ధ్యానం

చుట్టూ
అరుపులు కేకలు
నినాదాలు వాదాలు

మధ్యలో కూర్చుని
చెట్టునీ పిట్టనీ
నదినీ నక్షత్రాన్నీ
ధ్యానించే బాలుడు

బయట
పూలదండలు పులివేషాలు
కొడవళ్ళూ నాగళ్ళూ
భజనలు గిరజాలు

గదిలో
పచ్చటి ఆకూ రెక్కల కిటికీ
తెల్లకాగితమంత సముద్రం

అంతా ఒక రంగులకంచె

ఒక చిక్కటి ఎరుపు
ఒక పల్చటి ఎరుపు
దట్టంగా అలమిన నలుపు

కంచె వెలుపల
నెమలికుంచె పట్టి
ఓ ఐంద్రజాలికుడు