పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి sesha kumar kv అభిప్రాయం:

    05/08/2010 7:24 am

    చక్కని పద్యాన్ని గుర్తు చేసి వివరించారు.పెద్దగా పేరు కెక్కని ఇలాంటి మంచి కవులు ఎందరెందరో!మంచి వ్యాఖ్యానం.వందనములు.
    శేష్ కుమార్

  2. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి baabjeelu అభిప్రాయం:

    05/08/2010 7:15 am

    ఉపేంద్ర గారూ,
    “ఆ రెండు” సంభాషణలూ సవ్యంగా జరిగితే ఏవిఁటవుతుంది?
    కవిత్వం ఎలా చదవాలో తెలుస్తుందా? కవిత్వం ఎలా రాయాలో తెలుస్తుందా?
    “ఆ రెండు” సంభాషణలూ ఎవరు చేయాలి?
    అసలు ఎందుకు చెయ్యాలి? చెయ్యకపొతే ఏవిఁటి నష్టం?
    ఆ పంచాయతీ తీర్పు ని ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోకుండా కవిత్వాలు రాసీవాళ్ళని ఎవరేం చెయ్యగలరు?

    బాబ్జీలు

  3. ‘వికృతి’ ఉగాది గురించి sesha kumar kv అభిప్రాయం:

    05/08/2010 6:13 am

    వ చ న కవిత్వమా లేక కవిత్వ వచనమా అనిపించింది కవిత చదివాక. భాషాసృష్టి గమ్మత్తు గా ఉంది. English Literature లో PROEM అనే మాట ఉంది. PROSE+POEM కు బదులుగా వాడుతారు, అలా ఉంది. “విపరీతపు లోతులలో భాషా ప్రయోజనము” ఏమిటో!.నేను రమ గారితో ఏకీభవిస్తున్నాను.

  4. పాఠకులకు సూచనలు గురించి Madhu అభిప్రాయం:

    05/08/2010 12:18 am

    నేను కూడా ‘ఈ మాట’ కు నా కవితలు పంపాలనుకుంటున్నాను. ఎలా పంపాలో వివరాలు తెలియజేయగలరు. కృతజ్ఞుణ్ణి.

    [‘రచయితలకు సూచనలు’ చూడండి. – సం]

  5. పాఠకులకు సూచనలు గురించి Madhu అభిప్రాయం:

    05/08/2010 12:12 am

    ఈ మధ్య కొంత కాలం నుండి ‘ఈ మాట’ చదువుతున్నాను. తెలుగంటే తెలియకుండా పోతున్న ఈ రోజుల్లో ఇటువంటి పత్రిక చాలా అవసరం. ధన్యవాదాలు.

  6. ఇంకా ఎందుకు మిగిలావు గురించి Madhu అభిప్రాయం:

    05/08/2010 12:07 am

    విశ్వ సాహితి గారూ…. చాలా బాగుంది మీ కవిత

  7. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి మోహన రావు అభిప్రాయం:

    05/07/2010 4:47 pm

    శ్రీనివాస్ గారు చెప్పారు –
    రచయితలకు ఉపయోగమో కాదో కాని పాఠకులకు కామెంట్లొక సౌలభ్యం. అన్నీ చదివే తీరిక,కోరిక లేనప్పుడు ఏం చదవాలో అన్నది కామెంట్లను చూసి నిర్ణయించుకోవడం ‘ఈ మాట’ brand సౌకర్యం.
    అంటే నాబోటి రచయితల రచనలు ఎవరూ చదవడం లేదన్న మాట, చదవరన్న మాట. మరి నేనెందుకు రాయడమో?
    విధేయుడు – మోహన

  8. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    05/07/2010 2:43 pm

    కామేశ్వరరావుగారు ఎన్నో మంచి పాయింట్లు చెప్పారు. సైన్సు వ్యాసాలను కొనసాగించడం సంతోషకరం. వివిధ రంగాలలో నిష్ణాతులు చాలా మంది వున్నా,రాయడం రాయించుకోవడం పిల్లికి గంట కట్టడం లాంటిదేమో!
    అయినా ప్రయత్నించాలి. రెండు పాయింట్లు చెప్పాలనిపించింది.

    1. బహుమతులు పురస్కారాలు ఇవ్వడం మంచిదే. కాని ఇప్పట్లో అది అనవసర భారాన్ని’ఈ మాట’ నిర్వాహక మిత్రులపై పెడుతుందని చెడ్డ అనుమానం.పత్రికనడపడమే పెద్ద పని. దానికి తోడు ఈ బహుమతుల ఎంపిక, నిర్ణయ పద్ధతులు, జడ్జీలను పె(ప)ట్టడం, నిర్వహణ,ప్రదానాలు – అసలే మంచి రచనలకోసం ఎదురుచూస్తుంటే ఇప్పుడు దేనికేమివ్వాలో అని తలపట్టుకోవడం అంతా పత్రిక ముఖ్యలక్ష్యానికి ప్రత్యక్షంగా ఏ మాత్రం సాయపడని లంపటమేమో!

    2.రచయితలకు ఉపయోగమో కాదో కాని పాఠకులకు కామెంట్లొక సౌలభ్యం. అన్నీ చదివే తీరిక,కోరిక లేనప్పుడు ఏం చదవాలో అన్నది కామెంట్లను చూసి నిర్ణయించుకోవడం ‘ఈ మాట’ brand సౌకర్యం. చర్చావేదికలున్నా, తీసేస్తే బాగుంటుందీ కామెంట్లు అన్నది సైతం మనం కామెంట్లలోనే చెప్పుకోవడం దాని ఉనికికి ఎంత అలవాటుపడ్డామో అని ఆశ్చర్యం.
    ====
    విధేయుడు
    శ్రీనివాస్‌

  9. శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని గురించి సౌమ్య అభిప్రాయం:

    05/07/2010 7:41 am

    ధన్యవాదాలు!!

  10. ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి సౌమ్య అభిప్రాయం:

    05/07/2010 6:58 am

    ఆడియో కొంత అస్పష్టంగా అనిపించింది నాకు.
    కనెక్షన్ సమస్యేమో అనుకున్నాగానీ….cache లో నుండి కాపీ చేసి కంప్యూటర్లో ప్లే చేసినా అలాగే అనిపించింది…. 🙁