పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. సా విరహే తవ దీనా గురించి naresh Nunna అభిప్రాయం:

    04/25/2010 8:08 am

    Dear బ్రహ్మానందం గొర్తి garu and particularly జెజ్జాల కృష్ణ మోహన రావు garu,

    I am really grateful to u for a wonderful article and the information with translations of సా విరహే… It is really commendable as ur article is an intuitive discovery of intricacies of Sanskrit verses of Jayadeva. That Intuition has been added by profound knowledge and experiential implications of verses into life. Ur readers must be certainly benefited by ur writings.

    But, personally, I detested the allusion, rather a reference to ‘A Midsummer night’s dream’ of William Shakespeare.

    One dare not compare

    ధ్యానలయేన పురః పరికల్ప్య భవంత మతీవ దురాపం
    విలపతి హసతి విషీదతి రోదితి చంచతి ముంచతి తాపం

    and

    More strange than true: I never may believe
    These antic fables, nor these fairy toys…..

    blah… blah..

    The latter is an objective comment, though an erudite one, by a world Master. But, the former is a kind of lyrical compliance, subjective surrender, emotional submission, irrational giving in and an unconditional kneeling before the manifestation of Love.

    Even the nicest translation by George Keyt, Kutub:

    Full of seductive art she makes and prepares,
    as a rite, a bed of flowers,
    A couch for the rapture of your embrace,
    of flowers like heads of the arrows of Love.

    ………. is very very far from the original…. :

    కుసుమవిశిఖశరతల్ప మనల్ప విలాస కలా కమనీయం
    వ్రత మివ తవ పరిరంభసుఖాయ కరోతి కుసుమ శయనీయం!

    When I first heard of Goethe, who received Abhijñāna śākuntalam of Kalidasa with wonder and fascination, that he danced on the street while reading the verses, I thought that his bliss would have been hyped manifold, if he had read Kalidasa text in original Sanskrit. So, that chasm would be always be there between any two languages, particularly between oriental and occidental languages.

    However, I personally owe you a lot for providing very erudite information. I also request you to give similar kind of profound information about ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే and రాధిక కృష్ణా రాధిక తవ విరహే కేశవా… Ashtapadis…

    regards,
    Naresh Nunna.

  2. తడిస్తే కదా తెలిసేది! గురించి Gannavarapu Narasimha Murty అభిప్రాయం:

    04/25/2010 1:38 am

    ధీరులు సాహితీ ప్రియులు దియ్యని దేనియ పల్కు ధారలున్
    బారగ నాల్గు దిక్కులనుఁ బ్రాజ్ఞతఁ బద్యము గద్యమందుటల్
    భూరి విశేష కల్పనలుఁ బూనికఁ జేయగ నాత్మ మెచ్చదే
    భారతి పెక్కు భంగిమల, భాగ్యమె పల్కుట తెల్గు నందుటన్ !

    తెలుగు భాష భవిష్యత్తు యేమిటి అని బెంగ పడవలసిన యీ రోజులలో తెలుగులో ఎవ రేమి వ్రాసినా చెప్పినా మనమంతా ఆనందించాలి. భారతి భావాంబర వీధి విశృత విహారి. వైవిధ్యంలో అందం ఉంది.

  3. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి bhaarati అభిప్రాయం:

    04/24/2010 11:07 pm

    బాలరాజు సినిమాలో ” రూపమునీయరయా,” అన్న రాగమాలిక శ్రీనివాస్‌ గారికి దొరకలేదా? లేదా, ఆపాట పాడింది వరలక్ష్మిగారు కాదా, చెప్మా?
    సందేహనివృత్తికోసం వేచి చూస్తూ,

    భారతి

  4. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి bhaarati అభిప్రాయం:

    04/24/2010 9:05 pm

    dear editors:

    the first part of this message is in response to geyamala.

    superlatives like greatest symbolist poet etcetera are impossible to justify. personal adorations should not not become a part of critical appreciation.

    in re: einstein’s relativity theory. as one who studied physics and poetry, i can only say that your analogy is hilarious, if not thoroughly ridiculous.

    there was a guy by name aristotle said that analogies are dangerous. i concur with that old fellow!

    secondly, jayaprabha,knowingly or unknowingly, simply repeated t s eliot’s cliche. and, alas! cliche it is! no more, no less!

    all the telugu literary stalwarts, poets and selfstyled “critics”, marxist and nonmarxist alike, go ape over it, viz.,
    ” poetry communicates before it is understood.” it is a bunch of hog wash.

