a constructive review. You may choose to offer a few corrections to help him get better and improve his work.

    Thanks and regards,
    Sameer G

  5. సా విరహే తవ దీనా గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    04/15/2010 10:43 am

    వ్యాసం ఆపాత మధురం. ఎంతో శ్రమతో ఓపికతో అందించిన వివరాలు ఒకెత్తు. ఇంకేంతో పరిశ్రమతో ఒక్క చోట కూర్చిన పాటలు వినాలనికుతూహలంగాఉంది. సంస్కృత శార్దూలవిక్రీడితాన్ని తెలుగుశార్దూలంలోఅనువదించడం సమంజసంగా ఉంది. తెలుగు అనువాదాలలో పదాలు సరళంగా హాయిగున్నాయి.
    ” వ్యాసం మధురం
    భావం మధురం
    చిత్రం మధురం
    అనువాదం మధురం
    వ్యాఖ్యానం సర్వం మధురం”
    =======
    విధేయుడు
    -Srinivas

  6. ఈమాట గురించి గురించి jayaprabha అభిప్రాయం:

    04/15/2010 8:00 am

    సంపాదకులకి! భారతీయ భాషలలొ వచ్చిన కవిత్వాన్ని జర్మనీ భాషలోకి అనువాదమ్ చేసి తెచ్చిన కవితా సంకలనమ్ వచ్చింది. దాని పేరు “Nachtregen”[ night rain అని అర్ధం.] ఈ పుస్తకంలో శ్రీశ్రీవి, నావీ కవితలున్నాయి. మిగతా భారతీయ భాషలకి సంబంధించి ఆయా భాషల్లో ప్రసిధ్ధులైన కవులు కూడా ఈ సంకలనం లో ఉన్నారు. ఇది హైడెల్ బెర్గ్ నించి వచ్చింది. అనువాదమూ.. సంపాదకత్వమూ draupadi verlag, ఇంకా jose punnamparambil చేసారు.

    జయప్రభ.

  7. “చందమామ” జ్ఞాపకాలు గురించి Buttegowda అభిప్రాయం:

    04/13/2010 8:16 pm

    This article is fabulous. Brought lots of memories. I read chandamama as a kid ( as well as today ) and collected almost all of them published between 1948 – 1972.

    Great to know the history of the artists as well as writers.

  8. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి Srinath అభిప్రాయం:

    04/13/2010 11:25 am

    దయ చెసి నవతరంగము లొ వచ్చిన ఈ వ్యాసానికి మీ అబిప్రాయము తెలుపగలరు! –

  9. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    04/13/2010 10:07 am

    BSRAO గారూ:

    ఈ వ్యాసం తెలుగులో చదవటానికి ఈమాట సంపాదకులు సాయపడగలరు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. తడిస్తే కదా తెలిసేది! గురించి తవ్వా ఓబుల్ రెడ్డి. అభిప్రాయం:

    04/13/2010 8:05 am

    మండుటెండలో మంచు బిందువులను కురిపించింది, మీ కవిత. అభినందనలు!