పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. సా విరహే తవ దీనా గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:

    04/21/2010 10:58 am

    రమగారు,

    మోహనగారు ఇచ్చిన అర్థాలకి మరికొన్ని జత చేర్చే ఉద్దేశం తప్ప ఎవరికి ఎన్ని నిఘంటువులు తెలుసన్న పోటీ కోసం కాదు. నాకన్నా మీకు ఎక్కువ నిఘంటువులు తెలుసన్న విషయంలో నాకెటువంటి సందేహం లేదు. నా పై అభిప్రాయంలో ప్రత్యేకించి మిమ్మల్ని సంబోధించనూ లేదు.

    కారాశం

  2. తెలగాణెము గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:

    04/21/2010 10:26 am

    “కవి గారు సిసలైన తెలంగాణ వాడినని చెబుతూనే తెలంగాణా ప్రజానీకం ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కవిత్వం చెప్పారు. “

    మీకు గాని కర్ణ పిశాచి గాని ఉందా ?? తెలంగాణా ప్రజానీకం మనసులో ఏముందో తెలుసుకోవడానికి ?? .తెలంగాణా ప్రజల మనోభీష్టం గురించి మీకు ఎంత తెలుసో /తెలియదో ఇతరులకు కూడా అంతే తెలుసు /తెలియదు అని తెలుసుకోవడమే అసలు సిసలు ప్రజాస్వామికం.ప్రజలు పట్టం గడితే గానీ ప్రభువులు కాలేరు ,అదే ప్రజాస్వామ్యం.మనది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం.ఒకప్పటి రష్యా ,ఇప్పటి చైనాలా ఏకశిలా పార్టీ (ప్రజా స్వామ్య?) వ్యవస్థలో ఇటువంటి అవకాశం లేదు. కావున, ఎటువంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు తిరునగరి సత్యనారాయణ గారు ?? స్వేచ్చకు తావులేని ఏక పార్టీ ఏకాభిప్రాయం గల అప్రజాస్వామిక వ్యవస్థా ?? బహుళ పార్టీ బహుళాభిప్రాయాలు గల ప్రజాస్వామిక వ్యవస్థా ?? నాకు చూడగా తిరునగరి సత్యనారాయణ గారు మొదటి దారినెంచుకొన్నట్లే కనిపిస్తుంది. అది ప్రమాదకరమని వేరే చెప్పాలా ?? భారత రాజ్యాంగం ఒకసారి కూడా తెరిచి చూడని వారు ప్రజాస్వామ్యం అన్న పదాన్ని తోచిన రీతిలో వాడటం వారి రాజకీయ అపరిపక్వతనే సూచిస్తుంది.

    “ఇవాళ్ళ తెలంగాణా పల్లె పలెనా ప్రతి మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవి కావని కవిగారు గుర్తెరిగారా? లేక గుర్తించినా తమ అభిప్రాయంగా, ప్రజల అభీష్టానికి భిన్నంగా పద్యం చెప్పారా?”

    కవి గణాంక శాస్త్ర వేత్త కాలేడు; కావున ఎన్ని పల్లెల్లో ఎందరు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో గణించి పట్టీలు కట్టడానికి.పోనీ సత్యనారాయణ గారు ఆ పని చేశారా అంటే అదీ లేదు.అయినా సరే , “పల్లె పల్లెనా మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవే” అని ప్రకటిస్తున్నారు. నా ప్రశ్న అసలు మీకు ఆ అభిప్రాయం ఎలా కలిగింది ?? ఏ ధైర్యంతో అలా ప్రకటిస్తున్నారు ?? ఆ అభిప్రాయం ఏర్పరచుకోవడానికి మీరు అవలంబించిన శాస్త్రీయ పద్ధతులు ఏవి ??

    నేను తెలంగాణా లో ఇటీవల జరిపిన పర్యటనలో దినకూలీలతో భేటీ అయ్యాను. వారు తెలంగాణా భావననే తిరస్కరిస్తున్నారు. రాజకీయ నాయకులను వారికి వత్తాసు పలికే మీడియాను అసహ్యించు కొంటున్నారు. అంత మాత్రం చేత తెలంగాణాలో అందరూ తెలంగాణాను వ్యతిరేకిస్తున్నారు అని నేను అన వచ్చునా ?? నా శాంపిల్ స్పేస్ సరిపోదు, ఆ నిర్ణయానికి రావడానికి. ప్రజల అభీష్టం తెలిసేది ఎన్నికల ద్వారా ; అంతవరకూ ,కర్ణ పిశాచి ఉన్నా సరే, ప్రజాభీష్టం తెలిసినట్టు ఫోజు పెడితే అబోరు దక్కదు. కాబట్టి , ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా / అనుకూలంగా కవిత్వం చెప్పారా అన్న ప్రశ్నే ఉదయించదు.