    if one understands the meaning of the words, one can appreciate poetry as it should be appreciated. i mean critically appreciated. doting is not appreciation! it is that simple.

    if anyone demands what eliot’s statement really means, these scholars put a pale dumb face. try it; you might like it, as the commercial goes!

    essentially, is it not what veluri’s essay is conveying?

    best regards.

    bharati

  5. సా విరహే తవ దీనా గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/24/2010 1:20 pm

    గొర్తి బ్రహ్మానందమ్ గారికి,

    ఎవరు ఏమని అనుకుంటారో నాకు తెలియదు. శాస్త్రంలో అది సాహిత్యమైనా లేక సంగీతమైనా కూడా తగిన ప్రవేశం గానీ అభినివేశం గానీ లేనప్పుడు అరకొర జ్ఞానంతో ఏమైనా అనుకోవచ్చును. అలాంటి అభిప్రాయాలని అరకొర అభిప్రాయాలుగా మాత్రమే పరిగణించాలి. తెలియనితనం అన్నమాట!!

    సంగీతం అన్నప్పుడు భావ రాగ సమ్మేళనం – అందులో భావమూ ముఖ్యమే రాగమూ ముఖ్యమే!! అది వాగ్గేయకారత్వం తెలిసిన వారికి మాత్రమే వశమైన విద్య. తొడబాదుడు లాంటి మాటలు గానీ కృష్ణుడు లేదా రాముడు మీది మాటలు పాటలు అనిగానీ ఎవరు అనుకున్నా వారు సంగీతజ్ఞానాన్ని సంపాదించి మార్క్స్ మీదనో..మావో మీదనో కూడా మేళకర్తలని అధ్యయనంచేసి అందులో వారి వారి ఇష్టాలని తీర్చుకొనవచ్చును. ఎవరు అభ్యంతరం పెడతారు గనక?? అలాంటి కృషి చేయలేక శాస్త్రం తెలుసుకోక “తొడబాదుడు” అంటే అది ఆడలేక మద్దెల ఓడు అన్నట్టే మరి. అలాంటి శుష్కవ్యాఖ్యానాలకేంలెండీ. వాటిని గణనకి తీసుకోనవసరంలేదు. అది కాదు అసలు సమస్య. అసలు సమస్య ఏమంటే మనకి popular science ని గురించిన వ్యాసాలు ఉన్నమాదిరికూడా సంగీతాన్ని గురించి ప్రాధమిక సమాచారం లేదు. పాత పుస్తకాలు పెద్ద గ్రంధాలు ఏవీ అందుబాటులో ఉండవు. అవి కాలానుగుణంగా సవరించిన సమాచారాన్ని కలిగినవీ కావు. సంగీతరంగంలో కచేరీలు చేసుకుని డబ్బులు సంపాదించుకునే గాయకులే తప్ప సంగీతపు పూర్వాపరాల మీద పరిశోధన చేసే పరిశోధకులు ఎవ్వరూ లేరు. గాయకులు మాత్రమే ఉన్నారివాళ. అది ఆ రంగంలో ఉన్న ప్రధానమైన లోటు. అది తీరకపోతే సంగీతాన్ని గురించిన ఏ వివరమూ ఎవరికీ తెలియని స్థితి. ఈ స్థితిలో ఎవరో తమకు తెలిసిన అరకొర సంగతులని వ్యాసాలుగా రాసేస్తోంటే వాటికి ప్రమాణం ఏమిటి? వాటిలో కల్పించుకుని ఎవరైనా గానీ చేసే చర్చలేమిటీ??

    రమ.

  6. సా విరహే తవ దీనా గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/24/2010 1:02 pm

