పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. పడమట సంధ్యారాగం గురించి chandra అభిప్రాయం:

    04/29/2010 10:02 pm

    సంధ్య ఎక్కడికి వెళ్లి ఉంటుందో నాకు తెలిసింది. మొగుడు వచ్చే సరికి చక్కగా కూర చేద్దామని బచ్చలి ఆకు కోసం కొట్టుకి వెళ్లింది.

    చంద్ర.

  2. చలంతో రజని ముఖాముఖి గురించి ఉష అభిప్రాయం:

    04/27/2010 8:21 am

    చలం గారి రచనలు చదివాను అనేకన్నా చదువుతూనేవున్నాను అనాలి. వివిధ ప్రభావాలు ఆయన వదిలారు సంఘం మీద. నాలోను గమనించాను, చుట్టూరాను గమనించాను. ఒక్కో ప్రాయం/దశలో ఒక్కోమాదిరిగా తోస్తున్నాయి. ఈ శబ్దతరంగాల్లో ఆయన అంతరంగం తెలియలేదు కానీ ఎన్నో అంతరంగాల సవ్వడిని వినిపించిన కలం అదే కదా అని అనిపించింది. అందించినందుకు ధన్యవాదాలు.

  3. తెలుగు నిఘంటువు గురించి… గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:

    04/26/2010 10:31 pm

    శబ్దరత్నాకరము డిజిటైజ్‌ అయ్యింది – దీని నుంచి, బౌణ్య నిఘంటువులనుంచి, బూదరాజు ఆధునికవ్యవహారకోశం నుంచి, కొన్ని పారిభాషికపదావళులనుంచి ఒకే interface ద్వారా పదములను, అర్థములను వెతకుటకు http://www.andhrabharati.com/dictionary వాడవచ్చు.


    వాడపల్లి శేషతల్పశాయి
    కాలెపు నాగభూషణరావు

  4. సా విరహే తవ దీనా గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/26/2010 1:27 pm

    నేను public performance ఇవ్వను గనక నా గొంతు ఎలా ఉన్నా నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. జనానికొచ్చిన ఇబ్బందీ ఏమీ లేదు. మీరుకూడా మీ అనువాదాన్ని మీరే చదువుకుని సంతోషించుకుంటే వచ్చిన ఇబ్బందీ ఏమీ ఉండదు. ప్రకటించినా ..CD గా తెచ్చినా విమర్శ తప్పదు కదా మరి!! జయదేవుని మాతృక మరీ గుర్తొస్తూంటేనే అసలు అవస్థ అంతా!! ఇంక మీ పేరు పలక కూడనిదా ఏమి?
    మీ పేరు లోనే అంత అందం ఉంది కాబోలు మరి “లైలా ఓ లైలా” అని పాడుకోబోయేలా!! nice name.

    అనువాదం బాగులేకపోతే అది చలంచేస్తే ఏమిటి?? ఇంకొహరు చేస్తే ఏమిటి??

    రమ.

  5. సా విరహే తవ దీనా గురించి mOhana అభిప్రాయం:

    04/26/2010 8:12 am

    సంస్కృత నిఘంటువులలో కొలోన్ నిఘంటువులో మాత్రమే సహోదరీ అనే పదము కనబడుతుంది. ఆప్తే, కొలోన్ నిఘంటువులలో స్త్రీ లింగములో సహోదరా అనే పదము ఉన్నది. ఈ సహోదరా పదము తెలుగులో సహోదర అవుతుంది (మాత, సీత లాటి పదాలవలె). కాబట్టి ఇది స్త్రీలింగము బహువచనములో సహోదరలు అవుతుంది.. మీకు సహోదరులు స్త్రీ లింగములో నచ్చకపోతే సహోదరలు అని పిలువవచ్చు. నా ఉద్దేశములో మణి అనే శ్రేష్ఠవాచక పదము అనవసరము.
    విధేయుడు – మోహన

  6. సా విరహే తవ దీనా గురించి lyla yerneni అభిప్రాయం:

    04/26/2010 1:22 am

    “ఎందుకంటే నేను “సావిరహే తవదీనా రాధా” అని జయదేవుని పల్లవిని అందుకుని పాడుకుని పరవశిస్తానే గానీ లైలాగారి అనువాదంతో నాకు పనిలేదు. మాతృక గొప్పగా ఉండగా దానిముందు పసలేని అనువాదం నాకు రుచించదు. – -rama bharadwaj

    నిజంగా.
    ఐతే ఎవరి గొంతుకలో పాడుకుని ఆనందిస్తారు? మీ సొంత గొంతుతోనే? మీ గొంతుకన్నా, ఇంతకు ముందు పాడిన గాయకుల గొంతులు గొప్పగా ఉంటే, మరి మీ గొంతు మీకు రుచిస్తుందా?

    జయదేవుడేమంటాడో? ఆయనకు మీ పాట రుచిస్తుందా? ఆయన పరవశిస్తాడా?

    ‘చెలం’ రాసిన జయదేవ నాటికలో తనను చూసుకుని ఆయన ఇంకా అలమటిస్తూనే ఉన్నాడో! అన్నమయ్య, నా సంగతేం చెప్పమన్నావ్ -అని ఆయన్ను ఓదారుస్తున్నాడో?