    “పద్యం ఎంత అందంగా చెప్పినా, అది రాయప్రోలు వారిని గుర్తు తెచ్చినా పద్యం లోని భావం (వస్తువు) రాజకీయ పరమైనది, అదీనూ తెలంగాణ ప్రజల రాజకీయానికి వ్యతిరేకమైనది. బహుశ అందుకేనేమో ఈ వస్తువు పద్య రూపాన్ని ఎంచుకున్నది . తెలంగాణ కోరుతూ సమకాలీన కవిత్వం రాస్తున్న వారంతా జానపదుల పాటను (వచన కవిత్వం తో పాటు) ప్రధానంగా ఎంచుకుంటున్నారు. వస్తువు రూపాన్ని నిర్ణయిస్తుంది అనడానికి ఇది మంచి ఉదాహరణ.”

    వచన కవిత్వం రాయడం తెలంగాణా ఉద్యమ స్ఫూర్తిలో భాగం అని చాలా విలువైన మాటను తెలిపారు. దేశికాచారి గారు ఆదినుండి పద్యకవి ; ఆయనకు పద్యరూపంలో రాయడంలోనే నేర్పు గలదు. ఇవాళ కొత్తగా ఆయన పద్యాన్ని చేపట్టి ఉంటే మీ సిద్ధాంతానికి బలం చేకూరేది. మరి , ఆయనను ఖండిస్తూ పద్యాలు రాసిన శ్రీనివాసులో ఉద్యమస్ఫూర్తి కొరవడిందా ??

    మీ అభిప్రాయాన్ని వచనంలో ఎందుకు రాశారు; ఏదైనా జానపదుల వరుసలో పాట కట్టి ఉంటే ఉద్యమస్ఫూర్తి వెలిగి పోయేది కదా. ఎవరి మనసుకు తోచినట్టు వారు రాసుకొంటారు. అదే రీతిన విమర్శ ,ప్రశంస వస్తాయి. నీవు వచన కవిత్వం రాసి ఊదర కొడితేనే / పాట రాసి గజ్జె కట్టి ఆడితేనే ఉద్యమ స్ఫూర్తి ఉన్నట్టు. వచన కవిత్వం , పాట వదిలి వచనంలోనో ,పద్యంలోనో రాస్తే ఉద్యమ స్ఫూర్తి లేనట్టు అనడం అసలు సిసలు అర్థంలో అప్రజాస్వామికమే కాదు మిగుల అజ్ఞాన జనితం.

    భావ ప్రకటనా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. దాన్ని దెబ్బ తీసే ఉద్యమాల మీద ,వాటి వెనుక ఉన్న అరాచక శక్తుల పట్ల సానుభూతి చూపడం ప్రమాద కరం. బాధ్యత గల కవిగా దేశికాచారి గారు దారి చూపారు. కవిదాటు ,గొర్రెదాటు ఒకటి కాదు అని నిరూపించడం బాధ్యత గల తెలంగాణా కవులు సాహిత్య వేత్తలు చేయదగిన పని. గుంపులో గోవింద కొట్టే వాడు ఎన్నటికి కవి కాలేడు అని తెలుసు కోవడం మంచిది. కవులు తమకు వెన్నెముక ఉందని వానపాములకూ తమకు భేదం ఉందని నిరూపించుకునే తరుణం ఆసన్నమయింది.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  3. సా విరహే తవ దీనా గురించి Rohiniprasad అభిప్రాయం:

    04/21/2010 9:24 am

    మరీ మించిపోయే లోపల రాగాల గురించిన చర్చ మానేసి కామెంట్లను సాహిత్యానికి పరిమితం చేస్తే బావుంటుంది!

  4. ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి Chandrakaladhar Reddy అభిప్రాయం:

    04/21/2010 8:47 am

    చాలా బాగుంది. అద్భుతముగా నున్నది. కండ్లకు కట్టినట్టు ఉంది. చదివీన తర్వాత చాలా ఆనందించాను.