    లైలాగారికి తాను రాసిన పాటమీద ఉన్న ఇష్టం నాకు అర్ధమౌతుంది. కానీ అందులో లేని అర్ధాన్ని తాను అనుకుని రాసి దాన్ని సందర్భానికి తగినట్టు సర్దుకొమ్మని అంటే మాత్రం అర్ధం కాదు. సోమము అంటే వెన్నెల అనిగాని అమృతము అనిగాని అర్ధాలు లేవు. సోమరసం అన్నా మదిర అని మాత్రమే!! అందువల్ల్ ముఖ బింబమే ఒలికే సోమమై..అంటే ఏ అర్ధమూ స్పురించదు. అందుకోసం బార్బారా మిల్లర్ ని సాయం తెచ్చుకున్నా కూడా అందులో ఏ అర్ధమూ స్పురించదు. అందువల్ల లైలాగారికి వచ్చిన ఇబ్బందీ ఏమీ ఉండదు. నాకూ ఏ ఇబ్బందీ ఉండదు. ఎందుకంటే నేను “సావిరహే తవదీనా రాధా” అని జయదేవుని పల్లవిని అందుకుని పాడుకుని పరవశిస్తానే గానీ లైలాగారి అనువాదంతో నాకు పనిలేదు. మాతృక గొప్పగా ఉండగా దానిముందు పసలేని అనువాదం నాకు రుచించదు. అందువలన లైలాగారు బహుచక్కగా రాధ ముఖ బింబాన్ని ఒలికే సోమంగా చేసుకోవచ్చును.:)

    రమ.

  7. సా విరహే తవ దీనా గురించి lyla yerneni అభిప్రాయం:

    04/24/2010 11:56 am

    “ముఖబింబమే ఒలికే సోమమై”…అంటే??

    “సంస్క్రుతంలో భావానికి తెలుగు పోలిక వాక్యాలలో అమిరినట్టులేదు.” -rama bharadwaj

    I, as a reader of Jayadeva’s ashtapadi, can only respond to the sound of Sanskrit lines. For the meaning I have to depend on multiple translations. I would think none of the meanings will coincide. Just like no two persons’ imagination of either Radha or Krishna coincide. The meanings and images lie somewhere in between. Or even outside the translation.

    To explain some, Let me first use the translation of Barbara Stoler Miller – the two lines where in ‘Radha’s face’ is described.

    “She raises her sublime lotus face, clouded and streaked with tears,
    Like the moon dripping with nectar from cuts of eclipse’s teeth.”

    Would the readers of this magazine say these lines atleast carry what is said in Sanskrit verse?

    There is a mixture of metaphors in the above lines, referring to lotus, cloud, moon, Rahu, nectar. da da da. There is a mythological story. Super. But, I don’t want to use all of that. Over all, I see ‘Radha’ is all miserable and teary. But Radha’s face is still beautiful and is exuding sweetness.

    Next.

    C.P. Brown gives interpretations such as ‘fatigue,’ ‘toil,’ ‘శ్రమ’ to this word- సోమము. Brown and Others ( please browse the net) refer to Soma/సోమ – as the elixir that Vedic people seemed to have enjoyed, as an elixir that Gods enjoy, as also the love (Moon) God and the luster he exudes. The Sanskrit roots of these words could be different. So what. The readers that are responders of poetry are not stopped by these details. Such would not interfere with their enjoyment. In fact it may introduce an element of curiosity.
    What is it I -as a reader and listener experience in Jayadeva’s poetry? and want to express uninhibitedly once again. It is eroticism. Sophisticated love, longing and desire to mate. ( I am not worried if there are eight stanzas or not in the song. I would not worry about mentioning poet Jayadeva in the song at all. I know his claim over this poetry is well established.)

    I kind of like the sound of ‘సోమమై’. I think the word ‘సోమమై’ serves beautifully, in this erotic old style lyric. The entire “ముఖబింబమే ఒలికే సోమమై పూలపానుపున నీకై వేచెనా దీనా” appeals to me. I feel singers would be able to give beautiful expression to these words, conjure up for the listener, the face of a charming virahini spilling tears.

    ఆ వాక్యంలో, ఆ ‘సోమమై’ మాట వాడకములో పాఠక/శ్రోతకు నచ్చకపోటానికి ఏముంది. అంతా అందమేగా! It is so సోము, సోమం. So Sonu Nigam. 🙂

    Two recent excerpts I may want to quote as complimentary to the above explanation are.

    1. ” As she becomes aroused, he does not look at her, or even into her eyes to see a reflection of his own glory, but over her head. Later he walks to the balcony and ‘sees’ a vast crowd in the square below. The sequence could be an old joke about a politician who wakes up feeling fine and can’t remember whether he had a good lay or good crowd the night before.” -Image Problems, David Denby, The New Yorker, March 22, 2010 ( In his article, Author is describing a scene from movie ‘Vincere,’ where young Mussolini is making love to his mistress Ida Dessler.)