    చలం నాటిక “జయదేవ” చివరలో జయదేవుని కొన్ని మాటలు:

    ” రాధా! మాటాడవా? ఎలా పరిహారం చెయ్యను? మరణిస్తే మాత్రం నన్ను ఒదులుతుందా ఈ జాడ్యం? రాధా! నీ చిన్ని పాదాలు తాకనీ, నీ పాదా లేవీ?”

    ఆ తర్వాత ఆ నాటిక అలా ముగించాడేం చలం? ఆ పుస్తకంలోని జయదేవుడూ, అష్టపదులు రాసిన జయదేవుడూ ఒకరేనా?

    మీ లేఖలో ఎందుకో నాలుగు సార్లు నా నామం జపించారని, ఈ ఉత్తరం రాస్తున్నా.

    లైలా

  7. About eemaata గురించి geyamala అభిప్రాయం:

    04/26/2010 12:19 am

    భారతి లేదు అనుకునే వారికి మీ పత్రిక ఒక అందమైన సమాధానం .
    my earnest appeal to you is to publish detailed critical analysis of writings of vaddera chandi das and on keelubommalu by g.v.krishna rao
    i hope what mallinadha suri said about magha and kalidasa would be applicable to your web edition.

  8. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి geyamala అభిప్రాయం:

    04/26/2010 12:00 am

    the poet chooses those words which alight on the hearts of readers like a dove.
    if one wants to enjoy the poetry, one is to strive hard. even for viewing a cinema, we are standing in queues for hours and spending a lot of time in traffic, then why can’t we take pains to understand what the poet has written. How many people could understand what was the actual meaning of the words written in his poem “sahasi”?
    “KADILINCHAKU SUPTA BHUJANGALANU”
    MANTRANAGARI SARIHADDULU MUTTAKU.”

    Unless the reader has authority on Freudian psychology, it was difficult to understand what was in SRI SRI’s mind.

  9. అసమర్థుని జీవయాత్రేనా? గురించి geyamala అభిప్రాయం:

    04/25/2010 11:44 pm

    Gopichand clearly failed in moulding the character of seetharama rao. the entire lecture of ramayya tata was plagiarized from M..N.ROY’s New humanism.
    Another thing is people who have inferiority complex will not become psychotics. Gopichand should have studied abnormal psychology. though it might have influenced Telugu readers some decades back, now , i feel it would not create any feeling after reading that novel. Actually, G.V.Krishna rao very powerfully utilised Marxism and psychology in his magnum opus ” keelu bommalu”. Why gopichand failed? because in those days, telugu writers were influenced by Freud only. they did not read Adler.

  10. సా విరహే తవ దీనా గురించి Dr Tatiraju Venugopal అభిప్రాయం:

    04/25/2010 1:47 pm

    మోహన బ్రహ్మానందం ఒక లైనులో ‘గాయనీ మణులు’ అంటూనే ‘బాంబే సహోదరుల’ అన్నారు. అది తప్పు అన్న వారికి బాల వ్యాకరణం లోని నియమాన్ని చూపించి, తప్పని గానీ సరి అని గానీ చెప్పక తప్పని సరిగా అవే మాటల్ని ఉంచేసారు. బూదరాజు రాధాకృష్ణ గారు వార్తా పత్రికల్లో వాడే భాషా నియమాలను తన ‘తెలుగు భాషా స్వరూపం’ ( పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం, 2001 ) పుస్తకంలో ఎంతో చక్కగా వివరించారు. వాడుకలో ‘బాంబే సిస్టర్స్’, ‘బేలూరు సిస్టర్స్’, ‘సికిల్ సిస్టర్స్’, హైదరాబాద్ బ్రదర్స్’ అని ఉన్నప్పుడు వాటిని తెలుగులోకి మార్చేయడం అనుచితం కాదు. ‘గాయనీ మణులు సౌమ్య,బాంబే సిస్టర్స్ ల’ అనే వాక్యం సరిపోతుంది. ఇలాగే నటుడు, నటి అనే పదాల బహువచనం లోనూ (నటులు) ఇబ్బంది ఉన్న కారణంగా ‘నటీ మణులు’ వాడవలసి వస్తోంది. అందర్నీ ఒకే త్రాట కట్టదలచుకుంటే ‘నటీ నటులు’ అన వచ్చు. ఇలాగే ‘గాయనీ గాయకులు’ కూడా. స్త్రీ, పురుష వ్యత్యాసం చూప దలుచుకుంటే మాత్రం ఈ స్త్రీ మూర్తులు బహు వచనంలో ‘మణి’ ధారులే. విజయవాడ నుంచి ఆ కాలంలో విడుదలయ్యే సినిమా పాటల పుస్తకాల్లో గాయని అనే మాట మచ్చుకైనా కనపడదు. ఘంటసాల,శ్రీనివాస్,సుశీల,జానకి,పిఠాపురం,బాల సుబ్రహ్మణ్యం – అందర్నీ ‘గాయకులు’ అనే హెడ్డింగ్ కింద చూపించేవారు. ఎంతటి అభ్యుదయమో చూడండి. కొన్ని శబ్దార్ధ రత్నాకరాల్లో ‘గాయకుడు’ అనే మాట తో బాటూ ‘గాయనుడు’ అనే పదం కూడా ఉంటుంది. గాయని ఉంది కానీ గాయకి లేదు.