  5. గాయం గురించి rameshakula అభిప్రాయం:

    04/21/2010 12:19 am

    mee kavitalo naku doctor ante evaro ardam kaledu.. adi vivarinchagalara

  6. తెలగాణెము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    04/20/2010 10:58 pm

    ఇది వొట్టి అభిప్రాయవేదిక కాబట్టి వ్రాసిన కవితకు స్పందన ప్రతిస్పందనలు సమంజసమే. రాష్ట్రం అన్నది ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా వేర్పాటు కాదు, ఏర్పాటు మాత్రమే, ఒకే దేశంలో ఏర్పాటు చేసుకున్న, చేసుకునే పాలక వ్యవస్థ. ఒక రాజకీయ పరమైన పాలక వ్యవస్థకు అంతకు మించి ప్రాముఖ్యతను ఇవ్వడం సమర్థనీయం అనిపించదు. ముఖ్యంగా ఇటువంటి వేదిక మీద.
    ===========
    విధేయుడు
    _Srinivas

  7. సా విరహే తవ దీనా గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/20/2010 10:57 pm

    కారాశం గారూ!! నేను నిఘంటువులు చూడనని మీరెందుకని అనుకున్నారో మరి. మీరు చెప్పినవాటికన్నా మరి కొన్నింటి నిఘంటువుల పేర్లు కూడా నేను చెప్పగలను . ఐతే నేను చూసిన ఏ నిఘంటువులోనూ “సోమము” అన్నదానికి ఎక్కడా మోహన గారు చెప్పిన అర్ధాలు ” అమృతము లేదా వెన్నెల [ కాంతికిరణము”] లాంటివి లేనే లేవు. ఏ ఒక్క నిఘంటువులోనీ లేవు. అందుకనే ఆయనని నేను ఆ అర్ధాల్ని ఎక్కడనించి ఇచ్చారూ అని అడిగింది. సోమరసము అన్నా జనవ్యాప్తిలో ఉన్న అర్ధాన్ని బట్టీ మదిర అనే అనుకోవాలే తప్ప అది అమృతము కాదు. అది అటుంచినా లైలా వాక్యం “ఒలికే సోమమై” అన్నది ఆ అష్టపదికి తెనుగు సేత గానూ నప్పదు. విడిగా తెనుగు వాక్యం గానూ నప్పదు.

    రమ.

  8. సా విరహే తవ దీనా గురించి mOhana అభిప్రాయం:

    04/20/2010 6:07 pm

    ఆప్తే సంస్కృత – ఆంగ్ల నిఘంటువులో అలా ఉంది. దాని లింకు ఇస్తున్నాను –
    http://aa2411s.aa.tufs.ac.jp/~tjun/sktdic/cgi-bin/dic-srch.cgi
    # విధేయుడు – మోహన

  9. సా విరహే తవ దీనా గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    04/20/2010 5:47 pm

    వేణు గోపాల్ గారూ,

    మీరు “టంగుటూరి సూర్య కుమారి గారు పాడిన ‘సా విరహే’ యమన్ కళ్యాణ్ రాగమా? కాదేమో? పీలూ అనిపిస్తోంది.” అని రాసారు.
    మీరన్నది కరక్టే! యమన్ కల్యాణి కాదు. అలా అని పీలూ రాగమూ కాదు. మిశ్ర కాపిలా అనిపించిది. రి-మ-ని-ప-గా ప్రయోగం కనిపిస్తుందీ పాటలో. అలా అనే ముందు నోట్స్ రాసుకున్నాను. రాసేటప్పుడు పొరపాటున యమన్ కల్యాణి అని పొరపాటుగా రాసాను. ఇది నా తప్పిదమే!

    సవరించమని ఈమాట వారిని కోరుతాను.

    తప్పు చూపినదుకు ధన్యవాదాలు.

    గుండమ్మ కథ సినిమాలో “అలిగిన వేళనె చూడాలీ! ” పీలు రాగమా, మిశ్ర కాపి రాగమా అని అప్పట్లో పెద్ద చర్చ జరిగిందని ఒక సంగీత విద్వాంసుడు చెప్పగా విన్నాను. ఘంటసాల వారినడిగితే ఆయన “నేను ఈ రాగంలో కట్టానని చెప్పానా? అది పీలూ కాదు అలా అని మిశ్రకాపీ కాదు. ఆ పాట అంతే !”నని జవాబిచ్చారని చెప్పగా విన్నాను. పీలు రాగం పేరు వినగానే ఇది గుర్తుకొస్తుంది.