    This kind of a man , an egoist Mussolini who makes love to the masses but fails to engage in intimate relationship with a woman -is not what I sense and experience in ‘Sa Virahe – Madhava ‘

    2. ” Christie kept insisting on essential relationship of words and music. Rehearsing a scene in which the soprano Lucy Crowe sang the aria ” If Love’s a sweet passion,” with echoes from a quartet of singers, he told them, “Lucy is coloring absolutely every word. Listen to the way she sings ‘wounds.’ Listen to the way she sings ‘dart.’ Listen to the vowel color, whether it is open or closed, lots of consonants, fewer consonants and so on.” – Alex Ross, Sweet Noises, The New Yorker, April.19, 2010. ( Author is describing a rehearsal of a musical event at Brooklyn Academy of Music, opened to the public – he feels William Christie, the conducter has “a magical knack for restoring opera’s unity: voices, instruments and words are all of a piece, …”)

    This is the kind of music conductor I like to meet and have some of Telugu lyrics I wrote in the past few years, sung. I do not see my lyrics being in Telugu language as a barrier at all to be understood by lovers across the globe. I am pretty positive they will be appreciated.

    Thanks for the question and comments.

    లైలా

  8. తెలగాణెము గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    04/24/2010 10:49 am

    భూషణ్,

    ఒక పర్యాటన , ఒక పది మంది రోజు కూలీలతో సంభాషణ, కొ. కు. అనే ఒక సెలిబ్రిటీ ఎండోర్స్ మెంటు ; ఇవి కాక తెలంగాణ భవిష్యత్తు కి ఇంత సాధికారకంగా పటం కట్టడానికి మీ కు ఇంకేమి అర్హతలు ఉన్నాయో నాకు తెలియదు.
    క్రితం సారి 1969 లో ఈ ఉద్యమం చల్లారిన తరువాత న్యాయం కోరుకునే తెలంగాణ యువత శక్తి సామర్ధ్యాలు ఎటు మళ్ళాయో కళ్ళారా చూసిన వాళ్ళకి, నాగాలాండు, పంజాబు సమస్యలని భారత ప్రజాస్వామ్యం ఎట్లా పుట్టించిందో ఎట్లా చల్లార్చిందో తెలిసిన వాళ్ళకీ , భారత ప్రజాస్వామ్యం ముందు తెలంగాణ అనగా ఎంత – అన్న మాట వింటే మాటల్లో చెప్పలేనంత గుబులు పుట్టటం ఖాయం.

    ఉపేంద్ర

    [సమకాలీన రాజకీయాలపైకి పూర్తిగా మళ్ళిన ఈ చర్చను ఇంతటితో ఆపివేస్తున్నాం. ఈ విషయంపై రాసిన అభిప్రాయాలు ఇక ప్రచురించబడవు. – సం.]

  9. తెలగాణెము గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    04/23/2010 10:11 pm

    మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం ,విద్వేషాలను పెంచడం ,చివరికి విభజనకు పట్టు బట్టడం. ఇదీ అయాచితంగా అధికారం చేజిక్కించుకోవాలనే నేతల తీరు. వారికి సమాజం సంస్కృతి,భాషలు సర్వనాశనమైనా చీమ కుట్టినట్టయినా ఉండదు. ఈ తరహా రాజకీయాలు ముస్లిం లీగుతో మొదలైనాయి.’సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా ‘అన్న కవిత రాసిన ఇక్బాల్ ఇటువంటి విభజన ఊహలకు బీజం వేశాడు అంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగ వచ్చు. తర్వాత బ్రిటిష్ అండదండలతో జిన్నా తన చిరకాల వాంఛితాన్ని నెర వేర్చుకొన్నాడు. తర్వాత పాకిస్తాన్ వేర్పాటు ఇరుదేశాల ప్రజలకు ఎన్ని కష్టాలు కొని తెచ్చిందో అందరికీ తెలిసినదే. ఠాగోర్ నోబెల్ ఉపన్యాసం చూడండి ,ఈ జాతీయవాదం ఎంత దూరం పొగలదో దర్శించాగలిగాడు అనిపిస్తుంది. గాంధి విభజన కు చివరిదాకా వ్యతిరేకి. దానివల్ల జరిగే ఉత్పాతం ఆయన దర్శించగలిగాడు ;దార్శనికులైన కవులు రాజకీయ వేత్తలు తెల్ల కాకుల లాంటి వారు. విభజన ,రక్తపాతం కోరే కవులు మేధావులు నాయకులు వీధికుక్కల్లా ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తారు.