    ఈమాట సంపాదకులకి –
    “మరికొన్ని రాగాలు” ఉప శీర్షికలో ఈ క్రింది వాక్యం తొలగించండి.
    “టంగుటూరి సూర్యకుమారి కూడా ఇదే రాగంలో పాడినా, పాట వరస వినడానికి కాస్త తేడాగా ఉంటుంది.”
    దాని స్థానంలో – ఈ వాక్యం ఉంచండి.
    “టంగుటూరి సూర్యకుమారి పాడిన పాట మిశ్ర కాపి రాగానికి దగ్గరగా ఉన్నా, పాట వరస వినడానికి మాత్రం పీలు రాగంలా అనిపిస్తుంది. కానీ మిశ్ర కాపికే అతి దగ్గరగా స్వరపరచబడింది.”

    -సాయి బ్రహ్మానందం

    [మీరడిగిన వాక్యం మార్చబడింది – సం. 21ఏప్రిల్2010]

  10. సా విరహే తవ దీనా గురించి Tatiraju Venugopal అభిప్రాయం:

    04/20/2010 3:55 pm

    చాలా చాలా బావుందండీ రచన.అయితే 10 వ రిఫరెన్సుగా -టిటిడి వారి ప్రచురణ ‘శ్రీ జయదేవ కవి కృత గీత గోవింద కావ్యము’ (2000 ) కూడా చేర్చ దగ్గదే.డాక్టరూ,చిత్రకారుడూ అయిన చెలికాని మురళీ కృష్ణా రావు ఇందులో 24 అష్ట పదులకి చక్కని బొమ్మలు గీసారు. అసలు గంటకో అష్టపది చొప్పున ఎవరైనా పాడి గిన్నీస్ రికార్డుకి ఎక్క వచ్చునేమో! ఇక-టంగుటూరి సూర్య కుమారి గారు పాడిన ‘సా విరహే’ యమన్ కళ్యాణ్ రాగమా? కాదేమో? పీలూ అనిపిస్తోంది. రమతే యమునా(ఘంటసాల), అజహున్ న ఆయే బాల్మా(రఫీ, సుమన్),మాధవా మాధవా నను లాలించరా (సుశీల,ఘంటసాల)-ఒక్కొక్కటీ గుర్తుకొస్తున్నాయి. సాలూరు వారు స్వర పరిచిన జయ దేవ అష్ట పదులు (సినిమాలోనివీ , ఆ తరువాత సుశీల గారి చేత పాడించిన లలిత లవంగ, నాథ హరే-లు) మొత్తం దేశమంతటా తెలియాలి. పద్మా సుబ్రహ్మణ్యం పాడినా ఏదో లోపం ఉంది. గానం- మళయాళ చిత్రంలో దక్షిణా మూర్తి బాల మురళి గారి చేత ‘యా రమితా వన మాలినా ‘ భలే అద్భుతంగా పాడించారు. కన్నడ ‘హంస గీతె’ చిత్రంలో ఉన్న అష్ట పదులన్నిటినీ టి జి లింగప్ప స్వర పరిచారు. వాటిని బాల మురళి ఆలపించారు. ‘నిజగాద సా యదునందనే’ మొదలైనవి బాల మురళి పాడిన సినియేతర అష్టపదులు. తెనాలి రామ కృష్ణ లో విశ్వనాథన్-రామమూర్తి స్వర సంపద -‘చందన చర్చిత’ , స్వర్ణ కమలంలో ఒరియా వారైన అక్షయ మహంతీ ట్యూన్ కట్టగా తృప్తి దాస్ పాడిన ‘సఖీ హి కేశి మథన’ -ఇవన్నీ నిజంగానే ‘ఇష్ట పదులు’. అష్ట పదులకి నాట్య గౌరవం తెప్పించినది -సదా స్మరణీయుడు కేలూ చరణ్, ఆయన కుటుంబం –ఇలా చెప్పుకుంటూ పోతే 24 అష్ట పదుల కాలమవ్వొచ్చు.

    మీ రచనలో సహోదరులు – దాని పైన వివరణ ముచ్చటగా ఉన్నాయి. సినిమా బండి వాడు ‘సోదర సోదరీ మణులారా- నేడే చూడండి మీ అభిమాన ధియేటర్ జ్యోతిలో’ అన్నా ఈ బహు వచన బెడదే! , ఆత్మ గౌరవంలో ఆరుద్ర ‘ఓ సోదర సోదరీ మణులారా– అని బహు వచనం ప్రయోగించి ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ అని ఏక వచనంలో పల్లవి కూర్చారు. బహుశః ఓ సోదరా, ఓ సోదరీ మణీ అని ఒక్కో ఏక వచనంగా విరుచుకోవాలేమో?