    తెలంగాణా గురించి మాట్లాడితే దేశ విభజన గురించి మాట్లాడటం ఏమీ బాగా లేదు ,అది వేరు ఇది వేరు అనవచ్చు. ఈ రెంటికి వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే .”మేము వేరు మీరు వేరు ;మనమందరం కలిసి బ్రతకలేము. మీరు మా నేలను వదిలితే ఆస్తులు మావి ఉద్యోగాలు మావి మా పెత్తనం మాది “ఇదీ వరుస . దేశంలో ఉన్న సమస్యలు చాలు ;పనిలేని నేతల పుణ్యమా అని లేనిపోని సమస్యలు తెచ్చి పెడుతున్నారు సామాన్యులకు . విభజన అన్న ఊహ చాలా ప్రమాదకరమైంది అని చెప్పడానికి ఇదంతా. ఇది తెలంగాణాతో అంతం కాదు.దీని కూకటి వేళ్ళను కదిలిస్తే దేశమే కదిలిపోతుంది.

    అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో నాలుగు డబ్బులు వెనుకేసుకుని ,కాస్త తీరిక ఉన్న వాళ్ళు అరాచక శక్తులకు అండ దండలు అందించడం చూస్తూనే ఉన్నాము. అక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి వారు చనిపోతే కవితలు రాసే కవిరాబందులకు నిజాయితీ , నైతికత అన్నది చాలా పెద్ద మాట. చేతనైతే ఒక చెట్టు నాటండి ;ఇంకా స్థోమత ఉందా ఒక గ్రంథాలయం మొదలు పెట్టండి.ఒక బడిని ఆసుపత్రిని నిర్వహించండి.ఇందులో ఆకర్షణ లేదు. నానా దేవుళ్ళకు గుళ్ళు కట్టించడం ,మార్క్సుమావోలకు ఇక్కడినుండి జేజేలు కొట్టడం ఇదీ మనవారి తీరు. ఆలోచనను పెంపొందించే ఏ పని చస్తే తలకెత్తుకోరు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది మన వారికి చాలా పెద్ద మాట.

    భారత ప్రజాస్వామ్యం నాగాలాండ్ ,పంజాబ్ లాంటి సమస్యలనే చల్లార్చింది.ఇక తెలంగాణా అనగా ఎంత ?? ఈ సమస్య పరిష్కారానికి ఎంతో దూరం లేదు అని నా అంచనా ..సమస్య కు పరిష్కారం లభించే లోగా కుహనా కవులు ,ప్రాంతీయవాదులు ,రాజకీయ నాయకులు జన జీవితంలో ఎంత చెత్తను పేరుస్తారో తలచుకోవడానికే మనసొప్పడం లేదు.
    చివరిగా, రచయితలలో మేధావిగా గుర్తింపు పొందిన కొ. కు అభిప్రాయం తెలంగాణా మీద “తెలంగాణ చీలదు .చీలితే తెలంగాణ పాట్లు కుక్కలు నక్క పడవు”(కొ. కు లేఖలు పే.101).

  10. సా విరహే తవ దీనా గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    04/23/2010 5:07 pm

    రమ గారూ,
    దక్షిణాదిన సాహిత్యం లేని సంగీతానికి ప్రాముఖ్యత లేదు. చాలా చక్కగా చెప్పారు. సంగీతం వచ్చినవారు సాహిత్యాన్ని వదిలేయమంటారు. సాహిత్యం ఇష్టం ఉన్నవాళ్ళు సంగీతం పట్టించుకోరు. ఎవరి రంగంలో వాళ్ళు పెత్తందార్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు.
    ఏ రాముడి మీదో, కృష్ణుడిమీదో భజన పాటలే కదా కర్ణాటక సంగీతమని అనుకునేవారూ ఉన్నారు. తొడ బాదుడు సంగీతం అనే వాళ్ళూ ఉన్నారు. సంగీతం గురించి తెలుగులో వచ్చిన రచనల సంఖ్యా చాలా తక్కువనే చెప్పాలి. తాళాల వెనుకా, రాగాల వెనుకా, మేళకర్త రాగ విభజన వెనుకా ఉన్న గణితమూ, శాస్త్రమూ అందరికీ తెలిసే భాషలో చెప్పినవి చాలా తక్కువే! తెలుగు వారికి సంగీతం అంటే సినిమా సంగీతమే. రాగాలు చెప్పేటప్పుడు సినిమా పాటల ఉదాహరణలు ఇచ్చింది అందుకే!